రిలయన్స్ ఇండస్ట్రీస్ సామ్రాజ్యాధినేత ముకేశ్ అంబానీ ఆసియా కుబేరుడిగా అవతరించారు. చైనాకు చెందిన హు కా యాన్‌ను అధిగమించి ఆయనీ ఘనత సొంతం చేసుకున్నారు. ఆర్‌ఐఎల్ షేరు బుధవారం 1.22 శాతం పెరగడంతో ముకేశుడి వ్యక్తిగత సంపద విలువ ఒక్కరోజే 466 మిలియన్ డాలర్ల మేర (రూ.3,000) పెరిగింది. దీంతో 42.1 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపద విలువతో (రూ.2.7 లక్షల కోట్లు) ఆసియా కుబేరుడిగా ముకేశ్ అవతరించారు.