Urvashi Rautela Fires On Rishabh Pant Fans Over Called Her Stalker, Details Inside - Sakshi
Sakshi News home page

Urvashi Rautela: స్టాకింగ్‌ అంటూ ఊర్వశిపై రిషబ్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌, ఘాటుగా స్పందించిన నటి

Published Thu, Oct 13 2022 6:22 PM | Last Updated on Thu, Oct 13 2022 7:37 PM

Urvashi Rautela Fires On Rishabh Pant Fans Over Called Her Stalker - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలా కొద్ది రోజులుగా తరచూ వివాదాలు, విమర్శలతో వార్తల్లో నిలుస్తుంది. టిమిండియా యంగ్‌ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ ఫ్యాన్స్‌ ప్రస్తుతం ఊర్వశిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఆమెను స్టాకర్‌ (వ్యక్తి ఇష్టం లేకుండా వెంట పడటం) అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి కారణం ఇటీవల ఆమె ఆస్ట్రేలియా వెళ్లడమే. కాగా కొద్ది రోజుల కిందట పంత్‌-ఊర్వశి మధ్య జరిగిన మాటల యుద్దం గురించి తెలిసిందే. అయితే ఊర్వశి పంత్‌కు సారీ చెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగిందనుకున్నారు. కానీ ఇంతలో ఊర్వశీ.. పంత్‌ను ఉద్ధేశిస్తూ చేసి పోస్ట్‌పై అతడి ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. 

కాగా టీ20 వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో ప్రస్తుతం టిమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే ఆమె కూడా ఆస్ట్రేలియాకు పయనమైంది.  దీంతో పంత్‌ను ఫాలో అవుతూ ఆమె ఆస్ట్రేలియా వెళ్లిందని, ఓ వ్యక్తి ఇష్టం లేకున్నా ఎలా ఫాలో అవుతారంటూ క్రికెట్‌ అభిమానులు ఊర్శశిని నిందిస్తున్నారు. ఈ క్రమంలో తనపై వస్తున్న నెగిటివిటిపై తాజాగా ఊర్వశి రౌతేలా స్పందించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస పోస్ట్స్‌ షేర్‌ చేస్తూ ట్రోలర్స్‌కి గట్టి కౌంటర్‌ ఇచ్చింది. ‘ఒకప్పుడు ఇరాన్‌, ఇప్పుడు ఇండియా. ఇది నాకే జరుగుతుంది. అందరు నన్నే నిందిస్తున్నారు. ఎందుకంటే నేనేప్పుడు ఎవరికి వ్యతిరేకంగా తప్పుడు ఆరోపణలు చేయకపోవడం వల్లే. 

ఇకనైనా నన్ను నిందించడం ఆపండి’ అంటూ స్టాప్‌బుల్లింగ్‌ఉమెన్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను జత చేసింది. అలాగే మరో పోస్ట్‌లో ఇండియన్‌ మీడియా స్టాకర్‌ అనే పదానికి అసలైన అర్థం తెలుకోవాలంటూ స్టాకర్‌ పదం నిర్వచనానికి సంబందించిన స్క్రిన్‌షాట్‌ షేర్‌ చేసింది. అనంతరం ఆస్ట్రేలియా మ్యాప్‌ షేర్‌ చేస్తూ.. ఇది ఇండియన్‌ మీడియా కోసం.. ఆస్ట్రేలియా దేశం ఎంత పెద్దగా ఉందో చూశారా?’ అంటూ భారత మీడియాను ఉద్దేశిస్తూ ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. కాగా టిమిండియా ఆస్టేలియా వెళ్లిన మరసటి రోజే ఊర్వశి రౌతేలా ఆస్ట్రేలియా పయనమైన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా వెళుతూ ఫ్లైట్‌లో దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ ‘ప్రేమ ఫాలో అవుతూ ఆస్ట్రేలియాకి’ అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేసి పంత్‌ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement