
ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సలీం అక్తర్ (82) మృతి చెందారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. దీంతో పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
(ఇదీ చదవండి: అల్లు అర్జున్ కోసం 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి?)
1980-90ల్లో ఆమిర్ ఖాన్, బాబీ డియోల్ తో వరస సినిమాలు నిర్మించిన ఈయన.. మంచి నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1997లో రాణీ ముఖర్జీని 'రాజా కీ ఆయేగా బరాత్' సినిమాతో, 2005లో తమన్నాని 'చాంద్ సా రోషన్ చెహ్రా' మూవీతో హిందీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈయనే.
అలా పలువురు హీరోయిన్లకు అచ్చొచ్చిన నిర్మాతగా పేరొందిన సలీం అక్తర్ ఇప్పుడు అనారోగ్య సమస్యలతో చనిపోయారు. బుధవారం (ఏప్రిల్ 9) మధ్యాహ్నం ఈయన అంత్యక్రియలు జరగనున్నాయి. సలీంకు భార్య, కొడుకు ఉన్నారు.
(ఇదీ చదవండి: రామ్ చరణ్ వీడియో.. ఏది నిజమో తెలియట్లేదు!)