ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న 'ఇలాన్ మస్క్' (Elon Musk) ఇప్పుడు రెండవ స్థానానికి చేరుకున్నారు. మొదటి స్థానంలో గ్లోబల్ లగ్జరీ గూడ్స్ బ్రాండ్ కంపెనీ ఎల్‌వీఎంహెచ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ అండ్ సీఈఓ 'బెర్నార్డ్ ఆర్నాల్ట్' (Bernard Arnault) నిలిచారు.
ఫోర్బ్స్ ప్రకారం.. బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబం నికర విలువ శుక్రవారం నాడు 23.6 బిలియన్ డాలర్లు పెరిగి, మొత్తం సంపద 207.8 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఆర్నాల్డ్ అత్యంత సంపన్నమైన వ్యక్తిగా మస్క్‌ను మించిపోయాడు. మరోవైపు మస్క్ సంపద 204.5 బిలియన్ డాలర్లుగా ఉంది.
బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఇలాన్ మస్క్ మొదటి రెండు స్థానాల్లో నిలువగా.. జెఫ్ బెజోస్, లారీ ఎల్లిసన్, మార్క్ జుకర్‌బర్గ్‌లు వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.
ఇలాన్ మస్క్ టెస్లా షేర్లు గత గురువారం ఏకంగా 13 శాతం పతనమవ్వడంతో.. 18 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైపోయింది. ఇదే సమయంలో ఆర్నాల్ట్ షేర్స్ బాగా పెరిగాయి. దీంతో మస్క్ ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి స్థానం కోల్పోవాల్సి వచ్చింది.
ఇదీ చదవండి: ఆ వ్యాఖ్యలే కొంప ముంచాయా! ఒకేరోజు రూ.6.64 లక్షల కోట్లు లాస్..
ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ ముఖేష్ అంబానీ 104.4 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో 11 వ స్థానం, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 75.7 బిలియన్ డాలర్ల సంపదతో 16వ స్థానం పొందినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment