Ramasamy
-
అమెరికా వదిలి ఇండియాకు.. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి..
ఇటీవల ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన 100 మంది ప్రపంచ కుబేరుల జాబితాలో ఆఖరి (100వ) స్థానంలో నిలిచిన కేపీఆర్ మిల్ ఛైర్మన్ 'రామసామి' (Ramasamy) ధనవంతుల లిస్ట్‌లో చేరిన మొదటి రైతు బిడ్డగా చరిత్ర సృష్టించాడు. అప్పు చేసి వేలకోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించిన 'రామసామి' వ్యాపారాన్ని చూసుకోవడానికి అతని కొడుకు 'ఆనందకృష్ణన్' విదేశాలను వదిలి ఇండియా వచ్చేసాడు. సంస్థ అభివృద్ధి కోసం తండ్రి బాటలోనే అడుగులు వేస్తున్న ఆనందకృష్ణన్.. కోయంబత్తూరులోని జీఆర్డీ కాలేజీలో బిజినెస్ మేనేజ్మెంట్లో బ్యాచిలర్ డిగ్రీ, అమెరికాలోని ఫిలడెల్ఫియా యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసాడు. విదేశాల్లో ఉన్నత చదువులు చదివిని ఆనందకృష్ణన్.. తన తండ్రి స్థాపించిన కుటుంబ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇండియా తిరిగి వచ్చాడు. కుటుంబ వ్యాపారాలను చూసుకోవడానికి విదేశాలను వదిలి వచ్చిన వారు ఇప్పటికే చాలామంది ఉన్నారు. ఈ జాబితాలో ఆనందకృష్ణన్ ఒకరుగా నిలిచాడు. 2001లో మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత, అతను 2002లో కేపీఆర్ గ్రూప్‌లో మేనేజ్మెంట్ టీమ్‌లో చేరాడు. అప్పటి నుంచి అతను గ్రూప్ అభివృద్ధికి కృషి చేసాడు. ఆ తరువాత 2008 నుంచి కంపెనీ 'ప్రెసిడెంట్' (ప్రాసెసింగ్ డివిజన్)గా పనిచేశాడు, 2011లో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఇదీ చదవండి: జాబ్ రిజైన్ చేస్తే రూ.4 లక్షలు - అమెజాన్ ఫౌండర్ అదిరిపోయే ఆఫర్! కేపీఆర్ గ్రూప్ అభివృద్ధికి ఎన్నెన్నో కొత్త ఆలోచలను ప్రవేశపెట్టిన ఆనందకృష్ణన్ ప్రస్తుతం కర్ణాటకలోని ప్రాసెసింగ్ డివిజన్, గార్మెంట్ యూనిట్, కొన్ని స్పిన్నింగ్ యూనిట్లు, కో-జెన్ కమ్ షుగర్ ప్లాంట్ వంటి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. అంతే కాకుండా ఇతడు కోయంబత్తూరులో ఆడి, హార్లే డేవిడ్సన్ డీలర్‌షిప్‌లను కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం. -
ధనవంతుల జాబితాలో రైతు బిడ్డ - సంపద తెలిస్తే అవాక్కవుతారు!
ఇటీవల ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన 100 మంది అత్యంత సంపన్నుల జాబితాలో రిలయన్స్ ఛైర్మన్ 'ముకేశ్ అంబానీ' (Mukesh Ambani) అగ్రస్థానం పొందగా.. ఆఖరి (100వ) స్థానంలో కేపీఆర్ మిల్ ఛైర్మన్ 'రామసామి' (Ramasamy) నిలిచినారు. ఈ కథనంలో రామసామి ఎవరు? ఆయన సంపద ఎంత? అనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆర్ధిక పరిస్థితుల కారణంగా కాలేజీ చదువును మధ్యలో ఆపేసిన ఒక రైతు కొడుకు నేడు భారతదేశంలోని 100 మంచి ధనవంతులలో ఒకడుగా నిలిచాడంటే చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఫోర్బ్స్ ఇండియా ప్రకారం, రామసామి మొత్తం ఆస్తుల విలువ 2.3 బిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 19133.7 కోట్లు). వస్త్రాలు (టెక్స్టైల్స్), చక్కెర తయారీదారులో తమదైన రీతిలో ముందుకు సాగుతున్న KPR మిల్ ఫౌండర్ అండ్ ఛైర్మన్ 'రామసామి' ఫోర్బ్స్ జాబితాలో చేరిన కొత్త వ్యక్తి కావడం హర్షించదగ్గ విషయం. ప్రస్తుతం ఈయన కంపెనీలలో సుమారు 25,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు, అందులో 90శాతం మంది మహిళా ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. వీరందరికి కరోనా మహమ్మారి సమయంలో కూడా పూర్తి జీతాలిచ్చి ఆదరించిన ఘనత రామసామి సొంతం. ఇదీ చదవండి: రూ.5 వేలతో మొదలైన రూ.14000 కోట్ల కంపెనీ.. సామాన్యుడి సక్సెస్ స్టోరీ! నేడు వందమంది ధనవంతుల జాబితాలో ఒకరుగా నిలిచిన రామసామి ప్రయాణం కేవలం రూ. 8,000 అప్పుతో మొదలైంది. ప్రతి ఏటా దాదాపు 128 మిలియన్ల వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్న కేపీఆర్ కంపెనీ సంవత్సరానికి వేలకోట్లు ఆర్జిస్తోంది. సంస్థ ఉత్పత్తి చేసే వస్త్రాలలో స్పోర్ట్స్‌వేర్ నుంచి స్లీప్వేర్ వరకు దాదాపు అన్ని లభిస్తాయి. -
మళ్లీ భయపెడతా!
మరోసారి సిల్వర్‌స్క్రీన్‌పై ప్రేక్షకులను భయపెట్టడానికి రెడీ అవుతున్నారు సంచలన క్రేజీ తార నయనతార.ఇంతకు ముందు హర్రర్ థ్రిల్లర్ కథాంశంతో కూడిన మాయ చిత్రంలో నటించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన నయనతార తాజాగా ఆ తరహా చిత్రంతో భయపెట్టడానికి సిద్ధం అవుతున్నారు.ఇంతకు ముందు నాన్ అవన్‌ఇల్లై,అంజాదే, పాండి, మిగామన్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన నెమిజంద్ జపక్ సంస్థ అధినేత వీ.హిందేష్ జపక్ నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. దీన్ని దర్శకుడు సర్గుణం తన సర్గుణం సినిమాస్ పతాకంపై తొలి కాపీ కాంట్రాక్ట్ విధానంలో నిర్మించనున్నారు. ఆయన శిష్యుడు రామసామి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం అని, హర్రర్,కామెడీతో కూడిన క్రైమ్ థ్రిల్లర్ ఇతి వృత్తంతో కూడిన ఈ చిత్రం పిల్లల నుంచి పెద్దల వరకూ చూసి ఆనందించే జనరంజక చిత్రంగా ఉంటుందని, చిత్ర షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుందని చిత్ర వర్గాలు వెల్లడించారు. తంబిరామయ్య, హరీష్ ఉత్తమ్ ముఖ్యపాత్రలు పోషించనున్న ఈ చిత్రానికి వివేక్ మెర్విన్ సంగీత బాణీలు కడుతున్నట్లు తెలిపారు.