mukesh amabni
-
ఐదేళ్లలో రిలయన్స్ రూ.50,000 కోట్ల పెట్టుబడులు
అస్సాం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) వచ్చే ఐదేళ్లలో రూ.50,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. ‘అడ్వాంటేజ్ అస్సాం 2.0 ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్’ సందర్భంగా ఆర్ఐఎల్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఈమేరకు ప్రకటన చేశారు. టెక్నాలజీ, మౌలిక సదుపాయాలు, రిటైల్ విస్తరణ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కంపెనీ ప్రతిష్టాత్మక ప్రణాళికలను వివరించారు. 2018లో జరిగిన సదస్సులో రాష్ట్రంలో రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ హామీ ఇచ్చిందని, కానీ దానిని రూ.12,000 కోట్లకు పెంచామని అంబానీ గుర్తు చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం సహా వివిధ రంగాలకు ప్రయోజనం చేకూర్చేలా ఏఐను ఉపయోగించుకోవాలని ఈ సమ్మిట్ లక్ష్యంగా పెట్టుకుంది.కీలక పెట్టుబడి రంగాలుఏఐ డేటా సెంటర్: అస్సాంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-రెడీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఆర్ఐఎల్ యోచిస్తోంది. కృత్రిమ మేధ సహాయంతో ఉపాధ్యాయులు, వైద్యులు, రైతులు అస్సాం నివాసితుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని కంపెనీ ఆశిస్తున్నట్లు అంబానీ తెలిపారు.మెగా ఫుడ్ పార్క్: అస్సాంలో సమృద్ధిగా ఉన్న వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు విలువను జోడించడానికి మెగా ఫుడ్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ చర్య రాష్ట్ర రైతులకు మద్దతు ఇస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్, పంపిణీకి కొత్త అవకాశాలను సృష్టించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను మెరుగవుతుంది.రిలయన్స్ రిటైల్ విస్తరణ: అస్సాంలో రిలయన్స్ రిటైల్ స్టోర్ల సంఖ్యను రెట్టింపు చేయాలని ఆర్ఐఎల్ యోచిస్తోంది. ఈ సంఖ్యను 400 నుంచి 800కు పెంచనుంది. ఈ విస్తరణ రిటైల్ ల్యాండ్ స్కేప్‌ను మెరుగుపరుస్తుంది. వినియోగదారులకు విస్తృత శ్రేణి ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు ఇది తోడ్పడుతుంది.క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ: అణు ఇంధనంతో సహా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి అస్సాంను హబ్‌గా మార్చడంపై కూడా రిలయన్స్ దృష్టి సారించనుంది. అస్సాంలో రెండు కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్లను ఆర్ఐఎల్ నిర్మించనుంది. ఇవి ఏటా 8 లక్షల టన్నుల క్లీన్ బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేస్తాయి. ప్రతిరోజూ రెండు లక్షల ప్యాసింజర్ వాహనాలకు ఇంధనం అందించేందుకు సరిపోతుంది.హై-ఎండ్ హాస్పిటాలిటీ: హై ఎండ్ హాస్పిటాలిటీ రంగాన్ని ప్రోత్సహించడానికి ఆర్ఐఎల్ అస్సాం నడిబొడ్డున విలాసవంతమైన సెవెన్ స్టార్ ఒబెరాయ్ హోటట్ను నిర్మించనుంది. పర్యాటకులను ఆకర్షించడం, రాష్ట్ర ఆతిథ్య ప్రమాణాలను పెంచడం ఈ అభివృద్ధి లక్ష్యం.ఇదీ చదవండి: లకారానికి దగ్గర్లో గోల్డ్రేటు.. ఈ దేశాల్లో చీప్‌గా కొనుగోలుఈ కార్యక్రమాలు అసోంలోని యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని అంబానీ తెలిపారు. రిలయన్స్ ఫౌండేషన్ తన ‘స్వదేశ్’ స్టోర్ల ద్వారా గ్రీన్ గోల్డ్(వెదురు)ను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ అస్సాంతోపాటు ఈశాన్య రాష్ట్రాలను భారతదేశ అభివృద్ధిలో ప్రధానంగా నిలిపారని అంబానీ కొనియాడారు. -
క్రిప్టో కరెన్సీకి పోటీగా జియో కాయిన్?
భారతీయ కుబేరుడు, ప్రముఖ వ్యాపార దిగ్గజం 'ముకేశ్ అంబానీ' (Mukesh Ambani) నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ టెక్నాలజీ అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫారమ్.. భారతదేశంలో తన వెబ్3, బ్లాక్‌చెయిన్ అరంగేట్రం కోసం పాలిగాన్ ప్రోటోకాల్స్ డెవలపర్ విభాగమైన 'పాలిగాన్ ల్యాబ్స్'తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇదే సమయంలో కంపెనీ 'జియో కాయిన్' (Jio Coin) తీసుకురానున్నట్లు కొన్ని వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.జియో కాయిన్ గురించి కంపెనీ అధికారిక ప్రకటన చేయలేదు. కానీ చాలామంది జియో కాయిన్ ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మొబైల్ రీఛార్జ్‌లు లేదా రిలయన్స్ గ్యాస్ స్టేషన్లలో కొనుగోళ్లు వంటి సేవలకు ఉపయోగించబడుతుందని బిటిన్నింగ్ సీఈఓ 'కాశిఫ్ రాజా' తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.క్రిప్టో కరెన్సీ మీద ముకేశ్ అంబానీ చాలా సంవత్సరాలకు ముందే కన్నేశారని. ఈ రంగంలోకి అడుగుపెట్టాలని, ఓ స్పెషల్ కరెన్సీ తీసుకురావాలని భావించగా సమాచారం. ఇందులో భాగంగానే జియో కాయిన్ తీసుకు వస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. దీనికోసమే పాలిగాన్ ల్యాబ్స్‌తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు.ఇదీ చదవండి: 40 కోట్ల జనం.. రూ.2 లక్షల కోట్ల ఆదాయం! ఎలాగో తెలుసా?జియో కాయిన్ రావడం నిజమైతే.. క్రిప్టో కరెన్సీ(Crypto Currency)కి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఎందుకంటే ప్రపంచంలో దాదాపు 500 మిలియన్ల మంది క్రిప్టో కరెన్సీ వినియోగదారులు ఉన్నారు. అయితే జియోకు 470 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. జియో కాయిన్ అందుబాటులో వస్తే.. వీరందరి ద్రుష్టి దీనిపైన పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.🇮🇳Big Breaking News:- Jiocoin Launched On Polygon.Reliance Jio, the world's largest mobile operator, has just surprised the crypto world by officially launching Jiocoins!What are Jiocoins?Jiocoins are digital tokens issued on Polygon.Jiocoins is a mechanism to reward… pic.twitter.com/MNRb5HGa08— Kashif Raza (@simplykashif) January 16, 2025 -
అంబానీ చేతికి మరో కంపెనీ: రూ.375 కోట్ల డీల్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా హెల్త్‌కేర్ ప్లాట్‌ఫామ్ కార్కినోస్ హెల్త్‌కేర్‌ను కొనుగోలు చేసింది. డీల్ విలువ రూ.375 కోట్లు. కార్కినోస్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ (RSBVL) దక్కించుకుంది.కార్కినోస్ 2020లో ప్రారంభం అయింది. క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం, నిర్ధారణ చేయడం, వ్యాధి నిర్వహణ కోసం సాంకేతికతతో కూడిన వినూత్న పరిష్కారాలను అందిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.22 కోట్ల టర్నోవర్‌ను ఆర్జించింది.కంపెనీ 2023 డిసెంబర్ వరకు దాదాపు 60 ఆసుపత్రులతో భాగస్వామ్యం కలిగి ఉంది. అనుబంధ కంపెనీ ద్వారా మణిపూర్‌లోని ఇంఫాల్‌లో 150 పడకల మల్టీస్పెషాలిటీ క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తోంది. కార్కినోస్ దివాళా పరిష్కార ప్రణాళికకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముంబై బెంచ్ ఆమోదించింది. ఆర్ఎస్బీవీఎల్ సమర్పించిన పరిష్కార ప్రణాళికకు ఎన్సీఎల్టీ ఆమోదించినట్టు డిసెంబర్ 10న రిలయన్స్ ప్రకటించింది. -
ఇషా, ఆకాష్ అంబానీ పేర్ల వెనుక స్టోరీ, వాటి అర్థం తెలుసా?
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ,నీతా అంబానీల పిల్లలు ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ. ఐవీఎఫ్ ద్వారా ఈ కవల పిల్లలకు జన్మనిచ్చారు నీతా అంబానీ. అక్టోబర్ 23న పుట్టిన ఇషా , ఆకాష్ అంబానీలు పేర్లు ఎలా వచ్చాయో తెలుసా?ఇషా, ఆకాష్ అంబానీ పుట్టిన రోజు సందర్బంగా గతంలో డిజైనర్లు అబు జానీ, సందీప్ ఖోస్లాతో నీతా అంబానీ సంభాషణ ఇపుడు వైరల్‌గా మారింది. ఇందులో తన కవల పిల్లలు ఇషా, ఆకాష్ పేర్ల వెనుకున్న కథను నీతా పంచుకున్నారు.కవలల పిల్లల ప్రసవం కోసం తాను అమెరికాలో ఉన్నానని నీతా తెలిపారు. అపుడు నత భర్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ తనను కలిసి ఇండియా వెళ్లేందుకు విమానం దిగారో లేదో వెంటనే అమెరికా బయలుదేరాల్సి వచ్చింది. ఎందుకంటే... నెలలకు నిండకుండానే. ఇషా, ఆకాష్‌కు జన్మనిచ్చారట నీతా. దీనితో ముఖేష్ U.S.కి తిరిగి వెళ్లవలసి వచ్చింది. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే..నీతాకు డెలివరీ అయిందన్న సంగతి తెలియగానే అంబానీతోపాటు, నీతా తల్లి, డాక్టర్ ఫిరోజా, విమానంలో అమెరికాకు బయలు దేరారు. అపుడు వారు ప్రయాణిస్తున్న విమానం పైలట్ ఈ సంతోషకరమైన వార్తను ప్రకటించారు. అంతేకాదు తమ పిల్లలకు ఇషా, ఆకాష్ పేర్లు ఎలా పెట్టిందీ వివరించారు నీతా. పిల్లలకు పేర్ల చర్చ వచ్చినపుడు పర్వతాల మీదుగా ఆకాశంలో ఎగురుతున్నపుడు ఈ వార్త తెలిసింది కాబట్టి అమ్మాయికి ఇషా (పర్వతాల దేవత) ఆకాష్ (ఆకాశం) అని అనే పేర్లు పెడదామని చెప్పారట అంబానీ. అదీ సంగతి. ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ పుట్టిన మూడేళ్ల తర్వాత వారి మూడో సంతానం అనంత్ అంబానీ జన్మించాడు. కాగా ప్రస్తుతం ఇషా, ఆకాష్, అనంత్ రిలయన్స్వ్యాపార సమ్రాజ్య బాధ్యతల్లో ఉన్నారు. ఆకాష్ , డైమండ్స్ వ్యాపారి కుమార్తె శ్లోకా మెహతాను పె ళ్లాడాడు వీరికి ఇద్దరు సంతానం. వ్యాపారవేత్త ఆనంద్పిరమిల్ వివాహమాడిన ఇషాకు ఇద్దరు కవల పిల్లలు. అనంత్ తన చిన్న నాటి స్నేహితురాలు రాధికా మర్చంట్‌ను ఈ ఏడాది జూలైలో అంగరంగ వైభవంగా పెళ్లాడిన సంగతి తెలిసిందే. -
Hurun Rich List 2024: అంబానీని మళ్లీ దాటేసిన అదానీ
న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ దెబ్బ నుంచి వేగంగా కోలుకున్న పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ (62) దేశీయంగా అత్యంత సంపన్నుల జాబితాలో మరోసారి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని (67) అధిగమించి అగ్రస్థానం దక్కించుకున్నారు. ఏడాది వ్యవధిలో ఆయన సంపద ఏకంగా 95 శాతం ఎగిసి రూ. 11.6 లక్షల కోట్లకు చేరింది. హురున్ గురువారం విడుదల చేసిన సంపన్నుల జాబితా– 2024లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2023 నివేదికలో అదానీ సంపద 57 శాతం క్షీణించి రూ. 4.74 లక్షల కోట్లకు పడిపోయింది.అప్పుడు అంబానీ సంపద రూ. 8.08 లక్షల కోట్లుగా నమోదైంది. తాజాగా అంబానీ మొత్తం సంపద 25 శాతం పెరిగి రూ. 10.14 లక్షల కోట్లకు చేరడంతో ఆయన రెండో స్థానంలో నిల్చారు. తాజా జాబితాలో జూలై 31 నాటి వరకు రూ. 1,000 కోట్ల పైగా నికర విలువ ఉన్న భారతీయ సంపన్నులను పరిగణనలోకి తీసుకున్నారు. ఈసారి కుబేరుల సంఖ్య 220 మేర పెరిగి 1,539కి చేరింది. మొత్తం సంపద 46 శాతం వృద్ధి ెచంది రూ. 159 లక్షల కోట్లకు చేరింది. ఇది సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్ దేశాల సంయుక్త జీడీపీ కన్నా అధికం కాగా భారతదేశ జీడీపీలో సగానికన్నా అధికం కావడం గమనార్హం. భారత్‌లో ప్రతి ఐదు రోజులకు ఒక కొత్త బిలియనీరు నమోదయ్యారు. మరిన్ని విశేషాలు.. ⇒ హురున్ టాప్–5 జాబితాలో హెచ్‌సీఎల్ అధిపతి శివ్ నాడార్ (రూ. 3.14 లక్షల కోట్లు) మూడో స్థానంలో, సీరమ్ ఇనిస్టిట్యూట్‌కి చెందిన సైరస్ పూనావాలా (రూ. 2.89 లక్షల కోట్లు) ఒక స్థానం తగ్గి నాలుగో స్థానంలో ఉన్నారు. సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వి రూ. 2.50 లక్షల కోట్ల సంపదతో ఆరు స్థానం నుంచి అయిదో స్థానానికి చేరారు. ⇒ 7,300 కోట్ల సంపదతో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తొలిసారిగా ఈ లిస్టులో చోటు దక్కించుకున్నారు.టాప్–3లో హైదరాబాద్.. 17 మంది కొత్త కుబేరులు జత కావడంతో హైదరాబాద్ తొలిసారిగా బెంగళూరును అధిగమించింది. 104 మంది సంపన్నులతో సంఖ్యాపరంగా మూడో స్థానంలో నిలి్చంది. తెలంగాణలో 109 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 9 మంది అత్యంత సంపన్నులు ఉన్నారు. 396 మంది కుబేరులతో ముంబై అగ్రస్థానంలో, 217 మందితో న్యూఢిల్లీ రెండో స్థానంలో ఉంది. అత్యంత సంపన్న తెలుగువారిలో మురళి దివి (దివీస్), సి.వెంకటేశ్వర రెడ్డి –ఎస్.సుబ్రహ్మణ్యం రెడ్డి (అపర్ణ కన్స్ట్రక్షన్స్), జీఎం రావు–కుటుంబం (జీఎంఆర్), హర్షా రెడ్డి పొంగులేటి (రాఘవ కన్స్ట్రక్షన్స్), పి.పి.రెడ్డి–పీవీ కృష్ణా రెడ్డి (ఎంఈఐఎల్), బి.పార్థసారథి రెడ్డి–కుటుంబం (హెటిరో ల్యాబ్స్), ప్రతాప్ రెడ్డి–కుటుంబం (అపోలో హెల్త్‌కేర్), పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి (అరబిందో ఫార్మా) తదితరులు ఉన్నారు. -
'ఆశ, ఆందోళన కాలంలో ఉన్నాము': ముకేశ్ అంబానీ
గురువారం జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేశ్ అంబానీ.. ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. భారతదేశం శక్తివంతమైన ప్రజాస్వామ్యానికి మోదీ నిదర్శనమని పేర్కొన్నారు. వరుసగా మూడోసారి గెలిచినా దూరదృష్టి గల ప్రధాని మోదీని హృదయపూర్వకంగా అభినందిద్దాం అని అన్నారు.నేటి ప్రపంచం ఆశ & ఆందోళన రెండింటినీ తెస్తుందిప్రస్తుత గ్లోబల్ డైనమిక్స్‌ను ఉద్దేశించి ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. మనం అపారమైన ఆశ, ఆందోళన రెండింటి కాలంలో జీవిస్తున్నామని అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో.. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటింగ్, రోబోటిక్స్, లైఫ్ సైన్సెస్ వంటివి భవిష్యత్తును రూపొందిస్తున్నాయి.వేగంగా పెరుగుతున్న టెక్నాలజీ ఎంత ఉపయోగకరంగా ఉంటుందో.. అంత నష్టాలను కలిగించే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ అనిశ్చితి ఉన్నప్పటికీ, భారతదేశం నిరంతర వృద్ధి పెరుగుదలపై అంబానీ విశ్వాసం వ్యక్తం చేశారు. మోదీ ఆకాంక్షిస్తున్న వికసిత భారత్ సాధ్యమవుతుందని ఆయన అన్నారు. -
జియో కస్టమర్లకు గుడ్ న్యూస్
-
రాధిక మర్చంట్ 'విదాయి'వేడుక..భావోద్వేగానికి గురైన ముఖేష్ అంబానీ!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నీతాల చిన్న కుమారుడు అనంత్ రాధికల వివాహం చాలా లగ్జరీయస్‌గా జరిగిన సంగతి తెలిసిందే. వివాహ తంతులో భాగంగా జరిగే అప్పగింతల కార్యక్రమం ఎంతటి ధనవంతురాలైన కోడలుగా వేరే ఇంట అడుగుపెట్టే వేళ్లు కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. ఇక ఈ వివాహతంతు తర్వాత నవ వధువు తను పుట్టిన చోటును వెళ్లిపోతున్నానన్న ఆలోచన తట్టుకోలేకపోతుంది. అలాంటి భావోద్వేగ సమయంలో ఆమెను చూస్తున్న వాళ్లు సైతం కన్నీళ్లుపెట్టుకుంటారు. అలాంటి తంతే అనంత రాధికల వివాహానంతరం సాగింది. దీన్ని వాళ్లు విదాయి వేడుక అంటారు. కోడలు రాధికా మర్చంట్ విదాయి వేడుకలో భాగంగా తనవాళ్లకు వీడ్కోలు పలుకుతూ కన్నీళ్లుపెట్టుకుంటున్న దృశ్యాన్ని చూసి మామగారు ముఖేష్ అంబానీ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఆ సున్నితమైన ఘట్టంలో రాధిక కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే అనంత్ ఓదార్చే ప్రయత్నం చేస్తుండగా..ఆ తంతుని చూసి ముఖేష్ కూడా చిన్నపిల్లాడిలా కంటతడి పెట్టడం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఆ సన్నివేశానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆయన తన కోడళ్లను చాలా ప్రేమానురాగాలో చూసుకుంటారు అనేందుకు ఈ ఘట్టమే ఉదాహరణ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఏ ఆడపిల్లకైన జీవితంలో తప్పక ఎదురై ఈ ఘట్టం కంటతడి పెట్టించేలా చేస్తుంది కదూ. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) (చదవండి: వింబుల్డన్ నేపథ్య చీరలో కంటెంట్ క్రియేటర్..!) -
అనంత్ అంబానీ పెళ్లిపై ఆలియా సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ వ్యాపారవేత్త, అపర కుభేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి శుక్రవారం(జులై 12) ముంబైలో జరగనుంది. ఇప్పటికే ఏర్పట్లు అన్ని పూర్తి చేశారు. ఈ వివాహ వేడుకకి ప్రపంచ నలుమూలల నుంచి పలువురు వ్యాపార, సీనీ, రాజకీయ ప్రముఖులు హాజరకానునున్నారు. ఇప్పటికే రెండు సార్లు ప్రీవెడ్డింగ్ ఈవెంట్స్ జరిగాయి. ఈ ఈవెంట్స్‌కి బాలీవుడ్ స్టార్స్ అంతా హాజరై సందడి చేశారు. (చదవండి: క్లీంకారతో ముంబయికి రామ్ చరణ్.. ఎందుకో తెలుసా?)రేపు జరిగే వివాహ వేడుకకి కూడా బాలీవుడ్ ప్రముఖులంతా హాజరుకానున్నారు. ఇప్పటికే సంబంధిత పీఆర్వోలు ఆహ్వానాలు అందించారు. పలువురు స్టార్స్ కూడా పెళ్లికి కోసం తమ షెడ్యూల్‌ని మార్చుకున్నారు. అయితే తనకు ఎన్నిసార్లు ఆహ్వానం పంపినా.. పెళ్లికి మాత్రం వెళ్లనని చెబుతోంది ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్. అంతేకాదు అనంత్ అంబానీ పెళ్లి.. పెళ్లిలా కాకుండా ఒక సర్కస్‌లా మారిందని సంచలన వ్యాఖ్యలు చేసింది.(చదవండి: పెళ్లి వేడుకల్లో మెరిసిన దేవర భామ.. పక్కనే బాయ్‌ఫ్రెండ్ కూడా!)‘నన్ను ఓ ఈవెంట్‌కి ఆహ్వానించారు. కానీ నేను రానని చెప్పాను. ఎందుకంటే నాకు కొంచెం ఆత్మగౌరవం ఉంది. ఒకరి పెళ్లిలో నన్ను నేను అమ్ముకోవడం కంటే నాకు గౌరవమే ముఖ్యం’ అని అలియా తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆలియా వ్యాఖ్యలపై నెట్టింట వైరల్ అవుతున్నాయి.అంబానీ ఇంట పెళ్లి అంటే.. బాలీవుడ్ మొత్తం పండగ చేసుకుంటుంది. స్టార్ హీరోహీరోయిన్లు పెళ్లిలో డ్యాన్స్ చేసి సందడి చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాప్ స్టార్లంతా ఈ పెళ్లి వేడుకలో ప్రదర్శన ఇచ్చేందుకు తహతహలాడతారు. అంబానీ ప్యామిలీ కూడా ఇలాంటి ఈవెంట్స్‌కి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది. Aliyah Kashyap (Anurag Kashyap's daughter) talks about the PR involved in the Ambani wedding on her Instagram channel. Influencers are being invited to promote wedding.Although this is hard to digest. They don’t need the PR thing to promote the wedding + it also takes away the… pic.twitter.com/kezmfnsk0b— Vineet Sharma (@Vineet_Sir_) July 8, 2024 -
అనంత్, రాధిక ప్రీ వెడ్డింగ్‌లో సందడి చేసిన ప్రముఖులు (ఫోటోలు)
-
అంబానీ ప్రీవెడ్డింగ్‌లో నాటు నాటు పాట
-
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు: స్టైయిలిష్ లుక్‌లో ఇషా!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సినీ సెలబ్రెటీలు దగ్గర నుంచి పలు రంగాల అధినేతలు దేశ విదేశాల నుంచి తరలి వచ్చి మీరీ ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో అనంత్ అంబానీ సోదరి ఇషా తన ప్రత్యేక వస్త్రాలంకరణలో అందర్నీ మిస్మరైజ్ చేసింది. ఈ వివాహ వేడుకల్లో ఇషా ఫ్యాషన్ ఐకాన్‌గా పేరుగాంచిని తన తల్లి నీతా అంబానీని ఫాలో అయ్యిందా అన్నంత రేంజ్లో ఉంది ఆమె లుక్. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ కార్ల్ లాగర్ ఫెల్డ్ చెందిన బ్లాక్ డ్రెస్‌లో అజంతా శిల్పంలా ఉంది. చేతులకు, డైమండ్ బ్రాస్లెంట్, డైమండ్ ఉంగరాలతో మరింత గ్రాండ్‌గా కనిపించింది. చెవులకు కూడా ఆ డ్రస్‌కి తగ్గ డైమండ్ జూకాలు ధరించింది. ఐషా ధరించిన గౌను ఆ బ్రాండ్ వ్యవస్థాపకుడు లాంగర్ ఫెల్డ్ చనిపోవడానికి కొద్దిరోజుల ముందు డిజైన్ చేసింది. ఆయన గత కొన్ని దశాబ్దాలుగా ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలుతున్న ప్రముఖ డిజైనర్ . తన క్రియేటివిటీతో ఎన్నో ప్రముఖ డిజైనర్ దుస్తులను పరిచయం చేసి ఫ్యాషన్‌కి అసలైన అర్థం ఇచ్చిన వ్యక్తి అతను. అతని బ్రాండెడ్ దుస్తులకు పలు సినీ సెలబ్రెటీలు, వ్యాపార ప్రముఖులే అభిమానులు. ఈ బ్రాండ్ ధర కూడా ఓ రేంజ్లో ఉంటుంది. ఇక ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఇషా ధరించిన లాగర్ఫెల్డ్ గౌనుపై వెండి ఆకుల రూపంలో బ్లాక్ షీర్ సిల్హౌట్ అందంగా డిజైన్ చేశారు. ఆ డ్రెస్‌కి తగ్గట్టు లైట్ మేకప్, పెదాలకు నేచురల్ లిప్‌స్టిక్‌తో ప్రత్యేక ఆకర్షణ నిలిచింది ఇషా. చెప్పాలంటే పండు వెన్నెలలో ఉండే జాబిల్లిలా ఆమె స్టన్నింగ్ లుక్ కళ్లు తిప్పుకోనివ్వలేనంతగా కట్టిపడేస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ చక్కెర్లు కొడుతున్నాయి.మరీ మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: అనంత్ అంబానీ అధిక బరువుకి కారణం ఇదే! ఆ విషంయలో కాబోయే భార్య..) -
టాటా షేర్స్ పై కన్నేసిన అంబానీ
-
దేశవ్యాప్తంగా వేతనంతో కూడిన సెలవు.. అంబానీ కీలక ప్రకటన
అయోధ్యలో జనవరి 22వ తేదీన బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సగం రోజు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. మోదీ నిర్ణయానికి మద్ధతుగా ప్రతిష్టాత్మక రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అదే బాటలో నిర్ణయం తీసుకున్నారు. జనవరి 22వ తేదీన రిలయన్స్ ఇండస్ట్రీ ఉద్యోగులకు సెలవు ప్రకటించారు. రిలయన్స్ ఆధ్వర్యంలోని అన్ని కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవుదినం ప్రకటించారు. జనవరి 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో అయోధ్యలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిలయన్స్ ఇండస్ట్రీ ఆఫీసులు, కంపెనీలు, ఫ్యాక్టరీలకు సెలవు ప్రకటించినట్లు అంబానీ వెల్లడించారు. ఇదీ చదవండి: రిలయన్స్ లాభం 17,265 కోట్లు దీంతో జనవరి 22వ తేదీన తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఉన్న ట్రెండ్స్ షోరూంలు, ఇతర రిలయన్స్ ఇండస్ట్రీ ఆఫీసులకు వేతనంతో కూడిన సెలవుదినంగా ప్రకటించారు. ముఖేష్ అంబానీ సోమవారం అయోధ్యలో జరిగే కార్యక్రమంలో ఫ్యామిలీతోపాటు హాజరుకానున్నట్లు తెలిసింది. -
ఇషితా సల్గావ్కర్ ఎవరు.. అంబానీతో సంబంధం ఏంటి?
భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత 'ముఖేష్ అంబానీ' గురించి తెలిసిన చాలా మందికి, ఆయన మేనకోడలు 'ఇషితా సల్గావ్కర్' (Isheta Salgaocar) గురించి తెలియకపోవచ్చు. వ్యాపార రంగంలో తనదైన గుర్తింపు పొందిన ఈమె గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎవరీ ఇషితా సల్గావ్కర్? ఇషితా సల్గావ్కర్.. దీప్తి సల్గావ్కర్, దత్తరాజ్ సల్గావ్కర్ దంపతుల కుమార్తె. ఈమె స్వయానా ముకేశ్ అంబానీకి మేనకోడలు. ఎందుకంటే ఇషితా తల్లి 'దీప్తి సల్గావ్కర్' ధీరూభాయ్ అంబానీ కుమార్తె.. ముకేశ్ అంబానీ సోదరి. నిజానికి ముకేశ్ అంబానీ మేనకోడలుగా కాకుండా వ్యాపార కార్యకలాపాలు, దాతృత్వ కార్యక్రమాలతోనే సుపరిచితం అయింది. ఈమె 2016లో నీరవ్ మోదీ తమ్ముడు నీషాల్ మోదీని వివాహం చేసుకుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వీరిరువురు విడిపోయారు. ఆ తరువాత ఇషితా బిజినెస్ టైకూన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ మేనల్లుడు 'అతుల్య మిట్టల్'తో ప్రేమలో పడింది. వీరిద్దరూ 2022లో వివాహం చేసుకున్నారు. అంబానీ కుటుంబంలోని తన బంధువుల మాదిరిగా కాకుండా.. ఇషితా చదువుకునే రోజుల నుంచి గొప్ప విజయాలను సాధించింది. ఈమె హార్వర్డ్ బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన తరువాత సల్గావ్కర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కార్పొరేట్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తోంది. ఇదీ చదవండి: స్మార్ట్‌ఫోన్ కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ కారు - సింగిల్ ఛార్జ్‌తో 800కిమీ రేంజ్ ఆమె తల్లి దీప్తి సల్గావ్కర్ మాదిరిగానే.. ఇషితా సల్గావ్కర్ దాతృత్వ కార్యకలాపాలలో ఎక్కువగా పాల్గొనేది. ఇప్పటికే అనేక విద్య, ఆరోగ్య సంరక్షణ సంబంధిత కార్యకలాపాలకు పెద్ద ఎత్తున సాయం కూడా చేసింది. ప్రస్తుతం ఇషితా నికర విలువ గురించి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు, అయితే కొన్ని మీడియా కథనాల ప్రకారం ఈమె నికర విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని, వ్యాపార రంగంలో కూడా బాగా రాణిస్తున్నట్లు సమాచారం. -
ఈ ఏడాది ఈమే టాప్.. తర్వాతే అంబానీ, అదానీ.. కానీ..
సంపన్నుల జాబితా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు అంబానీ, అదానీ కదా.. అయితే వారి సంపాదన ఎక్కువగా ఉండడం వల్ల వారు సంపన్నుల జాబితాలో చోటుసంపాదిస్తుంటారు. ఈ ఏడాది అత్యధిక సంపద ఆర్జించిన జాబితాలో సావిత్రి జిందాల్(73) అగ్రస్థానంలో నిలిచినట్లు ‘బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్’ నివేదించింది. ఆమె మొత్తం సంపద రూ.2.1 లక్షల కోట్లు. అయితే ఈ ఒక్క ఏడాదిలోనే ఆమె సంపద రూ.80 వేలకోట్లు పెరిగిందని నివేదిక వెల్లడించింది. దాంతో అంబానీ, అదానీ, బిర్లా.. వంటి ప్రముఖుల సంపదను సావిత్రి జిందాల్ మించిపోయారు. దాంతో ఈ ఏడాది అధికంగా సంపదించిన జాబితాలో ఆమె అందరి కంటే ముందు నిలిచారని నివేదిక తెలిపింది. అయితే మొత్తంగా మాత్రం రూ.7.7 లక్షల కోట్ల సంపదతో ముఖేష్ అంబానీ అత్యధిక సంపన్నుడిగానే కొనసాగుతున్నారు. ప్రపంచ కుబేరుల్లో 13వ స్థానంలో నిలిచారు. అయితే ఈ ఏడాది ఆయన సంపద రూ.43 వేలకోట్లు పెరిగినట్లు తెలిసింది. రూ.7 లక్షల కోట్ల సంపదతో దేశంలోని సంపన్నుల జాబితాలో గౌతమ్అదానీ రెండో స్థానంలో ఉన్నారు. జిందాల్ గ్రూప్‌ను స్థాపించిన ఓం ప్రకాశ్ జిందాల్ సతీమణే సావిత్రి జిందాల్. ఆయన మరణానంతరం ఓపీ జిందాల్ గ్రూప్ ఛైర్‌పర్సన్‌గా ఆమె వ్యవహరిస్తున్నారు. ఈ గ్రూప్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ అండ్ పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జిందాల్ స్టెయిన్లెస్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఇందులో చాలా వరకు కంపెనీల షేర్లు దేశీయ మార్కెట్లో లాభాల్లో దూసుకెళ్లడంతో సావిత్రి జిందాల్ సంపద భారీగా పెరిగింది. దేశీయ కుబేరుల జాబితాలో అయిదో స్థానంలో నిలిచినా.. దేశంలోని మహిళా సంపన్నుల జాబితాలో ఆమెదే అగ్రస్థానం. మొత్తం సంపద విషయంలో అజీమ్ ప్రేమ్‌జీ (రూ.2 లక్షల కోట్లు)ను సావిత్రి దాటేశారు. ఇదీ చదవండి: తగ్గిన ‘తీపి’ ఉత్పత్తి..! కారణాలు ఇవే.. ఈ ఏడాది ఎక్కువ సంపదను ఆర్జించిన వారి జాబితాలో హెచ్‌సీఎల్ టెక్ అధినేత శివ్‌నాడార్ రూ.66 వేలకోట్లతో రెండో స్థానంలో నిలిచారు. స్థిరాస్తి సంస్థ డీఎల్ఎఫ్ లిమిటెడ్ ఛైర్మన్ కేపీ సింగ్ సంపద రూ.59వేలకోట్లు పెరగడంతో మూడో స్థానంలో ఉన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ బిర్లా, షాపూర్ మిస్త్రీ రూ.52 వేలకోట్ల చొప్పున సంపదను పెంచుకున్నారు. ముకేశ్ అంబానీ సంపద ఈ ఏడాది రూ.43 వేలకోట్లు పెరిగింది. సన్‌ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వి, రవి జైపురియా, ఎంపీ లోథా, సునీల్ మిత్తల్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
హైదరాబాద్‌లో రిలయన్స్ ‘స్వదేశ్‌స్టోర్’ ప్రారంభం.. సందడి చేసిన సెలబ్రిటీలు
సాక్షి,హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో రిలయన్స్ స్వదేశ్ స్టోర్‌ను రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ ప్రారంభించారు. హస్తకళలను ఆదరించడం, హస్త కళాకారులను ప్రోత్సహించడంలో భాగంగా దేశంలోనే తొలిసారి అతిపెద్ద ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్టోర్‌ను ఏర్పాటు చేసినట్లు నీతా అంబానీ చెప్పారు. ఈ సందర్భంగా ‘కళాకారులకు అవకాశం కల్పించడమే స్వదేశ్ స్టోర్ల లక్ష్యం.హైదరాబాద్ అంటే మాకు చాలా ఇష్టం. మా మొట్టమొదటి రిలయన్స్ రిటైల్ స్టోర్ ఇక్కడి నుంచే ప్రారంభించాం. ముంబై ఇండియన్స్ కూడా ఇక్కడ రెండు టైటిల్స్ గెలిచారని’ నీతా అంబానీ అన్నారు. ఇక, స్వేదేశ్ స్టోర్ ప్రారంభోత్సవానికి రాంచరణ్, ఉపాసన, మంచు లక్ష్మి, పీవీ సింధు, సానియా మీర్జాతో పాటు పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. హస్తకళలకు అండగా దేశంలోని హస్తకళాకారులకు స్థిరమైన జీవనోపాధిని అందించడానికి, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు భారతీయ కళలను పరిచయం చేసేలా ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆ సంస్థ హస్తకళల బ్రాండ్ ‘స్వదేశ్’ పేరుతో దేశ వ్యాప్తంగా స్టోర్లను ప్రారంభిస్తుంది. #WATCH | Hyderabad, Telangana | Founder and chairperson of Reliance Foundation & IOC Member Nita Ambani says, "We had the honour to host the Olympics Session in India after 40 years. So, it is after 40 years that we have brought the Olympic movement back into India and it was… pic.twitter.com/M5CIO5lolX — ANI (@ANI) November 8, 2023 ఈ స్టోర్లలో కళాకారులు చేతితో తయారు చేసిన వస్త్రాలు, హస్తకళలు, వ్యవసాయ ఉత్పత్తులు, చేతివృత్తుల వారి నుంచి నేరుగా రిలయన్స్ సేకరిస్తుంది. ఈ స్టోర్లలో ప్రదర్శిస్తుంది. ఆపై భారతీయ చేతివృత్తులవారిని, సెల్లర్లను ఒకే ప్లాట్‌ఫామ్ పైకి చేర్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు స్వదేశ్ బ్రాండ్‌తో ఈ కళాఖండాలను అందిస్తుంది రిలయన్స్ రీటైల్. రైస్ కేంద్రాల ఏర్పాటు దేశ వ్యాప్తంగా కళాకారులు ఏ మూలన ఉన్న వారిని గుర్తించేలా రిలయన్స్ స్వదేశ్ కేంద్రాలు గుర్తిస్తున్నాయి. వారిలో నైపుణ్యాలు మరింత పెంపొందేలా రిలయన్స్ ఫౌండేషన్ ఇన్ఫియేటీవ్ ఫర్ స్కిల్ ఎన్‌హ్యాన్స్‌మెంట్ (RiSE) కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది రిలయన్స్ -
జియో వినియోగదారులకు శుభవార్త
వినియోగదారులకు రిలయన్స్ శుభవార్త చెప్పింది. వాట్సాప్, లైవ్ టీవీ స్ట్రీమింగ్, యూపీఐ పేమెంట్స్ వంటి ఫీచర్లతో మెరుగైన వెర్షన్లో 4జీ ఫోన్లను రూ.999కే అందించనుంది. ఈ నేపథ్యంలో నోకియా, లావా, ఐటెల్ వంటి మొబైల్ ఫోన్ బ్రాండ్లతో కలిసి స్మార్ట్‌ఫోన్ సొంత వెర్షన్లను అభివృద్ధి చేయడానికి పనిచేస్తుందని రిలయన్స్ జియో ప్రెసిడెంట్ (పరికరాల విభాగం) సునీల్ దత్ తెలిపారు. 250 మిలియన్ల 2జీ వినియోగదారులు 4జీ టెక్నాలజీని వినియోగించేలా కృషి చేయాలని కంపెనీ భావిస్తుందన్న ఆయన .. 450కి పైగా ఛానళ్లతో లైవ్ టీవీ, లేటెస్ట్ సినిమాలు, పాటలు, ఐపీఎల్ స్ట్రీమింగ్, ఇతర కంటెంట్ వంటి ఫీచర్లను రిలయన్స్ జియో 30 శాతం తక్కువ ధరకే అందిస్తోంది. స్కాన్ అండ్ పే ఆప్షన్ తో యూపీఐ పేమెంట్స్ ను జియో ప్రవేశపెట్టిందని దత్ వెల్లడించారు. గత నెలలో రిలయన్స్ జియో కొత్త 4జీ ఫోన్ జియోభారత్ బి1ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కంపెనీ అధికారిక వెబ్సైట్లో ఈ ఫోన్ ధర రూ.1,299గా ఉంది. ఈ ఫోన్లో 2.4 అంగుళాల స్క్రీన్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. సినిమాలు, వీడియోలు, స్పోర్ట్స్ హైలైట్స్ అందించేందుకు జియో యాప్స్‌ను ఫ్రీ ఇన్ స్టాల్ చేసింది. 23 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుండగా.. యూపీ పేమెంట్స్ కోసం జియోపేని ఉపయోగించుకునే అవకాశాన్ని వినియోగదారులకు జియో కల్పిస్తుంది. జియో ఫోన్, జియో ఫోన్ 2, జియో ఫోన్ నెక్స్ట్, జియో భారత్ వీ2, కే1 కార్బన్ వంటి ఫోన్లను జియో ప్రవేశపెట్టింది. -
ముఖేష్ అంబానీకి మరో మెయిల్! అడిగింది ఇవ్వకుంటే చంపేస్తామంటూ..
భారతదేశంలో అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ 'ముఖేష్ అంబానీ'కి (Mukesh Ambani) గత 48 గంటల్లో రెండు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. అక్టోబర్ 27న పంపిన మెయిల్లో రూ.20 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన నిందితుడు.. అదే మెయిల్ నుంచి రూ. 200 కోట్లు ఇవ్వాలని, లేకుంటే చంపుతామని బెదిరిస్తూ మెయిల్ చేసాడు. ఇండియాలో మాకు అత్యుత్తమ షూటర్లు ఉన్నారని, అడిగిన డబ్బు ఇవ్వకుంటే చంపుతామని మెయిల్లో నిందితుడు ప్రస్తావించారు. దీనిపైన యాంటిలియా సెక్యూరిటీ ఇన్ఛార్జ్ దేవేంద్ర మున్షీరామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు యూరప్‌కు చెందిన ఈ-మెయిల్ సర్వీస్ ప్రొవైడర్ ఉపయోగించాడని, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ ద్వారా అతడిని గుర్తించాలని లేఖ రాశామని పోలీసు అధికారి తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 387, 506 (2) కింది గుర్తు తెలియని వ్యక్తి మీద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: రూ.1200 సంపాదనతో మొదలై.. రూ.9800 కోట్ల కంపెనీ నడిపిస్తోంది! ఎవరీ గజల్ అలఘ్.. ముఖేష్ అంబానీ కుటుంబానికి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది అక్టోబర్ 5న రిలయన్స్ ఫౌండేషన్‌కు చెందిన ఒక హాస్పిటల్‌కి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఆసుపత్రిలో బాంబ్ పేల్చనున్నట్లు పేర్కొన్నాడు. ఆ తరువాత రోజే ఫోన్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ముఖేష్ అంబానీ వారసులు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులైన సందర్భంగా ఈ బెదిరింపు మెయిల్ రావడం గమనార్హం. -
రూ.20కోట్లు ఇవ్వకపోతే చంపుతామంటూ అంబానీకి ఈమెయిల్..నిందితుడు ఎవరంటే..
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీని చంపుతామంటూ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. తనకు రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తానని ఒక వ్యక్తి అంబానీని ఈమెయిల్ ద్వారా బెదిరించినట్లు చెప్పారు. "మీరు మాకు రూ.20 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే మిమ్మల్ని చంపుతాము. భారతదేశంలోనే అత్యుత్తమ షూటర్లు మా వద్ద ఉన్నారు" అని ఈమెయిల్ వచ్చినట్లు చెప్పారు. అయితే ఆ ఈమెయిల్ అక్టోబరు 27న షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి అకౌంట్ ద్వారా వచ్చినట్లు పోలీసులు ధ్రువపరిచారు. అంబానీ నివాసం యాంటిలియాలోని భద్రతా అధికారులు హత్య బెదిరింపుకు సంబంధించిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకురావడంతో విచారణ ప్రారంభించారు. (ఇదీ చదవండి: 29.7 శాతం పెరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం) అంబానీ, అతని కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని బెదిరిస్తూ అనామక కాల్స్ చేసినందుకు బిహార్‌కు చెందిన ఒక వ్యక్తిని ముంబై పోలీసులు గత ఏడాది అరెస్టు చేశారు. దక్షిణ ముంబైలోని అంబానీ కుటుంబ నివాసం 'యాంటిలియా'తో పాటు హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌ను పేల్చివేస్తానని ఆ వ్యక్తి కాల్ చేసి బెదిరించాడు. -
మామకు తగ్గ మేనల్లుడు.. అర్జున్ కొఠారి ఆస్తులు ఇన్ని కోట్లా?
భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబం ఏది అనగానే వెంటనే గుర్తొచ్చేది 'ముఖేష్ అంబానీ' ఫ్యామిలీ. అంటే ఇందులో చాలామందికి తెలిసిన పేర్లు నీతా, ఇషా, అనంత్ అండ్ ఆకాష్ అంబానీ మాత్రమే. కానీ వీరి కుటుంబానికి చెందిన మరో బిలినీయర్ 'అర్జున్ కొఠారి' (Arjun Kothari) ఒకరున్నారనే సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో అర్జున్ కొఠారి ఎవరు? ఈయన మొత్తం సంపద ఎంత? అనే మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ముఖేష్ అంబానీ సోదరి 'నీనా కొఠారి' కొడుకే ఈ అర్జున్ కొఠారి. అంటే ఈయన స్వయానా ముఖేష్ అంబానీ మేనల్లుడే. ఇతని మొత్తం ఆస్తుల విలువ ఏకంగా రూ. 845 కోట్లు కావడం గమనార్హం. ఇంతపెద్ద మొత్తంలో ఆస్తులున్నప్పటికీ ఈయన గురించి చాలామందికి తెలియకపోవడం కొంత ఆశ్చర్యమనే చెప్పాలి. కొఠారీ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో ఉన్న అర్జున్ కొఠారి.. అమెరికాలోని మేనేజ్మెంట్ డెవలప్మెంట్ రొటేషన్ ప్రోగ్రామ్‌లో జనరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్‌తో సీనియర్ స్పెషలిస్ట్ హోదాను కలిగి ఉన్నాడు. ఇదీ చదవండి: I am not a robot: ఇది ఎందుకొస్తుంది? అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు! వ్యాపార లావేదేవాలను చూసుకోవడానికి ముందు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ నార్త్ఈస్టన్ యూనివర్సిటీ (Bachelor of Science at Northeastern University)లో పూర్తి చేసాడు. ఆ తరువాత కుటుంబ వ్యాపారంలో అడుగుపెట్టి గొప్ప వేగంగా అభివృద్ధి చెందాడు. ఆ తరువాత ప్రముఖ వ్యాపారవేత్తలైన అంజలి & రాజేన్ మరివాలా కుమార్తె ఆనందిత మరివాలాను వివాహం చేసుకున్నారు. -
తండ్రికి తగ్గ తనయ.. ఆకట్టుకున్న ఇషా అంబానీ మాటలు!
Isha Ambani at Reliance AGM 2023: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్ విభాగం రిలయన్స్ రిటైల్ వ్యాపారం, పెట్టుబడులు.. ఇలా అన్ని అంశాల్లోనూ దూసుకెళ్తోంది. ముఖేష్ అంబానీ తనయ ఇషా అంబానీ నాయకత్వంలో రిటైల్ బిజినెస్ పరుగులు పెడుతోంది. తాజాగా జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ రిటైల్ ప్రగతిని ఇషా అంబానీ వివరించారు. రిలయన్స్ రిటైల్ 2023 ఆర్థిక సంవత్సరంలో 100 కోట్ల లావాదేవీల మైలురాయిని దాటింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇది 42 శాతం పెరిగింది. సంస్థ రిజిస్టర్డ్ కస్టమర్ బేస్ 249 మిలియన్లకు చేరుకుంది. 3,300 కొత్త స్టోర్లు ఏర్పాటయ్యాయి. మొత్తంగా 65.6 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో 18,040 స్టోర్లకు రిటైల్ విస్తరణ చేరుకుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ ముఖేష్ అంబానీ వివరించారు. ల్యాండ్‌మార్క్ ఇయర్ కంపెనీ డిజిటల్ కామర్స్, ఇతర కొత్త వ్యాపారాలు దాదాపు రూ.50,000 కోట్ల ఆదాయాన్ని అందించాయి. అంటే మొత్తం రెవెన్యూలో ఇది ఐదో వంతు. "మేము గత రెండు సంవత్సరాలలో 10 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.82 వేల కోట్లు)కుపైగా పెట్టుబడి పెట్టాం. సమ్మిళిత వృద్ధి, అంతర్గత బ్రాండ్లను పెంచుకోవడం, సప్లయి చైన్ నెట్‌వర్క్‌లను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెడుతున్నాం" అని ఇషా అంబానీ చెప్పారు. రిటైల్ వ్యాపారానికి 2023 ఆర్థిక సంవత్సరాన్ని ఒక మైలురాయి సంవత్సరంగా ఆమె అభివర్ణించారు. ఇదీ చదవండి: తక్కువ ధరలతో రిలయన్స్ కొత్త ఫ్యాషన్ బ్రాండ్.. తొలి స్టోర్ హైదరాబాద్‌లోనే.. “మేము గత సంవత్సరం 3,300 కొత్త స్టోర్లను ప్రారంభించాం. మొత్తం స్టోర్లు 18,040లకు చేరుకున్నాయి. 6.56 కోట్ల చదరపు అడుగుల రిటైల్ స్థలాన్ని కవర్ చేశాం. ఈ స్టోర్లలో మూడింట రెండొంతులు టైర్ 2, టైర్ 3 నగరాలు, చిన్న పట్టణాల్లోనే ఉన్నాయి" అని ఇషా అంబానీ పేర్కొన్నారు. తమ బ్యాకెండ్ వేర్‌హౌసింగ్, లాజిస్టిక్స్ ఆస్తులలో కూడా కంపెనీ పెట్టుబడి పెడుతోంది. రిలయన్స్ రిటైల్ బలమైన వృద్ధి భారతదేశంలో ఈ-కామర్స్, ఆన్లైన్ షాపింగ్‌కు పెరుగుతున్న ప్రజాదరణకు నిదర్శనం. కంపెనీ తన ఫిజికల్ స్టోర్ నెట్‌వర్క్‌ను టైర్ 2, టైర్3 మార్కెట్లలోకి విస్తరించడం ద్వారా కూడా ప్రయోజనం పొందుతోంది. భారతదేశంలోని 30 శాతానికి పైగా జనాభాకు తమ ఉత్పత్తులను అందిస్తున్నట్లు ఇషా అంబానీ చెప్పారు. ఇవన్నీ రిలయన్స్ రిటైల్‌ను ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే టాప్-10 రిటైలర్లలో ఒకటిగా నిలిపాయని వివరించారు. నాలుగు ‘సీ’ల సూత్రంపైనే.. రిటైల్ వ్యాపారం కొలాబరేషన్, కన్జ్యూమర్ ఎంగేజ్మెంట్, క్రియేటివిటీ, కేర్ అనే 4 సీ(C)ల సూత్రంపై ఆధారపడి ఉంటుంది. రిలయన్స్ రిటైల్ భారతీయ కుటుంబాల రోజువారీ అవసరాలను 90 శాతానికి పైగా తీర్చేలా ఉత్పత్తులను అందిస్తోంది. కిరాణా వ్యాపారంలో ఈ సంవత్సరంలో 18 లక్షల మెట్రిక్ టన్నుల కిరాణా సామగ్రిని విక్రయించాం. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్‌లో సంవత్సరంలో దాదాపు 5 లక్షల ల్యాప్‌టాప్‌లు, 23 లక్షలకు పైగా ఉపకరణాలను విక్రయించాం. ఇక ఫ్యాషన్ & లైఫ్‌స్టైల్ వ్యాపారంలో ఈ సంవత్సరంలో రికార్డు స్థాయిలో 50 కోట్ల వస్త్రాలను విక్రయించినట్లు ఇషా అంబానీ చెప్పారు. కంపెనీ ఇటీవల యువత లక్ష్యంగా ఫ్యాషన్ రిటైల్ ఫార్మాట్ యూస్టాను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్లో తన మొదటి స్టోర్‌ను ప్రారంభించింది. ఇది యువతకు సరసమైన ధరలలో ఫ్యాషన్ ఉత్పత్తులు అందిస్తుంది. ఇదీ చదవండి: అంబానీ కంపెనీ దూకుడు! భారీగా పెరిగిన నికర రుణం.. అయినా తగ్గేదేలే.. -
అప్పు తీసుకుంటున్న అంబానీ ఎందుకో తెలుసా
-
మరోమారు తాతయిన ముకేష్ అంబానీ.. పేరుతోనే వైరల్ అయినా వారసురాలు
-
అంబానీ పిల్లలు ఏం చదువుకున్నారు ..? వాళ్ళ జీతం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు
-
మనవరాలి కోసం లగ్జరీ కొనవే ఏర్పాటు చేసిన ముకేశ్ అంబానీ
-
ముఖేష్ అంబానీ తరచూ సందర్శించే ఆలయమిదే.. ప్రాధాన్యత ఏంటంటే
దేశంలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ముఖేష్ అంబానీ లగ్జరీ లైఫ్ గురించి చాలా కథనాలు వినిపిస్తుంటాయి. అయితే ముఖేష్ అంబానీ ఆధ్మాత్మికతపై అమితమైన మక్కువ చూపిస్తారనే విషయం కొద్దిమందికి మాత్రమే తెలుసు. దేశంలోని చాలా ఆలయాలకు తరచూ ముఖేష్ అంబానీ వెళుతుంటారు. వీటిలో ఒకటే నాథద్వారాలో కొలువైన శ్రీనాథ్ దేవాలయం. రాజస్థాన్‌లోని నాథద్వారాలోని ఆలయానికి ముఖేష్ అంబానీ చాలాకాలంగా వస్తున్నారు. అంబానీ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి వస్తుంటారు. ముఖేష్ అంబానీ మాత్రమే కాకుండా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ లాంటి బడా స్టార్లు కూడా ఇక్కడికి వస్తుంటారు.ఈ మందిరానికున్న ప్రాధాన్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నాథద్వారా ప్రాంతం ఉదయపూర్‌కు సమీపంలో ఉంది. ఈ ప్రాంతానికి రైలులో లేదా విమానంలో ఉదయ్‌పూర్ చేరుకున్నాక అక్కడి నుంచి ఆలయానికి వెళ్లవచ్చు. ఈ ఆలయంలో శ్రీకృష్టుని అవతారమైన శ్రీనాథుడు కొలువైవున్నాడు. రాజస్థాన్‌కు చెందిన ప్రజలు ఇక్కడికి తరచూ వస్తుంటారు. శ్రీనాథ మందిర నిర్మాణం 17వ శతాబ్ధంలో జరిగింది. ఆలయాన్ని మహారాజా రాజాసింగ్ కట్టించారు. ఆలయానికి విశాల ప్రాంగణం ఉంది. అలయంలోనికి ప్రవేశించేందుకు నలువైపులా ద్వారాలు ఉన్నాయి. ఆలయంలో శ్యామల వర్ణంలోని శ్రీనాథుడు కొలువైవున్నాడు.హోలీనాడు ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. లెక్కకు మించిన జనం ఆలయం వద్దకు చేరుకుంటారు. ఈ ఆలయాన్ని సందర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని చెబుతారు.ఈ ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకునేవారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. ఆలయ పరిసరాల్లో భక్తులకు వసతి సౌకర్యం కూడా లభిస్తుంది. ఇటీవలికాలంలో ఇది పర్యాటక స్థలంగానూ అభివృద్ధి చెందుతోంది. -
భారత్‌లో యాపిల్ రీటైల్ స్టోర్.. టిమ్‌కుక్ అదిరిపోయే మాస్టర్ ప్లాన్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ వచ్చే భారత్‌లో తొలి రీటైల్ స్టోర్‌ను ప్రారంభించబోతుంది. దేశంలో ఐఫోన్ల తయారీని వేగంగా విస్తరిస్తున్న యాపిల్ తన రిటైల్ స్టోర్‌ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో రీటైల్ స్టోర్ ప్రారంభం కంటే ముందే తన ప్రత్యర్ధులకు చెక్ పెట్టేలా ఆ సంస్థ సీఈవో టిమ్‌కుక్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ముంబైలో ఆసియా అపర కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన ‘బంద్రా కుర్లా కాంప్లెక్స్’లోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో యాపిల్ స్టోర్‌ను ఏర్పాటు చేస్తుంది. రిటైల్ స్టోర్ ఏర్పాటు చేయడం ద్వారా యాపిల్ స్పెషల్ డిస్కౌంట్ పొందినట్లు తెలుస్తోంది. ఇందుకోసం టిమ్‌కుక్.. జియో వరల్డ్ డ్రైవ్ యాజమాన్యానికి కొన్ని షరతులు పెట్టారని, ఆ షరతులకు లోబడే యాపిల్ రీటైల్ స్టోర్ ఏర్పాటు అంగీకరించినట్లు సమాచారం. ఇంతకీ ఆ షరతు ఏంటంటే? ముంబైలోని రిలయన్స్ జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో రీటైల్ స్టోర్ ఏర్పాటు కోసం యాపిల్ సంస్థ 20,800 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని 11 ఏళ్ల పాటు లీజుకు తీసుకుంది. లీజు ఒప్పందం ప్రకారం.. నెలకు రూ.42 లక్షలను అద్దె రూపంలో చెల్లించనుంది. ఈ లెక్కన ఏడాదికి అద్దె రూపంలోనే రూ.5 కోట్లను చెల్లిస్తుండగా.. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి అద్దె 15 శాతం మేర పెంపు ఉంటుంది. ఆ మూడేళ్లలో 2 శాతం రెవెన్యూ షేర్, మూడేళ్ల తర్వాత 2.5 శాతం రెవెన్యూ షేర్‌ను అంబానీ సంస్థకు చెల్లించనుంది. అదే సమయంలో కొన్ని కండీషన్లు పెట్టింది. డేటా అనలటిక్స్ సంస్థ సీఆర్ఈ మ్యాట్రిక్స్ రిపోర్ట్ ప్రకారం.. రీటైల్ స్టోర్ ఏర్పాటు అనంతరం ఆ ప్రాంతంలో 21 సంస్థలకు చెందిన బ్రాండ్ల యాడ్స్‌ను డిస్ప్లే చేసేందుకు వీలు లేదు. వాటిల్లో అమెజాన్,ఫేస్బుక్, గూగుల్, ఎల్జీ, మైక్రోసాఫ్ట్, సోనీ, ట్విటర్, బోస్, డెల్, డెలాయిట్ , ఫాక్స్‌కాన్, గార్మిన్, హిటాచీ, హెచ్‌పీ, హెచ్‌టీసీ, ఐబీఐఎం, ఇంటెల్, లెనోవో, నెస్ట్, ప్యానసోనిక్, తోషిబా, శాంసంగ్ వంటి సంస్థలు ఉన్నాయి. -
NMACC: డాన్స్‌తో ఇరగదీసిన షారూక్, గౌరీ, ఇక ప్రియాంక చోప్రా డాన్స్‌కైతే
సాక్షి, ముంబై: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) లాంచ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో పలువురు రాజకీయ, క్రీడా రంగ ప్రముఖులు, సినీరంగ సెలబ్రిటీలు చేసిన సందడి అంతా ఇంతా కాదు. బాలీవుడ్ ఖాన్ త్రయంతోపాటు, దీపికా, రణవీర్, కరీనా కపూర్-సైఫ్ అలీ ఖాన్ ,ఫ్యాషన్‌స్టార్ సోనమ్ కపూర్, వరుణ్‌ధావన్, రణ్వీర్ సింగ్, సీనియర్ నటులు రేఖ , వహీద తదితర స్టార్‌డస్ట్ అంతా గ్లామరస్‌గా కనిపించారు. ముఖ్యంగా బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్‌తో కలిసి డ్యాన్స్ ఇరగ దీశారు. షారుఖ్ ఖాన్ హిట్ ట్రాక్ ఝూమ్ జో పఠాన్‌కి స్టెప్పులేశారు. ఇండో కెనడియన్ సింగర్ అమృత్ పాల్ సింగ్ ధిల్లాన్ (ఏపీ సింగ్) పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. గౌరీ బెస్ట్ ఫఫ్రెండ్ మహీప్ కపూర్, పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్‌ని కూడా ఈ వీడియోలో చూడొచ్చు. View this post on Instagram A post shared by JODI (@thejodilife) అంతముందు వరుణ్ ధావన్, సూపర్ మోడల్ జిగి హడిద్ స్టేజ్‌పై సందడి చేశారు. మరోవైపు బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా స్టేజ్‌పై షారూఖ్ ఖాన్ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఉత్సాహం నెలకొంది. తనతోపాటు స్టెప్ప్లేయాల్సిందిగా వరుణ్‌ధావన్, రణ్వీర్ సింగ్‌ను కోరడంతో మరింత జోష్ నెలకొంది View this post on Instagram A post shared by @varindertchawla మరోవైపు బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ ప్రియాంక చోప్రా, హీరో రణవీర్ సింగ్‌తో కలిసి డ్యాన్స్ చేసింది.దీనికి షారూఖ్ ఖాన్ భార్య గౌరీ ఎంజాయ్ చేయడం విశేషంగా నిలిచింది. GAURI KHAN ??? DANCING AND VIBING TO PRIYANKA’S PERFORMANCE??? NOW THIS IS MY MULTIVERSE OF MADNESS 😭😭😭😭 *screamingggg*#PriyankaChopra pic.twitter.com/0y3Ku7Vvt9 — k. (@karishmaokay) April 2, 2023 -
అంబానీకి కాబోయే కోడలు చేతిలో చిన్న బ్యాగు.. ధర ఎంతో తెలుసా?
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎన్ఎంఏసీసీ (నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో అంబానీ ఇంటికి కాబోయే కోడలు, అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధికా మర్చంట్ అందరి దృష్టినీ ఆకర్షించారు. (కార్ల ధరలు పెంచేసిన మారుతీ సుజుకీ.. అమల్లోకి కొత్త ధరలు) రాజకీయ, వ్యాపార, క్రీడా రంగ ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేసిన ఈ వేడుకల్లో రాధికా మర్చంట్ నల్ల చీరలో మెరిసిపోయారు. ఈ సందర్భంగా ఆమె చేతిలో ఉన్న వెండి రంగు హెర్మేస్ కెల్లీమార్ఫోస్ మినీ బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. bollywoodshaadis.com కథనం ప్రకారం.. ఫ్యాషన్స్టాలో ఈ చిన్న బ్యాగ్ ధర అక్షరాలా రూ.52,30,000. ఇంత ఖరీదైన బ్యాగ్‌లో మిక్ ఫ్రంట్ ఫ్లాప్, సిగ్నేచర్ కెల్లీ డిజైన్‌తో పాటు చైన్‌మెయిల్ బాడీ, షార్ట్ స్ట్రా, క్లోచెట్‌తో కూడిన పొడవాటి భుజం గొలుసు ఉన్నాయి. (The Holme: రూ.2,500 కోట్ల భవంతి! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది ఇదే..) ఈ వేడుకలో రాధికా మర్చంట్ నలుపు రంగులో ఉన్న ఇండో వెస్ట్రన్ స్టైల్ లేస్ చీరలో అద్భుతంగా కనిపించారు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, వారి చిన్న కొడుకుతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ గత జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. -
ముకేశ్ అంబానీ వంటమనిషి జీతం ఎంతంటే?
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు 'ముకేశ్ అంబానీ' గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. ప్రపంచ ధనవంతుల్లో ఒకరుగా ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా శాఖాహారమే తీసుకోవడం గమనార్హం. ఇటీవల అంబానీ డ్రైవర్‌కు ఇచ్చే జీతం గురించి తెలిసింది, కాగా ఇప్పుడు వంటమనిషికి ఎంత జీతం ఇస్తారన్నది వెలుగులోకి వచ్చింది. చాలా సాధారణమైన ఆహారం తీసుకునే ముకేశ్ అంబానీ ఎక్కువగా పప్పు, చపాతీ, అన్నం తింటారని, అంతే కాకుండా అప్పుడప్పుడు సరికొత్త వంటకాలు కూడా రుచిచూస్తారని సమాచారం. అంబానీ ఆహారపు అలవాట్లు ఆయన సాధారణ వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తాయని చెబుతారు. ముకేశ్ అంబానీకి సాధారణ వంటకాలతో పాటు థాయ్ వంటకాలంటే కూడా చాలా ఇష్టమని సన్నిహితులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఆదివారం రోజు ఇడ్లీ సాంబార్ ఉండి తీరాల్సిందే అంటున్నారు. వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్న రాత్రి భోజం మాత్రం కుటుంబంతో కలిసి చేస్తారని గతంలో నీతా అంబానీ చెప్పారు. (ఇదీ చదవండి: భారత్‌లో మారుతి బ్రెజ్జా సిఎన్జి లాంచ్.. పూర్తి వివరాలు) అంబానీ ప్రతి రోజు తీసుకునే ఆహారానికి సంబంధించి కీలక పాత్ర చెఫ్ది (వంట మనిషి) అనే చెప్పాలి. ఎప్పుడు ఏమి తింటారనేది కూడా వారే చూసుకుంటారు. ఇంతలా జాగ్రత్తలు తీసుకునే వంటమనిషి జీతం భారతదేశంలో ఉన్న కొంత మంది ఎమ్మెల్యేల జీతంకంటే ఎక్కువని తెలుస్తోంది. సుమారు అంబానీ వంటమనిషి జీతం రూ. 2 లక్షల కంటే ఎక్కువే అని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. -
రిలయన్స్ ‘మెట్రో’ డీల్ ఓకే, రూ.2,850 కోట్లతో కొనుగోలు
న్యూఢిల్లీ: ‘మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా’ని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ) సొంతం చేసుకునేందుకు కాంపిటిషన్ కమిషన్ (సీసీఐ) ఆమో దం తెలిపింది. జర్మనీకి చెందిన మెట్రో ఏజీ భారత్‌లోని తన హోల్‌సేల్ కార్యకలాపాలను విక్రయించేందుకు రిలయన్స్‌తో ఈ ఒప్పందం చేసుకోవడం గమనార్హం. మెట్రో క్యాష్ అండ్ క్యారీలో 100 శాతం వాటాలను రూ.2,850 కోట్లతో కొనుగోలు చేసేందుకు రిలయన్స్ తప్పనిసరి ఒప్పందంపై సంతకాలు చేసింది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు ట్విట్టర్లో సీసీఐ ప్రకటించింది. ఇవీ చదవండి: ఇషా ట్విన్స్‌కు అంబానీ బ్రహ్మాండమైన గిఫ్ట్: వీడియో వైరల్ ముఖేష్ అంబానీ లగ్జరీ కార్లు.. రోల్స్ రాయిస్ నుంచి ఫెరారీ వరకు -
రిలయన్స్ ‘చల్లటి’ కబురు... మార్కెట్లోకి రిఫ్రెష్ డ్రింక్స్
వేసవి సమీపిస్తున్న వేళ రిలయన్స్ చల్లటి కబురు చెప్పింది. 50ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ‘క్యాంపా’ బ్రాండ్ కూల్‌డ్రింక్స్‌ను మళ్లీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. మూడు రకాల సాఫ్ట్డ్రింక్స్ను పరిచయం చేస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ విభాగం రిలయన్స్ కన్సూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదీ చదవండి: బీటెక్ అమ్మాయి.. బుల్లెట్‌పై హైజీనిక్ పానీపూరి మూడు ఫ్లేవర్లు.. ఐదు ప్యాక్‌లు క్యాంపా కూల్‌డ్రింక్స్‌లో మూడు రకాల ఫ్లేవర్లను రిలయన్స్ విడుదల చేసింది. అవి క్యాంపా కోలా, క్యాంపా లెమన్, క్యాంపా ఆరెంజ్. మొత్తం ఐదు రకాల ప్యాక్‌లలో లభిస్తాయి. 200 ఎంఎల్ తక్షణ వినియోగ ప్యాక్, 500 ఎంఎల్, 600 ఎంఎల్ ఆన్-ది-గో షేరింగ్ ప్యాక్‌లు, 1,000 ఎంఎల్, 2,000 ఎంఎల్ హోమ్ ప్యాక్‌లు ఇందులో ఉన్నాయి. క్యాంపా డ్రింక్స్‌ను అన్ని వయసుల వారు ఇష్టపడతారని, ఎంతో చరిత్ర ఉన్న క్యాంపా పానీయాలను తిరిగి మార్కెట్లోకి తెస్తున్నందుకు సంతోషిస్తున్నామని రిలయన్స్ కన్సూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ప్రతినిధి తెలిపారు. ఎఫ్ఎంసీజీ వ్యాపారానికి ఇది మరో సాహసోపేతమైన ముందడుగు అని పేర్కొన్నారు. ఈ శీతల పానీయాల పోర్ట్‌ఫోలియోను ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో ప్రారంభించి దేశం అంతటా విస్తరించనున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: టాప్ సీక్రెట్ చెప్పిన గూగుల్ మాజీ వైస్ ప్రెసిడెంట్... ఇది ఉంటే జాబ్ పక్కా! -
రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌ను కొనుగోలు చేసిన జియో!
ముంబై: రిలయన్స్ ఇన్ఫ్రాటెల్లో (ఆర్ఐటీఎల్) 100 శాతం వాటాలను రిలయన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ (ఆర్‌పీపీఎంఎస్‌ఎల్) దక్కించుకుంది. ఇందుకోసం రూ. 3,725 కోట్లు వెచ్చించింది. ఆర్‌పీపీఎంఎస్‌ఎల్ మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ విషయాలు వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే.. దివాలా చర్యలు ఎదుర్కొంటున్న రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ (ఆర్ఐటీఎల్) మొబైల్ టవర్, ఫైబర్ అసెట్స్ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు టెలికం దిగ్గజం జియోలో భాగమైన ఆర్‌పీపీఎంఎస్‌ఎల్ 2019లో రూ. 3,720 కోట్లకు బిడ్ చేసింది. ఈ మొత్తాన్ని ఎస్క్రో ఖాతాలో డిపాజిట్ చేస్తామంటూ నవంబర్ 6న ప్రతిపాదించింది. దీనికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదముద్ర వేయడంతో తాజాగా రూ. 3,720 కోట్లను ఎస్బీఐ ఎస్క్రో ఖాతాలో జమ చేసింది. -
రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కీలక పరిణామం
దేశంలోనే అత్యంత విలువైన కార్పొరేట్ గ్రూప్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అపర కుబేరుడు, రిలయన్స్ చీఫ్ ముకేశ్ అంబానీ తన వారసులకు ఆస్తుల పంపకం ప్రక్రియకు తెరతీశారు. టెలికం అనుబంధ విభాగమైన రిలయన్స్ జియోకు ముకేశ్ అంబానీ రాజీనామా చేశారు. తద్వారా టెలికం విభాగం పగ్గాలను తనయుడు ఆకాశ్ అంబానీకి అప్పగించారు. న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) గ్రూప్ యాజమాన్యంలో భారీ మార్పులకు ముకేశ్ అంబానీ బాటలు వేశారు. పెద్ద కొడుకు ఆకాశ్ ఎం.అంబానీకి టెలికం విభాగం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఇందుకు అనుగుణంగా టెలికం బోర్డు నుంచి వైదొలిగారు. సోమవారం సమావేశమైన కంపెనీబోర్డు, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆకాశ్ ఎం. అంబానీని చైర్మన్‌గా నియమించే ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు రిలయన్స్ జియో స్టాక్ ఎక్స్ఛేంజ్జీలకు తాజాగా సమాచారమిచ్చింది. సోమవారం సాయంత్రం ముకేశ్ అంబానీ రాజీనామా చేసినట్లు బోర్డు వెల్లడించింది. 217 బిలియన్ డాలర్ల విలువైన ప్రైవేట్ రంగ దిగ్గజం ఆర్ఐఎల్ గ్రూప్.. చమురు శుద్ధి, పెట్రోకెమికల్స్, టెలికం, రిటైల్, మీడియా, న్యూఎనర్జీ విభాగాలలో విస్తరించిన విషయం విదితమే. వారసులకు బాధ్యతలు... ముకేశ్ అంబానీ ముగ్గురు సంతానంలో ఆకాశ్, ఈషా కవలలుకాగా.. చిన్న కుమారుడు అనంత్. రిటైల్ బిజినెస్ పగ్గాలను కుమార్తె ఈషా (30 ఏళ్లు) చేతికి ఇవ్వనున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. పిరమల్ గ్రూప్‌నకు చెందిన ఆనంద్ పిరమల్‌ను ఈషా వివాహం చేసుకున్న విషయం విదితమే. అజయ్ పిరమల్, స్వాతి పిరమల్ కుమారుడు ఆనంద్ కాగా.. ఇప్పటికే ఆకాశ్, ఈషా రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్ఆర్వీఎల్) బోర్డులో విధులు నిర్వహిస్తున్నారు. సూపర్ మార్కెట్లు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, గ్రోసరీ, ఫ్యాషన్, జ్యవెలరీ, ఫుట్‌వేర్, క్లాతింగ్ విభాగాలతోపాటు ఆన్లైన్ రిటైల్ వెంచర్ జియోమార్ట్‌ను రిలయన్స్ రిటైల్ కలిగి ఉంది. ఇక డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ (జేపీఎల్) బోర్డులోనూ 2014 అక్టోబర్ నుంచీ వీరిద్దరూ కొనసాగుతున్నారు. ఇక 26 ఏళ్ల అనంత్ ఇటీవలే ఆర్ఆర్వీఎల్ బోర్డులో డైరెక్టరుగా చేరారు. 2020 మే నుంచి జేపీఎల్‌లోనూ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎండీగా పంకజ్... ఈ నెల 27 నుంచి ఐదేళ్లపాటు ఎండీగా పంకజ్ మోహన్ పవార్‌ను బోర్డు ఎంపిక చేసినట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు వెల్లడించింది. అంతేకాకుండా కేంద్ర ఆర్థిక మాజీ కార్యదర్శి రమీందర్ సింగ్ గుజ్రాల్, మాజీ సీవీసీ కేవీ చౌదరిలను స్వతంత్ర డైరెక్టర్లుగా నియమించినట్లు పేర్కొంది. వీరిరువురూ ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డులో కొనసాగుతున్నారు. కంపెనీ ప్రధానంగా మూడు బిజినెస్ విభాగాలను కలిగి ఉంది. ఇవి చమురు శుద్ధి, పెట్రోకెమికల్స్, రిటైల్, టెలికంసహా డిజిటల్ సర్వీసులు. రిటైల్, డిజిటల్ సర్వీసులను పూర్తి అనుబంధ ప్రత్యేక కంపెనీలుగా ఏర్పాటు చేసింది. న్యూఏజ్పై దృష్టి... ఆర్‌ఐఎల్‌కుగల 3 బిజినెస్‌లూ పరిమాణంలో సమానమేకాగా.. గ్రూప్‌లోని ఆధునిక విభాగాలు రిటైల్, టెలికంలలో ఆకాశ్, ఈషా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అనంత్ పునరుత్పాదక ఇంధనం, చమురు, కెమికల్ యూనిట్లకు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజా నిర్ణయం ద్వారా 65 ఏళ్ల పారిశ్రామిక దిగ్గజం ముకేశ్.. ఆస్తుల పంపకం విషయంలో స్పష్టంగా వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2002లో తండ్రి మరణం తదుపరి వ్యాపార సామ్రాజ్య విభజనలో తమ్ముడు అనిల్ అంబానీతో వివాదాలు నెలకొన్న కారణంగా ముకేశ్ ప్రస్తుత నిర్ణయాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు వారు చెబుతున్నారు. ఈ వార్తలతో ఆర్ఐఎల్ షేరు 1.5 శాతం బలపడి రూ. 2,530 వద్ద ముగిసింది. ఆర్ఐఎల్ చైర్మన్‌గా ముకేశ్... ఆర్ఐఎల్కు ముకేశ్ అంబానీ చైర్మన్, ఎండీగా, ఆయన సతీమణి నీతా అంబానీ బోర్డులో సభ్యురాలిగా కొనసాగనున్నారు. అంతేకాకుండా జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్‌కు చైర్మన్‌గానూ ముకేశ్ కొనసాగనున్నారు. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌సహా అన్ని జియో డిజిటల్ సర్వీసుల బ్రాండ్లు జియో ప్లాట్‌ఫామ్స్ కిందకు వస్తాయి. కంపెనీ వివరాల ప్రకారం అంబానీ కుటుంబ వాటా ఆర్ఐఎల్లో 50.6 శాతానికి చేరింది. 1973లో ధీరూభాయ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చదవండి👉 ముఖేష్ అంబానీ తన ఆస్తులన్ని ఎవరి పేరిట రాశారో తెలుసా? -
అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం ఫలితాల్లో అదరగొట్టిన రిలయన్స్..!
ఆసియాలోని అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 31 డిసెంబర్, 2021తో ముగిసిన 3వ త్రైమాసికం(క్యూ3 ఎఫ్ వై22) ఫలితాలను విడుదల చేసింది. ఈ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో సంస్థ ₹18,549 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గత ఏడాది క్రితం 3వ త్రైమాసికంలో పొందిన లాభం కంటే (₹13,101 కోట్ల) 41 శాతం ఎక్కువ. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన చమురు-రిటైల్-టెలికామ్ ఆదాయం ₹1.23 లక్షల కోట్లతో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం 54% పెరిగి ₹1.91 లక్షల కోట్లకు చేరుకుంది. ఫలితాల విడుదల ముందు శుక్రవారం రిలయన్స్ ఎన్ఎస్ఈలో ₹2,476 ధర వద్ద ముగిసింది. ఈ ఇండెక్స్ హెవీవెయిట్ స్టాక్ గత ఏడాది కాలంలో 18.26% పెరిగింది. రిలయెన్స్ జియో అసమాన పనితీరుతో 102 కోట్ల మంది కొత్త కస్టమర్లను పొందింది. 2021-22 మూడవ త్రైమాసికంలో, జియో మొత్తం ఆదాయాలు 13.8 శాతం పెరిగి రూ.24,176 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో పన్నుకు ముందు లాభం రూ.10,008 కోట్లకు చేరుకోగా, నికర లాభం రూ.3,795 కోట్లకు చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 8.9 శాతం వృద్ధి నమోదైంది. డిసెంబర్ 31 వరకు కంపెనీ కస్టమర్ల సంఖ్య 42.10 కోట్లుగా ఉంది. డిసెంబర్ త్రైమాసికంలో 1.02 కోట్ల కొత్త కస్టమర్లు చేరారు. "మా రిలయన్స్ అన్ని వ్యాపారాల నుంచి బలమైన సహకారం అందడంతో క్యూ3 ఎఫ్ వై22లో సంస్థ అత్యుత్తమ పనితీరును కనబరిచింది అని ప్రకటించడం నాకు సంతోషంగా ఉంది. మా వినియోగదారుల వ్యాపారాలు, రిటైల్ & డిజిటల్ సేవలు రెండూ అత్యధిక ఆదాయాలు నమోదు చేశాయి. ఈ త్రైమాసికంలో, మేము భవిష్యత్తు వృద్ధిని నడపడానికి మా వ్యాపారాలలో వ్యూహాత్మక పెట్టుబడులు & భాగస్వామ్యాలపై దృష్టి సారించడం కొనసాగించాము" అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు. (చదవండి: యాపిల్ అదిరిపోయే డీల్.. ఏకంగా రూ.23 వేల తగ్గింపు..!) -
జియో ఫోన్ అమ్మకాలు ప్రారంభం, ఎలా కొనాలో తెలుసా..?
జియో ఫోన్ నెక్ట్స్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఫోన్ కొనుగోలు కోసం స్టోర్ కు వెళ్లేముందే వాట్సాప్, లేదంటే కంపెనీ వెబ్ సైట్ (https://www.jio.com/next)లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా ఫోన్ కొనే సౌకర్యం లేదని జియో ప్రతినిధులు తెలిపారు. రిజిస్ట్రేషన్ పక్కా జియో ఫోన్ నెక్ట్స్ కొనుగోలు కోసం ముందుగా 70182 70182కు హాయ్ మెసేజ్ పెట్టాలి. అనంతరం అదే నెంబర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సందర్భంగా వినియోగదారులు తమ లొకేషన్ ను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ పూర్తయిన తర్వాత స్టోర్‌కు వెళ్లి జియో ఫోన్ నెక్ట్స్ కొనుక్కోవచ్చంటూ వినియోగదారులకు మెసేజ్ వెళుతుంది. అలా మెసేజ్ వస్తే స్టోర్‌లో జియో ఫోన్నెక్ట్స్ను సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్ ధరల విషయానికొస్తే ఫోన్ ధర రూ.6,499 ఉండగా.. ఫోన్ కొనుగోలు కోసం ఈఎంఐ సదుపాయాన్ని ఎంపిక చేసుకోవచ్చు. డౌన్ పేమెంట్ కింద రూ.1,999, రూ.501 ప్రాసెసింగ్ ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 30వేల ఔట్లెట్లు జియో ఫోన్ కొనుగోలు కోసం రిలయన్స్ దేశ వ్యాప్తంగా 30,000కు పైగా రిటైల్ అవుట్ లెట్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తద్వారా కొనుగోలు దారులు ఈ ఫోన్‌ను ఔట్లెట్లలో సొంతం చేసుకోవచ్చు. జియో ఫోన్ నెక్ట్స్ ఫీచర్లు ♦ డిస్ప్లే: 5.45 అంగుళాల హెచ్డీ ప్లస్ రిజెల్యూషన్ (720 X 1440 ) ♦ స్క్రీన్ గ్లాస్: యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ ♦ ప్రాసెసర్: క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ క్యూఎం-215, క్వాడ్ కోర్ 1.3 జీహెచ్‌జెడ్ ♦ ర్యామ్,స్టోరేజ్ : 2జీబీ ర్యామ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 512 జీబీ వరకు ♦ బ్యాక్ కెమెరా: 13 ఎంపీ ♦ ఫ్రంట్ కెమెరా: 8 ఎంపీ ♦ బ్యాటరీ: 3500 ఎంఏహెచ్ ♦ సిమ్ స్లాట్లు: 2 (డ్యూయల్ సిమ్) ♦ సిమ్ పరిమాణం: నానో ♦ కనెక్టివిటీ: వైఫై, బ్లూటూత్ వీ4.1, మైక్రో యూఎస్బీ, ఆడియో జాక్ స్టాండర్డ్ 3.5ఎంఎం ♦ సెన్సార్లు : యాక్సిలరోమీటర్, లైట్ సెన్సార్,ప్రాక్సిమిటీ సెన్సార్ చదవండి: నెలకు రూ.300 చెల్లిస్తే చాలు జియో ఫోన్ మీ సొంతం..! ఫోన్ ధర ఎంతంటే..! -
నెలకు రూ.300 చెల్లిస్తే చాలు జియో ఫోన్ మీ సొంతం..! ఫోన్ ధర ఎంతంటే..!
మరో వారంలో ప్రపంచంలో అత్యంత చవకైన ఫోన్ 'జియో ఫోన్ నెక్ట్స్' విడుదల కానున్న విషయం తెలిసిందే. జియో- గూగుల్ సంయుక్తంగా రూరల్ ఏరియాల్ని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్‌ను విడుదల చేయడంపై వినియోగదారులు ఈ ఫోన్ ధర, ఫీచర్స్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వారి ఆసక్తిని రెట్టింపు చేస్తూ తక్కువ డౌన్ పేమెంట్‌తో పాటు కేవలం రూ.300 నెలవారీ ఈఎంఐని చెల్లించి ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. దీపావళి సందర్భంగా విడుదల కానున్న ఈ ఫోన్ ఈఐఎంఐతో పాటు వాయిస్ కాల్స్, డేటా వివరాల గురించి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అధికారికంగా వెల్లడించారు. జియో వివరాల ప్రకారం భారత్‌లో విడుదల చేయనున్న 4జీ జియో ఫోన్ నెక్ట్స్‌ను జియో సంస్థ కేవలం రూ.1,999 చెల్లించి సొంతం చేసుకోవచ్చని ప్రకటించింది. మిగిలిన మొత్తాన్ని 18 నెలలు లేదంటే 24 నెలల కాల వ్యవధిలో చెల్లించే సౌకర్యాన్ని అందిస్తుంది. జియో ఫోన్ ధర చిప్ సెట్ల కొరత కారణంగా భారత్‌లో కాస్త ఎక్కువ ధరకే జియో ఫోన్ మార్కెట్ లో విడుదల కానుంది. మన దేశంలో జియో ఫోన్ ధర రూ.6,499గా నిర్ణయించింది. అయితే, కస్టమర్లు బడ్జెట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలంటే రూ.1,999 ను డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని 18-24 నెలల్లోగా పే చేయాలి. ఇందుకోసం జియో నాలుగు ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. జియో ఫోన్ నెక్ట్స్ : కస్టమర్ల కోసం నాలుగు ప్లాన్లు మొదటి ప్లాన్ : ఆల్వేస్ ఆన్ ప్లాన్ కింద 18 లేదా 24 నెలల కాల వ్యవధిలో కస్టమర్లు ఎంపిక చేసుకున్న ఈఎంఐని బట్టి రూ.350 లేదా రూ.300 మాత్రమే చెల్లించాలి. ఇందులో వినియోగదారులు నెలకు 5జీబీ డేటా ప్లస్ 100నిమిషాల టాక్‌టైమ్‌ను కూడా పొందుతారు. రెండవ ప్లాన్ : జియో ఫోన్ నెక్ట్స్ లార్జ్ ప్లాన్ కింద కస్టమర్లు 18 నెలలకు రూ.500, 24 నెలలకు రూ.450 చెల్లించాలి. ఈ ప్లాన్‌లో రోజుకు 1.5జీబీ 4జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్‌ను పొందవచ్చు. మూడో ప్లాన్ : జియో ఫోన్ నెక్ట్స్ కోసం జియో మూడవ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎక్స్ఎల్ అని పిలిచే మూడో ప్లాన్‌లో వినియోగదారులు 18 నెలలకు రూ. 550 లేదా 24 నెలలకు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ కింద వినియోగదారులు ప్రతిరోజూ 2జీబీ హై స్పీడ్ 4జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. నాల్గవ ప్లాన్ : చివరిగా నాల్గవ ప్లాన్ ఎక్స్ ఎక్స్ఎల్ ప్లాన్. ఈ ప్లాన్‌లో జియో ఫోన్ కొనుగోలుదారులు నెలకు రూ. 600 చొప్పున 18 నెలల పాటు లేదా 24 నెలల పాటు రూ. 550 చెల్లించాలి. ఈ ఆఫర్ వినియోగదారులకు 24 నెలల పాటు అపరిమిత వాయిస్ కాల్లతో పాటు రోజుకు 2.5జీబీ 4జీ డేటాను పొందవచ్చు. జియో ఫోన్ నెక్ట్స్ ఫీచర్లు డిస్ప్లే: 5.45 అంగుళాల హెచ్డీ ప్లస్ రిజెల్యూషన్ (720 X 1440 ) స్క్రీన్ గ్లాస్: యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ ప్రాసెసర్: క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ క్యూఎం-215, క్వాడ్ కోర్ 1.3 జీహెచ్‌జెడ్ ర్యామ్,స్టోరేజ్ : 2జీబీ ర్యామ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 512 జీబీ వరకు బ్యాక్ కెమెరా: 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా: 8 ఎంపీ బ్యాటరీ: 3500 ఎంఏహెచ్ సిమ్ స్లాట్లు: 2 (డ్యూయల్ సిమ్) సిమ్ పరిమాణం: నానో కనెక్టివిటీ: వైఫై, బ్లూటూత్ వీ4.1, మైక్రో యూఎస్బీ, ఆడియో జాక్ స్టాండర్డ్ 3.5ఎంఎం సెన్సార్లు : యాక్సిలరోమీటర్, లైట్ సెన్సార్,ప్రాక్సిమిటీ సెన్సార్ అంతేకాదు ఆండ్రాయిడ్ ఆధారిత ప్రగతి ఓఎస్ ను గూగుల్ డెవలప్ చేసింది. జియో ఫోన్ నెక్ట్స్ కోసం ఆపరేటింగ్ సిస్టమ్ పెద్దగా చదవడం, ట్రాన్స్‌లేట్ చేసుకునేలా ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. జియో ఫోన్ నెక్ట్స్ మై జియో, జియో సినిమా,జియో టీవీ, జియో సావన్‌తో పాటు మరికొన్ని యాప్‌లను ఇన్స్టాల్ చేసుకునే సదుపాయం ఉంది. చదవండి: దుమ్ము లేపుతుంది, భారత్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ ఇదే..! -
వారెవ్వా..! జెఫ్ బెజోస్, ఎలన్‌మస్క్ సరసన ముఖేష్ అంబానీ...!
రిలయన్ అధినేత ముఖేష్ అంబానీ మరో సరికొత్త రికార్డును నమోదు చేశారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం... ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ, జెఫ్ బెజోస్, ఎలోన్ మస్క్‌తో కలిసి ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన సంపద క్లబ్లో చేరాడు. బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం...3.22 బిలియన్ డాలర్ల సంపదతో ముఖేష్ అంబానీ సంపద 101 బిలియన్ డాలర్లకు చేరుకుంది. చదవండి: భారత్‌లో అత్యంత ఖరీదైన స్కూటర్ ఇదే, ధర ఎంతంటే? 100 బిలియన్ డాలర్ల ఏలైట్ క్లబ్లో జాయినైనా తొలి ఆసియా వ్యక్తిగా ముఖేశ్ అంబానీ రికార్డు సృష్టించారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ 11 వ స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు అదానీ సంస్థల అధినేత గౌతమ్ అదానీ 73.3 బిలియన్ డాలర్ల సంపదతో 14 వ స్థానంలో కొనసాగుతున్నారు. తండ్రి నుంచి పగ్గాలు... రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన తండ్రి మరణాంతరం కంపెనీ పగ్గాలను చేపట్టాడు. చమురు శుద్ధి ,పెట్రోకెమికల్స్ వ్యాపారాలను వారసత్వంగా పొందినప్పటి నుంచి రిలయన్స్ పలు రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించింది.అంతేకాకుండా ఫేస్బుక్, గూగుల్, ఆరామ్ కో వంటి కంపెనీలతో కలిసి పనిచేస్తున్నారు. ఈ ఏడాది జరిగిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో గ్రీన్ ఎనర్జీకి ప్రతిష్టాత్మకమైన ప్రోత్సాహాన్ని ఆవిష్కరించారు. వచ్చే మూడు సంవత్సరాలలో సుమారు 10 బిలియన్ల డాలర్లను పెట్టుబడిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రణాళికాబద్ధమైన పెట్టుబడితో వాతావరణ మార్పులను ఎదుర్కోవటానికి, శక్తి దిగుమతులను తగ్గించడానికి భారత్ పరిశుభ్రమైన ఇంధన గ్లోబల్ తయారీ కేంద్రంగా మార్చాలని ముఖేశ్ అంబానీ ప్రణాళికలు చేస్తున్నారు. చదవండి: Amazon: అమెజాన్ ప్రైమ్ యూజర్లకు గుడ్‌న్యూస్...! -
14 ఏళ్లుగా ఆ జాబితాలో అగ్రస్థానంలో ముఖేష్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఫోర్బ్స్ ఇండియా జాబితా ప్రకారం 14వ సంవత్సరాల(2008) నుంచి భారతదేశంలో అత్యంత ధనవంతుడుగా కొనసాగుతున్నారు. గత ఏడాది కాలంలో ముకేష్ అంబానీ సంపద 4 బిలియన్ డాలర్లు పెరిగింది, 92.7 బిలియన్ డాలర్ల నికర విలువతో ముఖేష్ అంబానీ ఫోర్బ్స్ ఇండియా జాబితాలో తన అగ్రస్థానాన్ని మరోసారి నిలబెట్టుకున్నారు. 100 మంది ధనవంతులైన భారతీయుల జాబితాను ఫోర్బ్స్ నేడు(అక్టోబర్ 7) విడుదల చేసింది. ఈ 100 మంది ధనవంతులైన భారతీయుల మొత్తం సంపద ఏడాది కాలంలో 775 బిలియన్ డాలర్లు పెరిగింది. గౌతమ్ అదానీ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నారు. 2020లో 25.2 బిలియన్ డాలర్ల నుంచి తన సంపద దాదాపు మూడు రెట్లు పెరిగింది. అతని కంపెనీల షేర్లు ఏడాది కాలంలో భారీగా పెరిగాయి. 2020లో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల సంపద మధ్య అంతరం 63.5 బిలియన్ డాలర్లుగా ఉంటే.. అది ఇప్పుడు 17.9 బిలియన్ డాలర్లకు తగ్గింది. గౌతమ్ అదానీ సంపద 2021లో ఏకంగా 49.5 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇక మూడో స్థానంలో హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ శివ్ నాడార్ 31 బిలియన్ డాలర్ల సంపదతో నిలిచారు. డి'మార్ట్ రిటైల్ చైన్ వ్యవస్థాపకుడు రాధాకృష్ణ దమాని ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నారు. అతని నికర విలువ 29.4 బిలియన్ డాలర్లు. 2020లో15.4 బిలియన్ డాలర్లుగా ఉన్న దమానీ సంపద ఏడాది కాలంలో దాదాపు రెట్టింపు అయ్యింది. (చదవండి: మెర్సిడెజ్ బెంజ్.. మేడిన్ ఇండియా.. ధర ఎంతంటే?) సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ పూనావాలా ఈ ఏడాది 5వ స్థానంలో ఉన్నారు. అతని మొత్తం నికర విలువ 11.5 బిలియన్ డాలర్ల నుంచి 2021లో 19 బిలియన్ డాలర్లకు పెరిగింది.ఇక ఈ జాబితాలో ఆరో స్థానంలో ఆర్సెలర్ మిట్టల్ కు చెందిన లక్ష్మీ మిట్టల్ 18.8 బిలియన్ డాలర్ల సంపదతో ఉన్నారు; 7వ స్థానంలో 18 బిలియన్ డాలర్ల సంపదతో సావిత్రి జిందాల్; 8వ స్థానంలో 16.5 బిలియన్ డాలర్ల నికర విలువతో ఉదయ్ కోటక్; 9వ స్థానంలో $16.4 బిలియన్ల నికర విలువతో షాపూర్జీ పల్లోంజీ & పల్లోంజీ మిస్త్రీ; 10వ స్థానంలో 15.8 బిలియన్ డాలర్ల నికర విలువతో కుమార్ మంగళం బిర్లా ఉన్నారు. గత ఏడాది కంటే 7.3 బిలియన్ డాలర్ల సంపద ఎక్కువ. (చదవండి: బుకింగ్‌లో మహీంద్రా ఎక్స్యువి 700 ఎస్యూవి సరికొత్త రికార్డు) ఈ జాబితాలో 6 కొత్త వారు అశోక్ బూబ్ (స్థానం - 93, ఆస్తులు - 2.3 బిలియన్ డాలర్లు) దీపక్ నైట్రైట్ దీపక్ మెహతా (స్థానం- 97, ఆస్తులు- 2.05 బిలియన్ డాలర్లు) ఆల్కైల్ అమైన్ కెమికల్స్ యోగేష్ కొఠారి (స్థానం - 100, ఆస్తులు - 1.94 బిలియన్ డాలర్లు) డాక్టర్ లాల్ పాత్లాబ్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అరవింద్ లాల్ (స్థానం- 87, ఆస్తులు- 2.55 బిలియన్ డాలర్లు) రాజకీయవేత్త మంగళ్ ప్రభాత్ లోధా (స్థానం- 42, ఆస్తులు- 4.5 బిలియన్ డాలర్లు) హాస్పిటల్ చైన్ అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ ప్రతాప్ రెడ్డి (స్థానం- 88, ఆస్తులు- 2.53 బిలియన్లు డాలర్లు) -
ప్రపంచంలో 'అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్' లాంచ్ చేసిన జియో
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో సంచలనం సృష్టించింది. ప్రపంచంలో 'అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్' జియోఫోన్ నెక్ట్స్ ను ముఖేష్ అంబానీ ఆవిష్కరించారు. గూగుల్ భాగస్వామ్యంతో ఈ కొత్త ఫోన్ ను అభివృద్ధి చేసినట్లు రిలయన్స్ 44వ వార్షిక సమావేశంలో ముఖేష్ అంబానీ తెలిపారు. గత ఏడాది గూగుల్ జియోలో రూ.33,737 కోట్ల పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ టెక్ దిగ్గజానికి జియోలో 7.7 శాతం వాటా లభించినట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. ప్రపంచ అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ జియోఫోన్ నెక్ట్స్ ను సెప్టెంబర్ 10 గణేష్ చతుర్థి రోజున మార్కెట్లోకి తీసుకొనిరానున్నట్లు సంస్థ పేర్కొంది. జియోఫోన్ నెక్ట్స్ ఫోన్ గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సహాయంతో పనిచేస్తుంది. దీనిలో వాయిస్ అసిస్టెంట్, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ పనిచేయనున్న కెమెరా, లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్ వంటి మరెన్నో ఫీచర్స్ తో వచ్చింది. దీనిని మొదట భారతదేశంలో ప్రారంభించనున్నారు. తర్వాత ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. దీని ధర ఎంత అనేది సంస్థ ఇంకా బయటికి ప్రకటించలేదు. చాలా మంది మార్కెట్ నిపుణులు ఈ మొబైల్ రూ.5,000 లోపు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. రిలయన్స్ జియోకు దేశంలో 425 మిలియన్లకు పైగా చందాదారులు ఉన్నారు. భారతదేశంలో డేటా వినియోగంలో కంపెనీ 45% వృద్ధిని నమోదు చేసింది. త్వరలో 200 మిలియన్ల కొత్త వినియోగదారులు చెరనున్నట్లు రిలయన్స్ జియో భావిస్తుంది. దేశంలో ఇప్పటికీ 30 కోట్ల మంది 2జీ ఫోన్ నే వాడుతున్నారు. వారిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఈ ఫోన్ తీసుకొచ్చినట్లు జియో తెలిపింది. చదవండి: ఎలక్ట్రిక్ వాహన విప్లవం రాబోతుంది: భవిష్ అగర్వాల్ -
సుడిగుండంలో ‘మహా’ సర్కారు
ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటి సమీపాన బాంబులతో దొరికిన కారు అనేకానేక మలుపులతో ఉత్కంఠ రేపుతోంది. మొదట్లో ఉగ్రవాదుల పనిగా అందరూ అనుమానించిన ఉదంతం కాస్తా ముంబై పోలీసుల మెడకు చుట్టుకోవటమే వింత అయితే...అది మళ్లీ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వైపు మళ్లి, శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాదీ ప్రభుత్వాన్ని చుట్టుముట్టింది. తాజాగా అది సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కింది. ఈ ఎపిసోడ్లో నగర పోలీస్ కమిషనర్ పదవి కోల్పోయిన పరంవీర్ సింగ్ హోంమంత్రి అనిల్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు లేఖ రాయటమేకాక, సుప్రీంకోర్టులో సైతం పిటిషన్ దాఖలు చేశారు. తన బదిలీ చెల్లదని ప్రకటించాలని కూడా కోరారు. పోలీసు వ్యవస్థను అధికారంలో వున్నవారు తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారన్న ఆరోపణలు చాలా పాతవి. ప్రత్యేకించి ముంబై పోలీసులకు ఆ విషయంలో మొదటినుంచీ అంత మంచి పేరు లేదు. ఒకప్పుడు ఆ మహానగరాన్ని మాఫియా డాన్లు తమ అడ్డాగా మార్చుకుని వ్యాపారులనూ, పారిశ్రామికవేత్తలనూ, సినీ నటుల్ని బెదిరించి డబ్బు దండుకోవటం, యధేచ్ఛగా కిడ్నాప్‌లకు పాల్పడటం, దాడులు చేయటం సాగిస్తున్నప్పుడు ముంబై పోలీసులు వాటిని సరిగా అరికట్టలేకపోయారు. వారిలో కొందరు మాఫియాలతో కుమ్మక్కు కావటమే అందుకు కారణమన్న ఆరోపణలుండేవి. ఆ వంకన బూటకపు ఎన్కౌంటర్లు జోరందుకున్నాయి. అమాయకుల్ని సైతం ఆ ముసుగులో హతమారుస్తున్నారన్న ఆరోపణలొచ్చాయి. 2008 నవంబర్ 26న ముంబైపై ఉగ్రవాదులు చేసిన దాడి, అంతక్రితం జరిగిన బాంబు పేలుళ్లు ముంబై పోలీసుల పనితీరును ప్రశ్నార్థకం చేశాయి. ఉగ్రవాదులు విరుచుకుపడినప్పుడు ప్రాణాలు కోల్పోయిన 173మందిలో పోలీసు ఉన్నతాధికారులు హేమంత్ కర్కరే, అశోక్ కామ్టే, ఇతర సిబ్బంది కూడా వున్నారు. కానీ పటిష్టమైన ముందస్తు నిఘా వుంచటంలో ముంబై పోలీసుల వైఫల్యం క్షమార్హం కాదు. ఇదంతా తెలిసి కూడా పోలీసు వ్యవస్థను సమర్థవంతంగా, వివాదరహితంగా తీర్చిదిద్దటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. మొత్తం వివాదానికి కేంద్ర బిందువుగా వున్న అధికారి సచిన్ వాజేను హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా సర్వీసులోకి తీసుకోవటమేకాక, ఆయనకు కీలకమైన కేసుల దర్యాప్తు బాధ్యతను అప్పగించటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా అపకీర్తి గడించిన వాజే, ఒక హత్య కేసులో జైలుకెళ్లి వచ్చాడు. మధ్యలో శివసేనలో చేరాడు. అలాంటి వ్యక్తికి హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా పదవి కట్టబెట్టటంలోని ఔచిత్యమేమిటి? ఇందుకు కారణం పరంవీర్ సింగేనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అంటున్నారు. మరి రాజకీయ నాయకత్వం వుండి ఏం చేసినట్టు? అనిల్ దేశ్‌ముఖ్‌ఎందుకు అభ్యంతరం చెప్పలేకపోయారు? తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కేంద్రం ఈ తతంగాన్నంతా నడిపిస్తోందంటున్న పవార్ దీనికేం చెబుతారు? ప్రభుత్వాలు నిర్వర్తించే కర్తవ్యాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కీలకమైనది. సురక్షితంగా, భద్రంగా వున్నామన్న భావన పౌరులకు కలగాలంటే పటిష్టమైన, చురుకైన పోలీసు వ్యవస్థ వుండాలి. అదే సమయంలో అది కర్తవ్య నిష్టతో పనిచేసేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వుంటుంది. కానీ మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ప్రభుత్వానికి దానిపై అదుపాజ్ఞలు వున్న దాఖలా కనబడదు. పోలీస్ కమిషనర్ పదవినుంచి తనను తప్పించగానే పరంవీర్ సింగ్ తీవ్రమైన ఆరోపణలే చేశారు. నెలకు వంద కోట్లు వసూలు చేసి ఇవ్వాలని వాజేకు అనిల్ దేశ్‌ముఖ్ నిర్దేశించారని ఆయనంటున్నారు. మరి అలాంటి వ్యక్తికి కీలక కేసుల దర్యాప్తు బాధ్యతను పరంవీర్ ఎలా అప్పగించారు? కనీసం తన బదిలీకి ముందు ఈ ఆరోపణ చేసివుంటే ఆయన నిజాయితీ వెల్లడయ్యేది. పదవినుంచి తప్పించారన్న అక్కసుతోనే ఇలా అంటున్నారన్న అభిప్రాయం అందరిలో ఏర్పడే పరిస్థితి వుండేది కాదు. తాను చాన్నాళ్లక్రితమే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే దృష్టికి ఈ సంగతి తీసుకొచ్చానని పరంవీర్ అంటున్నారు. అదే జరిగుంటే పరంవీర్‌ను ఇన్నాళ్లు పదవిలో కొనసాగించేవారా అన్న సంశయం కలుగుతుంది. వాజే వ్యవహారంలో తన ప్రమేయాన్ని తుడిచేసుకోవటానికే పరంవీర్ ఇలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని ఇప్పటికే విమర్శలు మొదలయ్యాయి. హోంమంత్రి, పోలీసు విభాగం ఇలా ఆరోపణల్లో చిక్కుకోవటం మహారాష్ట్రలో ఇది మొదటిసారేమీ కాదు. 2003లో అప్పటి హోంమంత్రి ఛగన్ భుజ్‌బల్‌పై అవినీతి ఆరోపణలు రావటంతో తప్పుకోవాల్సి వచ్చింది. ఆయన అబ్దుల్ కరీం తెల్గీ స్టాంపు పేపర్ల కుంభకోణంలో కూడా ఇరుక్కున్నారు. ఎన్కౌంటర్ స్పెషలిస్టులుగా పేరుమోసి, అమాయకుల్ని హతమార్చారన్న ఆరోపణలున్నవారిని నెత్తినపెట్టుకోవటం వాజేతోనే మొదలుకాలేదు. నకిలీ ఎన్కౌంటర్ల కేసులో శిక్షపడిన 11మంది పోలీసులను 2015లో విడుదల చేసిన ఘనత అప్పటి బీజేపీ–శివసేన సర్కారుది. దీన్ని బొంబాయి హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టి అడ్డుకుంది. తాజా వ్యవహారంలో సుప్రీంకోర్టు ఏం చెబుతుందన్న సంగతలా వుంచితే ఆరోపణలొచ్చిన విలాస్ దేశ్ముఖ్తో రాజీనామా చేయించటం, వాజే పునరాగమనంలో నిజంగా పరంవీర్ పాత్ర వుంటే నిగ్గు తేల్చి, తగిన చర్యలు తీసుకోవటం రాజకీయంగా మహారాష్ట్ర ప్రభుత్వానికే మంచిది. -
ఈ కొత్త కుబేరుడు- ఆసియాలోనే టాప్
న్యూఢిల్లీ, సాక్షి: ప్రస్తుత కేలండర్ ఏడాది(2020) చివర్లో కొత్త కుబేరుడు ఆవిర్భవించాడు. వ్యక్తిగత సంపద 77.8 బిలియన్ డాలర్లకు చేరడంతో చైనాకు చెందిన జాంగ్ షంషాన్ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచినట్లు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజాగా పేర్కొంది. తద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టినట్లు తెలియజేసింది. ప్రస్తుతం ముకేశ్ వ్యక్తిగత సంపద 76.9 బిలియన్ డాలర్లుగా వెల్లడించింది. వెరసి జాంగ్ ప్రపంచ కుబేరుల జాబితాలో 11వ ర్యాంకును పొందగా.. ముకేశ్ అంబానీ ఆ వెనుకే నిలిచినట్లు పేర్కొంది. ఇతర వివరాలు చూద్దాం.. చదవండి: (2020: పసిడి, కుబేరులు, మార్కెట్లు!) జాక్ మా.. 5వ ప్లేస్ ప్రయివేట్ బిలియనీర్ కావడంతో మీడియాలో తక్కువగా కనిపించే 66 ఏళ్ల జాంగ్ కెరీర్ జర్నలిజం, పుట్టగొడుగుల పెంపకం, ఆరోగ్య పరిరక్షణ రంగాలతో పెనవేసుకుంది. ఈ ఏడాదిలోనే జాంగ్ సంపద అత్యంత వేగంగా వృద్ధి చెందింది. 2020లో 70.9 బిలియన్ డాలర్ల సంపద జమయ్యింది. దీంతో జాంగ్ వ్యక్తిగత సంపద 77.8 బిలియన్ డాలర్లను తాకింది. ఇందుకు ప్రధానంగా వ్యాక్సిన్ తయారీ కంపెనీ బీజింగ్ వాంటాయ్ బయోలాజికల్ ఫార్మసీ ఎంటర్‌ప్రైజస్‌ను ఏప్రిల్‌లో లిస్టింగ్ చేయడం సహకరించింది. అంతేకాకుండా బాటిల్డ్ వాటర్ కంపెనీ నాంగ్ఫు స్ర్పింగ్ కంపెనీ హాంకాంగ్‌లో పబ్లిక్ ఇష్యూకి రావడం కూడా దీనికి జత కలసింది. షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయిన వాంటాయ్ షేర్లు 2,000 శాతం దూసుకెళ్లగా.. నాంగ్ఫు షేర్లు సైతం 155 శాతంపైగా ర్యాలీ చేశాయి. దీంతో ఒక్క వాంటాయ్ కారణంగానే ఆగస్ట్‌కల్లా జాంగ్ సంపదకు 20 బిలియన్ డాలర్లు జమయ్యింది. వెరసి తొలిసారి చైనాయేతర దేశాలలోనూ జాంగ్ పేరు వినిపిస్తున్నట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు సరదాగా వ్యాఖ్యానించారు. (2021: ముకేశ్ ఏం చేయనున్నారు?) ముకేశ్ స్పీడ్ నిజానికి 2020లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద సైతం వేగంగా బలపడింది. పెట్రోకెమికల్స్ తదితర డైవర్సిఫైడ్ బిజినెస్‌లు కలిగిన ఆర్ఐఎల్ను డిజిటల్, టెక్నాలజీ, ఈకామర్స్ దిగ్గజంగా రూపొందించడంతో ముకేశ్ సంపద 18.3 బిలియన్ డాలర్లమేర ఎగసింది. తాజాగా 76.9 బిలియన్ డాలర్లకు చేరింది. ఒక దశలో అంటే ఈ ఏడాది జూన్‌కల్లా ఆర్ఐఎల్ గ్రూప్ షేర్ల పరుగు కారణంగా ముకేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో నాలుగో ర్యాంకుకు సైతం చేరారు. కాగా.. ఇతర ఆసియా కుబేరుల్లో పిన్‌డ్యువోడ్యువో అధినేత కొలిన్ హువాంగ్ 63.1 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో మూడో ర్యాంకులో నిలిచారు. టెక్ దిగ్గజం టెన్సెంట్ చీఫ్ పోనీ మా 56 బిలియన్ డాలర్లతో తదుపరి స్థానాన్ని కైవసం చేసుకోగా.. ఈకామర్స్ దిగ్గజం అలీబాబా సహవ్యవస్థాపకుడు జాక్ మా 51.2 బలియన్ డాలర్లతో ఐదో ర్యాంకును పొందారు. జాక్ మాకు షాక్ చైనా నియంత్రణ సంస్థలు ఇటీవల యాంట్ గ్రూప్ సంస్థలపై యాంటీట్రస్ట్ నిబంధనల్లో భాగంగా దర్యాప్తును చేపట్టడంతో జాక్ మా సంపదకు సుమారు 10 బిలియన్ డాలర్లమేర చిల్లు పడింది. దీంతో సంపద రీత్యా జాక్ మా వెనకడుగు వేశారు. కాగా.. బాటిల్డ్ వాటర్ బిజినెస్‌లో మార్కెట్ లీడర్‌గా నిలుస్తున్న నాంగ్ఫు స్ప్రింగ్ పటిష్ట క్యాష్‌ఫ్లోలను సాధించగదని సిటీగ్రూప్ వేసిన అంచనాలు ఈ కంపెనీకి జోష్‌నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న వార్తలతో వాంటాయ్ షేరు సైతం జోరందుకున్నట్లు తెలియజేశారు. వెరసి జాంగ్ ఆసియా కుబేరుడిగా అవతరించినట్లు వివరించారు. -
డిజిటలైజేషన్‌తో స్పీడ్: జుకర్‌బర్గ్, ముకేశ్
ముంబై, సాక్షి: ఫ్యూయల్ ఫర్ ఇండియా2020పేరుతో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ నిర్వహిస్తున్న తొలి ఎడిషన్ నేడు ప్రారంభమైంది. వర్చువల్ పద్ధతిలో ప్రారంభమైన సదస్సులో భాగంగా ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రసంగించారు. దేశీయంగా డిజిటల్ విభాగంలో గల అవకాశాలు, ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో డిజిటల్ ప్రభావం తదితర పలు అంశాలను ప్రస్తావించారు. సదస్సులో ఫేస్బుక్ సీవోవో షెరిల్ శాండ్‌బర్గ్, ఫేస్బుక్ ఇండియా ఎండీ అజిత్ మోహన్‌తోపాటు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అధికారులు సైతం ప్రసంగించనున్నారు. ఇదేవిధంగా రిలయన్స్ జియో తరఫున డైరెక్టర్లు ఆకాశ్ అంబానీ, ఈషా అంబానీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నారు. కాగా.. డిజిటలైజేషన్లో దేశాన్ని ప్రధాని మోడీ ముందుండి నడిపిస్తున్నట్లు జుకర్‌బర్గ్, ముకేశ్ అంబానీ ప్రశంసించారు. వివరాలు చూద్దాం.. (5జీ టెక్నాలజీను వెంటనే అనుమతించండి) మార్క్ జుకర్‌బర్గ్: భారత్‌లో ప్రస్తావించదగ్గ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సంస్క్రతి నెలకొని ఉంది. ప్రధాని మోడీ డిజిటల్ ఇండియా విజన్ కారణంగా పలు అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వంతో భాగస్వామ్యానికి పరిశ్రమకు వీలు చిక్కనుంది. టెక్నాలజీ ద్వారా అభివృద్ధి వేగమందుకోనుంది. ప్రభుత్వం సృష్టించిన యూపీఐ చెల్లింపుల వ్యవస్థ ప్రజలకెంతో మేలు చేస్తోంది. డిజిటల్ టూల్స్ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం లభించనుంది. దేశీయంగా కోట్ల కొద్దీ ప్రజలకు ఇంటర్నెట్ ప్రయోజనాలను అందించడంలో రిలయన్స్ జియో కీలకంగా మారింది. మరోపక్క వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ తదితర ప్లాట్‌ఫామ్స్ ద్వారా డిజిటల్ ఇన్‌క్లూజన్‌కు దారి ఏర్పడుతోంది. దేశీ వినియోగదారులకు భద్రతతో కూడిన స్వేచ్చా ఇంటర్నెట్కు ఫేస్బుక్ వేదికగా నిలుస్తోంది. (ముకేశ్ కుంటుంబం ఆసియాలోకెల్లా సంపన్నం) ముకేశ్ అంబానీ: రిలయన్స్ జియోలో ఫేస్బుక్ పెట్టుబడుల కారణంగా జియోకు లబ్ది చేకూరుతోంది. అంతేకాకుండా దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలయన్స్ జియోలో 9.9 శాతం వాటాను రూ. 43,754 కోట్లకు ఫేస్బుక్ కొనుగోలు చేసిన విషయం విదితమే. దేశంలో రిలయన్స్ జియో డిజిటల్ కనెక్టివిటీకి తెరతీసింది. మరోవైపు వాట్సాప్ నౌ ద్వారా వాట్సాప్ డిజిటల్ ఇంటరేక్టివిటీని కల్పిస్తోంది. ఇక రిటైల్ రంగంలో జియో మార్ట్ అటు ఆన్లైన్, ఇటు ఆఫ్‌లైన్‌లో అపార అవకాశాలకు చోటిస్తోంది. దీంతో గ్రామాలు, చిన్న పట్టణాలలోగల చిన్న షాపులకూ డిజిటలైజేషన్ ద్వారా బిజినెస్ అవకాశాలకు దారి ఏర్పడుతోంది. విద్య, ఆరోగ్య రంగాలలోనూ డిజిటల్ అవకాశాలకు కొదవలేదు. డిజిటల్ సోసైటీగా మారాక రానున్న రెండు దశాబ్దాలలో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోని టాప్-3లో ఒకటిగా ఆవిర్భవించే వీలుంది. యువశక్తి ఆర్థిక వ్యవస్థను నడిపిస్తుంది. దీంతో తలసరి ఆదాయం ప్రస్తుత 2,000 డాలర్ల నుంచి 5,000 డాలర్లకు పుంజుకునే అవకాశముంది. -
కోవిడ్-19లోనూ.. మన కుబేరులు భళా
ముంబై, సాక్షి: ప్రపంచ దేశాలను కోవిడ్-19 వణికిస్తున్నప్పటికీ దేశీయంగా బిలియనీర్ల సంపద పెరుగుతూ వచ్చింది. 2020లో ఏడుగురు కుబేరుల సంపదకు 60 బిలియన్ డాలర్లు జమయ్యింది. వెరసి వీరి మొత్తం సంపద దాదాపు 200 బిలియన్ డాలర్లకు చేరింది. జనవరి 1 మొదలు డిసెంబర్ 11కల్లా దేశీయంగా 7గురు కుబేరుల సంపద మొత్తం 194.4 బిలియన్ డాలర్లను తాకినట్లు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజాగా వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం...(మార్క్ జుకర్‌బర్గ్ సమీపానికి ముకేశ్ అంబానీ) యమస్పీడ్.. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించినప్పటికీ ఈ ఏడాది దేశీ కుబేరుల సంపద 50 శాతం బలపడింది. తొలితరం పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద 21.1 బిలియన్ డాలర్లు పెరిగింది. వెరసి 32.4 బిలియన్ డాలర్లను తాకింది. ఇక 2020లో ఆర్ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీ సంపద సైతం 18.1 బిలియన్ డాలర్ల వృద్ధితో 76.7 బిలియన్ డాలర్లయ్యింది. వ్యాక్సిన్ల కంపెనీ సీరమ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ సైరస్ పూనావాలా సంపదకు 6.91 బిలియన్ డాలర్లు జమకావడంతో 15.6 బిలియన్ డాలర్లకు వ్యక్తిగత సంపద ఎగసింది. ఐటీ దిగ్గజాలు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ శివనాడార్, విప్రో అధినేత ప్రేమ్‌జీ సంపద సంయుక్తంగా 12 బిలియన్ డాలర్లమేర పెరిగింది. దీంతో శివనాడార్ సంపద 22 బిలియన్ డాలర్లను తాకగా.. ప్రేమ్‌జీ వెల్త్ 23.6 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ బాటలో డీమార్ట్ స్టోర్ల అధినేత రాధాకిషన్ దమానీ సంపద సైతం 4.71 బిలియన్ డాలర్లు బలపడి 14.4 బిలియన్ డాలర్లయ్యింది. ఇదేవిధంగా హెల్త్‌కేర్ దిగ్గజం సన్ ఫార్మా చీఫ్ దిలీప్ సంఘ్వీ సంపద 2.23 బిలియన్ డాలర్లు పుంజుకుని 9.69 బిలియన్ డాలర్లుగా నమోదైంది. షేర్ల ర్యాలీ దేశీ పారిశ్రామిక దిగ్గజాల వ్యక్తిగత సంపద పుంజుకోవడానికి ఆయా కంపెనీ షేర్లు ర్యాలీ బాటలో సాగడం దోహదపడింది. గ్రూప్ కంపెనీలు అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ పోర్ట్స్ 120-27 శాతం మధ్య దూసుకెళ్లడంతో గౌతమ్ అదానీకి కలసి వచ్చింది. అయితే అదానీ పవర్ 28 శాతం క్షీణించడం గమనార్హం. ప్రధానంగా ఆర్ఐఎల్ మార్కెట్ విలువ 33 శాతం ఎగసి 13.56 లక్షల కోట్లను తాకడంతో ముకేశ్ సంపద జోరందుకుంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేరు 52 శాతం, విప్రో 44 శాతం పురోగమించడంతో శివనాడార్, అజీమ్ ప్రేమ్‌జీ సంపదలు వృద్ధి చెందాయి. ఇదేవిధంగా సన్ ఫార్మా షేరు 31 శాతం లాభపడటంతో దిలీప్ సంఘ్వీ సంపద పుంజుకుంది. ఇదే సమయంలో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 12 శాతమే లాభపడటం ప్రస్తావించదగ్గ అంశం! -
రిలయన్స్ రిటైల్‌లో.. సిల్వర్ లేక్
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అనుబంధ విభాగమైన రిలయన్స్ రిటైల్‌లో పీఈ సంస్థ సిల్వర్ లేక్ స్వల్ప వాటాను కొనుగోలు చేయనుంది. 1.75 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు సిల్వర్ లేక్ డీల్ కుదుర్చుకున్నట్లు ఆర్ఐఎల్ తాజాగా వెల్లడించింది. ఇందుకు సిల్వర్‌లేక్ రూ. 7,500 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఈ డీల్‌తో రిలయన్స్ రిటైల్ విలువ రూ. 4.21 లక్షల కోట్లకు చేరినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం డిజిటల్ అనుబంధ విభాగమైన రిలయన్స్ జియోలో సైతం సిల్వర్ లేక్ ఇన్వెస్ట్ చేసింది. నిధుల సమీకరణ డిజిటల్ అనుబంధ విభాగం రిలయన్స్ జియో బాటలో రిలయన్స్ రిటైల్లోనూ మైనారిటీ వాటా విక్రయం ద్వారా మరిన్ని నిధులు సమకూర్చుకునే ప్రణాళికల్లో ముకేశ్ అంబానీ ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కంపెనీ వృద్ధి కోసం ఆర్ఐఎల్ వివిధ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలియజేశాయి. రిలయన్స్ జియోలో ఇప్పటికే సిల్వర్ లేక్ రూ. 10,202 కోట్లను ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలకు రిలయన్స్ రిటైల్లోనూ వాటా కొనుగోలుకి వీలు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ రిటైల్‌లో 10 శాతంవరకూ వాటాను విక్రయించే ప్రణాళికల్లో ముకేశ్ అంబానీ ఉన్నట్లు చెబుతున్నారు. కన్సాలిడేషన్ గత నెలలో కిశోర్ బియానీ సంస్థ ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్ బిజినెస్‌లను ముకేశ్ అంబానీ దిగ్గజం రిలయన్స్ రిటైల్ సొంతం చేసుకున్న విషయం విదితమే. ఇందుకు రూ. 24,713 కోట్ల డీల్‌ను కుదుర్చుకుంది. తద్వారా దేశీ రిటైల్ రంగంలో కన్సాలిడేషన్ ద్వారా రిలయన్స్ గ్రూప్.. రిటైల్ బిజినెస్‌ను మరింత పటిష్ట పరచుకోనున్నట్లు నిపుణులు తెలియజేశారు. మరోవైపు ఈకామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్(వాల్‌మార్ట్)కు పోటీగా జియో మార్ట్ ద్వారా రిలయన్స్ రిటైల్ వేగంగా విస్తరిస్తున్నట్లు వివరించారు. 2006లో ప్రారంభమైన రిలయన్స్ రిటైల్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11,806 స్టోర్లను కలిగి ఉంది. -
రిలయన్స్ జియోలో గూగుల్‌కు వాటా
ఇటీవల పలు విదేశీ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకట్టుకుంటున్న జియో ప్లాట్‌ఫామ్స్ తాజాగా టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ను సైతం ఆకర్షించింది. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు డిజిటల్, టెలికం విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో గూగుల్ రూ. 33,737 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తాజాగా ముకేశ్ అంబానీ వెల్లడించారు. తద్వారా రిలయన్స్ జియోలో 7.7 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేశారు. గూగుల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా అందుబాటు ధరల్లో 4జీ/5జీ ఫోన్లను తయారు చేనున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా దేశీ వినియోగం కోసం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించనున్నట్లు వివరించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ వీడియో కాన్ఫెరెన్సింగ్ ద్వారా నిర్వహిస్తున్న ఏజీఎంలో ఈ వివరాలు తెలియజేశారు. రానున్న 5-7 ఏళ్ల కాలంలో దేశీయంగా 10 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసే ప్రణాళిల్లో ఉన్నట్లు సోమవారం గూగుల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. తద్వారా డిజిటల్ టెక్నాలజీస్‌లో మరింత విస్తరించే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం యథాతథంగా రూ. 1918 వద్ద ట్రేడవుతోంది. తొలుత 2.2 శాతం ఎగసి రూ. 1989 సమీపానికి చేరింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకావడం విశేషం! క్వాల్‌కామ్‌తో.. పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ కంపెనీ ఆర్ఐఎల్కు అనుబంధ విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో చివరిగా చిప్ దిగ్గజం క్వాల్కామ్ రూ. 730 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. తద్వారా జియోలో 0.15 శాతం వాటాను సొంతం చేసుకుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 25.24 శాతం వాటాను విక్రయించడం ద్వారా ఇప్పటికే ఆర్ఐఎల్ రూ. 1.18 లక్షల కోట్లకుపైగా సమీకరించింది. జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌సహా చిప్ దిగ్గజాలు ఇంటెల్, క్వాల్కామ్.. పీఈ సంస్థలు కేకేఆర్, సిల్వర్ లేక్ తదితరాలు ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. ఈ పెట్టుబడులకు జతగా రైట్స్ ఇష్యూ ద్వారా ఆర్ఐఎల్ రూ. 53,124 కోట్లను సమకూర్చుకుంది. ఈ బాటలో గతేడాది ఇంధన రిటైల్ నెట్‌వర్క్‌లో 49 శాతం వాటా అమ్మకం ద్వారా బీపీ నుంచి రూ. 7,000 కోట్లు సమీకరించింది. వెరసి నికరంగా రుణరహిత కంపెనీగా ఆవిర్భవించినట్లు గత నెలలో ఆర్ఐఎల్ తెలియజేసింది. మార్చికల్లా ఆర్ఐఎల్ రుణ భారం రూ. 1.6 లక్షల కోట్లుగా నమోదైన సంగతి తెలిసిందే. -
ఆర్ఐఎల్ ఏజీఎం- ముకేశ్ గ్రూప్ షేర్ల హవా
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వర్చువల్ ప్రాతిపదికన నేడు వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) నిర్వహిస్తోంది. ఇటీవల డిజిటల్ అనుబంధ విభాగం రిలయన్స్ జియోకు తరలివచ్చిన విదేశీ పెట్టుబడులు, ఆర్ఐఎల్ చేపట్టిన రైట్స్ ఇష్యూ నేపథ్యంలో ఏజీఎంకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. గత ఏజీఎంలో రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ పేర్కొన్న గడువుకంటే ముందుగానే ఆర్ఐఎల్ రుణరహిత దిగ్గజంగా ఆవిర్భవించిన నేపథ్యంలో ప్రస్తుత సమావేశంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ముకేశ్ అంబానీ వెల్లడించనున్న ప్రణాళికలపై అంచనాలతో ఇన్వెస్టర్లు ఆర్ఐఎల్ గ్రూప్ కౌంటర్లలో కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. దీంతో ముకేశ్ అంబానీ గ్రూప్ షేర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. జోరుగా హుషారుగా ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఆర్ఐఎల్ షేరు 2.2 శాతం ఎగసి రూ. 1960 వద్ద ట్రేడవుతోంది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ఇటీవలే కంపెనీ మార్కెట్ విలువ రూ. 12 లక్షల కోట్లను అధిగమించింది. తద్వారా ఈ ఘనతను సాధించిన తొలి దేశీ కంపెనీగా రికార్డ్ నెలకొల్పింది. ఈ ప్రభావంతో గ్రూప్‌లోని ఇతర కంపెనీల కౌంటర్లు సైతం జోరందుకున్నాయి. హాథవే కేబుల్ అండ్ డేటాకామ్ 13 శాతం దూసుకెళ్లి రూ. 47 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 50 సమీపంలో ఏడాది గరిష్టాన్ని తాకింది. ఇతర కౌంటర్లలో డెన్ నెట్వర్క్స్, 5.25 శాతం జంప్‌చేసి రూ. 94 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 97 సమీపంవరకూ ఎగసింది. ఇక రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 0.5 శాతం బలపడి రూ. 461 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 468ను దాటింది. ఇటీవల ర్యాలీ రెండు రోజులుగా దూకుడు చూపుతున్న హాథవే కేబుల్ షేరు గత నెల రోజుల్లో 73 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! ఇదే విధంగా రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైతం 46 శాతం లాభపడింది. ఈ బాటలో టీవీ18 బ్రాడ్‌క్యాస్ట్, నెట్వర్క్ 18 మీడియా, డెన్ నెట్వర్క్స్ 12-40 శాతం మధ్య ఎగశాయి. -
ప్రపంచ కుబేరుల్లో 6వ స్థానానికి ముకేశ్
ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ మరో ఘనత సాధించాడు. ప్రపంచ కుబేరుల జాబితాలో 6వ స్థానానికి ఎగబాకారు. సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజం ఎలెన్ మస్క్‌ను, గూగుల్ సహ-వ్యవస్థాపకులు బ్రెయిన్, లారీ పేజ్‌లను అధిగమించడం ద్వారా ఈ ఘనతను సాధించినట్లు బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకటించింది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ సంపద 72.4బిలియన్ డాలర్లుగా ఉంది. అమెరికా టెక్ షేర్లు సోమవారం భారీ పతనాన్ని చవిచూశాయి. షేర్ల పతనంతో లారీ పేజ్ సంపద 71.6బిలియన్ డాలర్లకు, బ్రెయిన్స్ సంపద 69.4బిలియన్ డాలర్లకు, టెస్లా అధినేత మస్క్ సంపద 68.6బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గతవారంలో చివర్లో ఇదే సంపద విషయంలో స్టాక్ మార్కెట్ దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌ను అధిగమించిన సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి ఈమార్చి నుంచి పలు దేశాలు విధించిన లాక్‌డౌన్‌తో అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఇటువంటి క్లిష్టతరుణంలో ముఖేష్ అంబానీ జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్బుక్, సిల్వర్‌లేక్, క్వాల్‌కాంతో సహా సుమారు 12 విదేశీ కంపెనీలకు 25.24 శాతం వాటా విక్రయం ద్వారా 13 విదేశీ సంస్థల నుంచి రూ.1.18 లక్షల కోట్ల మేర నిధులు సమీకరించింది. ఫలితంగా రిలయన్స్ షేరు మార్చి కనిష్టస్థాయి నుంచి రెట్టింపు లాభాల్ని ఆర్జించింది. భారత్‌లో శరవేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్ వ్యాపారాన్ని దృష్టి పెట్టుకుని ముకేశ్ ఈ-కామర్స్ రంగంలో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద జనాభ కలిగిన మనదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక విదేశీ కంపెనీలు... ముఖ్యంగా అమెరికా ఆధారిత కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. అందులో భాగంగా నిన్నటి రోజులన వచ్చే 5–7 సంవత్సరాల్లో సుమారు రూ. 75 వేల కోట్లు (దాదాపు 10 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు గూగుల్ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
థ్యాంక్యూ ఆమిర్ : సీఎం ఫడ్నవిస్
ముంబై : బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆమిర్ తాజాగా వరద బాధితులకు సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. మహారాష్ట్రలో కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలకు భారీ వరదలు సంభవించడంతో అక్కడి జనజీవనం అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమిర్‌ఖాన్ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. తనవంతు సహాయంగా సీఎం రిలీఫ్‌ఫండ్‌కు రూ.25 లక్షలు విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆమీర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక బాలీవుడ్ ‘ఖిలాడి’ అక్షయ్ కుమార్ కూడా ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. రైతులు, వరద బాధితులు, అమరవీరుల కుటుంబాలకు ఆయన ఆపన్న హస్తం అందించారు. అసోంకు వరదలు వచ్చినప్పుడు రూ.2 కోట్లను ఇచ్చి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. అమీర్, అక్షయ్ బాటలోనే గాన కోకిల లతా మంగేష్కర్ రూ.11 లక్షలను, బాలీవుడ్ బిగ్‌బీ రూ. 51 లక్షలను విరాళంగా ప్రకటించారు. దీంతో మరికొంతమంది ప్రముఖులు కూడా ముందుకువచ్చి విరాళాలు ఇస్తున్నారు. పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్ అంబానీ రూ. 5 కోట్లను విరాళంగా ఇవ్వగా ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ రూ. 5 కోట్ల చెక్కును సీఎంకు అందించారు. అలాగే ఆగస్టు 12న బాలీవుడ్ కపుల్ రితేశ్ దేశ్‌ముఖ్- జెనీలియా రూ.25 లక్షల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహరాష్ట్ర సీఎం ఆపన్న హస్తాన్ని అందించిన ప్రతీ ఒక్కరికీ ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ మంత్రులు, ఫడ్నవీస్‌తో సహా వారి ఒకరోజు వేతనాన్ని రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్లుగా ప్రకటించారు.వరదల విజృంభన వల్ల పుణెలో ఇప్పటి వరకు 54 మంది చనిపోగా, లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. Thank you @aamir_khan for your contribution of ₹25,00,000/- (₹25 lakh) towards #CMReliefFund #MaharashtraFloods ! — Devendra Fadnavis (@Dev_Fadnavis) August 20, 2019 -
బియాన్స్... బడ్జెట్ అదుర్స్
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కూతురి పెళ్లి సంబరాలు ఇటీవల జరిగిన విషయాన్ని వినే ఉంటారు. ఇండియన్ సెలబ్రిటీలను మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ సెలబ్రిటీలను కూడా ఆహ్వానించారు అంబానీ. కేవలం వెడ్డింగ్ పార్టీల కోసమే సుమారు వంద మిలియన్ డాలర్లను కార్లో పెట్రోల్లా ఖర్చు పెట్టారట ఆయన. ఈ ఫంక్షన్లో హాలీవుడ్ సింగర్ బియాన్స్ కనిపించడం విశేషం. ఎందుకంటే బియాన్స్ ఒక్క ప్రైవేట్ పార్టీకి సుమారు 3–4 మిలియన్ డాలర్స్ (దాదాపు 20 కోట్ల రూపాయలు) అందుకుంటారట. 2017లో మ్యూజిక్ ఇండస్ట్రీలో అత్యధికంగా సంపాదించిన సింగర్‌గా బియాన్స్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. ఇంతకీ ఆమె అంబానీ పార్టీ కోసం ఎంత తీసుకున్నారంటే.. సుమారు 28 కోట్లు పుచ్చుకున్నారని టాక్. -
ఇషా అంబానీ వివాహం : మొదటి ఆహ్వానం ఎవరికంటే
ముంబై : అంబానీ కుటుంబంలో సంతోషాలు వరుస కడుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ముఖేష్ అంబానీ, నీతా అంబానీల గారాల పట్టి ఇషా అంబానీ, పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్ ఎంగేజ్మెంట్ ఇటలీ లేక్ కోమో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్లో వీరి వివాహ వేడుక జరగనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకూ దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లి పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో నిన్న రాత్రి అంబానీ కుటుంబ సభ్యులు ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయకుని ఆలయాన్ని సందిర్శించారు. ఇషా - పిరమిల్‌ల తొలి వివాహ ఆహ్వాన పత్రికను వినాయకుని పాదాల చెంత ఉంచి ఎటువంటి విఘ్నాలు లేకుండా తమ కుమార్తె వివాహం జరగాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముకేష్ అంబానీ దంపతులతో పాటు వారి కుమారుడు అనంత్ అంబానీ.. ముకేష్ అంబానీ తల్లి కోకిలా బెన్ కూడా హాజరయ్యారు. గతంలో ముకేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ - శ్లోకా మెహతాల తొలి నిశ్చితార్థపు ఆహ్వాన పత్రికను కూడా ఇదే ఆలయంలో ఉంచి పూజలు నిర్వహించారు. -
ఘనంగా ఆకాశ్ నిశ్చితార్థం
ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ నిశ్చితార్థం శనివారం రాత్రి ముంబైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు, బాలీవుడ్, క్రీడ, పారిశ్రామిక రంగ ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర మంత్రులు సురేశ్ ప్రభు, మనోజ్ సిన్హా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ (కుటుంబ సమేతంగా), ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, పార్టీ నేత ప్రఫుల్ పటేల్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆనంద్ శర్మ, దిగ్విజయ్ సింగ్, మాజీ ఎంపీ ప్రియాదత్ తదితర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వ్యాపార రంగం నుంచి రతన్ టాటా, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, కోటక్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఉదయ్ కోటక్, ఆదిత్యా బిర్లా గ్రూపు చైర్మన్ కుమార్ మంగళం బిర్లా, జీ గ్రూపు చైర్మన్ సుభాష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. దక్షిణ ముంబైలో వధువు శ్లోక నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. బాలీవుడ్ నుంచి షారుక్ ఖాన్ (భార్య గౌరీతో కలిసి), రేఖ, అనిల్ కపూర్, రణ్‌బీర్ కపూర్, విద్యా బాలన్, మాధుర్ భండార్కర్, విదూ వినోద్ చోప్రా, జావెద్ అక్తర్‌లు క్రీడా రంగం నుంచి సచిన్, హర్భజన్, జహీర్ ఖాన్ తదితరులు ఈ నిశ్చితార్థ కార్యక్రమం విందుకు హాజరయ్యారు. వీరి పెళ్లి డిసెంబర్లో జరగొచ్చని తెలుస్తోంది. -
అత్యంత శక్తిమంతుల్లో
న్యూయార్క్: ప్రపంచంలోని అత్యంత శక్తిమంతులతో కూడిన ఫోర్బ్స్ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీకి 9వ స్థానం దక్కింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను అధిగమించి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తొలిసారి అగ్రస్థానం దక్కించుకున్నారు. ప్రపంచ గతిని మార్చిన 75 మంది ప్రముఖులతో 2018 ఏడాదికి ఫోర్బ్స్ ఈ జాబితాను వెలువరించింది. మోదీతో పాటు జాబితాలో చోటు దక్కించుకున్న మరో భారతీయుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ(32వ ర్యాంకు), ఫేస్బుక్ సీఈఓ జుకర్‌బర్గ్(13), బ్రిటన్ ప్రధాని థెరిసా మే(14), చైనా ప్రధాని లీకెకియాంగ్(15), యాపిల్ సీఈఓ టిమ్ కుక్(24) కన్నా మోదీ ముందంజలో ఉన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు 40వ స్థానం దక్కింది. ‘ఈ భూమ్మీద మొత్తం 7.5 బిలియన్ల మంది జీవిస్తున్నారు. అందులో ఈ 75 మంది ప్రపంచ గతిని మార్చారు. ప్రతి 100 మిలియన్ల మందికి ఒకరి చొప్పున ఈ ఏడాది అత్యంత శక్తిమంతుల జాబితాను రూపొందించాం’ అని ఫోర్బ్స్ వ్యాఖ్యానించింది. భారత్‌లో మోదీకి ఆదరణ కొనసాగుతోందన్న ఫోర్బ్స్.. 2016 నాటి నోట్లరద్దు నిర్ణయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. జియో సేవలు ప్రారంభించిన రిలయన్స్ భారత టెలీ మార్కెట్లో చవక టారిఫ్‌ల యుద్ధానికి తెరతీసిందని పేర్కొంది. -
ఆసియాలో ముకేశ్ ఫ్యామిలీయే రిచ్చ్చ్!
న్యూఢిల్లీ: సంపదలో ముకేశ్ అంబానీ ఖ్యాతి దేశం దాటి ఖండాంతరాల్లో మారుమోగుతోంది. ఇప్పటిదాకా ఇండియాలో అత్యంత సంపన్నుడిగా ఉంటూ వస్తున్న ముకేశ్ అంబానీ... ఇపుడు ఆసియాలోనూ ఆ ఘనత సొంతం చేసుకున్నారు. ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన తాజా జాబితాలో ఆసియాలోనే అత్యంత సంపన్న కుటుంబంగా ముకేశ్ అంబానీ ఫ్యామిలీ నిలిచింది. ఈ కుటుంబం తాలూకు సంపద విలువ 19 బిలియన్ డాలర్ల పెరుగుదలతో ఏకంగా 44.8 బిలియన్ డాలర్లకు ఎగిసింది. దీంతో శాంసంగ్ సామ్రాజ్యాన్ని స్థాపించిన కొరియాకు చెందిన లీ కుటుంబం రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. నిజానికి ఇక్కడ లీ కుటుంబ సంపద కూడా ఏమీ తగ్గలేదు. 11.2 బిలియన్ డాలర్ల మేర పెరుగుదలతో 40.8 బిలియన్ డాలర్లకు చేరింది. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ షేరు ధర గతేడాదితో పోలిస్తే 75%మేర లాభపడింది. కానీ వీరి సంపద కన్నా ముకేశ్ అంబానీ కుటుంబ సంపద జెట్ స్పీడ్‌లో పెరిగిపోయింది. ఇక హాంగ్‌కాంగ్‌కు చెందిన క్వాక్ కుటుంబం మూడో స్థానంలో ఉంది. వీరి నికర సంపద విలువ 40.4 బిలియన్ డాలర్లు. ఆసియాలోని అత్యంత సంపన్న రియల్ ఎస్టేట్ కుటుంబం ఇది. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ సన్ హంగ్ కై ప్రాపర్టీస్ వీరిదే. ప్రముఖ బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన ‘ఆసియాలోని టాప్–50 అత్యంత ధనిక కుటుంబాల జాబితా–2017’లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం.. ►టాప్–10లో భారత్ నుంచి ముకేశ్ అంబానీ కుటుంబం మాత్రమే స్థానం పొందింది. అయితేనేం!! జాబితాలో ఎక్కువ కుటుంబాలు ఇండియా నుంచే ఉన్నాయి. ►జాబితాలో భారత్ నుంచి మొత్తంగా 18 కుటుంబాలు స్థానం దక్కించుకున్నాయి. వీటిల్లో ప్రేమ్‌జీ కుటుంబం (19.2 బిలియన్ డాలర్లు–11వ స్థానం), హిందుజా కుటుంబం (18.8 బిలియన్ డాలర్లు–12వ స్థానం), మిట్టల్ కుటుంబం (17.2 బిలియన్ డాలర్లు–14వ స్థానం), మిస్త్రీ కుటుంబం (16.1 బిలియన్ డాలర్లు–16వ స్థానం), బిర్లా కుటుంబం (14.1 బిలియన్ డాలర్లు–19వ స్థానం) తదితరులున్నారు. ►జాబితాలోని 50 కుటుంబాల మొత్తం సంపద విలువ 699 బిలియన్ డాలర్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఇందులో దాదాపు 200 బిలియన్ డాలర్లమేర పెరుగుదల నమోదయ్యింది. ►జాబితాలోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఒక కుటుంబం సంపద విలువ కనీసం 5 బిలియన్ డాలర్లు ఉండాలి. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.32,500 కోట్ల పైమాటే!!. -
ఆసియా కుబేరుడు ముకేశ్
-
ఆసియా కుబేరుడు ముకేశ్: ఫోర్బ్స్
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ సామ్రాజ్యాధినేత ముకేశ్ అంబానీ ఆసియా కుబేరుడిగా అవతరించారు. చైనాకు చెందిన హు కా యాన్‌ను అధిగమించి ఆయనీ ఘనత సొంతం చేసుకున్నారు. ఆర్ఐఎల్ షేరు బుధవారం 1.22 శాతం పెరగడంతో ముకేశుడి వ్యక్తిగత సంపద విలువ ఒక్కరోజే 466 మిలియన్ డాలర్ల మేర (రూ.3,000) పెరిగింది. దీంతో 42.1 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపద విలువతో (రూ.2.7 లక్షల కోట్లు) ఆసియా కుబేరుడిగా ముకేశ్ అవతరించారు. చైనా ఈవర్‌గ్రాండ్ గ్రూపు చైర్మన్ హు కా యాన్ సంపద బుధవారం నాటికి 1.28 బిలియన్ డాలర్ల మేర తగ్గి 40.6 బిలియన్ డాలర్లు (రూ.2.60 లక్షల కోట్లు) వద్ద ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ముకేశుడు 14వ స్థానంలో ఉన్నట్టు ఫోర్బ్స్ సంస్థ తెలిపింది. ఎయిర్టెల్ అధినేత సునీల్‌భారతీ మిట్టల్ కూడా తన సంపద విలువను 751 మిలియన్ డాలర్లు పెంచుకున్నారు. ఆయన మొత్తం సంపద విలువ 10.9 బిలియన్ (రూ.70,000 కోట్లు)డాలర్లుగా ఉంది. -
జియో తరువాతి డాటా ప్లాన్ ఏంటి?
న్యూడిల్లీ: రిలయన్స్ జియో సంచలన ఆఫర్ ముగిసిన తరువాత డాటా చార్జ్ ఎంత వసూలు చేయనుందనే దానిపై ఊహాగానాలు భారీగానే నెలకొన్నాయి. ప్రస్తుత హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ముగిసిన తరువాత డాటా ప్లాన్ రూ.100గా ఉండనుందని వార్తలు వెలువడుతున్నాయి. టెలికాం దిగ్గజాలకు షాకిస్తూ ఆఫర్లను అందిస్తున్న జియో ఫ్రీ ఆఫర్ ముగిసిన తరువాత డేటా వినియోగానికి రూ.100 వసూలు చేయవచ్చని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. అపరిమిత కాలింగ్, ఉచిత డ్యాటా అంటూ భారతీయ టెలికాం రంగంలోకి రియలన్స్ జియో ఇన్ఫోకాం దూసుకువ చ్చింది. గత డిసెంబర్‌తో ముగిసిన ఈ ఆఫర్ ను హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ గా మార్చి 31, 2017 వరకు పొడిగించింది. మార్చి తరువాత ఉచిత డాటా ప్లాన్ రూ.100 గా నిర్ణయించనుందట. మరోవైపు ఈ ఫ్రీ ఆఫర్ ను జూన్ 30వరకు పొడిగించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. కాగా ఆవిష్కరించిన మూడు నెలల్లో ఫేసు బుక్ , వాట్సాప్, స్కైప్ లాంటి సామాజిక నెట్వర్కింగ్ సైట్లకు ధీటుగా యూజర్లను సొంతం చేసుకుంది జియో. 72 మిలియన్లకు పై చందాదారులను ఆకర్షించిందని ఆర్ఐఎల్ చైర్మన్ ముఖేష్ అంబానీ గత డిసెంబర్ లో ప్రకటించారు. అంతేకాదు 100 మిలియన్ల లక్ష్యంగా ముందుకుపోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. సుమారు రూ .2 లక్షల కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఎంట్రీ ఇచ్చిన జియో ఇతర టెల్కోలను తారిఫ్‌వార్ లో అనివార్యంగా లాక్కొచ్చింది. మరి ఈ రూ. 100 ల డాటా ప్లాన్ ఇతర కంపెనీలను ఇరకాటంలో పెట్టనుందా.. వేచి చూడాలి.