
బరువు తగ్గడం అనేది పెద్ద టాస్కే. అదీ 50 దాటిన తరువాత అధిక బరువును తగ్గించు కోవడానికి చాలా కృషి, పట్టుదల, ప్రేరణ కావాలి. ఇతర ఆరోగ్య సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని వెయిట్ లాస్ జర్నీని ప్లాన్ చేసుకోవాలి. అలా ప్రముఖ నిర్మాత,సల్మాన్ ఖాన్ స్నేహితుడు, సాజిద్ నదియాడ్ వాలా బరువును తగ్గించుకుని ఫిట్‌గా మారిన తీరు అభిమానులను ఆశ్చర్యపర్చింది. అతని బాడీలోని భారీ పరివర్తన, బాగా బరువు తగ్గి స్మార్ట్‌గా తయారైన అతడి ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి..
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన 'సికందర్' చిత్రానికి సాజిద్ నిర్మాత. ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో సాజిద్ ఫేస్ ఆఫ్ ది ఇంటర్నెట్‌గా మారిపోయాడు. అతని భార్య వార్దా ఖాన్ బాగా సన్నగా ఉన్న భర్త సాజిద్ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో ఆయన ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చాడు. రిప్‌డ్ జీన్స్, డెనిమ్ జాకెట్, బటన్స్ లేని షర్ట్‌లో అస్సలు గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సాజిద్‌ను చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా 59 ఏళ్ల వయసులో, ఆరోగ్యంగా, సంతోషంగా, ఫిట్‌గా కనిపిస్తూ అందరికీ ప్రేరణగా నిలుస్తున్నాడు. అభిమానులు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

“ఎంత సెక్సీ లుక్… అబ్ తో ఫిల్మ్ మే హీరో బన్నే కా సమయ్ ఆ గయా హై” (సెక్సీగా ఉన్నారు.. ఇక సినిమాల్లో హీరో ఐపోయే సమయం వచ్చింది.)"అప్నా అస్లీ సికందర్ యే హై (మా నిజమైన సికందర్)" , ‘‘యువ హీరోలకు కఠినమైన పోటీ...” ,“21 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నారు! జవానీ కా రాజ్ క్యా హై?” ( ఈ యంగ్ లుక్ వెనుక రహస్యం ఏమిటి?), తదితర వ్యాఖ్యలు వెల్లువెత్తాయి.
కాగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సాజిద్ నిర్మించిన ‘సికందర్’ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈద్‌కు విడుదల కానున్న ఈ మూవీలో రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్, ప్రతీక్ బబ్బర్, సత్యరాజ్ , శర్మన్ జోషి ప్రధాన పాత్రలు పోషించారు.
50ల తరువాత బరువు తగ్గడం, జాగ్రత్తలు
శరీరం వయస్సు పెరిగే కొద్దీ, కండరాలు, అవయవాలు, ఎముకలు ధృడత్వాన్ని కోల్పోతూ ఉంటాయి. 50 ఏళ్లు దాటాకి ఇది మరీ పెరుగుతుంది. అందుకే ఆహారం, వ్యాయామం , జీవనశైలిపై దృష్టి పెట్టడం చాలా అవసరం అవుతుంది. ఈక్రమంలో పురుషులు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలను పరిశీలిద్దాం
హైడ్రేషన్: 60కి సమీపిస్తున్న తరుణంలో వెయట్ లాస్ అంటే చాలా ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి.ముఖ్యంగా హైడ్రేషన్ అనే గోల్డెన్ టిప్‌ను అస్సలు మిస్ చేయకూడదు. ఇది శరీరాన్ని ఫిట్‌గా ఉంచి, మూత్రపిండాల పనితీరుకు సహాయపడుతుంది, టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది.
ఆహారం: కండరాల బలం కోసం చికెన్, గుడ్డు, పనీర్, కాయధాన్యాలు వంటి ప్రోటీన్లున్న ఫుడ్ తీసుకోవాలి. జీర్ణక్రియకోసం తృణధాన్యాలు, కరిగే ఫైబర్, పండ్లు , కూరగాయలపై దృష్టి పెట్టాలి. ఆరోగ్యకరమైన మెటబాలిజం రేటుపై శ్రద్ధపెట్టాలి. .
తీపి పదార్థాలకు దూరంగా : తీపి పానీయాలు, చక్కెర కలిగిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఫుడ్‌కు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. లేదంటే అరుగుదల సమస్యలు, కొవ్వు పేరుకు పోవడం లాంటి సమస్యలొస్తాయి.
వ్యాయామం: ప్రతి వ్యక్తికి శారీరక శ్రమ చాలా ముఖ్యం. బాడీలో అన్ని ఎ ముకలు, కీళ్ల కీళ్ల స్వేచ్ఛా కదలికల నిమిత్తం క్రమం తప్పకుండా వ్యాయామం చాలా అవసరం. ఇది మొత్తం కండరాల, ఎముక బలానికి కూడా సహాయపడుతుంది.
నిద్రకు ప్రాధాన్యత: సరియైన నిద్ర అనేది మరో ప్రధాన మైన నియమం. నాణ్యమైన 8-9 గంటల నిద్ర చాలా ముఖ్యం. ఇది శరీరం కోలుకోవడానికి,విశ్రాంతికి సహాయపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment