ఆ బడా నిర్మాత కొడుకుతో ‘గని’ మూవీ హీరోయిన్‌ ప్రేమయాణం.. | Is Saiee Manjrekar Dating With Bollywood Star Producer Son Subhan Nadiadwala | Sakshi
Sakshi News home page

Saiee Manjrekar: ఆ బడా నిర్మాత కొడుకుతో వరుణ్‌ తేజ్‌హీరోయిన్‌ ప్రేమయాణం..

Published Fri, Feb 25 2022 4:05 PM | Last Updated on Fri, Feb 25 2022 5:09 PM

Is Saiee Manjrekar Dating With Bollywood Star Producer Son Subhan Nadiadwala - Sakshi

‘దబాంగ్‌ 3’తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సయి మంజ్రేకర్‌ ఆ వెంటనే తెలుగులో వరస ఆఫర్లు అందుకుంది. ప్రస్తుతం మెగా హీరో వరుణ్‌ తేజ్‌ గని మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. గనితో పాటు అడవి శేష్‌ మేజర్‌లో కూడా సయి హీరోయిన్‌గా నటించింది. ఇదిలా ఉంటే ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజులకే ఈ భామ ప్రేమలో పడిందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

చదవండి: ఛీఛీ ఇలాంటి చెత్త వీడియోలో నటించడమేంటి, కాస్తా చూసుకో: కీర్తిపై దారుణమైన ట్రోల్స్‌

తొలి చిత్రంతోనే కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌తో ‘దబాంగ్‌ 3’ నటించే చాన్స్‌ కొట్టేసిన సయీ.. బాలీవుడ్‌కు చెందిన బడా నిర్మాత కొడుకుతో ప్రేమలో మునిగితేలుతున్నట్లు బి-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరద్దరు జంటగా ముంబైలో పలుమార్లు లంచ్‌, డిన్నర్‌ డేట్స్‌కు వెళుతూ మీడియా కెమెరాలకు చిక్కారు. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రీసెంట్‌గా బుధవారం సాయంత్రం కూడా వీరిద్దరూ ఓ రెస్టారెంట్‌కు వెళ్లి మీడియా కంట పడ్డారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్ కూతురు సయి మంజ్రేకర్ ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.

చదవండి: చిన్నారులపై అసభ్యకర సన్నివేశాలు, ప్రముఖ దర్శకుడిపై కేసు

ఈ క్రమంలో  స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ సాజిద్ నడియాద్వాలా కుమారుడు సుభాన్ నడియాద్వాలాతో చట్టాపట్టాలేసుకు తిరగడంతో వీరిద్దరి మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఇరు కుటుంబాల మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలోనే విరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని చెబుతున్నాయి సినీ వర్గాలు. మరి వీరి ప్రేమ వ్యవహరం పెళ్లి పీటల వరకు వెళుతుందో లేదో చూడాలి. ఇదిలా ఉంటే సుభాన్ త్వరలోనే డైరెక్టర్‌గా డెబ్యూ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement