Rumour Relationship
-
హీరోయిన్ కోసం 16 గంటలు వెయిట్ చేసిన క్రికెటర్ రిషబ్ పంత్ !
Cricketer Rishabh Pant Weight For 16 Hours To Meet Urvashi Rautela: హీరోహీరోయిన్ల మధ్య ప్రేమయణాలు, విడుపోవడాలు, గాసిప్స్ బాలీవుడ్ ఇండస్ట్రీకి సర్వసాధారణమే. చిత్ర పరిశ్రమకు చెందినవారినే కాకుండా క్రికెటర్లు, వ్యాపారవేత్తలతో డేటింగ్ చేసి తర్వాత పెళ్లీ పీటలు ఎక్కిన హీరోయిన్లను కూడా చూశాం. కాగా కొందరి సెలబ్రిటీల్లో వచ్చిన ప్రేమ, పెళ్లి గాసిప్స్ సైతం పుకార్లులానే మిగిలిపోయాయి. ఇదిలా ఉంటే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా, భారత క్రికెటర్ రిషబ్ పంత్‌తో డేటింగ్లో ఉన్నట్లు గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై వారిద్దరూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా వీరిద్దరికి సంబంధంచిన ఒక విషయం బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఊర్వశి రౌతేలాను కలవడం కోసం రిషబ్ పంత్ సుమారు 16 గంటలు ఎదురు చూసినట్లు సమాచారం. ఊర్వశి తన సినిమా ప్రాజెక్ట్‌లలో ఒకదాని కోసం వారణాసిలో షూటింగ్ చేస్తుందట. అత్యంట టైట్ షెడ్యూల్లో ఊర్వశి ఉందట. అప్పుడు ఊర్వశి షూటింగ్లో ఉండటం తెలుసుకున్న రిషబ్, ఊర్వశిని కలిసేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అలా వెళ్లిన రిషబ్ ఆమెకోసం సుమారు 16-17 గంటలు నిరీక్షించినట్లు బీటౌన్ వర్గాల నుంచి సమాచారం. కాగా వీరిద్దరికి కలిసి ఉన్న ఒక్క ఫొటో కూడా ఇప్పటికీ బయటకు రాలేదు. అయితే ఊర్వశి, రిషబ్ నిజంగా ప్రేమలో ఉన్నట్లయితే వారిద్దరూ కలిసి ఉన్న ఒక్క ఫొటో అయినా బహిర్గతం అయ్యేది కదా! అని బాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయట. -
ఆ బడా నిర్మాత కొడుకుతో ‘గని’ మూవీ హీరోయిన్ ప్రేమయాణం..
‘దబాంగ్ 3’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సయి మంజ్రేకర్ ఆ వెంటనే తెలుగులో వరస ఆఫర్లు అందుకుంది. ప్రస్తుతం మెగా హీరో వరుణ్ తేజ్ గని మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. గనితో పాటు అడవి శేష్ మేజర్‌లో కూడా సయి హీరోయిన్గా నటించింది. ఇదిలా ఉంటే ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజులకే ఈ భామ ప్రేమలో పడిందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: ఛీఛీ ఇలాంటి చెత్త వీడియోలో నటించడమేంటి, కాస్తా చూసుకో: కీర్తిపై దారుణమైన ట్రోల్స్ తొలి చిత్రంతోనే కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో ‘దబాంగ్ 3’ నటించే చాన్స్ కొట్టేసిన సయీ.. బాలీవుడ్‌కు చెందిన బడా నిర్మాత కొడుకుతో ప్రేమలో మునిగితేలుతున్నట్లు బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరద్దరు జంటగా ముంబైలో పలుమార్లు లంచ్, డిన్నర్ డేట్స్‌కు వెళుతూ మీడియా కెమెరాలకు చిక్కారు. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రీసెంట్గా బుధవారం సాయంత్రం కూడా వీరిద్దరూ ఓ రెస్టారెంట్‌కు వెళ్లి మీడియా కంట పడ్డారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్ కూతురు సయి మంజ్రేకర్ ఇప్పుడిప్పుడే హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. చదవండి: చిన్నారులపై అసభ్యకర సన్నివేశాలు, ప్రముఖ దర్శకుడిపై కేసు ఈ క్రమంలో స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ సాజిద్ నడియాద్వాలా కుమారుడు సుభాన్ నడియాద్వాలాతో చట్టాపట్టాలేసుకు తిరగడంతో వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఇరు కుటుంబాల మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలోనే విరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని చెబుతున్నాయి సినీ వర్గాలు. మరి వీరి ప్రేమ వ్యవహరం పెళ్లి పీటల వరకు వెళుతుందో లేదో చూడాలి. ఇదిలా ఉంటే సుభాన్ త్వరలోనే డైరెక్టర్‌గా డెబ్యూ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. -
అన్ ఫాలో అలియా.. అఫైర్ కన్ఫర్మ్?
సాక్షి, ముంబై: బాలీవుడ్ లో లాంగ్ రిలేషన్లు ఎక్కువ కాలం కొనసాగుతాయన్న గ్యారెంటీ లేకుండా పోతుంది. అయితే దీపిక-రణ్వీర్ లాంటి జంటపై రూమర్లు వచ్చినప్పటికీ ఎప్పటికప్పుడు వాటిని తమ ప్రేమతో పటాపంచల్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో బాలీవుడ్ జంట విడిపోబోతున్నారన్న వార్త చక్కర్లు కొడుతోంది. తన తొలిచిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో నటి అలియా భట్ డీప్ రిలేషన్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఒక హీరోయిన్ మూలంగా ఏడాదిగా వీరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయని, ఇప్పుడు బ్రేకప్ స్టేజీకి చేరిపోయారని ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనం రాసింది. శ్రీలంక బ్యూటీ జాక్వైలిన్ ఫెర్నాండేజ్‌తో సిద్ధార్థ్ డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు రేగుతున్నాయి. వీరిద్దరు నటించిన ఏ జెంటిల్ మెన్ చిత్రం విడుదల విషయం తెలిసిందే. గతేడాది ఆ చిత్రం ప్రారంభమైన దగ్గరి నుంచే ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. చిత్రం ప్రమోషన్ టైంలో కూడా టీవీ ఛానెళ్లలో కాస్త అతి క్లోజ్ నెస్ ప్రదర్శించారు. జాక్వెలిన్‌తో అఫైర్ మూలంగానే అలియాను సిద్ధార్థ్ దూరం పెడుతున్నాడని, తరచూ ఇద్దరి మధ్య గొడవలు కూడా అయ్యాయని ఇలా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ మధ్య జాక్వెలిన్.. అలియాను ట్విట్టర్ లో అన్ ఫాలో అయ్యిందంట. దీంతో వీరి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుందని అర్థమౌతోంది. మరి ఈ బ్రే..క...ప్ వార్తలపై ఆ ప్రేమ జంట ఎలా స్పందిస్తుందో చూడాలి.