అన్‌ ఫాలో అలియా.. అఫైర్‌ కన్ఫర్మ్? | Unfollows Alia Twitter Jacqueline Confirm's Affair with Siddarth | Sakshi
Sakshi News home page

అన్‌ ఫాలో అలియా.. అఫైర్‌ కన్ఫర్మ్?

Sep 7 2017 2:05 PM | Updated on Aug 25 2018 6:37 PM

బాలీవుడ్‌లో ప్రేమ జంటలు ఎక్కువ కాలం సంబంధాలను కొనసాగించలేకపోతున్నాయి. మధ్యలో...

సాక్షి, ముంబై: బాలీవుడ్ లో లాంగ్ రిలేషన్లు ఎక్కువ కాలం కొనసాగుతాయన్న గ్యారెంటీ లేకుండా పోతుంది. అయితే దీపిక-రణ్‌వీర్‌ లాంటి జంటపై రూమర్లు వచ్చినప్పటికీ ఎప్పటికప్పుడు వాటిని తమ ప్రేమతో పటాపంచల్‌ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో  ఇప్పుడు మరో బాలీవుడ్ జంట విడిపోబోతున్నారన్న వార్త చక్కర్లు కొడుతోంది. 
 
తన తొలిచిత్రం స్టూడెంట్ ఆఫ్‌ ది ఇయర్ హీరో సిద్దార్థ్‌ మల్హోత్రాతో నటి అలియా భట్‌ డీప్ రిలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఒక హీరోయిన్ మూలంగా ఏడాదిగా వీరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయని, ఇప్పుడు బ్రేకప్ స్టేజీకి చేరిపోయారని ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనం రాసింది. శ్రీలంక బ్యూటీ జాక్వైలిన్ ఫెర్నాండేజ్‌తో సిద్ధార్థ్ డేటింగ్‌ చేస్తున్నట్లు పుకార్లు రేగుతున్నాయి. వీరిద్దరు నటించిన ఏ జెంటిల్‌ మెన్‌ చిత్రం విడుదల విషయం తెలిసిందే. 
 
గతేడాది ఆ చిత్రం ప్రారంభమైన దగ్గరి నుంచే ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. చిత్రం ప్రమోషన్‌ టైంలో కూడా టీవీ ఛానెళ్లలో కాస్త అతి క్లోజ్‌ నెస్ ప్రదర్శించారు. జాక్వెలిన్‌తో అఫైర్ మూలంగానే అలియాను సిద్ధార్థ్ దూరం పెడుతున్నాడని, తరచూ ఇద్దరి మధ్య గొడవలు కూడా అయ్యాయని ఇలా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ మధ్య జాక్వెలిన్‌.. అలియాను ట్విట్టర్‌ లో అన్‌ ఫాలో అయ్యిందంట. దీంతో వీరి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుందని అర్థమౌతోంది. మరి ఈ బ్రే..క...ప్‌ వార్తలపై ఆ ప్రేమ జంట ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement