తప్పుకున్న ప్రొడ్యూసర్‌.. డైరెక్టర్‌గా సల్మాన్‌ ఖాన్‌ ? | Salman Khan Turn Into Director For Kabhi Eid Kabhi Diwali Movie | Sakshi
Sakshi News home page

Salman Khan: తప్పుకున్న ప్రొడ్యూసర్‌.. డైరెక్టర్‌గా సల్మాన్‌ ఖాన్‌ ?

Published Sat, Apr 9 2022 3:17 PM | Last Updated on Sat, Apr 9 2022 3:22 PM

Salman Khan Turn Into Director For Kabhi Eid Kabhi Diwali Movie - Sakshi

Salman Khan Turn Into Director For Kabhi Eid Kabhi Diwali Movie: బాలీవుడ్‌ మోస్ట్ ఎలిజబుల్‌ బ్యాచ్‌లర్‌ సల్మాన్ ఖాన్‌ త్వరలో మెగాఫోన్‌ పట్టుకోనున్నాడన్న వార్త బీటౌన్‌ ఫిల్మ్‌ దునియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకు తన నటన, హావాభావాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరించిన సల్లూ భాయి దర్శకుడిగా కూడా తానేంటో నిరూపించుకోనున్నాడని తెలుస్తోంది. త్వరలోనే సల్మాన్‌ ఖాన్‌ ఓ సినిమాను డైరెక్ట్‌ చేయనున్నాడని, అందుకు అంతా సిద్ధమైందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. సల్మాన్‌ సొంత బ్యానర్‌లో 'కబీ ఈద్‌ అబీ దివాలి' మూవీ రూపొందనుంది. ఈ సినిమాకు మరో నిర్మాతగా ఉన్న సాజిద్‌ నదియావాలా ఇటీవలే ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఏకైక నిర్మాతగా ఉన్న సల్మాన్‌ ఖాన్‌ తానే దర్శకత్వ బాధ్యతలు కూడా స్వీకరించాలని నిర్ణయుంచుకున్నాడని టాక్. 

చదవండి: తన గర్ల్‌ఫ్రెండ్స్‌ అందరికీ పెళ్లయిందన్న హీరో.. వీడియో వైరల్

అయితే సల్మాన్‌ ఖాన్‌ సన్నిహితుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం గత నాలుగైదేళ్లుగా తన సినిమాలకు ఘోస్ట్‌ డైరెక్టర్‌గా వ్యహరిస్తున్నాడని తెలుస్తోంది. 'గత 4-5 సంవత్సరాలుగా అతను చేసిన చాలా సినిమాలకు ఎవరు దర్శకత్వం వహిస్తున్నారని మీరు అనుకుంటున్నారు ? భాయ్‌ అనుమతి లేకుండా ఒక్క ఫ్రేమ్‌ కూడా అవుట్‌పుట్‌లోకి రాదు. అతను చాలా కాలంగా తన సినిమాలను ఎడిటింగ్‌ చేస్తున్నాడు.' అని తెలిపారు. సల్మాన్‌ జోక్యం కారణంగానే సంజయ్‌ లీలా భన్సాలీతో విబేధాలు వచ్చాయని, దాని ఫలితంగా వీరిద్దరి 'ఇన్షా అల్లా' మూవీ అకాస్మాత్తుగా నిలిచిపోయిందని సమాచారం. తాజాగా మరోసారి తన సినిమాకు ఇదే రిపీట్‌ కావడంతో నేరుగా తానే దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించాలని అనుకున్నాడట సల్లూ భాయ్‌. అయితే ఈ సినిమాకు ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న ఫర్హాద్‌ సమ్‌జీ కో-డైరెక్టర్‌గా వ్యవహరిస్తాడని టాక్‌ వినిపిస్తోంది. 

చదవండి: హీరోయిన్‌ బాత్రూమ్‌లోకి చొరబడ్డ ఫ్యాన్‌.. పెళ్లి చేసుకోకుంటే చస్తానని బెదిరింపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement