బిజినెస్ రియాలిటీ సిరీస్ సృష్టికర్తలను పరిచయం చేసే 'షార్క్ ట్యాంక్ ఇండియా' (Shark Tank India) మూడవ సీజన్ కోసం సిద్ధమవుతోంది. ఇందులో అప్‌గ్రాడ్ కో-ఫౌండర్ వ్యవస్థాపకుడు అండ్ ఛైర్మన్ 'రోనీ స్క్రూవాలా' ప్యానెల్‌లో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ బిజినెస్ మ్యాన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఎవరీ రోనీ స్క్రూవాలా..
బాలీవుడ్‌లో అత్యంత ధనవంతుడైన రోనీ స్క్రూవాలా ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత. ప్రారంభంలో టూత్ బ్రష్ తయారీ కంపెనీ స్థాపించిన స్క్రూవాలా.. ఆ తరువాత కేబుల్ టీవీ రంగంలో అడుగుపెట్టాడు. ఇది అతి తక్కువ సమయంలోనే భారతదేశంలోని అనేక నగరాల్లో బాగా విస్తృతి చెందింది.
1990లో కేవలం రూ. 37000 పెట్టుబడితో స్క్రూవాలా స్థాపించిన UTV అనేక ప్రజాదరణ పొందిన కార్యక్రమాలను నిర్వహించి, టెలివిజన్ రంగంలో తనకు తానే సాటిగా నిరూపించుకుంది. ఆ తరువాత రోనీ స్క్రూవాలా.. జోధా అక్బర్, ఫ్యాషన్, బర్ఫీ, చెన్నై ఎక్స్‌ప్రెస్ వంటి ఎన్నో చిత్రాలకు ప్రొడ్యూసర్ అయ్యాడు.
2012లో రోనీ స్క్రూవాలా తన కంపెనీ వాటాను ఓకే బిలియన్ డాలర్లకు డిస్నీకి విక్రయించారు. ఆ తరువాత ఆర్‌ఎస్‌విపి మూవీస్ స్థాపించి ఉరి, కేదార్‌నాథ్ చిత్రాలను నిర్మించారు. స్క్రూవాలా రంగ్ దే బసంతికి మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు జాతీయ అవార్డును గెలుచుకున్నాడు
ఇదీ చదవండి: 2500 యాప్స్ తొలగించిన గూగుల్ - లోక్‌సభలో నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
అప్‌గ్రాడ్ కంపెనీ
స్క్రూవాలా కేవలం సినీ నిర్మాత మాత్రమే కాదు, అతడు UpGrad ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ కంపెనీ కో-ఫౌండర్ కూడా. సుమారు 2.25 బిలియన్ డాలర్ల విలువైన ఈ కంపెనీని రోనీ స్క్రూవాలా.. మయాంక్ కుమార్, ఫాల్గం కొంపల్లి, రవిజోత్ చుగ్ వంటి వారితో జతకట్టి స్టార్ట్ చేశారు. ప్రస్తుతం రోనీ స్క్రూవాలా నికర విలువ రూ. 12800 కోట్లు ($1.55 బిలియన్) అని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment