దేశంలో అత్యంత సంపన్నుల జాబితాను హురున్ ఇండియా విడుదల చేసింది. అందులో గౌతమ్ అదానీ(62) మొదటి స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న ముఖేశ్ అంబానీ రెండో స్థానానికి చేరారు. ఆ లిస్ట్‌లో బాలివుడ్ స్టార్ షారుఖ్‌ఖాన్‌కు తొలిసారి చోటు దక్కింది.
ఈ సందర్భంగా హురున్ ఇండియా వ్యవస్థాపకులు అనస్ రెహమాన్ జునైద్ మాట్లాడుతూ..‘రూ.11.6 లక్షల కోట్ల సంపదతో గౌతమ్ అదానీ(62) తన కుటుంబం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో టాప్‌లో నిలిచింది. గత ఏడాది భారత్‌లో ప్రతి ఐదు రోజులకు ఒక కొత్త బిలియనీర్ తయారయ్యాడు. చైనా బిలియనీర్ల సంఖ్య 25 శాతం పడిపోయింది. భారత్‌లో వీరి సంఖ్య 29% పెరిగింది. దాంతో దేశంలో రికార్డు స్థాయిలో బిలియనీర్ల సంఖ్య 334కు చేరింది. ఆసియా సంపద సృష్టిలో భారత వాటా అధికమవుతోంది’ అని తెలిపారు.
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 నివేదిక ప్రకారం..
1. గౌతమ్ అదానీ, కుటుంబం: రూ.11.6 లక్షల కోట్లు
2. ముఖేష్ అంబానీ, కుటుంబం: రూ.10.1 లక్షల కోట్లు
3. శివ్ నాడార్, కుటుంబం: రూ.3.1 లక్షల కోట్లు
4. సైరస్ పునావాలా, కుటుంబం: రూ.2.89 లక్షల కోట్లు
5. దిలిప్ సింఘ్వీ: రూ.2.49 లక్షల కోట్లు.
6. కుమార్ మంగళం బిర్లా: రూ.2.35 లక్షల కోట్లు.
7. గోపిచంద్ హిందుజా, కుటుంబం: రూ.1.92 లక్షల కోట్లు.
8. రాధాకృష్ణ దమాని, కుటుంబం: రూ.1.90,900 కోట్లు.
9. అజిమ్ ప్రేమ్‌జీ, కుటుంబం: రూ.1.90,700 కోట్లు.
10. నిరజ్ బజాజ్, కుటుంబం: రూ.1.62 లక్షల కోట్లు
2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో తక్కువ వయసు ఉన్న వారిగా జెప్టో క్విక్ కామర్స్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు కైవల్య వోహ్రా(21) నిలిచారు.
షారుఖ్ ఖాన్‌కు చోటు
మొదటిసారిగా బాలివుడ్ నటుడు షారుఖ్ ఖాన్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో చోటు సంపాదించారు. ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌లో తాను వాటాలు కలిగి ఉండడంతో వాటి విలువ పెరిగింది. దాంతో మొత్తంగా రూ.7,300 కోట్లతో ఈ లిస్ట్‌లో స్థానం సంపాదించారు.
Comments
Please login to add a commentAdd a comment