హీరోయిన్ కోసం 16 గంటలు వెయిట్‌ చేసిన క్రికెటర్ రిషబ్‌ పంత్‌ ! | Cricketer Rishabh Pant Weight For 16 Hours To Meet Urvashi Rautela | Sakshi
Sakshi News home page

Rishabh Pant Urvashi Rautela: హీరోయిన్ కోసం 16 గంటలు వెయిట్‌ చేసిన రిషబ్‌ పంత్‌ !

Published Sat, Mar 19 2022 4:49 PM | Last Updated on Sat, Mar 19 2022 5:24 PM

Cricketer Rishabh Pant Weight For 16 Hours To Meet Urvashi Rautela - Sakshi

Cricketer Rishabh Pant Weight For 16 Hours To Meet Urvashi Rautela: హీరోహీరోయిన్ల మధ్య ప్రేమయణాలు, విడుపోవడాలు, గాసిప్స్‌ బాలీవుడ్‌ ఇండస్ట్రీకి సర్వసాధారణమే. చిత్ర పరిశ్రమకు చెందినవారినే కాకుండా క్రికెటర్లు, వ్యాపారవేత్తలతో డేటింగ్‌ చేసి తర్వాత పెళ్లీ పీటలు ఎక్కిన హీరోయిన్లను కూడా చూశాం. కాగా కొందరి సెలబ్రిటీల్లో వచ్చిన ప్రేమ, పెళ్లి గాసిప్స్‌ సైతం పుకార్లులానే మిగిలిపోయాయి. ఇదిలా ఉంటే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా, భారత క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై వారిద్దరూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా వీరిద్దరికి సంబంధంచిన ఒక విషయం బీటౌన్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. 

ఊర్వశి రౌతేలాను కలవడం కోసం రిషబ్ పంత్ సుమారు 16 గంటలు ఎదురు చూసినట్లు సమాచారం. ఊర్వశి తన సినిమా ప్రాజెక్ట్‌లలో ఒకదాని కోసం వారణాసిలో షూటింగ్‌ చేస్తుందట. అత్యంట టైట్‌ షెడ్యూల్‌లో ఊర్వశి ఉందట. అప్పుడు ఊర్వశి షూటింగ్‌లో ఉండటం తెలుసుకున్న రిషబ్‌, ఊర్వశిని కలిసేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అలా వెళ్లిన రిషబ్‌ ఆమెకోసం సుమారు 16-17 గంటలు నిరీక్షించినట్లు బీటౌన్‌ వర్గాల నుంచి సమాచారం. కాగా వీరిద్దరికి కలిసి ఉన్న ఒక్క ఫొటో కూడా ఇప్పటికీ బయటకు రాలేదు. అయితే ఊర్వశి, రిషబ్‌ నిజంగా ప్రేమలో ఉన్నట్లయితే వారిద్దరూ కలిసి ఉన్న ఒక్క ఫొటో అయినా బహిర్గతం అయ్యేది కదా! అని బాలీవుడ్‌ వర్గాలు అనుకుంటున్నాయట. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement