
రజనీకాంత్‌తో బాలీవుడ్ దర్శక–నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా చేయనున్న సినిమా గురించి ఇటీవల అధికారిక ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో రజనీకాంత్ హీరోగా చేయడం లేదని టాక్. ఓ కీలక పాత్ర కోసమే రజనీని సంప్రదించారట సాజిద్. అది కూడా గంగూలీ బయోపిక్ కోసమని భోగట్టా. భారత మాజీ ప్రముఖ క్రికెటర్ సౌరవ్ గంగూలీ బయోపిక్ వెండితెరపైకి రానుందనే వార్త కొంతకాలంగా ప్రచారంలో ఉంది.
గంగూలీగా నటించే హీరోల జాబితాలో రణ్‌బీర్ కపూర్, హృతిక్ రోషన్, ఆయుష్మాన్ ఖురానా వంటివారి పేర్లు వినిపించాయి. అయితే ఇంకా ఎవర్నీ ఫిక్స్ చేయలేదు. కాగా ఈ సినిమాకు రజనీకాంత్ కుమార్తె సౌందర్యా రజనీకాంత్ దర్శకత్వం వహిస్తారన్నది తాజా ఖబర్. ఈ బయోపిక్‌ను సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తారని, ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసమే రజనీకాంత్‌ను కలిశారని సమాచారం. మరి.. గంగూలీ బయోపిక్‌కు సౌందర్య దర్శకత్వం వహిస్తారా? ఇందులో రజనీ గెస్ట్ రోల్ చేస్తారా? అనే విషయాలు తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment