భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబం ఏది అనగానే వెంటనే గుర్తొచ్చేది 'ముఖేష్ అంబానీ' ఫ్యామిలీ. అంటే ఇందులో చాలామందికి తెలిసిన పేర్లు నీతా, ఇషా, అనంత్ అండ్ ఆకాష్ అంబానీ మాత్రమే. కానీ వీరి కుటుంబానికి చెందిన మరో బిలినీయర్ 'అర్జున్ కొఠారి' (Arjun Kothari) ఒకరున్నారనే సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో అర్జున్ కొఠారి ఎవరు? ఈయన మొత్తం సంపద ఎంత? అనే మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
ముఖేష్ అంబానీ సోదరి 'నీనా కొఠారి' కొడుకే ఈ అర్జున్ కొఠారి. అంటే ఈయన స్వయానా ముఖేష్ అంబానీ మేనల్లుడే. ఇతని మొత్తం ఆస్తుల విలువ ఏకంగా రూ. 845 కోట్లు కావడం గమనార్హం. ఇంతపెద్ద మొత్తంలో ఆస్తులున్నప్పటికీ ఈయన గురించి చాలామందికి తెలియకపోవడం కొంత ఆశ్చర్యమనే చెప్పాలి.
కొఠారీ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో ఉన్న అర్జున్ కొఠారి.. అమెరికాలోని మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ రొటేషన్ ప్రోగ్రామ్‌లో జనరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్‌తో సీనియర్ స్పెషలిస్ట్ హోదాను కలిగి ఉన్నాడు.
ఇదీ చదవండి: I am not a robot: ఇది ఎందుకొస్తుంది? అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు!
వ్యాపార లావేదేవాలను చూసుకోవడానికి ముందు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ నార్త్ఈస్టన్ యూనివర్సిటీ (Bachelor of Science at Northeastern University)లో పూర్తి చేసాడు. ఆ తరువాత కుటుంబ వ్యాపారంలో అడుగుపెట్టి గొప్ప వేగంగా అభివృద్ధి చెందాడు. ఆ తరువాత ప్రముఖ వ్యాపారవేత్తలైన అంజలి & రాజేన్ మరివాలా కుమార్తె ఆనందిత మరివాలాను వివాహం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment