sajid nadiadwala
-
డబుల్ ధమాకా
పంజాబీ నటి సోనమ్ భజ్వా బాలీవుడ్లో డబుల్ ధమాకా కొట్టారు. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, సంజయ్‌దత్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘హౌస్‌ఫుల్ 5’. తరుణ్ మన్సుఖాని ఈ మూవీకి దర్శకుడు. ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు సోనమ్ భజ్వా. ఈ చిత్రంలో సోనమ్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా ‘హౌస్‌ఫుల్ 5’ చిత్రీకరణ పూర్తి కాకముందే మరో బాలీవుడ్ చిత్రం ‘బాఘీ 4’లో హీరోయిన్గా నటించే చాన్స్‌ను దక్కించుకున్నారు సోనమ్ భజ్వా.టైగర్ ష్రాఫ్ హీరోగా నటించనున్న ఈ సినిమాకు ఎ.హర్ష దర్శకత్వం వహించనుండగా, సంజయ్‌దత్ ఓ లీడ్ రోల్లో నటిస్తారు. ‘బాఘీ, హౌస్‌ఫుల్’.. ఈ రెండూ బాలీవుడ్లో హిట్ ఫ్రాంచైజీలే. అలాగే ఈ రెండు సినిమాలకు నిర్మాత సాజిద్ నడియాద్ వాలాయే కావడం విశేషం. ‘‘హౌస్‌ఫుల్ 5’ చిత్రీకరణ పూర్తి కాకుండానే, ‘బాఘీ 4’లో నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు సోనమ్ భజ్వా. -
పదేళ్ల తర్వాత సూపర్‌హిట్ మూవీకి సీక్వెల్.. ప్రకటించిన డైరెక్టర్!
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికందర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యాక్షన్ ఓరియటండ్ చిత్రంలో రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.అయితే అంతలోనే మరో మూవీకి సిద్ధమయ్యారు సల్మాన్ ఖాన్. గతంలో ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రం కిక్. 2014లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఆ సినిమాకు సీక్వెల్‌గా కిక్ 2 తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ సాజిద్ నదియావాలా తాజాగా ప్రకటించారు. దాదాపు పదేళ్ల తర్వాత సీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.(ఇది చదవండి: నేను తప్పు చేయలేదు, బిగ్‌బాస్ నన్ను రోడ్డున పడేశాడు)కాగా.. 2009లో టాలీవుడ్ హీరో రవితేజ హీరోగా నటించిన ‘కిక్. ఈ మూవీ ఆధారంగానే బాలీవుడ్లో కిక్ తెరకెక్కించారు. సల్మాన్‌ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాడెంజ్ నటించిన ఈ సినిమాకు సాజిద్ నదియావాలా దర్శకత్వం వహించారు. యాక్షన్ కామెడీ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా అందుకుంది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. View this post on Instagram A post shared by Nadiadwala Grandson (@nadiadwalagrandson) -
గంగూలీ బయోపిక్‌లో?
రజనీకాంత్‌తో బాలీవుడ్ దర్శక–నిర్మాత సాజిద్ నడియాడ్వాలా చేయనున్న సినిమా గురించి ఇటీవల అధికారిక ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో రజనీకాంత్ హీరోగా చేయడం లేదని టాక్. ఓ కీలక పాత్ర కోసమే రజనీని సంప్రదించారట సాజిద్. అది కూడా గంగూలీ బయోపిక్ కోసమని భోగట్టా. భారత మాజీ ప్రముఖ క్రికెటర్ సౌరవ్ గంగూలీ బయోపిక్ వెండితెరపైకి రానుందనే వార్త కొంతకాలంగా ప్రచారంలో ఉంది. గంగూలీగా నటించే హీరోల జాబితాలో రణ్‌బీర్ కపూర్, హృతిక్ రోషన్, ఆయుష్మాన్ ఖురానా వంటివారి పేర్లు వినిపించాయి. అయితే ఇంకా ఎవర్నీ ఫిక్స్ చేయలేదు. కాగా ఈ సినిమాకు రజనీకాంత్ కుమార్తె సౌందర్యా రజనీకాంత్ దర్శకత్వం వహిస్తారన్నది తాజా ఖబర్. ఈ బయోపిక్‌ను సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తారని, ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసమే రజనీకాంత్‌ను కలిశారని సమాచారం. మరి.. గంగూలీ బయోపిక్కు సౌందర్య దర్శకత్వం వహిస్తారా? ఇందులో రజనీ గెస్ట్ రోల్ చేస్తారా? అనే విషయాలు తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. -
నయా కాంబినేషన్
రజనీకాంత్ ఇప్పటివరకూ దక్షిణ, ఉత్తరాది, హాలీవుడ్ మూవీ (బ్లడ్ స్టోన్) కలుపుకుని దాదాపు 170 చిత్రాల్లో నటించారు. ఇన్ని సినిమాలు చేసిన ఆయన గత కొన్నేళ్లుగా హిందీ నిర్మాతలతో సినిమాలు చేసింది లేదు. ఇప్పుడు అగ్రనిర్మాత సాజిద్ నడియాడ్‌వాలాతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హిందీలో ‘హౌస్‌ఫుల్ సిరీస్, 2 స్టేట్స్, హీరో పంతి, కిక్, సూపర్ 30, ఛిచోరే, 83’ తదితర చిత్రాలతో పాటు రీసెంట్ హిట్ ‘సత్య ప్రేమ్ కీ కథ’ చిత్రం నిర్మించారు సాజిద్ నడియాడ్వాలా. ‘హౌస్‌ఫుల్, హౌస్‌ఫుల్ 2, కిక్’ వంటి చిత్రాలకు దర్శకుడు కూడా. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్–సాజిద్ల నయా కాంబినేషన్ సెట్ అయింది. ‘‘ఒక లెజండరీ నటుడితో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను’’ అని సామాజిక మాధ్యమాల ద్వారా పేర్కొన్నారు సాజిద్. కాగా ఇది హిందీ చిత్రమా లేక పాన్ ఇండియన్ ప్రాజెక్టా? ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు? వంటి విషయాలను సాజిద్ స్పష్టం చేయలేదు. -
తప్పుకున్న ప్రొడ్యూసర్.. డైరెక్టర్‌గా సల్మాన్ ఖాన్ ?
Salman Khan Turn Into Director For Kabhi Eid Kabhi Diwali Movie: బాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సల్మాన్ ఖాన్ త్వరలో మెగాఫోన్ పట్టుకోనున్నాడన్న వార్త బీటౌన్ ఫిల్మ్ దునియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకు తన నటన, హావాభావాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరించిన సల్లూ భాయి దర్శకుడిగా కూడా తానేంటో నిరూపించుకోనున్నాడని తెలుస్తోంది. త్వరలోనే సల్మాన్ ఖాన్ ఓ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడని, అందుకు అంతా సిద్ధమైందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. సల్మాన్ సొంత బ్యానర్లో 'కబీ ఈద్ అబీ దివాలి' మూవీ రూపొందనుంది. ఈ సినిమాకు మరో నిర్మాతగా ఉన్న సాజిద్ నదియావాలా ఇటీవలే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఏకైక నిర్మాతగా ఉన్న సల్మాన్ ఖాన్ తానే దర్శకత్వ బాధ్యతలు కూడా స్వీకరించాలని నిర్ణయుంచుకున్నాడని టాక్. చదవండి: తన గర్ల్‌ఫ్రెండ్స్ అందరికీ పెళ్లయిందన్న హీరో.. వీడియో వైరల్ అయితే సల్మాన్ ఖాన్ సన్నిహితుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం గత నాలుగైదేళ్లుగా తన సినిమాలకు ఘోస్ట్ డైరెక్టర్‌గా వ్యహరిస్తున్నాడని తెలుస్తోంది. 'గత 4-5 సంవత్సరాలుగా అతను చేసిన చాలా సినిమాలకు ఎవరు దర్శకత్వం వహిస్తున్నారని మీరు అనుకుంటున్నారు ? భాయ్ అనుమతి లేకుండా ఒక్క ఫ్రేమ్ కూడా అవుట్‌పుట్‌లోకి రాదు. అతను చాలా కాలంగా తన సినిమాలను ఎడిటింగ్ చేస్తున్నాడు.' అని తెలిపారు. సల్మాన్ జోక్యం కారణంగానే సంజయ్ లీలా భన్సాలీతో విబేధాలు వచ్చాయని, దాని ఫలితంగా వీరిద్దరి 'ఇన్షా అల్లా' మూవీ అకాస్మాత్తుగా నిలిచిపోయిందని సమాచారం. తాజాగా మరోసారి తన సినిమాకు ఇదే రిపీట్ కావడంతో నేరుగా తానే దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించాలని అనుకున్నాడట సల్లూ భాయ్. అయితే ఈ సినిమాకు ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న ఫర్హాద్ సమ్జీ కో-డైరెక్టర్‌గా వ్యవహరిస్తాడని టాక్ వినిపిస్తోంది. చదవండి: హీరోయిన్ బాత్రూమ్లోకి చొరబడ్డ ఫ్యాన్.. పెళ్లి చేసుకోకుంటే చస్తానని బెదిరింపు -
ఆ బడా నిర్మాత కొడుకుతో ‘గని’ మూవీ హీరోయిన్ ప్రేమయాణం..
‘దబాంగ్ 3’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సయి మంజ్రేకర్ ఆ వెంటనే తెలుగులో వరస ఆఫర్లు అందుకుంది. ప్రస్తుతం మెగా హీరో వరుణ్ తేజ్ గని మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. గనితో పాటు అడవి శేష్ మేజర్‌లో కూడా సయి హీరోయిన్గా నటించింది. ఇదిలా ఉంటే ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజులకే ఈ భామ ప్రేమలో పడిందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: ఛీఛీ ఇలాంటి చెత్త వీడియోలో నటించడమేంటి, కాస్తా చూసుకో: కీర్తిపై దారుణమైన ట్రోల్స్ తొలి చిత్రంతోనే కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో ‘దబాంగ్ 3’ నటించే చాన్స్ కొట్టేసిన సయీ.. బాలీవుడ్‌కు చెందిన బడా నిర్మాత కొడుకుతో ప్రేమలో మునిగితేలుతున్నట్లు బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరద్దరు జంటగా ముంబైలో పలుమార్లు లంచ్, డిన్నర్ డేట్స్‌కు వెళుతూ మీడియా కెమెరాలకు చిక్కారు. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రీసెంట్గా బుధవారం సాయంత్రం కూడా వీరిద్దరూ ఓ రెస్టారెంట్‌కు వెళ్లి మీడియా కంట పడ్డారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్ కూతురు సయి మంజ్రేకర్ ఇప్పుడిప్పుడే హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. చదవండి: చిన్నారులపై అసభ్యకర సన్నివేశాలు, ప్రముఖ దర్శకుడిపై కేసు ఈ క్రమంలో స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ సాజిద్ నడియాద్వాలా కుమారుడు సుభాన్ నడియాద్వాలాతో చట్టాపట్టాలేసుకు తిరగడంతో వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఇరు కుటుంబాల మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలోనే విరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని చెబుతున్నాయి సినీ వర్గాలు. మరి వీరి ప్రేమ వ్యవహరం పెళ్లి పీటల వరకు వెళుతుందో లేదో చూడాలి. ఇదిలా ఉంటే సుభాన్ త్వరలోనే డైరెక్టర్‌గా డెబ్యూ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. -
‘జేమ్స్ బాండ్’ కోసం లండన్ థియేటర్ మొత్తం బుక్ చేసిన బాలీవుడ్ నిర్మాత
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, కృతి సనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘హీరోపంతి 2’. లండన్‌లో షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ టీం గురువారం విడుదలై జేమ్స్ బాండ్ సిరీస్ ‘నో టైమ్ టు డై’ సినిమాను అక్కడ థియేటర్లో చూసి ఎంజాయ్ చేసింది. ఈ జేమ్స్ బాండ్ సిరీస్ చూసేందుకే నిర్మాత సాజిద్ నడియద్వాలా ‘హీరోపంత్ 2 మూవీ టీం, క్రూడ్ కోసం ఏకంగా లండన్‌లోని థియేటర్ మొత్తం బుక్ చేశాడట. లండన్ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న నేపథ్యంలో సెలబ్రెషన్స్‌లో భాగంగా థియేటర్ మొత్తాన్ని బుక్ చేసి చిత్రం బృందంతో కలిసి ఆయన సినిమా చూశాడు. చదవండి: ప్రెగ్నెన్సీ వల్ల.. మూవీస్ నుంచి తొలగించారు నిర్మాతతో పాటు హీరో టైగర్ ష్రాఫ్, నటి తార సుతరియా, డైరెక్టర్ అహ్మద్ ఖాన్‌తో పాటు మిగతా తారగణం, క్రూడ్ ఉన్నారు. నెల రోజుల పాటు లండన్‌లో షూటింగ్‌ను జరుపుకున్న ‘హీరోపంత్ 2’ టీం ఈ నేపథ్యంలో ‘నో టైమ్ టూ డై’ సినిమాను చూసి సెలబ్రెట్ చేసుకున్నారు. కాగా ఆహ్మద్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ హీరోపంత్ 2’ వచ్చే ఏడాది మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: జేమ్స్ బాండ్: ‘నో టైమ్ టు డై’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా! -
దివ్య భారతి చేజారిన పెద్ద సినిమాలివే
బొబ్బిలి రాజా, అసెంబ్లీ రౌడీ, చిట్టెమ్మ మొగుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మసులో చెరగని ముద్ర వేసుకుంది దివ్య భారతి. తెలుగుతో పాటు దీవానా, దిల్ కా క్యా కసూర్, జాన్ సే ప్యారా వంటి పలు హిందీ చిత్రాల్లో నటించిన ఆమె అందం, అభినయానికి హిందీ ప్రేక్షకులు సైతం మంత్రముగ్ధులయ్యారు. 16 ఏళ్లకే నటనారంగంలోకి అడుగు పెట్టిన ఆమె తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా పేడు గడించింది. అదే సమయంలో 1993 ఏప్రిల్ 5న ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి తీరని శోకాన్ని మిగిల్చింది. దీంతో ఆమె సినిమాలు కొన్ని మధ్యలోనే అర్ధాంతరంగా ఆగిపోగా, మరికొన్ని ఆమె స్థానాన్ని వేరొకరితో భర్తీ చేసి షూటింగ్ జరుపుకున్నాయి. ఆమె అకాల మరణం కారణంగా పలు హిట్ సినిమాల్లో దివ్య భారతి స్థానంలో పలువురు బాలీవుడ్ తారలను తీసుకున్నారు. నేడు ఆమె జయంతి సందర్భంగా తన చివరి రోజుల్లో చేజారిన సినిమాలేంటి? ఆమె పాత్రలను ఎవరు భర్తీ చేశారనేది ఓ సారి చదివేద్దాం... కర్తవ్య రాజ్ కన్వర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో దివ్య భారతిని కథానాయికగా డిసైడ్ అయ్యారు. కొంత భాగం చిత్రీకరణ కూడా జరిపారు. కానీ సడన్‌గా ఆమె మరణించడంతో ఆమె స్థానంలోకి జూహీ చావ్లాను తీసుకోక తప్పలేదు. హల్చల్ 1995లో హల్చల్ సినిమాతో దర్శకుడిగా వెండితెరపై కాలు మోపాడు అనీస్ బజ్మీ. తొలి చిత్రం కావడంతో ఎలాగైనా దివ్య భారతినే హీరోయిన్గా తీసుకోవాలనుకున్నాడు. కానీ ఆమె మరణం ఈ సినిమా యూనిట్‌ను షాక్‌కు గురి చేసింది. తర్వాత దర్శకుడు ఆమె ప్లేస్‌లో కాజోల్‌ను తీసుకున్నాడు. ఇందులో కాజోల్ భర్త అజయ్ దేవ్‌గణ్ హీరో. మోహ్రా స్టార్ నటులు అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి సినిమా మెహ్రాలో నటించే చాన్స్ కొట్టేసింది దివ్య భారతి. ఈ మేరకు కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారట. కానీ ఆమె ఆకస్మిక మరణం తర్వాత రవీనా టండన్‌ను రీప్లేస్ చేశారు. రాజీవ్ రాణి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. లాడ్లా అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన లాడ్లా సినిమాకు సైన్ చేసింది దివ్య.. కానీ తన సడన్ డెత్ తర్వాత ఆమె పాత్రను శ్రీదేవి పోషించింది. ఈ చిత్రంలో రవీనా టండన్, శక్తి కపూర్ కీలక పాత్రల్లో నటించారు. కాగా దివ్య భారతి, నిర్మాత సాజిద్ నడియాద్వాలా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు ఆమె తండ్రి అంగీకరించకపోవడంతో పెద్దలను ఎదిరించి మరీ అతడితో ఏడడుగులు నడిచింది. కానీ పెళ్లైన పది నెలలకే ఐదో అంతస్థులోని బాల్కనీ నుంచి దూకి మరణించింది. అప్పుడామె వయసు 19ఏళ్లు మాత్రమే కావడం గమనార్హం. చదవండి: సుశాంత్ కేసు: ఓ సోదరికి బెయిల్.. మరొకరికి షాక్ ‘ఆస్కార్ నటితో మీకు పోలికా.. ప్లీజ్ బ్రేక్ తీసుకొండి’ -
దివ్య భారతి స్థానాన్ని భర్తీ చేయాలనుకోలేదు..
ముంబై: సాజిద్ భార్యగా దివ్య భారతి స్థానాన్ని భర్తీ చేసేందుకు తానెన్నడూ ప్రయత్నించలేదని జర్నలిస్టు వార్దా అన్నారు. దివ్య ఎల్లప్పుడూ తమ కుటుంబ సభ్యురాలిగానే ఉంటారని.. ఆమె వదిలివెళ్లిన జ్ఞాపకాలు తమతోనే ఉన్నాయన్నారు. హీరోయిన్గా అగ్రస్థానానికి చేరుకుంటున్న సమయంలోనే పద్దెమినిదేళ్ల వయస్సులో దివ్య భారతి బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాద్వాలాను పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో 1993 ఏప్రిల్‌లో తమ అపార్టుమెంటులోని ఐదో అంతస్తు నుంచి జారి పడి మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె మృతిపై అనేక కథనాలు పుట్టుకొచ్చాయి. దివ్య భారతిని ఉద్దేశపూర్వంగానే కిందకు తోసేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. (లాక్డౌన్: భార్య ఫొటో షేర్ చేసిన డైరెక్టర్) ఇక తదనంతర కాలంలో సాజిద్ జర్నలిస్టు వార్దాను రెండో వివాహం చేసుకున్నారు. అయితే ఇటీవల దివ్య వర్ధంతి(ఏప్రిల్ 5) సందర్భంగా అభిమానులు ఆమెపై ట్రోలింగ్‌కు దిగారు. ఈ విషయంపై స్పందించిన వార్దా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘దివ్య, ఆమె కుటుంబం, తన సోదరుడు కునాల్ నేటికీ మా కుటుంబ సభ్యులుగా ఉన్నారు. ప్రతీ వేడుకలోనూ పాలుపంచుకుంటారు. మీరు నన్ను ట్రోల్ చేసినంత మాత్రాన నాకు వచ్చే నష్టమేమీ లేదు. దివ్య పుట్టినరోజు, తనకు సంబంధించిన ఇతర కార్యక్రమాలను మేం జరుపుకొంటాం. ఆ సమయంలో తను నాతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. తన సినిమాలు చూస్తున్నప్పుడు మా పిల్లలు పెద్దమ్మ అంటూ సంతోషం వ్యక్తం చేస్తారు. మా అందమైన జీవితాల్లో తను ఎప్పుడూ జీవించే ఉంటుంది. సాజిద్ దివ్య వాళ్ల నాన్నను తన తండ్రిలా చూసుకుంటారు. ('ప్రభాస్‌ను నేను పెళ్లి చేసుకోవడం లేదు') ఇక దివ్య సోదరుడు కునాల్‌తో కూడా అన్నలా వ్యవహరిస్తారు. నిజం చెప్పాలంటే నేను ఏనాడు దివ్య స్థానాన్ని భర్తీ చేయాలనుకోలేదు. నాకంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది. అలాగే దివ్య మిగిల్చిన అందమైన జ్ఞాపకాలు మాతోనే ఉన్నాయి’’అని చెప్పుకొచ్చారు. కాగా విశ్వాత్మ, దిల్ కా క్యా కసూర్, సోలా ఔర్ షబ్నం, జాన్ సే ప్యారా వంటి హిందీ చిత్రాల్లో నటించిన దివ్య భారతి... బొబ్బిలి రాజా, చిట్టెమ్మ మొగుడు, అసెంబ్లీ రౌడీ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. చిన్న వయస్సులోనే దివికేగి అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చారు. -
‘హౌస్‌ఫుల్’పై మీటూ ఎఫెక్ట్
‘మీటూ’ ఉద్యమానికి సంబంధించి పది రోజులుగా యాక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, రైటర్స్, డైరెక్టర్స్, సింగర్స్‌లపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి సినీ కెరీర్‌పై ‘మీటూ’ ఉద్యమం ప్రభావం చూపిస్తున్నట్లుంది. మహిళలను లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సుభాష్ కపూర్‌తో కలిసి పని చేయలేనని చెప్పేశారు ఆమిర్‌ఖాన్. ఇప్పుడు అక్షయ్ కుమార్ కూడా ఇదే బాటలో నడుస్తానంటున్నారు. ‘హౌస్‌ఫుల్ 4’ షూటింగ్‌ను వెంటనే ఆపివేయాలని అక్షయ్ ఈ సినిమా నిర్మాత సాజిద్ నడియాడ్వాలాను కోరినట్లు బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ‘హౌస్‌ఫుల్ 4’ డైరెక్టర్ సాజిద్ ఖాన్, నటుడు నానా పటేకర్లపై ‘మీటూ’ ఆరోపణలు రావడమే ఇందుకు కారణమని బాలీవుడ్ టాక్. ‘‘విదేశాలు నుండి ఇంటికి తిరిగి రాగానే ‘మీటూ’ ఉద్యమానికి చెందిన కథనాలను చదివి కలత చెందాను. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులపై విచారణ జరగాలి. బాధితులకు సరైన న్యాయం జరగాలి. మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారితో కలిసి నటించాలని నేను అనుకోవడం లేదు’’ అన్నారు అక్షయ్ కుమార్. ‘హౌస్‌ఫుల్’ ఫ్రాంచైజీలో వస్తున్న నాలుగో పార్ట్ ‘హౌస్‌ఫుల్ 4’. ఇందులో అక్షయ్‌కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, పూజా హెగ్డే, కృతీ కర్భందా, కృతీసనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘‘మీటూ’ ఉద్యమంలో భిన్న రంగాల మహిళలు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పిన విషయాలు నన్ను ఆవేదనకు గురి చేశాయి. స్రీలు ఇలా తమ చేదు అనుభవాలను బయటపెట్టడానికి నిజంగా ధైర్యం కావాలి. వారి కథనాలను వినాలి కానీ జడ్జ్ చేయకూడదు. బాధిత స్త్రీలందరికీ నా మద్దతు తెలుపుతున్నా. అలాగే ‘హౌస్‌ఫుల్ 4’కు సంబంధించి అక్షయ్ కుమార్ నిర్ణయాన్ని నేనూ కట్టుబడి ఉండాలనుకుంటున్నా అన్నారు ‘హౌస్‌ఫుల్ 4’ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్న రితేష్ దేశ్‌ముఖ్. అలాగే హౌస్‌ఫుల్ 4 సినిమా నుంచి నానా పటేకర్ తప్పుకున్నారని బాలీవుడ్ టాక్. తన వల్ల ‘హౌస్‌ఫుల్ 4’ సినిమా టీమ్‌కు ఇబ్బంది కలగకూడదని నానా పటేకర్ ఫీల్ అయ్యారని హిందీ చిత్రపరిశ్రమలో తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల నానా పటేకర్‌పై తనుశ్రీ దత్తా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు తన మీద వచ్చిన ఆరోపణలకు సాజిద్ ఖాన్ స్పందించారు. నైతిక బాధ్యత వహిస్తున్నా ‘మీటూ’ ఉద్యమంలో నాపై వచ్చిన ఆరోపణల కారణంగా నా కుటుంబ సభ్యులు, నా నిర్మాతలు, నా సినిమాల్లోని హీరోల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాను. అందుకే ఈ ఆరోపణలకు సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ, నిజం నిరూపితమయ్యే వరకు డైరెక్టర్ చైర్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నాను. అలాగే నా స్నేహితులకు, మీడియా వారికి ఒక విన్నపం. నిజం నిరూపించబడే వరకు దయచేసి నాపై వస్తున్న ఆరోపణలను పాపులర్ చేయకండి’’ అని ‘హౌస్‌ఫుల్ 4’ దర్శకుడు సాజిద్ ఖాన్ అన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ నిర్ణయాల పట్ల నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ‘‘అక్షయ్ కుమార్‌కు సెల్యూట్. మీటూ ఉద్యమంలో భాగంగా అక్షయ్ లాగే చాలా మంది స్పందించి మహిళలకు సమానత్వం, గౌరవం అనే అంశాల్లో అండగా నిలుస్తారని ఆశిస్తున్నాను. అప్పుడు మహిళలు ఇండస్ట్రీలో సంతోషంగా పనిచేసే వాతావరణం ఏర్పడుతుంది’’ అని కన్నడ కథానాయిక పరుల్ యాదవ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పక్కదారి పట్టకూడదు తాజాగా ఈ విషయంపై కమల్‌హాసన్ స్పందించారు. ‘‘మీటూ’ ఉద్యమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు పెదవి విప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యమం నిజాయతీగా సక్రమమైన మార్గంలో వెళితే మంచి మార్పు వస్తుంది. కానీ ఇది పక్కదారి పట్టకూడదు. తప్పుడు ఆరోపణలు తెరపైకి రాకూడదు. నిజం ఉన్నప్పుడు ‘మీటూ’ ఉద్యమం తప్పుకాదు. సమాజంలో మహిళల సమస్యలను అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే కాదు పురాణాల కాలం నుంచే మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారు’’ అని కమల్ పేర్కొన్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న ‘మీటూ’ కథనాలు నన్ను బాధించాయి. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. తాము ఎదుర్కొన్న భయంకరమైన సంఘటలను షేర్ చేసిన మహిళలందరికీ నేను మద్దతు తెలుపుతున్నాను. ఇప్పుడు మహిళలందరూ ఏకతాటిపైకి రావడం మంచి పరిణామంగా భావిస్తున్నాను. మీటూ గొంతు ఇప్పుడు జాతీయ స్థాయిలో వినిపిస్తోంది. మాట్లాడాల్సిన సమయం ఇదే. మంచి మార్పుకు కూడా సరైన సమయం ఇదే. – రకుల్ ప్రీత్‌సింగ్ ‘మీటూ’ కథనాల వల్ల బాగా డిస్ట్రబ్ అయ్యాను. మహిళలకు సొసైటీలో గౌరవం, భద్రత ఉండాలి. అందుకు నేను, నా కంపెనీ కట్టుబడి ఉంటాం. మీటూ ఉద్యమ బాధితులకు నా మద్దతు ఉంటుంది. – అజయ్ దేవగన్ బయటకు వస్తున్న పేర్ల కంటే కూడా ఆ సంఘటనలు జరిగిన విధానం నన్ను ఎక్కువగా బాధిస్తున్నాయి. అలాగే ఇన్ని భయంకరమైన సంఘటనలు కూడా మంచు కొండలో కోన మాత్రమే అని అనుకుంటున్నాను’’ అని ట్వీట్ చేశారు. – తాప్సీ మా కుటుంబానికి చాలా విషాదకరమైన సమయం ఇది. ఇప్పుడు మేము కొన్ని సమస్యలను ఎదుర్కొనక తప్పదు. నా తమ్ముడు సాజిద్ ఖాన్‌పై వచ్చిన ఆరోపణలు ఒకవేళ నిజమే అయితే ఆ బాధిత మహిళలకు ఒక మహిళగా నా సపోర్ట్ ఉంటుంది – ఫరా ఖాన్ కథానాయికలు రిచా చద్దా, కృతీ సనన్, ఫరాఖాన్, చిత్రాంగద సింగ్‌లతో పాటు మరికొందరు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ‘మీటూ’ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. - -
రీమేక్‌తో ఎంట్రీ
బాలీవుడు నటుడు సునీల్ శెట్టి 25 సంవత్సరాలుగా హిందీ, దక్షిణాది చిత్రాలతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తన రెండో జనరేషన్ యాక్టర్స్‌ని స్క్రీన్కు పరిచయం చేస్తున్నారు. ఆల్రెడీ పెద్ద కూతురు అతియా శెట్టిని ‘హీరో’ సినిమా ద్వారా 2015లో సల్మాన్‌ఖాన్ పరిచయం చేశారు. ఇప్పుడు కుమారుడు అహన్ శెట్టిని బాలీవుడ్ బడా నిర్మాత సాజిద్ న డియాడ్వాలా పరిచయం చేయనున్నారు. తెలుగు సూపర్ హిట్ చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ రైట్స్ ఈ నిర్మాత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ ద్వారా అహన్ శెట్టిని హీరోగా బాలీవుడ్లో పరిచయం చేయనున్నారట. ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు. -
సల్మాన్ ఖాన్ కోసం..
ముంబై : కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. జంతు ప్రేమికులు ఈ తీర్పును స్వాగతించగా.. సల్మాన్ స్నేహితులు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సల్మాన్ కోసం ఆయన స్నేహితుడు, బాలీవుడ్ దర్శక నిర్మాత సాజిద్ నడియావాలా తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు. తీర్పు వినగానే స్నేహితుడిని కలిసేందుకు జైపూర్ బయల్దేరారు. ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ వారం రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్లో చేరిన బాఘీ 2 సక్సెస్ మీట్ కోసం భారీ ఏర్పాట్లు చేసుకున్న చిత్ర నిర్మాత సాజిద్ మిత్రుడి కోసం కార్యక్రమాన్ని రద్దు చేసుకుని స్నేహ బంధాన్ని చాటారు. సల్మాన్ ఖాన్ హీరోగా జుడ్వా, ముజ్ సే షాదీ కరోగీ వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన సాజిద్.. సల్మాన్ ఖాన్ ‘కిక్’ సినిమాతోనే దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం బాఘీ 2 విజయాన్ని ఆస్వాదిస్తున్న సాజిద్ త్వరలోనే ‘కిక్’ సీక్వెల్ ‘కిక్ 2 ’ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
రిలీజ్ కాకముందే సీక్వెల్!
సాక్షి, సినిమా : బాలీవుడ్లో మరో సీక్వెల్ చిత్రాన్ని ప్రకటించేశారు. భాఘీ నుంచి మరో చిత్రం రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. సిరీస్‌లో రెండో చిత్రం విడుదల కాకముందే మూడో దానిని ప్రకటించటం విశేషం. టైగర్ ష్రాఫ్ హీరోగానే బాఘీ 3 సినిమా ఉండబోతున్నట్లు చెప్పేశారు. నిర్మాత సాజిద్ నడియా వాలా సొంత బ్యానర్ లోనే ఈ చిత్రం కూడా తెరకెక్కబోతోంది. బాఘీ 2 తెరకెక్కిస్తున్న అహ్మద్ ఖాన్ మూడో పార్ట్‌ను డీల్ చేయబోతున్నాడు. మిగతా తారాగణం త్వరలో ప్రకటించనున్నారు. బాఘీ మొదటి పార్ట్ తెలుగు వర్షం చిత్రం రీమేక్‌గా తెరకెక్కింది. సబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహించగా.. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించింది. రెండో పార్ట్‌ను క్షణం రీమేక్‌గా అహ్మద్ ఖాన్ తెరకెక్కిస్తున్నాడు. దిశా పఠానీ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. క్లాసిక్ మూవీ బేతాబ్ లో మాధురి సాంగ్ ‘ఏక్ దో తీన్’ పాట రీమిక్స్‌పై జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చిందులు వేయనుంది. మార్చి 30న బాఘీ-2 విడుదల కానుంది. Drumrolls 🥁🎷 Our excitement level has just tripled! We are thrilled to share the 3rd instalment of #SajidNadiadwala’s Baaghi franchise starring @iTIGERSHROFF directed by @khan_ahmedasas#Baaghi3 @WardaNadiadwala pic.twitter.com/ijYdyIqbVs — Nadiadwala Grandson (@NGEMovies) 19 February 2018 -
భళి భళి భళి రా భళి...
... సాహోరే బాహుబలి.. పాట ఎంత బాగుంటుందో కదా. ‘బాహుబలి–2’లోని ఈ పాటను తెర మీద చూస్తున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇప్పుడు అక్షయ్ కుమార్ కూడా ‘బాహుబలి’గా మారనున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ! ‘బాహుబలి’ బహు భాషల్లో విడుదలైంది కాబట్టి, హిందీలో రీమేక్ అయ్యే అవకాశం లేదు. మరి.. అక్షయ్‌కుమార్ ‘బాహుబలి’గా మారడం ఏంటి? అనుకుంటున్నారా? అసలు విషయం ఏంటంటే... అక్షయ్‌కుమార్ మెయిన్ లీడ్‌లో రూపొందిన ‘హౌస్‌ఫుల్’ చిత్రం గురించి తెలిసే ఉంటుంది. ఇప్పటివరకూ ఈ సినిమాకి సంబంధించిన మూడు భాగాలు వచ్చాయి. ఇప్పుడు ‘హౌస్‌ఫుల్ 4’ రూపొందనుంది. ఫస్ట్, సెకండ్ పార్ట్‌లకు దర్శకత్వం వహించిన సాజిద్ ఖాన్ నాలుగో భాగానికి దర్శకత్వం వహించనున్నారు. మూడో భాగం సాజిద్ ఫర్హాద్ దర్శకత్వంలో రూపొందింది. ‘హౌస్‌ఫుల్’ సిరీస్‌ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న సాజిద్ నడియాడ్వాలా ఫోర్త్ మూవీని త్వరలో ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ చిత్రం ప్రజెంట్, పాస్ట్.. రెండు నేపథ్యాలలో రూపొందనుంది. పాస్ట్ స్టోరీ ‘బాహుబలి’ కాలంలో ఉంటుంది. అక్షయ్‌కుమార్ గుర్రపు స్వారీ. కత్తి యుద్ధం చేస్తారట. ‘బాహుబలి’ తారలు ఎలాంటి కాస్ట్యూమ్స్ వాడారో అలాంటివే డిజైన్ చేయిస్తున్నారట. ఆ ఎపిసోడ్ మొత్తం ‘బాహుబలి’ని తలపించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకూ తమ సంస్థ నుంచి వచ్చిన అన్ని కామెడీ ఎంటర్టైనర్స్కన్నా సాజిద్ నడియాడ్వాలా ఈ ఎంటర్టైనర్ని ఎక్కువ బడ్జెట్లో తీయనున్నారు. మరి.. ‘బాహుబలి’లా అంటే.. హయ్యస్ట్ బడ్జెట్ అవకుండా ఉంటుందా? -
నిజం దివ్యభారతికే ఎరుక!
అప్పుడెప్పుడో జరిగిపోయిన సంఘటన.. తలచుకుంటే నేటికీ మనసుని మెలిపెడుతుంది. వేలాది హృదయాలను కదిలిస్తుంది. ఆమె సజీవంగా ఉంటే బాగుండు కదా.. అనిపిస్తుంది. ఊహ తెలియని వయసులోనే స్టార్డమ్, ప్రపంచాన్ని అర్థం చేసుకునేలోపే అనంతలోకాలకు పయనం.. వెరసి, అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చిందామె. నేలపై నడిచినప్పుడే ఆమెను స్టార్ అన్నారంతా.. నింగికెగిశాక అనకుండా ఉండగలరా..? కానీ, ఆ స్టార్‌డమ్‌ను పూర్తిగా ఆస్వాదించకుండానే వెళ్లిపోయింది టీనేజ్ స్టార్ దివ్యభారతి. ఎన్నో అనుమానాలకు తెరలేపిన ఆమె మరణానికి కారణమేంటి..? ఇంతకీ ఆరోజేం జరిగింది..? 1993.. ఏప్రిల్ 5.. మరో అరవై నిమిషాలు గడిస్తే తేదీ మారుతుందనగా ముంబైని సునామీ లాంటి వార్త ఒక్కసారిగా ముంచెత్తింది. టీనేజ్ సంచలనం, అందాల నటి దివ్యభారతి ఆత్మహత్య చేసుకుందన్నదే ఆ వార్త! పంతొమ్మిదేళ్ల వయసు, మోయలేనంత స్టార్డమ్, అసాధారణ భవిష్యత్తు ఉన్న అమ్మాయి ఎందుకు మరణిస్తుంది..? ఎవరో కావాలనే ఆమెను హతమార్చారు అంటూ కొందరు అనుమానాలు లేవనెత్తారు. సక్సెస్ కిక్కును తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుందేమో అంటూ కొందరు నిట్టూర్చారు. ఏళ్లు గడిచినా ముంబై పోలీసులు మాత్రం ఎలాంటి ఆధారాలూ సంపాదించలేకపోయారు. ఆమె మరణం నేటికీ మిస్టరీనే! కానీ, ఆ రోజు దివ్యభారతి చాలా హుషారుగా ఉందని చెబుతారు దగ్గరనుంచి చూసినవాళ్లు. చెన్నై నుంచి షూటింగ్ పూర్తి చేసుకుని ముంబై చేరుకున్న ఆమె.. తన సంపాదనతో ఓ అపార్ట్మెంట్లోని ఇంటిని కొనుగోలు చేయాలని భావించింది. అందులో భాగంగానే సోదరుడు కునాల్‌తో కలిసి ఆ నాలుగు పడకగదుల ఇంటిని సందర్శించింది. ముంబైలాంటి ఖరీదైన ప్రాంతంలో ఇల్లు సొంతం చేసుకోవాలనే కోరిక ఎవరికి మాత్రం ఉండదు..? అందుకే, డీల్ పూర్తి కాగానే అందరికీ సంబరంగా చెప్పుకొచ్చింది. కానీ, ఆ ఫ్లాట్ ఆమె కోసం కాదు. ఆమె తల్లిదండ్రుల కోసం! అవును, అప్పటికే దివ్య భారతికి వివాహమయింది. భర్త, ప్రముఖ నిర్మాత సాజిద్ నదియాడ్వాలాతో కలిసి అంధేరీ ప్రాంతంలోని తులసీ అపార్ట్మెంట్లో నివసిస్తోంది. ఆమెకు ప్రత్యేకంగా ఇంటి అవసరం ఏముంటుంది..? కొనుగోలు వ్యవహారాల్లో ఆ రోజంతా తలమునకలై ఉండటంతో తర్వాతి రోజు హైదరాబాద్‌లో చేయాల్సిన షూటింగ్‌ను వాయిదా వేసుకుంది. నిర్మాతలకు ఫోన్ చేసి, తాను అలసిపోయానని.. ఒకరోజు విశ్రాంతి తీసుకుని వస్తానని చెప్పింది. అలా రాత్రి పదిగంటలకు తులసీ అపార్ట్‌మెంట్‌కు చేరుకుంది. అప్పటికి పనిమనిషి అమృత మాత్రమే ఇంట్లో ఉంది. చిన్ననాటి నుంచీ దివ్యభారతి ఆలనాపాలనా చూసుకుంటోంది ఆమే. దివ్యభారతి బెడ్రూమ్లోకి చేరి, కాసేపు నడుం వాల్చగానే ప్రముఖ డిజైనర్ నీతా లుల్లా నుంచి ఫోన్ వచ్చింది. తన భర్త డా.శ్యామ్ లుల్లాతో కలిసి తులసీ అపార్ట్‌మెంట్‌కు వస్తున్నానని చెప్పిందామె. దీంతో వారికి వెల్కమ్ చెప్పేందుకు మద్యం బాటిల్లతో సిద్ధమైంది దివ్యభారతి. ముగ్గురూ కలిసి ఆమె బెడ్రూమ్లోనే మద్యం సేవించారు. కొద్దిసేపు డ్రెస్సుల గురించీ, డిజైన్ల గురించీ చర్చించారు. అమృత వారికి ఇష్టమైన ఆహారాన్ని వండిపెడుతోంది. ఓవైపు వంట చేస్తూనే, మరోవైపు కిచెన్ నుంచే దివ్యభారతితో మాట్లాడుతోందామె. హీరోయిన్ కూడా బిగ్గరగా అరుస్తూ ఆమెకు సమాధానాలిస్తోంది. అలా మాట్లాడుతూనే బాల్కనీ వైపు నడుచుకుంటూ వెళ్లింది దివ్యభారతి. మరోవైపు నీతా, శ్యామ్ లుల్లాలు టీవీ చూస్తూ ఉండిపోయారు. బాల్కనీలోని తలుపుల్లేని కిటికీ ముందు నిల్చుంది దివ్యభారతి. అక్కడి నుంచే స్వచ్ఛమైన గాలికోసమన్నట్టుగా తలను బయట పెట్టి చూస్తూ పనిమనిషితో బిగ్గరగా మాట్లాడసాగింది. ఏం జరిగిందో ఏమో.. పదకొండు గంటల సమయంలో ఒక్కసారిగా ఆమె కాళ్లు పట్టుతప్పాయి. ముందుకు కూలబడిపోయింది. ఐదో అంతస్తు నుంచి పెద్ద శబ్దం చేస్తూ కింద పడిపోయింది. ఆ శబ్దానికి చుట్టుపక్కలవారు లేచి చూశారు. అంతే.. రక్తపు మడుగులో దివ్యభారతి కొట్టుమిట్టాడుతోంది. ఆలస్యం చేయకుండా అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అలా కొద్ది సమయంలోనే దగ్గర్లోని కూపర్ ఆస్పత్రికి ఆమెను చేర్చారు. అయితే, హాస్పిటల్లోకి అడుగుపెట్టగానే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఇదే ఇప్పటివరకూ ఆమె మరణం విషయంలో వినిపిస్తోన్న కథనం. దీనిపై నీతా, శ్యామ్ లుల్లాలు ఏరోజూ నోరు మెదపలేదు. భర్త సాజిద్ కూడా మౌనాన్నే ఆశ్రయించాడు. వంటమనిషి అమృత.. దివ్యభారతి మరణాన్ని తట్టుకోలేక నెలరోజులకే గుండె ఆగి చనిపోయింది. దీంతో ఇది హత్య అన్న వాదనలకు బలం దొరకలేదు. కానీ, ఈ మరణం వెనక దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ గ్యాంగ్ ప్రమేయం ఉందనే పుకార్లు హల్చల్ చేశాయి. సాజిద్ ఉద్దేశపూర్వకంగానే భార్యను హత్య చేయించాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముంబై పేలుళ్ల కేసు నుంచి బయటపడేందుకే ఇలా చేశాడనీ కొంతమంది సిద్ధాంతీకరించారు. కానీ, ముంబై పోలీసులు ఆ దిశగా ఎలాంటి ఆధారాలూ సంపాదించలేకపోయారు. దీంతో 1998 వరకూ కొనసాగిన విచారణ.. ఆ ఏడాది ముగిసిపోయింది. మరణ కారణం ఏంటో ప్రపంచానికి స్పష్టంగా చెప్పకుండానే పోలీసులు కేసును మూసివేశారు. ఇంతకీ ఆమెది హత్యా, ఆత్మహత్యా, ప్రమాదమా..? నిజం దివ్యభారతి మాత్రమే చెప్పగలదు..! -
అవును డ్యూయల్ రోల్ చేస్తున్నా..
ముంబై: తెలుగులో బంపర్ హిట్ అయిన సినిమాలను బాలీవుడ్లో రీమేక్ చేస్తూ దూసుకుపోతున్నాడు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్. తాజాగా రవితేజ హీరోగా నటిస్తున్న కిక్ 2 చిత్రాన్ని కూడా రీమేక్ చేసేందుకు రెడీ అవున్నాడు. కిక్ 2 సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నామని, ఆ సినిమాలో తాను ద్విపాత్రాభినయం చేస్తున్నానని సల్మాన్ స్పష్టం చేశాడు. 2014లో భారీ విజయం సాధించిన కిక్ మూవీకి సీక్వెల్‌గా కిక్ 2 తెరకెక్కిచనున్నట్టు సల్లూభాయ్ తెలిపాడు. ఇందుకు సంబంధించి స్ర్కిప్ట్ వర్క్ నడుస్తోందని పేర్కొన్నాడు. కిక్ చిత్రానికి పని చేసిన దర్శకుడు సాజిద్ నడియాద్ వాలానే ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నట్లు చెప్పాడు. ఈ సినిమాలో తాను పోషిస్తున్న రెండు పాత్రలు అద్భుతంగా ఉండేలా సాజిద్ కథను రూపొందిస్తున్నట్లు సల్మాన్ తెలిపాడు. గతంలో తాను చేసిన 'పోకిరి', 'రెడీ' కిక్ రీమేక్స్ హిట్టవడంతో ఈ చిత్రం కూడా అదే రేంజిలో వర్కవుట్ అవుతుందని భావిస్తున్నాడట ఈ బాలీవుడ్ కండల వీరుడు. మరోవైపు ఈ వార్తలను సాజిద్ కూడా ధ్రువీకరించాడు. రెండు మూడు నెలల్లో కథ సిద్ధం అవుతుందని చెప్పాడు. సల్మాన్‌ఖాన్ హీరోగా సాజిద్ నదియావాలా దర్శకత్వంలో 'కిక్' అదే పేరుతో హిందీలో రీమేక్ కాగా ఆ చిత్రం ఘన విజయం సాధించింది. కాగా కిక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కిక్ ఎక్కించిన రవితేజ త్వరలోనే కిక్-2తో ప్రేక్షకులకు డబుల్ కిక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
కిక్ సీక్వెల్ తీస్తున్న సల్మాన్?
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ ఇప్పటివరకు తన 'దబాంగ్' సినిమా తప్ప మరి దేనికీ సీక్వెల్ తీయలేదు. కానీ త్వరలోనే 'కిక్' సినిమా సీక్వెల్ తీయబోతున్నారని సమాచారం. తెలుగులో సూపర్‌హిట్ అయిన కిక్ సినిమాను హిందీలో రీమేక్ చేసిన సల్లూభాయ్.. ఇప్పుడు సాజిద్ నడియాడ్వాలా దర్శకత్వంలో దానికి సీక్వెల్ చేయాలనుకుంటున్నారట. ఇప్పటివరకు సల్మాన్ నటించిన సినిమాలన్నింటిలోకీ కిక్ అత్యధిక వసూళ్లు సాధించింది. ఇప్పటివరకు అది దాదాపు రూ. 234 కోట్లు వసూలు చేసినట్లు బాక్సాఫీసు వర్గాలు చెబుతున్నాయి. ఇంతకుముందు సల్మాన్ నటించిన 'ఏక్ థా టైగర్' 188 కోట్లు వసూలు చేయగా, దాన్ని కూడా కిక్ ఓ తన్ను తన్నింది. దాంతో సాజిద్ స్నేహితులు, పంపిణీదారులు అందరూ కూడా దాని సీక్వెల్ తీయాల్సిందిగా చెబుతున్నారు. ఇప్పటికైతే నిర్మాతగా సాజిద్‌కు చేతినిండా సినిమాలున్నాయి. సల్మాన్ స్టార్ పవర్ కారణంగా కిక్ అనుకున్నదాని కంటే చాలా ఎక్కువ వసూళ్లు సాధించిందని, సీక్వెల్ ఎప్పుడు చేస్తామో అప్పుడే చెప్పలేమని అన్నారు. -
బాలీవుడ్ మిత్రవింద?
తెలుగు తెర సంచలనం ‘మగధీర’ హక్కుల్ని దర్శకనిర్మాత సాజిద్ నడియాడ్వాలా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయకునిగా షాహిద్‌కపూర్ ఇప్పటికే ఖరారైనట్లు సమాచారం. మరి కథానాయిక పాత్ర పోషించేదెవరు? అనేది గత కొన్ని రోజులుగా బాలీవుడ్లో నలుగుతున్న ప్రశ్న. తొలుత మాతృకలో కథానాయికగా నటించిన కాజల్ అగర్వాల్‌నే కథానాయికగా తీసుకోవాలని సాజిద్ నడియాడ్వాలా భావించారు. బాలీవుడ్ తెరపై మిత్రవిందగా కాజల్ మెరవనున్నారని వార్తలు కూడా మీడియాలో హల్చల్ చేశాయి. అయితే... కొందరు శ్రేయోభిలాషులు... ‘కాజల్ అయితే... ఫ్రెష్‌నెస్ ఉండదు’ అని చెప్పడంలో సాజిద్ తన అభిప్రాయాన్ని మార్చుకున్నారట. మరి బాలీవుడ్ మిత్రవింద ఎవరు? అని అందరూ అనుకుంటున్న తరుణంలో... సీన్లోకి అలియా భట్ వచ్చారు. ఈ పాత్రకు అలియా వందకు వంద శాతం యాప్ట్ అని యూనిట్ మొత్తం ఏకగ్రీవంగా ఓటు వేయడంతో, అలియాను మిత్రవిందగా ఖరారు చేసేశారట సాజిద్. వచ్చే నెల చివర్లో ఈ సినిమా సెట్స్‌కి వెళుతుందని సమాచారం. -
పరిణీతి చిర్రుబుర్రు
మీడియా సమావేశంలో ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగడమే కాకుండా, అసభ్యంగా ప్రవర్తించిన రిపోర్టర్‌పై పరిణీతి చోప్రా చిర్రుబుర్రులాడింది. అతడిని తిట్టిపోసి, బయటకు వెళ్లిపోవాలంటూ సమావేశం నుంచి పంపేసింది. ఆ తర్వాత కోపాన్ని అదుపు చేసుకుని, మీడియా సమావేశాన్ని యథావిధిగా కొనసాగించింది. జర్నలిస్టుగా కరిష్మా కొద్దికాలంగా తెరమరుగైన కరిష్మా కపూర్ తిరిగి తెరపైకి వచ్చేందుకు ముమ్మర యత్నాలే సాగిస్తోంది. ఈ యత్నాలు ఫలించి, బుల్లితెరపై జర్నలిస్టు పాత్ర పోషించే అవకాశం ఆమెకు లభించింది. ఒక మహిళా జర్నలిస్టు జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సీరియల్లో కరిష్మా ప్రధాన పాత్ర పోషించనుందని సమాచారం. ‘మగధీర’గా షాహిద్! రామ్‌చరణ్ తేజ హీరోగా నటించిన ‘మగధీర’ను సాజిద్ నడియాద్వాలా హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నాడు. దీని హక్కుల కోసం సాజిద్ టాలీవుడ్ వర్గాలతో సంప్రదింపులు సాగిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటించనున్నట్లు సమాచారం. -
అందులో తప్పేముంది?
ముంబై: 'కిక్' సినిమా ప్రచారంలో హీరో సల్మాన్‌ఖాన్ ఎక్కువగా ప్రమోట్ చేయడాన్ని హీరోయిన్ జాక్వెలెన్ ఫెర్నాంజెడ్ సమర్థించింది. అందులో తప్పేముందని ఎదురు ప్రశ్నించింది. ప్రధాన పాత్ర పోషించిన సల్మాన్‌ఖాన్- సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసాడని కితాబిచ్చింది. సల్మాన్ సూపర్ స్టార్ అని, ఆయనను ఎక్కువగా ప్రమోట్ చేయడం ఏమాత్రం తప్పుకాదని పేర్కొంది. సినిమా విజయానికి ఏదీ మంచో అదే చేస్తారని కూడా అంది. శ్రీలంకకు చెందిన జాక్వెలెన్ 2009లో అల్లాదీన్ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. 'కిక్' సినిమాకు సాజిద్ నడియాడ్వాలా దర్శకత్వం వహించగా, చేతన్ భగత్ స్క్రీన్ ప్లే అందించారు. -
40 అంతస్థుల బిల్డింగ్‌పై సాహసం
బాలీవుడ్ స్టార్లలో మాస్ ఇష్టపడే హీరో ఎవరు? అంటే... టక్కున వచ్చే సమాధానం సల్మాన్‌ఖాన్. ఆటోల మీద, లారీల పైన, మెకానిక్ షాపుల్లో, బ్యాచ్లర్స్ రూముల్లో... ఇలా ఉత్తరాదిన ఎక్కడపడితే అక్కడ సల్మాన్ బొమ్మలే కనిపిస్తుంటాయి. అయితే... ఇక్కడే కాదు... ప్రపంచం మొత్తం ఈ కండలవీరుడికి అభిమానులున్నారని ఇటీవల జరిగిన ఓ సంఘటనతో స్పష్టమైంది. వివరాల్లోకెళ్తే... సినిమా షూటింగులకు సౌకర్యవంతంగా ఉండటం, నిర్మాతలకు ఖర్చు కూడా తక్కువగా అవుతుండటంతో ఇటీవల పోలండ్‌లో మన భారతీయ సినిమాల షూటింగులు ఊపందుకున్నాయి. ‘జిందగీ న మిలేగీ దొబారా’ చిత్రం కూడా అక్కడ తెరకెక్కిందే. ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాల షూటింగులు పోలండ్‌లోనే రూపొందుతున్నాయి. అయితే, ఏ సినిమాకూ ఎదురుకాని సమస్య... సల్మాన్‌ఖాన్ హీరోగా రూపొందుతోన్న ‘కిక్’ సినిమాకు తలెత్తింది. పోలండ్ రాజధాని వార్సాలో ఈ సినిమాకు సంబంధించిన పతాక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సాజిద్ నడియాడ్వాలా. పోలండ్ దేశంలోనే అత్యంత ఎత్తయిన బిల్డింగ్(కల్చర్ అండ్ సైన్స్) పై నుంచి వేళ్లాడుతూ, రకరకాల ఫీట్లు చేస్తూ సల్మాన్ ఫైట్ చేయాలి. అది నలభై అంతస్థుల బిల్డింగ్. సల్లూభాయ్ కెరీర్లోనే అత్యంత ప్రమాదకరమైన ఫీట్ ఇది. వారం రోజుల పాటు జరిగే ఈ ఫైట్ చిత్రీకరణ విషయంలో దర్శకుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారట. ఈ ఫైట్ వివరాలను పోలండ్‌లోని అత్యధిక సర్క్యులేషన్‌గల పత్రికైన ‘గజెటా వైబోర్కా’ ప్రచురించింది. దాంతో అక్కడి చానల్స్‌లో కూడా ఈ ఫైట్ గురించి పెద్ద ఎత్తున కథనాలు ప్రసారమయ్యాయి. దాంతో వేలాది మంది అభిమానులు కల్చర్ అండ్ సైన్స్ బిల్డింగ్ వద్దకు చేరుకున్నారు. ‘సల్మాన్... సల్మాన్’ అంటూ నినాదాలు చేస్తూ లొకేషన్ మొత్తాన్నీ రచ్చ రచ్చ చేశారు. దాంతో, విదేశీయుల్లో కూడా తనకు ఇంతమంది అభిమానులున్నారా అని విస్తుపోవడం సల్మాన్ వంతు అయిందట. వారిని కట్టడి చేయడం పోలండ్ పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. మరి సల్లూభాయా మజాకా!