లవర్స్ మధ్య చిచ్చుపెట్టిన మరో నటి!
న్యూఢిల్లీ: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ యువ జంట రిలేషన్ ప్రమాదంలో పడింది. కరణ్ జోహర్ దర్శకత్వంలో 2012లో తెరకెక్కిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన జంట అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా. గత ఐదేళ్ల నుంచి అలియా, సిద్ధార్థ్ చాలా క్లోజ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. తరచుగా పార్టీలకు వెళ్తూ అక్కడ ఫొటోలకు ఫోజులిచ్చేవారు. అయితే తామిద్దరం ప్రేమికులమని, తమ రిలేషన్‌ను బయటపెట్టేవారు కాదు. ఇన్ని రోజులుగా సజావుగా సాగిన వీరి ప్రేమ వ్యవహారం బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది.
'కిక్' భామ, శ్రీలంక అందం జాక్వెలైన్ ఫెర్నాండేజ్‌తో కొంతకాలం నుంచి సిద్ధార్థ్ క్లోజ్‌గా మూవ్ కావడంపై ప్రేయసి అలియా ఇదివరకే వార్నింగ్ ఇచ్చింది. అయినా హీరో వ్యవహారంలో మార్పు రాలేదని ప్రియుడిపై అలిగిన ఈ ముద్దుగుమ్మ.. తాము ప్లాన్ చేసుకున్న సమ్మర్ వెకేషన్‌ను క్యాన్సల్ చేసింది. ప్రస్తుతం రీలోడెడ్ మూవీలో నటిస్తున్న సహనటి జాక్వెలైన్‌తో సిద్ధార్థ్ లైన్(గీత) దాటుతున్నాడని భావించిన ఈ చిన్నది టూర్‌ను రద్దు చేసిందని ఇండస్ట్రీ వర్గాల టాక్. జాక్వెలైన్‌తో ఇలాగే రిలేషన్ కొనసాగిస్తే బ్రేకప్ చెప్పేందుకు కూడా అలియా సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చింది. రణబీర్ కపూర్ కు జోడీగా డ్రాగన్‌లో షూటింగ్‌లో అలియా బిజీ బిజీగా ఉంది.