భారతీయ కుబేరుడు, ప్రముఖ వ్యాపార దిగ్గజం 'ముకేశ్ అంబానీ' (Mukesh Ambani) నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ టెక్నాలజీ అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫారమ్.. భారతదేశంలో తన వెబ్3, బ్లాక్‌చెయిన్ అరంగేట్రం కోసం పాలిగాన్ ప్రోటోకాల్స్ డెవలపర్ విభాగమైన 'పాలిగాన్ ల్యాబ్స్'తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇదే సమయంలో కంపెనీ 'జియో కాయిన్' (Jio Coin) తీసుకురానున్నట్లు కొన్ని వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
జియో కాయిన్ గురించి కంపెనీ అధికారిక ప్రకటన చేయలేదు. కానీ చాలామంది జియో కాయిన్ ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మొబైల్ రీఛార్జ్‌లు లేదా రిలయన్స్ గ్యాస్ స్టేషన్‌లలో కొనుగోళ్లు వంటి సేవలకు ఉపయోగించబడుతుందని బిటిన్నింగ్ సీఈఓ 'కాశిఫ్ రాజా' తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
క్రిప్టో కరెన్సీ మీద ముకేశ్ అంబానీ చాలా సంవత్సరాలకు ముందే కన్నేశారని. ఈ రంగంలోకి అడుగుపెట్టాలని, ఓ స్పెషల్ కరెన్సీ తీసుకురావాలని భావించగా సమాచారం. ఇందులో భాగంగానే జియో కాయిన్ తీసుకు వస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. దీనికోసమే పాలిగాన్ ల్యాబ్స్‌తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు.
ఇదీ చదవండి: 40 కోట్ల జనం.. రూ.2 లక్షల కోట్ల ఆదాయం! ఎలాగో తెలుసా?
జియో కాయిన్ రావడం నిజమైతే.. క్రిప్టో కరెన్సీ(Crypto Currency)కి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఎందుకంటే ప్రపంచంలో దాదాపు 500 మిలియన్ల మంది క్రిప్టో కరెన్సీ వినియోగదారులు ఉన్నారు. అయితే జియోకు 470 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. జియో కాయిన్ అందుబాటులో వస్తే.. వీరందరి ద్రుష్టి దీనిపైన పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
🇮🇳Big Breaking News:- Jiocoin Launched On Polygon.
Reliance Jio, the world's largest mobile operator, has just surprised the crypto world by officially launching Jiocoins!
What are Jiocoins?
Jiocoins are digital tokens issued on Polygon.
Jiocoins is a mechanism to reward… pic.twitter.com/MNRb5HGa08— Kashif Raza (@simplykashif) January 16, 2025
Comments
Please login to add a commentAdd a comment