రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఫోర్బ్స్ ఇండియా జాబితా ప్రకారం 14వ సంవత్సరాల(2008) నుంచి భారతదేశంలో అత్యంత ధనవంతుడుగా కొనసాగుతున్నారు. గత ఏడాది కాలంలో ముకేష్ అంబానీ సంపద 4 బిలియన్ డాలర్లు పెరిగింది, 92.7 బిలియన్ డాలర్ల నికర విలువతో ముఖేష్ అంబానీ ఫోర్బ్స్ ఇండియా జాబితాలో తన అగ్రస్థానాన్ని మరోసారి నిలబెట్టుకున్నారు. 100 మంది ధనవంతులైన భారతీయుల జాబితాను ఫోర్బ్స్ నేడు(అక్టోబర్ 7) విడుదల చేసింది. ఈ 100 మంది ధనవంతులైన భారతీయుల మొత్తం సంపద ఏడాది కాలంలో 775 బిలియన్ డాలర్లు పెరిగింది.
గౌతమ్ అదానీ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నారు. 2020లో 25.2 బిలియన్ డాలర్ల నుంచి తన సంపద దాదాపు మూడు రెట్లు పెరిగింది. అతని కంపెనీల షేర్లు ఏడాది కాలంలో భారీగా పెరిగాయి. 2020లో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల సంపద మధ్య అంతరం 63.5 బిలియన్ డాలర్లుగా ఉంటే.. అది ఇప్పుడు 17.9 బిలియన్ డాలర్లకు తగ్గింది. గౌతమ్ అదానీ సంపద 2021లో ఏకంగా 49.5 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇక మూడో స్థానంలో హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ శివ్ నాడార్ 31 బిలియన్ డాలర్ల సంపదతో నిలిచారు. డి'మార్ట్ రిటైల్ చైన్ వ్యవస్థాపకుడు రాధాకృష్ణ దమాని ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నారు. అతని నికర విలువ 29.4 బిలియన్ డాలర్లు. 2020లో15.4 బిలియన్ డాలర్లుగా ఉన్న దమానీ సంపద ఏడాది కాలంలో దాదాపు రెట్టింపు అయ్యింది. (చదవండి: మెర్సిడెజ్ బెంజ్.. మేడిన్ ఇండియా.. ధర ఎంతంటే?)
సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ పూనావాలా ఈ ఏడాది 5వ స్థానంలో ఉన్నారు. అతని మొత్తం నికర విలువ 11.5 బిలియన్ డాలర్ల నుంచి 2021లో 19 బిలియన్ డాలర్లకు పెరిగింది.ఇక ఈ జాబితాలో ఆరో స్థానంలో ఆర్సెలర్ మిట్టల్ కు చెందిన లక్ష్మీ మిట్టల్ 18.8 బిలియన్ డాలర్ల సంపదతో ఉన్నారు; 7వ స్థానంలో 18 బిలియన్ డాలర్ల సంపదతో సావిత్రి జిందాల్; 8వ స్థానంలో 16.5 బిలియన్ డాలర్ల నికర విలువతో ఉదయ్ కోటక్; 9వ స్థానంలో $16.4 బిలియన్ల నికర విలువతో షాపూర్జీ పల్లోంజీ & పల్లోంజీ మిస్త్రీ; 10వ స్థానంలో 15.8 బిలియన్ డాలర్ల నికర విలువతో కుమార్ మంగళం బిర్లా ఉన్నారు. గత ఏడాది కంటే 7.3 బిలియన్ డాలర్ల సంపద ఎక్కువ.
(చదవండి: బుకింగ్‌లో మహీంద్రా ఎక్స్‌యువి 700 ఎస్‌యూవి సరికొత్త రికార్డు)
ఈ జాబితాలో 6 కొత్త వారు
- అశోక్ బూబ్ (స్థానం - 93, ఆస్తులు - 2.3 బిలియన్ డాలర్లు)
- దీపక్ నైట్రైట్ దీపక్ మెహతా (స్థానం- 97, ఆస్తులు- 2.05 బిలియన్ డాలర్లు)
- ఆల్కైల్ అమైన్ కెమికల్స్ యోగేష్ కొఠారి (స్థానం - 100, ఆస్తులు - 1.94 బిలియన్ డాలర్లు)
- డాక్టర్ లాల్ పాత్‌లాబ్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అరవింద్ లాల్ (స్థానం- 87, ఆస్తులు- 2.55 బిలియన్ డాలర్లు)
- రాజకీయవేత్త మంగళ్ ప్రభాత్ లోధా (స్థానం- 42, ఆస్తులు- 4.5 బిలియన్ డాలర్లు)
- హాస్పిటల్ చైన్ అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ ప్రతాప్ రెడ్డి (స్థానం- 88, ఆస్తులు- 2.53 బిలియన్లు డాలర్లు)
Comments
Please login to add a commentAdd a comment