అవును డ్యూయల్ రోల్ చేస్తున్నా.. | Yes, I will play double role in Kick sequel: Salman Khan | Sakshi
Sakshi News home page

అవును డ్యూయల్ రోల్ చేస్తున్నా..

Published Wed, Aug 5 2015 12:37 PM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM

అవును డ్యూయల్ రోల్  చేస్తున్నా..

అవును డ్యూయల్ రోల్ చేస్తున్నా..

ముంబై: తెలుగులో బంపర్ హిట్ అయిన సినిమాలను బాలీవుడ్లో రీమేక్ చేస్తూ  దూసుకుపోతున్నాడు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్. తాజాగా రవితేజ హీరోగా నటిస్తున్న కిక్ 2  చిత్రాన్ని  కూడా రీమేక్ చేసేందుకు రెడీ అవున్నాడు.  కిక్ 2  సినిమాను  హిందీలో  రీమేక్ చేస్తున్నామని,  ఆ సినిమాలో  తాను ద్విపాత్రాభినయం చేస్తున్నానని  సల్మాన్ స్పష్టం చేశాడు.

2014లో భారీ విజయం సాధించిన కిక్ మూవీకి సీక్వెల్గా కిక్ 2  తెరకెక్కిచనున్నట్టు సల్లూభాయ్ తెలిపాడు.   ఇందుకు సంబంధించి  స్ర్కిప్ట్ వర్క్ నడుస్తోందని పేర్కొన్నాడు.   కిక్  చిత్రానికి పని చేసిన దర్శకుడు సాజిద్ నడియాద్ వాలానే ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నట్లు చెప్పాడు.   ఈ సినిమాలో తాను పోషిస్తున్న రెండు పాత్రలు అద్భుతంగా ఉండేలా సాజిద్ కథను  రూపొందిస్తున్నట్లు సల్మాన్ తెలిపాడు. గతంలో  తాను చేసిన 'పోకిరి', 'రెడీ' కిక్ రీమేక్స్ హిట్టవడంతో ఈ చిత్రం కూడా అదే రేంజిలో వర్కవుట్ అవుతుందని  భావిస్తున్నాడట ఈ బాలీవుడ్ కండల వీరుడు.

మరోవైపు ఈ వార్తలను సాజిద్ కూడా ధ్రువీకరించాడు.   రెండు మూడు నెలల్లో కథ సిద్ధం అవుతుందని చెప్పాడు.  సల్మాన్‌ఖాన్ హీరోగా సాజిద్‌ నదియావాలా దర్శకత్వంలో 'కిక్' అదే పేరుతో హిందీలో రీమేక్ కాగా ఆ చిత్రం ఘన విజయం సాధించింది.  కాగా కిక్ సినిమాతో  తెలుగు ప్రేక్షకులకు కిక్ ఎక్కించిన రవితేజ త్వరలోనే కిక్-2తో ప్రేక్షకులకు డబుల్ కిక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement