direction
-
Sreeleela : రెట్రో షేడ్స్ లుక్స్‌తో శ్రీలీల.. మరో సావిత్రి అంటూ కామెంట్స్! (ఫొటోలు)
-
డైరెక్షన్ పై లేడీ సూపర్ స్టార్ ఇంటరెస్ట్..?
-
బాబు డైరెక్షన్లోనే పీకే వ్యాఖ్యలు!
సాక్షి, హైదరాబాద్: గతంలో ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆదివారం హైదరాబాద్‌లోని ఓ సదస్సులో ఏపీలో వైఎస్సార్సీపీపై చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు ప్రేరేపితమని బయటపడిపోయింది. టీడీపీ అధినేత చంద్రబాబుతో ముందుగా సమావేశమై, ఆయన డైరెక్షన్లోనే ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తేటతెల్లమైంది. హైదరాబాద్ నగరంలోని ఖరీదైన హోటల్లో బస చేసి, గంటల తరబడి చంద్రబాబుతో భేటీలు జరుపుతున్న ప్రశాంత్ కిషోర్.. బాబు వ్యూహంలో భాగంగానే వైఎస్సార్సీపీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఓ ఆంగ్ల పత్రిక సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ప్రశాంత్ కిషోర్ శనివారం మూడు గంటలపాటు చంద్రబాబుతో సమావేశమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఆ సమావేశంలో చంద్రబాబు కోరిన మేరకు ఆదివారం సదస్సులో ఏపీ ఎన్నికలపై వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. తాను సర్వేలు చేయడంలేదని, ఏ రాజకీయ పార్టీకీ సలహాలు ఇవ్వడంలేదంటూనే, పీకే ఒక పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటంలో ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎలాంటి సర్వేలు చేయకుండా, గణాంకాల్లేకుండానే ఓ పార్టీ ఓడిపోతుందని చెప్పడం కచ్చితంగా రాజకీయ ప్రేరేపితమేనని విశ్లేషకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రోజురోజుకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటం, టీడీపీ ఓటమి ఖాయమని తేలడంతో ప్రజల్లో గందరగోళం సృష్టించాలన్న ఉద్దేశంతోనే పీకేతో చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ వీరు వైసీపీపై ఇటువంటి విష ప్రచారాన్ని మరింతగా చేయాలని చంద్రబాబు, పీకే నిర్ణయించినట్లు చెబుతున్నారు. సోమవారమూ బాబుతో పీకే భేటీ సోమవారం ఉదయం కూడా ప్రశాంత్ కిషోర్ రెండున్నర గంటలపాటు చంద్రబాబుతో భేటీ అయ్యారు. టీడీపీ ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ (ఒకప్పుడు పీకే టీంలో సభ్యుడు), లోకేశ్ సన్నిహితుడు కిలారి రాజేష్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సమావేశం ముగిసేవరకు సోమవారం ఉదయం చంద్రబాబు మరెవరికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని తెలిసింది. పీకేతో భేటీ తర్వాతే చంద్రబాబు అనంతపురం జిల్లాలో టీడీపీ సమావేశానికి వెళ్లారని సమాచారం. సోమవారం సాయంత్రం ప్రశాంత్ కిషోర్ పాట్నా వెళ్లినట్లు తెలిసింది. -
హిట్ డైరెక్షన్
లైఫ్ డైరెక్షన్ బాగుండాలంటే కెరీర్ మంచి డైరెక్షన్లో వెళ్లాలి. ఆ డైరెక్షన్‌ని సెట్ చేసుకోవడంలోనే టాలెంట్ ఉంటుంది. సెట్ చేసుకున్నాక హిట్ డైరెక్షన్లో వెళ్లడానికి శ్రమ అనుకోకుండా వీలైనంత కష్టపడాలి. ఈ ఏడాది కొందరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి గోల్ సెట్ చేసుకుని, ఎంతో తపనతో ఎంటరయ్యారు. ఫస్ట్ మూవీతో నిరూపించుకోవడానికి హార్డ్‌వర్క్ చేశారు. హిట్ అయిన డైరెక్టర్ల శాతం ఎక్కువే ఉంది. అలా ‘హిట్ డైరెక్షన్’లో కెరీర్ పరంగా ఒక మెట్టు ఎక్కిన దర్శకులతో పాటు పరిచయం అయిన ఇతర దర్శకుల గురించి తెలుసుకుందాం. లక్ అంటే శ్రీకాంత్ ఓదెలదే. మరి.. దర్శకత్వం వహించిన తొలి చిత్రమే (‘దసరా’) పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అంటే లక్కే కదా. పైగా నేచురల్ స్టార్ నాని సినిమాకి చాన్స్ అంటే చిన్న విషయం కాదు. యాక్చువల్‌గా శ్రీకాంత్ పదో తరగతి చదువుతున్నప్పుడే సుకుమార్ దర్శకత్వం వహించిన ‘జగడం’ చూసి, సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. అయితే ఇంజినీరింగ్ పూర్తి చేశాక ఏ దర్శకుడి (సుకుమార్) సినిమా చూసి స్ఫూర్తిపొందారో.. అదే దర్శకుని వద్ద అసిస్టెంట్‌గా చేరేందుకు నాలుగేళ్లు కష్టపడ్డారు. ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగ స్థలం’ చిత్రాలకు సుకుమార్ వద్ద అసిస్టెంట్‌గా చేశారు శ్రీకాంత్. ‘రంగస్థలం’ తర్వాత తన నిజ జీవిత ఘటనలతో ‘దసరా’ కథ రాసుకున్నారు. ఆ కథ నిర్మాత సుధాకర్ చెరుకూరి, నానీలకు నచ్చడంతో సినిమా పట్టాలెక్కింది. తెలంగాణలోని గోదావరి ఖని సమీపంలో ఉన్న సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ‘దసరా’ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై, నాని కెరీర్లో తొలి వంద కోట్ల సినిమాగా నిలిచింది. శ్రీకాంత్ మలి చిత్రం కూడా నానీతోనే రూపొందనుందని టాక్. హాస్యనటుడిగా ప్రేక్షకులను అలరించిన వేణు యెల్దండిలో మంచి ఎమోషనల్ డైరెక్టర్ ఉండి ఉంటాడని ఎవరూ ఊహించి ఉండరు. ‘బలగం’ సినిమాతో తనలోని మంచి దర్శకుడ్ని ఆవిష్కరించుకున్నారు వేణు. వాస్తవానికి దగ్గరగా మరణం, భావోద్వేగాల చుట్టూ కథ రాసుకుని ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించారు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్ జంటగా ‘దిల్’ రాజు ప్రోడక్షన్స్‌లో హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఊహించని వసూళ్లను రాబట్టింది. ఇక తనకు తొలి చాన్స్ ఇచ్చిన ‘దిల్’ రాజుప్రోడక్షన్లోనే మలి సినిమా చేసేందుకు కథ సిద్ధం చేసుకుంటున్నారు వేణు. చదివింది ఇంజినీరింగ్ అయినా డైరెక్టర్ కావాలనే కలతో హైదరాబాద్‌లో అడుగుపెట్టారు షణ్ముఖ ప్రశాంత్. తన సొంత కథలతోనే పలు షార్ట్ ఫిలింస్ తీశారాయన. ఆ సమయంలో సుహాస్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో సుహాస్ హీరోగా నటించిన ‘కలర్ ఫోటో’ చిత్రంలో కొన్నాళ్లు దర్శకత్వం విభాగంలో చేశారు. ఆ తర్వాత సుహాస్ హీరోగా చేసిన ‘ఫ్యామిలీ డ్రామా’ చిత్రానికి రైటర్‌గా చేశారు. ఆ టైమ్‌లో తాను సిద్ధం చేసుకున్న ‘రైటర్ పద్మభూషణ్’ కథని సుహాస్‌కి చెప్పడం.. ఆయనకి నచ్చడంతో ఈ సినిమా పట్టాలెక్కింది. సుహాస్, టీనా శిల్పరాజ్ జంటగా నటించారు. మదర్ అండ్ ఫాదర్ సెంటిమెంట్, ఎమోషనల్–కామెడీ డ్రామాతో తొలి హిట్ సాధించారు షణ్ముఖ ప్రశాంత్. చిత్తూరు జిల్లా మంగళంపేటకు చెందిన కల్యాణ్ శంకర్ ‘మ్యాడ్’తో దర్శకుడిగా పరిచయమయ్యారు. స్వగ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్న కల్యాణ్ శంకర్ తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియారెడ్డి, అనంతికా సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్’. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర నిర్మించారు. విడుదలైన రెండు మూడు రోజుల్లోనే ఈ సినిమా లాభాల బాట పట్టింది. భీమవరానికి చెందిన క్లాక్స్ (అసలు పేరు ఉద్దరాజు వెంకటకృష్ణ పాండురంగ రాజు) తొలి చిత్రం ‘బెదురులంక 2012’తో హిట్ అందుకున్నారు. కార్తికేయ, నేహాశెట్టి జంటగా రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇండస్ట్రీలోకి రాకముందు క్లాక్స్ పలు ఉద్యోగాలు చేశారు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే ఇటాలియన్ సినిమా చూశాక ఇండస్ట్రీకి వెళ్లాలనే ఆలోచన కలిగింది. దర్శకులు సుధీర్ వర్మ, రామ్‌గోపాల్ వర్మ, దేవా కట్టాల వద్ద అసిస్టెంట్‌గా చేశారాయన. డైరెక్టర్ అజయ్ భూపతి ద్వారా హీరో కార్తికేయ పరిచయం కావడంతో ఆయనతో ‘బెదురులంక 2012’ తీసి హిట్ అందుకున్నారు. ఈ ఏడాది ఆఖరి నెలలో విడుదలైన ‘హాయ్ నాన్న’ చిత్రంతో దర్శకునిగా పరిచయమయ్యారు శౌర్యువ్. తొలి సినిమాతోనే హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారాయన. నాని, మృణాల్ ఠాకూర్ జంటగా, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలో నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. వైజాగ్‌కి చెందిన శౌర్యువ్‌ని ఇంట్లో వాళ్లు మెడిసిన్ చేయమన్నారు. అయితే సినిమాలపై ఇష్టంతో మూవీ నేపథ్యం లేకున్నా పరిశ్రమలోకి వచ్చారాయన. కన్నడ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ‘జాగ్వార్’, ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘ఆదిత్య వర్మ’ చిత్రాలకు సహాయ దర్శకుడిగా చేశారు. నాలుగేళ్ల క్రితమే ‘హాయ్ నాన్న’ కథ రాసుకున్నారు. ఈ కథ తొలుత నిర్మాతలకు, ఆ తర్వాత నానీకి నచ్చడంతో సినిమా పట్టాలెక్కింది. తండ్రీ కూతురు మధ్య ఉండే అనుబంధం, భావోద్వేగాలతో రూపొందిన ఈ చిత్రం హిట్‌తో దూసుకెళుతోంది. ఇంకా ‘వినరో భాగ్యము విష్ణుకథ’తో మురళీ కిశోర్ అబ్బూరు, ‘నరకాసుర’తో సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్, ‘విమానం’తో శివప్రసాద్ యానాల, ‘మిస్టర్ ప్రెగ్నెంట్’తో శ్రీనివాస్ వింజనంపాటి వంటి దర్శకులు హిట్ అందుకున్నారు. వీరితో పాటు మరికొందరు కొత్త దర్శకులు తమ ప్రతిభని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళా దర్శకుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఈ ఏడాది ‘మార్టిన్ లూథర్ కింగ్’ సినిమాతో పూజా కొల్లూరు దర్శకురాలిగా పరిచయమయ్యారు. అమెరికాలో డైరెక్షన్ , స్క్రీన్ రైటింగ్, సినిమాటోగ్రఫీ విభాగాల్లో డిగ్రీ పట్టాపొందారు పూజ. 30కి పైగా చిత్రాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలకు పని చేసిన పూజ పలు అవార్డులు సొంతం చేసుకున్నారు. సమాజానికి మంచి సినిమాలు అందించాలన్న లక్ష్యంతో ఇండియా వచ్చారామె. తొలి ప్రయత్నంగా సంపూర్ణేశ్ బాబు హీరోగా ‘మార్టిన్ లూథర్ కింగ్’ సినిమా తెరకెక్కించారామె. తమిళంలో విజయవంతమైన ‘మండేలా’కు తెలుగు రీమేక్‌గా ఇది రూపొందింది. ప్రధానంగా ఓటు విలువని తెలియజెప్పేలా ఈ చిత్రం సాగుతుంది. సమాజంలోని అసమానతల్ని ఎత్తి చూపుతూ ఆలోచింపజేస్తుందీ చిత్రం. తొలి చిత్రంతో దర్శకురాలిగా మంచి మార్కులు తెచ్చుకున్న పూజా కొల్లూరు తన తర్వాతి చిత్రాలకు కథలు సిద్ధం చేసుకుంటున్నారు. -
పిక్ టాక్: కొత్త అవతారం ఎత్తిన నయనతార!
తమిళసినిమా: అగ్ర కథానాయిక నయనతార కొత్త అవతారం ఎత్తనుందా అంటే ఆమె అభిమానులు అవుననే అంటున్నారు. ఎక్కడో కేరళ రాష్ట్రంలోని మారుమూల గ్రామంలో పుట్టిన డయానా కురియన్ అనే మలయాళ కుట్టి నయనతార నటిగా సినీ విశ్వరూపం దాల్చుతుందని ఆమె కూడా ఊహించి ఉండరు. నటిగా రంగప్రవేశం చేసి అగ్ర కథానాయకి స్థాయికి చేరుకుని ఆ తరువాత రౌడీ పిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి నిర్మాతగా అవతారం ఎత్తారు. అంతటితో ఆగకుండా వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్‌గా రాణిస్తున్నారు. మరో పక్క వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తూ నాలుగు చేతులా ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం తన కవల పిల్లలతో ముద్దు, మురిపాలు కురిపిస్తూనే మరో పక్క హీరోయిన్గా టాప్ లెవెల్లో సాగిపోతున్నారు. తాజాగా ఈమె కథానాయకి పాత్రకు ప్రాధాన్యత కలిగిన పాత్రలో నటించిన అన్నపూరణి చిత్రం డిసెంబర్ ఒకటో తేదీ తెరపైకి రానుంది. అదే విధంగా నయనతార నటిస్తున్న మరో చిత్రం మన్నాంగట్టి. ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఈ సందర్భంగా ఈమె కెమెరా వెనుక నిలబడి చూస్తున్న ఫొటోను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. అందులో ఇది న్యూ అవతారం నమ్మండి అని పేర్కొన్నారు. దీంతో మెగా ఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నారని ఆమె అభిమానులు సంబరపడుతున్నారు. అయితే ఇది పబ్లిసిటీ స్టంటా, లేక నయనతార భవిష్యత్తులో దర్శకత్వం వహించడానికి సిద్ధం అవుతున్నారా? అనే చర్చ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
మళ్లీ మెగాఫోన్ పట్టనున్న ప్రముఖ నటి!!
నటిగా రోహిణి 1974లోనే బాలనటిగా తెరంగేట్రం చేశారు. తర్వాత కథానాయకిగా పలు చిత్రాల్లో నటించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. అంతే కాదు ఈమెలో మంచి డబ్బింగ్ కళాకారిణి, దర్శకురాలు కూడా ఉన్నారు. 2005లోనే చిన్న చిన్న ఆశై అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.ఆ తరువాత ఒక డాక్యుమెంటరీ చిత్రం కూడా చేశారు. (ఇది చదవండి: కన్నీరు పెట్టుకున్న శోభ, యావర్.. నేడు షో టైమింగ్స్‌లో మార్పు) తాజాగా మరోసారి మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమైనట్లు సమాచారం. యదార్థ ఘటనలతో ఇప్పటికే చాలా చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో పలు చిత్రాలు విజయాన్ని సాధించాయి. జైభీమ్, సూరారై పోట్రు వంటి చిత్రాలు ఈ కోవలోకి వస్తాయి. కాగా ఆ మధ్య తమిళనాడునే ఉలిక్కిపడేలా చేసిన వాచ్ఛాత్తి హింసా సంఘటన ఇప్పుడు వెండితెరకెక్కనుంది. దీనికి నటి రోహిణి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. కాగా దీనికి రచయిత ఆదవన్ దీక్షగా మాటలు,కథనం రాస్తున్నారు. ఇందులో జై భీమ్ చిత్రం ఫేమ్ లిజోమోల్ జోస్ ప్రధాన పాత్రను పోషించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
చంటి బిడ్డల్లా సాదుకున్నా..!
సాక్షి, హైదరాబాద్: ‘‘ఎమ్మెల్యేలను చంటి బిడ్డల్లా సాదుకున్నా. చిన్న చిన్న పొరపాట్లతో ఓటమి కొని తెచ్చుకోవద్దు. 60రోజుల క్రితమే అభ్యర్థులను ప్రకటించినా చాలా మంది నియోజకవర్గాల్లో పార్టీలోని అంతర్గత అసమ్మతిని చక్కదిద్దుకోలేక పోయారు. పార్టీ అభ్యర్థులుగా ప్రకటించగానే ఎమ్మెల్యేలు అయినట్టుగా భావించకూడదు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయకపోతే ప్రజలు బండకేసి కొడతారని చరిత్ర చెప్తోంది..’’అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థులను హెచ్చరించారు. ఆదివారం తెలంగాణ భవన్లో పార్టీ అసెంబ్లీ అభ్యర్థులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. ఎంత చిన్నస్థాయి కార్యకర్త అయినా కలుపుకొని వెళ్లాలని.. గతంలో జూపల్లి కృష్ణారావు వంటి ఒకరిద్దరు నేతలు అలాంటి కారణాలతోనే ఓటమి పాలయ్యారని కేసీఆర్ వివరించారు. నాయకులను నిశితంగా పరిశీలించాకే ఓటర్లు నిర్ణయం తీసుకుంటారని.. ఏ ఒక్కరినీ తక్కువగా అంచనా వేయకుండా అందరితో కలసి పనిచేయాలని సూచించారు. వరుసగా పదేళ్లపాటు మనం అధికారంలో ఉన్నందున ప్రజల్లో కొంత అసహనం ఉండటం సహజమేని.. ప్రజల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సహనంతో సమాధానాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. సర్వేల ఫలితాలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని.. ప్రజల నాడి తెలిసిన వ్యక్తిగా చెప్తున్నా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మనమే గెలుస్తున్నామని భరోసా ఇచ్చారు. మేనిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. అభ్యర్థులందరి అఫిడవిట్ల పరిశీలన! నామినేషన్లు, అఫిడవిట్ల దాఖలు సహా ఎన్నికల సంఘం నిబంధనలను పాటించడంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చూపినా మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అభ్యర్థులను సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ‘‘ఇంతకుముందు మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వంటి నేతలు భారీ మెజారిటీతో గెలుపొందినా అఫిడవిట్లలోని కొన్ని సాంకేతిక అంశాలతో ఇబ్బందులు పడ్డారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా సమర్పించే అఫిడవిట్లలో తప్పులు లేకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు, నేరారోపణలకు సంబంధించిన అంశాలు ఉంటే కచ్ఛితంగా పేర్కొనండి. ట్రాఫిక్ చలాన్లు, ఫోన్ బిల్లులు, విద్యుత్ బిల్లుల బకాయిలు, ఆదాయ పన్ను రిటర్నులు వంటివీ జాగ్రత్తగా చూసుకోండి. ఈసారి పార్టీ అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్లను బీఆర్ఎస్ లీగల్ సెల్ స్రూ్కటినీ చేస్తుంది. ఈ నెల 21వ తేదీ సాయంత్రం లోపు అఫిడవిట్లను తెలంగాణభవన్‌లో డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్‌కుమార్ గుప్తా బృందానికి అందజేయాలి..’’అని కేసీఆర్ ఆదేశించారు. పార్టీ నిధి నుంచి ఎన్నికల ఖర్చు కోసం అభ్యర్థులకు ఇస్తున్న డబ్బులతో ప్రత్యేక ఖాతాను తెరవాలని సూచించారు. నామినేషన్ దాఖలు కోసం చివరి తేదీ వరకు వేచి చూడొద్దని స్పష్టం చేశారు. ఎన్నికల వ్యయం వివరాలను ఏ రోజుకారోజే అధికారులకు అప్పగించి రశీదులు తీసుకోవాలని చెప్పారు. ఎన్నికల ఏజెంట్ల నియామకం మొదలుకుని ఓట్ల లెక్కింపు దాకా అప్రమత్తంగా ఉండాలన్నారు. తాను తొలిసారి పోటీ చేసినప్పుడు ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా లేనందునే ఓటమి పాలయ్యానని పేర్కొన్నారు. పోలింగ్ రోజున అన్ని బూత్‌లను పార్టీ అభ్యర్థులు పరిశీలించాలన్నారు. 69 మందికి బీఫారాలు.. రూ.40 లక్షల చెక్కులు అభ్యర్థులకు బీఫారాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం ప్రగతిభవన్‌లో ప్రారంభించారు. తన సెంటిమెంట్ అయిన ఆరు సంఖ్య వచ్చేలా 15 న 51 మంది అభ్యర్థులకు తొలి విడతగా పంపిణీ చేశారు. ఇందులోనూ ఆరుగురు అభ్యర్థులకు సంబంధించి ప్రగతిభవన్‌లో, మిగ తా వారికి తెలంగాణ భవన్లో అందజేశారు. నిర్ణయించిన ముహూర్తం మేరకు ఉదయం ప్రగతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో జీవన్‌రెడ్డి (ఆర్మూర్), కేటీఆర్ (సిరిసిల్ల), హరీశ్‌రావు (సిద్దిపేట), పల్లా రాజేశ్వర్‌రెడ్డి (జనగాం), బాల్క సుమన్ (చెన్నూరు), కేసీఆర్ (గజ్వేల్) బీఫారాలు అందుకున్నారు. తెలంగాణభవన్‌లో మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తరఫున కామారెడ్డి బీఫారంను సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తీసుకున్నారు. తన తల్లి మృతిచెందిన నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి (బాల్కొండ) రాలేకపోవడంతో ఆయన తరఫున ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఫాం అందుకున్నారు. పార్టీ అభ్యర్థులకు బీఫారాలతోపాటు ప్రచార ఖర్చు నిమిత్తం పార్టీ నిధి నుంచి ఒక్కొక్కరికి రూ.40లక్షల చొప్పున చెక్కులను కూడా అందజేశారు. అయితే కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టిన ఐదు సీట్లకుగాను పల్లా రాజేశ్వర్‌రెడ్డి (జనగామ) ఒక్కరే ఆదివారం బీఫారం అందుకున్నారు. నర్సాపూర్, మల్కాజిగిరి, గోషామహల్, నాంపల్లి సీట్లలో ఎవరు పోటీచేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆదివారం సాయంత్రమే రెండో విడత బీఫారాల పంపిణీ మొదలైంది. కేసీఆర్ చేతుల మీదుగా మరో 18 మంది అభ్యర్థులు బీఫారాలు తీసుకున్నారు. బీఫారాలు తీసుకున్నవారి సంఖ్య 69కి చేరింది. -
ఎలాగైనా గెలవాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అన్ని అనుకూల పరిస్థితులున్నందున వీటిని ఉపయోగించుకుని విజయం సాధించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. విజయం దిశగా కట్టుదిట్ట మైన కార్యాచరణను, ఎన్నికల వ్యూహాలను అమలు చేయాలని రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలను ఆయన ఆదేశించారు. ప్రజల్లో కేసీఆర్ సర్కార్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతున్నందున దానిని బీజేపీకి అనుకూలంగా ఓట్లుగా మార్చేకునే దిశగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర పార్టీకి, నేతలకు అవసరమైన సహాయ, సహకారాలు, తోడ్పాటును అందించేందుకు జాతీ య నాయకత్వం సిద్ధం ఉందని హామీ నిచ్చారు. మంగళవారం రాత్రి బేగంపేటకు సమీపంలోని ఓ స్టార్ హోటల్లో కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్‌తో అమిత్ షా భేటీ అయ్యారు. ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరు, ఎన్నికల మేనిఫెస్టో తయారీ, అభ్యర్థులకు సంబంధించి రెండు, మూడు జాబితాల తయారీపై కసరత్తు, ఎన్నికల్లో అనుసరించబోయే వ్యూహాలు, ప్రచార సరళి తదితర అంశాలన్నింటిపైనా సమీక్ష నిర్వహించినట్టు సమాచారం.గ్రేటర్‌పై ఫోకస్ పెంచండిజీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు గెలిచి అనూహ్య ఫలితాలు సాధించినందున, గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి, చుట్టుపక్కల జిల్లాలపై ఫోకస్ పెట్టి అత్యధిక స్థానాలు గెలిచేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని అమిత్ షా ఆదేశించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా పార్టీకి బలమున్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్‌లతో పాటు మహబూబ్‌నగర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించినట్టు తెలిసింది. ఇక పార్టీపరంగా అంతగా బలం లేని ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌తో పాటు నల్లగొండ జిల్లా పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో కార్యకలాపాలు, ఎన్నికల ప్రచారవేగం ముమ్మరం చేయాలని ఆదేశించినట్టు సమాచారం. ఈ భేటీ అనంతరం అమిత్ షాను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి, రాష్ట్ర పార్టీ ప్రధానకార్యదర్శి బంగారు శ్రుతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక బేగంపేట విమానాశ్రయంలో అమిత్‌షాను బీజేపీ జాతీయకార్యవర్గసభ్యుడు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి కలుసుకున్నారు. తొలి జాబితాలోని 38 మంది అభ్యర్థుల బలాబలాలపై ఆరా ఇక ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఖరారు చేయబోతున్న 38 మంది అభ్యర్థుల తొలి జాబితాపై చర్చించారు. వీరి విజయావకాశాలు, బలాబలాలు తదితర అంశాలపై ఆరా తీసినట్టు తెలిసింది. ప్రస్తుతం పార్టీలో వివిధ స్థానాల్లో (తొలిజాబితా మినహాయించి) పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న వారు, పార్టీ పరంగా బలమైన అభ్యర్థులుగా పరిగణిస్తున్న వారు ఎవరెవరు ఉన్నారన్న అంశాలపైనా ఆరా తీసినట్టు సమాచారం. బీజేపీలో చేరేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్న వాళ్లెవరు, ఏ స్థానంలోనైనా సీటు కావాలని కోరుకుంటున్న వారెవరు, చేరేందుకు ఏదైనా కమిట్ మెంట్, హామీ కోరుకుంటున్నారా అన్న విషయాలపై రాష్ట్ర పార్టీ నేతలను అమిత్‌షా ప్రశ్నించినట్టు తెలిసింది. -
జెంటిల్మన్లో భాగమవడం సంతోషం – ప్రాచీ తెహ్లాన్
‘‘జెంటిల్మన్ 2’ సినిమాలో నటించాలని నిర్మాత కేటీ కుంజుమోన్ గారు ఫోన్ చేసినప్పుడు చాలా ఎగ్జయిటింగ్‌గా ఫీలయ్యాను. ఓ బ్లాక్ బస్టర్ మూవీ ఫ్రాంచైజీలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని హీరోయిన్ ప్రాచీ తెహ్లాన్ అన్నారు. అర్జున్, మధుబాల, శుభశ్రీ ప్రధాన పాత్రల్లో శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జెంటిల్‌మేన్’. కేటీ కుంజుమోన్ నిర్మించిన ఈ సినిమా 1993లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘జెంటిల్మన్ 2’ నిర్మిస్తున్నారు కుంజుమోన్. చేతన్ చీను హీరోగా ఎ.గోకుల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా అవకాశం రావడంపైప్రాచీ తెహ్లాన్ మాట్లాడుతూ–‘‘జెంటిల్మన్ 2’ లో ఇప్పటి వరకు చేయనటువంటి పాత్ర చేస్తున్నాను. యాక్షన్ సన్నివేశాల్లోనూ మెప్పించబోతున్నాను. ఈ సీక్వెన్స్ లో నటించటం సవాల్‌తో కూడుకున్నది.. ఇందుకోసం శిక్షణ తీసుకున్నాను. త్వరలోనే షూటింగ్లో పాల్గొనబోతున్నాను’’ అన్నారు. -
రెండు భాగాలు?
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ యాక్షన్ ఫిల్మ్ రూపొందనున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే ఈ చిత్రం రెండు భాగాలుగా రానున్నదనే టాక్ తాజాగా ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఓ సాధారణ కానిస్టేబుల్ గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాల్సి వచ్చిందనే కోణంలో ఈ సినిమా కథనం ఉంటుందని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఈ సినిమాలో తొలుత హీరోయిన్గా శ్రీలీలను అనుకున్నారు. కానీ కాల్షీట్స్ సర్దుబాటు విషయంలో ఇబ్బందులు రావడంతో శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకున్నారని, ఆమె స్థానంలో రష్మికా మందన్నాను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. గతంలో విజయ్–రష్మిక కాంబినేషన్లో ‘గీతగోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యంగా దూసుకెళ్లండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రానున్న అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు బండి సంజయ్ కుమార్‌కు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు మరింత దూకుడుగా వ్యవహరించాలని చెప్పారు. సోమవారం ఢిల్లీలో తనను కలిసిన బండి సంజయ్‌తో సుమారు 30 నిమిషాలపాటు రాష్ట్ర రాజకీయ వ్యవహారాలపై అమిత్ షా చర్చించారు. ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అప్పగించిన తర్వాత మొదటిసారి బండి సంజయ్ అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా పారీ్టకి సంబంధించిన వ్యవహారాలు, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం, ప్రధాని సహా కేంద్రమంత్రుల పర్యటనలు తదితర అంశాలపై అమిత్ షా పలు సూచనలు చేశారు. అంతేగాక ఇటీవల కిషన్‌రెడ్డి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల స్వీకరణ రోజు బండి సంజయ్ సహా పలువురు నాయకులు చేసిన వ్యాఖ్యల గురించి అమిత్ షా అడిగి తెలుసుకున్నారని సమాచారం. పార్టీ అంతర్గత విషయాలను బహిరంగ వేదికలపై, మీడియాతో మాట్లాడరాదని అమిత్ షా సూచించారని తెలిసింది. బండితో భేటీకి సంబంధించిన సమాచారాన్ని అమిత్ షా స్వయంగా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలను బండితో చర్చించినట్లు చెప్పారు. అనంతరం షాతో భేటీకి సంబంధించి బండి సైతం ట్వీట్ చేశారు. రాజకీయ చాణక్యుడు అమిత్ షాను కలవడం సంతోషంగా ఉందని, ఆయన మార్గదర్శనంలో పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానని బండి వెల్లడించారు. -
DJ టిల్లుతో సమంత రొమాన్స్..?
-
సినిమాలకు గుడ్ బై? ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చిన సూపర్ స్టార్
-
సుధీర్ పక్కన హీరోయిన్ ఎలా సిగ్గు పడుతుందో చూడండి
-
మరో మాస్ కాంబినేషన్
-
డైరెక్టర్ గా మారిన శేఖర్ మాస్టర్.. హీరో ఎవరో తెలుసా..?
-
డాన్స్ మాస్టర్ బృందా దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ
ప్రముఖ డాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘థగ్స్’. ఈ చిత్రం ద్వారా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిబు తమీన్స్ కుమారుడు హ్రిదు హరూన్ హీరోగా పరిచయమవుతున్నారు. తమీన్స్ సింహ, ఆర్కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ ముఖ్య పాత్రలు చేశారు. హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్ సమర్పణలో జియో స్టూడియోస్‌తో కలిసి రియా శిబు నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్స్‌ని విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్, ఆర్య, అనిరుధ్, కీర్తీ సురేష్ విడుదల చేశారు. తెలుగులో ‘కోనసీమ థగ్స్’ పేరుతో ఈ సినిమా విడుదల కానుంది. డైరెక్టర్ బృందా గోపాల్ మాట్లాడుతూ..‘‘కోనసీమ నేపథ్యంలో జరిగే రా యాక్షన్ ఫిల్మ్ ఇది. ప్రేక్షకులకు గ్రిప్పింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి శామ్ సీఎస్ సింగీతం అందించారు. -
నటనకు గుడ్‌బై? దర్శకురాలిగా మారనున్న రాధికా ఆప్టే?
తమిళసినిమా: నటి రాధికా ఆప్టే గురించి పరిచయం అక్కర్లేదు. అందాల ఆరబోతలో ఈ అమ్మడిని మించిన వారు ఉండరేమో. తమిళంలో ధోని చిత్రంతో నటిగా రంగ ప్రవేశం చేసిన ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగు తదితర భాషల్లో నటిస్తూ తనదైన ముద్ర వేసుకుంది. తమిళంలో రజనీకాంత్ సరసన కబాలి చిత్రంలో నటించి పేరు తెచ్చుకున్నారు. తర్వాత బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లోనూ బిజీ అయ్యారు. అయితే తాను నటించిన కథానాయకులపైనే విమర్శలు చేస్తూ వివాదాస్పద నటి అనే ముద్ర వేసుకుంది. అలాంటి ఈ నటి దృష్టి ఇప్పుడు దర్శకత్వంపై పడింది. ఇప్పటి వరకు ఇతరుల డైరక్షన్లో నటించిన ఈ బ్యూటీ త్వరలో హీరోలని డైరెక్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నారట. దీని గురించి ఒక భేటీలో రాధికా ఆప్టే మాట్లాడుతూ దర్శకురాలు కావాలనే మొదట భావించానని చెప్పింది. అయితే అనూహ్యంగా హీరోయిన్ అయ్యానని తెలిపింది. తాను దర్శకత్వం శాఖలో శిక్షణ పొందినట్లు చెప్పింది. అది నటనకు ఉపయోగపడిందని పేర్కొంది. అయితే ఇప్పుడు మెగా ఫోన్ పట్టాలని నిశ్చయించుకున్నట్లు చెప్పింది. అయితే స్క్రీన్‌ప్లే రూపొందించడంలో తగిన శిక్షణ పొందాలని, అందుకు ప్రముఖ దర్శకుల వద్ద పని చేయ్యాలనుకుంటున్నట్లు చెప్పింది. అదే సమయంలో కొన్ని కథలను సిద్ధం చేసుకుంటున్నారని చెప్పింది. అలాగని నటనకు స్వస్తి చెబుతున్నానని భావించరాదని, తన తొలి ప్రాధాన్యత నటనకేనని పేర్కొంది. అయితే ఈ అమ్మడు ఏ భాషలో దర్శకత్వం వహించేది మాత్రం చెప్పలేదు. -
వైఎస్ఆర్సీపీ నేతలకు సీఎం వైఎస్ జగన్ దిశా నిర్దేశం
-
ఆ నటుడి డైరెక్షన్లో సమంత నెక్ట్స్ మూవీ?
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం యశోద మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన యశోద చిత్రం మంచి విజయం సాధించింది. బక్సాఫీసు వద్ద ఈ మూవీ భారీ వసూళ్లు సాధించింది. సరోగసి నేఫథ్యంలో వచ్చిన ఈసినిమాలో తన నటన, యాక్షన్ సీక్వెన్స్‌లో అలరించింది. దీంతో ఆమె తదుపరి చిత్రాలపై ఆసక్తి నెలకొంది. నెక్ట్ సమంత ఎవరి డైరెక్షన్లో చేయనుంది, ఎవరికి ఒకే చెప్పనుందనేది చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఆమె ఓ నటుడు దర్శకత్వంలో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: సూపర్ స్టార్ కృష్ణకు ఘన నివాళి.. మహేశ్ బాబు కీలక నిర్ణయం! స్టార్ హీరోయిన్ సమంత నటుడు డైరెక్షన్లో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సమంతకు ఓ స్టోరీ లైన్ వినిపిండాడట. అది ఆమెకు బాగా నచ్చిందని, దీంతో వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్. అయితే మొదట రాహుల్ ఈ కథను రష్మికకు వినిపించాడట, ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా చేయలేనని చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత సమంత కోసం ఈ స్క్రీప్ట్ మర్పులు చేసి ఆమెకు స్టోరీ చెప్పగా సమంత ఒకే చేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి. కాగా ప్రస్తుతం సమంత ఖుషి సినిమాలో నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రేమకథా రూపొందుతున్న ఈచిత్రంలో సామ్ విజయ్‌తో జతకట్టింది. చదవండి: కాబోయే భర్తను పరిచయం చేసిన తమన్నా! షాకవుతున్న నెటిజన్లు -
రాజకీయ పార్టీని పక్కన పెట్టి.. మళ్లీ మెగా ఫోన్ పట్టి హీరోగా..
చాలా గ్యాప్ తర్వాత దర్శకుడు వి.గౌతమన్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈయన ఇంతకుముందు కనవే కలయాదే, మగిల్చి వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. మధ్యలో రాజకీయాలకు వెళ్లిన ఈయన సొంతంగా రాజకీయ పార్టీని కూడా ప్రారంభించారు. అలాంటిది చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాలపై దృష్టి సారించారు. ఈయన దర్శకత్వం వహించి కథానాయకుడుగా నటించే చిత్రానికి మావీర అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వాస్తవ సంఘటన నేపథ్యంలో చిత్రాలు చేసే ఈయన తాజాగా పడమినీ, మహిళల గౌరవాభిమానాన్ని కాపాడిన మందిరక్కాడు వీరుడి జీవిత చరిత్ర మావీర పేరుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శత్రువులను తుది ముట్టించాలన్న భావన కంటే వారి మనసులను గెలవడం ముఖ్యమని భావించే కథాంశంతో రూపొందిస్తున్న చిత్రం ఇదని వి.గౌతమన్ పేర్కొన్నారు. ఆసక్తికరమైన అంచనాలతో యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. దీనికి జై ప్రకాష్ కుమార్ సంగీతం, వైరముత్తు పాటలు, వెట్రివేల్ మహేంద్రన్ చాయాగ్రహణం అందించనున్నారని తెలిపారు. వీకే ప్రొడక్షన్స్ పతాకంపై తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు చెప్పారు. -
మధ్యలో తప్పుకున్న దర్శకులు.. మెగా ఫోన్ పట్టిన స్టార్ హీరోలు
ఇండస్ట్రీలో క్రియేటివ్ కథలు ఉన్నట్లే, అప్పుడప్పుడూ ‘క్రియేటివ్ డిఫరెన్సెస్’ కూడా ఉంటాయి. అభిప్రాయ భేదాల వల్ల కొన్నిసార్లు హీరోయే దర్శకుడిగా మారాల్సి వస్తుంది. డేట్స్ అడ్జస్ట్ చేయలేక పోవడంవల్ల కూడా ఒప్పుకున్న సినిమా నుంచి దర్శకుడు తప్పుకోవచ్చు. అలా ఈ మధ్య కొందరు దర్శకులు తప్పుకుంటే వారి స్థానంలో హీరోయే డైరెక్టర్‌గా మారారు. అలా డైరెక్షన్ మారింది. ఆ విశేషాలు తెలుసుకుందాం. విశాల్ కెరీర్లో ఉన్న విజయవంతమైన చిత్రాల్లో ‘తుప్పరివాలన్’ (2017) (తెలుగులో ‘డిటెక్టివ్’) ఒకటి. మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ చేసిన ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఎంతలా అంటే ‘తుప్పరివాలన్’ సీక్వెల్ కోసం ఎదురు చూసేంత. ప్రేక్షకుల ఆసక్తిని గమనించిన విశాల్, మిస్కిన్ ‘తుప్పరివాలన్ 2’ను ప్రకటించారు. వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని వెంటనే షూటింగ్ కూడా ఆరంభించారు. కానీ అనుకోకుండా ఈ సీక్వెల్‌కు బ్రేక్‌లు పడ్డాయి. షూటింగ్ లొకేషన్స్, బడ్జెట్, కథ అంశాల్లో విశాల్, మిస్కిన్‌ల మధ్య అభిప్రాయభేదాల వల్లే ఈ బ్రేక్ అనే వార్తలు వచ్చాయి. ఈ వార్త నిజమే అన్నట్లుగా ‘తుప్పరివాలన్ 2’కు తానే దర్శకత్వం వహిస్తున్నట్లుగా ఓ సందర్భంలో ప్రకటించారు విశాల్. అలా హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకు అయితే ‘తుప్పరివాలన్ 2’కు విశాలే దర్శకుడు. చర్చలు సఫలమై మిస్కిన్ మళ్లీ టేకప్ చేస్తారనే టాక్ కూడా ఉంది. (చదవండి: బాలీవుడ్లో సమంత భారీ సినిమా.. హీరోగా ఎవరంటే?) మరోవైపు యశ్ ‘కేజీఎఫ్’ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్‌ను బాగా థ్రిల్ చేశాయి. ఈ చిత్రం హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్లకు ఎంత పేరు వచ్చిందో ‘కేజీఎఫ్’ స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్బు, అరివులకు అంతే పేరు వచ్చింది. ఈ ఇద్దరూ దర్శకులుగా మారాలనుకున్నారు. కొరియోగ్రాఫర్, నటుడు, దర్శక–నిర్మాత రాఘవా లారెన్స్ వీరికి ఆ చాన్స్ ఇచ్చారు. అన్బు, అరివుల దర్శకత్వంలో రాఘవా లారెన్స్ హీరోగా ‘దుర్గ’ అనే సినిమా షూటింగ్ ఆరంభమైంది కూడా. కానీ వివిధ కారణాల వల్ల ‘దుర్గ’ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి అన్బు, అరివులు తప్పుకున్నారు. ఇప్పుడు ‘దుర్గ’ సినిమాకు రాఘవా లారెన్స్‌నే దర్శకత్వం వహిస్తున్నారని కోలీవుడ్ సమాచారం. సేమ్ సీన్ బాలీవుడ్‌లోనూ రిపీట్ అయ్యింది. అజయ్ దేవగన్ హీరోగా‘బోళ’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తమిళంలో కార్తీ నటించిన ‘ఖైదీ’ సినిమాకు ‘బోళ’ హిందీ రీమేక్. ఈ చిత్రానికి ముందు దర్శకుడిగా ధర్మేంద్ర శర్మ బాధ్యతలు తీసుకున్నారు. కారణం బయటకు రాలేదు కానీ ఇప్పుడు ‘బోళ’ సినిమాకు అజయ్ దేవగన్నే దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా దర్శకుడు మారడం తెలుగులోనూ జరిగింది. హీరో విశ్వక్ సేన్, దర్శకుడు నరేశ్ కుప్పిలి కాంబినేషన్లో ‘పాగల్’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత విశ్వక్, నరేశ్ కలిసి ‘దాస్ కా దమ్కీ’ అనే సినిమాను ఆరంభించారు. కానీ ఇప్పుడు ఈ సినిమాకు నరేశ్ దర్శకుడు కాదు. విశ్వక్ సేన్ ఆ బాధ్యతలను స్వీకరించారు. ఇలా హీరోయే దర్శకుడిగా మారిన మరికొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి. -
తప్పుకున్న ప్రొడ్యూసర్.. డైరెక్టర్‌గా సల్మాన్ ఖాన్ ?
Salman Khan Turn Into Director For Kabhi Eid Kabhi Diwali Movie: బాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సల్మాన్ ఖాన్ త్వరలో మెగాఫోన్ పట్టుకోనున్నాడన్న వార్త బీటౌన్ ఫిల్మ్ దునియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకు తన నటన, హావాభావాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరించిన సల్లూ భాయి దర్శకుడిగా కూడా తానేంటో నిరూపించుకోనున్నాడని తెలుస్తోంది. త్వరలోనే సల్మాన్ ఖాన్ ఓ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడని, అందుకు అంతా సిద్ధమైందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. సల్మాన్ సొంత బ్యానర్లో 'కబీ ఈద్ అబీ దివాలి' మూవీ రూపొందనుంది. ఈ సినిమాకు మరో నిర్మాతగా ఉన్న సాజిద్ నదియావాలా ఇటీవలే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఏకైక నిర్మాతగా ఉన్న సల్మాన్ ఖాన్ తానే దర్శకత్వ బాధ్యతలు కూడా స్వీకరించాలని నిర్ణయుంచుకున్నాడని టాక్. చదవండి: తన గర్ల్‌ఫ్రెండ్స్ అందరికీ పెళ్లయిందన్న హీరో.. వీడియో వైరల్ అయితే సల్మాన్ ఖాన్ సన్నిహితుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం గత నాలుగైదేళ్లుగా తన సినిమాలకు ఘోస్ట్ డైరెక్టర్‌గా వ్యహరిస్తున్నాడని తెలుస్తోంది. 'గత 4-5 సంవత్సరాలుగా అతను చేసిన చాలా సినిమాలకు ఎవరు దర్శకత్వం వహిస్తున్నారని మీరు అనుకుంటున్నారు ? భాయ్ అనుమతి లేకుండా ఒక్క ఫ్రేమ్ కూడా అవుట్‌పుట్‌లోకి రాదు. అతను చాలా కాలంగా తన సినిమాలను ఎడిటింగ్ చేస్తున్నాడు.' అని తెలిపారు. సల్మాన్ జోక్యం కారణంగానే సంజయ్ లీలా భన్సాలీతో విబేధాలు వచ్చాయని, దాని ఫలితంగా వీరిద్దరి 'ఇన్షా అల్లా' మూవీ అకాస్మాత్తుగా నిలిచిపోయిందని సమాచారం. తాజాగా మరోసారి తన సినిమాకు ఇదే రిపీట్ కావడంతో నేరుగా తానే దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించాలని అనుకున్నాడట సల్లూ భాయ్. అయితే ఈ సినిమాకు ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న ఫర్హాద్ సమ్జీ కో-డైరెక్టర్‌గా వ్యవహరిస్తాడని టాక్ వినిపిస్తోంది. చదవండి: హీరోయిన్ బాత్రూమ్లోకి చొరబడ్డ ఫ్యాన్.. పెళ్లి చేసుకోకుంటే చస్తానని బెదిరింపు -
రజనీకాంత్ కుమార్తె జీవితంలో కొత్త మలుపు.. ట్వీట్ చేసిన ఐశ్వర్య
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్యకి బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. తమిళ చిత్ర సీమలో డైరెక్టర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు హిందీ పరిశ్రమలో అడుగుపెడుతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆమె స్వయంగా ప్రకటించారు. ‘‘ఈ వారాన్ని ఇంతకంటే అద్భుతంగా ప్రారంభించలేను. దర్శకురాలిగా బాలీవుడ్లో నా ప్రయాణాన్ని మొదలుపెడుతున్నానని చెప్పడం ఎంతో సంతోషాన్నిస్తోంది. ‘ఓ సాథీ చల్’ అనే ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాను. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అని పేర్కొన్నారు ఐశ్వర్య. కాగా ‘ఓ సాథీ చల్’ అనే సినిమాని సీ9 పిక్చర్స్ నిర్మించనుంది. My week couldn’t have started better..Happy n feeling blessed to announce my directorial debut in Hindi “Oh Saathi Chal”,an extraordinary true love story,produced by @MeenuAroraa @Cloud9Pictures1 @archsda #NeerajMaini need all your blessings n wishes pic.twitter.com/zqDH2BkQme — Aishwarya Rajinikanth (@ash_rajinikanth) March 21, 2022 -
ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించిన సినిమా ఇదే..
Prime Minister Narendra Modi Appriciates The Kashmir Files Movie Team: సామాజిక అంశాలను వెండితెరపై ఆవిష్కరించే దర్శకులలో వివేక్ అగ్నిహోత్రి ఒకరు. ఇదివరకు ఆయన తెరకెక్కించిన 'ది తాష్కెంట్ ఫైల్స్' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా 90వ దశకంలో కశ్మీర్ పండిట్లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'. ఈ సినిమాలో బాలీవుడ్ పాపులర్ నటులైన అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి కీలకపాత్రల్లో నటించారు. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టగా.. విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. ఇటీవలే హర్యానా, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు ఈ సినిమాకు పన్ను మినహాయింపును కూడా ప్రకటించాయి. చదవండి: డైరెక్టర్ కాళ్లు పట్టుకుని ఏడ్చేసిన మహిళ అయితే తాజాగా 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రబృందం శనివారం (మార్చి 12) ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆ సినిమాను, మూవీ యూనిట్‌ను అభినందించారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ తన ట్విటర్ హ్యాండిల్లో షేర్ చేస్తూ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను ఆయ ప్రశంసించడం, దాని గొప్పతనం గురించి చెప్పిన మాటలు మాకు ఎంతో ప్రత్యేకం. మేము ఆ చిత్రాన్ని నిర్మించడంలో ఎప్పుడూ గర్వపడలేదు. ధన్యవాదాలు మోదీజీ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ప్రేక్షకులతో పంచుకున్నారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. I am so glad for you @AbhishekOfficl you have shown the courage to produce the most challenging truth of Bharat. #TheKashmirFiles screenings in USA proved the changing mood of the world in the leadership of @narendramodi https://t.co/uraoaYR9L9 — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 12, 2022 -
మళ్లీ సింగిల్ లెటర్‌తో ఉపేంద్ర సినిమా.. ఏడేళ్ల తర్వాత
Upendra Returns To Direction With Single Letter Movie U: ఉపేంద్ర విలక్షణ నటుడు అనే సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘ఓంకారం, ఎ, ఉపేంద్ర’ తదితర చిత్రాల ద్వారా దర్శకుడిగానూ తన విశిష్టతను చాటుకున్నారు. అయితే ‘ఉప్పి 2’ (2015) తర్వాత మళ్లీ ఉపేంద్ర మెగాఫోన్ పట్టలేదు. ఏడేళ్ల గ్యాప్ తర్వాత తాజాగా ఓ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు సింగిల్ లెటర్ టైటిల్‌ను పెట్టారు. ఒక అక్షరంతో సినిమా తీయడం ఉపేంద్రకు బాగా అలవాటు. ఇదివరకూ ఎ, రా చిత్రాలు కన్నడతోపాటు తెలుగులోనూ మంచి విజయం సాధించాయి. ఒక సినిమాకు అయితే టైటిలే లేకుండా కేవలం సింబల్‌ను వాడి సూపర్ అనే మరో మూవీ తీశారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు 'యూ' అనే భిన్నమైన టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం (మార్చి 11) విడుదల చేశారు. కన్నడంలో ‘టగరు’, ‘సలగ’ వంటి సినిమాలను నిర్మించిన వీనస్ ఎంటర్టైన్మెంట్స్తో కలసి లహరి మ్యూజిక్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఉపేంద్ర మాట్లాడుతూ ‘‘భారీ నిర్మాణ సంస్థలతో కలిసి ఈ ప్యాన్ ఇండియన్ ఫిల్మ్ చేయడానికి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. ‘‘ఉపేంద్ర ‘ఎ’ చిత్రం నుంచి ఆయనతో మాకు మంచి అసోసియేషన్ ఉంది’’ అన్నారు లహరి మ్యూజిక్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి. మనోహరన్. ‘‘దేశవ్యాప్తంగా ఈ సినిమా అభిమానులను మెప్పిస్తుంది’’ అన్నారు వీనస్ ఎంటర్టైన్మెంట్స్ శ్రీకాంత్. In the film Industry, it is you who created the story Upendra, it is you who wrote the screenplay & dialogues for 33 years, it is you who directed through your whistles and claps. I dedicate this film to you the praja prabhu fans 🙏🙏🙏#nimmaupendra #uppidirects #laharifilms pic.twitter.com/h4UsatujyT — Upendra (@nimmaupendra) March 11, 2022 -
నయనతార, విఘ్నేష్ శివన్ నిర్మాతలుగా మరో కొత్త సినిమా..
చెన్నై(తమిళనాడు): నటి నయనతార తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి రౌడీ పిక్చర్స్ నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సంస్థలో నిర్మించిన కూళాంగళ్, రాఖీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. తాజాగా మరో చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యారు. దీనికి ఊర్ కురువి అనే టైటిల్ నిర్ణయించారు. ఇందులో బిగ్‌బాస్ ఫేమ్ కవిన్ కథానాయకుడిగా నటించనున్నారు. ఈయన హీరోగా నటించిన లిప్టు చిత్రం ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదలై మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కాగా ఊర్ కురువి చిత్రం ద్వారా అరుణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్ర వివరాలను నిర్మాత విఘ్నేష్ శివన్ విజయదశమి సందర్భంగా మీడియాకు వెల్లడించారు. అరుణ్ తన వద్ద తానా సేంద కూట్టం చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేశాడన్నారు. అతని ప్రతిభను గుర్తించి దర్శకుడిగా పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. -
సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుదేవా
Prabhu Deva Sensational Decision: ఇండియన్ మైకేల్ జాక్సన్‌గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా..నటుడిగా, దర్శకుడిగా సత్తా చాటారు. 2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంతో దర్శకుడిగా మారిన ప్రభుదేవా తొలి చిత్రంతోనే హిట్ కొట్టారు. ఆ తర్వాత రూపొందించిన పౌర్ణమి సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. అయితే పోకిరి సినిమాను రీమేక్ చేసి హిందీ, తమిళ భాషల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. చదవండి : ఆ సమస్యతో బాధపడుతున్న హీరోయిన్ తమన్నా అయితే ఆ తర్వాత మాత్రం డైరెక్టర్‌గా ఆశించినంత స్థాయిలో ప్రభుదేవా కెరీర్ లేదని చెప్పుకోవచ్చు. ఇటీవలె సల్మాన్‌ఖాన్‌తో తెరకెక్కించిన రాధే చిత్రం బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఘోరంగా పరాజయం పాలయ్యింది. దీంతో ఇకపై డైరెకక్షన్కు గుడ్‌బై చెప్పాలని ప్రభుదేవా నిర్ణయించుకున్నారట. అంతేకాకుండా నటుడిగా వరుస అవకాశాలు వస్తుండటంతో దానిపైనే ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ఆయన భగీరా అనే చిత్రంలో మెయిన్ లీడ్‌లో నటించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధం కానుంది. చదవండి : బాలీవుడ్ నటిపై యాసిడ్ దాడి.. గాయాలు -
Chittoor: కీచకుడి వికృత చేష్టలు.. బాలికలను మిద్దె మీదకు తీసుకెళ్లి..
-
ఆ ఆలోచనైతే ఉంది..కానీ..
నటిగా, గాయనిగా నిత్యామీనన్‌కి ఫుల్ మార్క్స్ ఎప్పుడో వేశారు ప్రేక్షకులు. తనలో ఓ డైరెక్టర్ కూడా ఉన్నారు అని నిత్యా మీనన్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఓ సినిమాను డైరెక్ట్ చేస్తానని కూడా అన్నారామె. అయితే ‘మీ దర్శకత్వంలో సినిమాను ఎప్పుడు చూడొచ్చు’ అని నిత్యాను అడిగితే ఇలా సమాధానమిచ్చారు–‘‘దర్శకత్వం చేయాలనే ఆలోచన నా మనసులో ఎప్పటి నుంచో ఉంది. కానీ ఎప్పుడు చేయాలో నిర్ణయించుకోలేదు. ఇందుకు ఎటువంటి ప్లాన్ వేసుకోలేదు. ప్రస్తుతం నేను చేయాల్సిన పాత్రలు చాలా ఉన్నాయి. ఇంకా విభిన్నమైన కథల ద్వారా, పాత్రల ద్వారా ప్రేక్షకులను పలకరించాలి’’ అన్నారు నిత్య. ప్రస్తుతం ‘19 (1) (ఎ)’ అనే మలయాళ చిత్రం, తెలుగులో సత్య దేవ్‌తో ‘స్కై ల్యాబ్’ సినిమా చేస్తున్నారు నిత్యా. -
అబ్బే... ఆ ఉద్దేశం లేదు
‘రాజకీయమా? నేనా? అబ్బే.. ఆ ఉద్దేశమే లేదు’ అన్నారు శ్రుతీహాసన్. ‘మీ నాన్నగారు పార్టీ స్థాపించారు కదా. మిమ్మల్ని కూడా రాజకీయాల్లో చూడొచ్చా’ అని శ్రుతీహాసన్‌ని అడిగితే ఆమె నుంచి ఈ సమాధానం వచ్చింది. దీని గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ – ‘‘రాజకీయాల గురించి నాకు ఎలాంటి అవగాహన లేదు. ఎటువంటి అవగాహన లేకుండా రాజకీయాల్లోకి వెళ్లడం అయినా, సినిమాకు దర్శకత్వం వహించడం అయినా పెద్ద పొరపాటు అవుతుంది. మనకు తెలియకుండానే ఎంతోమందికి హాని చేసినవాళ్లం అవుతాం. మా నాన్నగారి పార్టీ ప్రచారానికి కూడా నేను వెళ్లను. ఆయన నమ్మిన సిద్ధాంతం, ఆయన విజన్‌ను నేను నమ్ముతాను. ఆయనకు మంచి జరగాలని కచ్చితంగా కోరుకుంటాను’ అన్నారు. ఇదిలా ఉంటే.. కరోనా వల్ల జరిగిన నష్టాన్ని, ఆర్థిక ఇబ్బందులను అధిగమించే దిశలో నటీనటులు పారితోషికం తగ్గించుకోవాలని ఇటీవల చిత్రపరిశ్రమకు సంబంధించిన కీలక శాఖలవారు పేర్కొన్నారు. ఆ విషయం గురించి శ్రుతీహాసన్‌ని అడిగితే – ‘నిజానికి సినిమా ఇండస్ట్రీలో పారితోషికం విషయంలో హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు చెల్లించేది చాలా తక్కువ. ఇద్దరి పారితోషికాల్లో వ్యత్యాసం చాలా ఉంది. హీరో అందుకుంటున్న రెమ్యునరేషన్ హీరోయిన్‌కి రావాలంటే కచ్చితంగా మరో 20 ఏళ్లు పడుతుంది’ అని పేర్కొన్నారు. -
చెప్పిందే చేస్తాడు
రాయలసీమ నేపథ్యంలో సినిమా అనగానే ఫ్యాక్షన్ ప్రధానాంశమని అనుకుంటారు. అయితే రాయలసీమలో అహింసను కోరుకునే శాంతి కాముకులు ఉన్నారనే కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం ‘పులి బిడ్డ’. ‘చెప్పిందే చేస్తాడు’ అన్నది ఉపశీర్షిక. ‘పోలీస్ సిస్టర్స్, ఖాకీ చొక్కా, అశోక చక్రం’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఫైట్ మాస్టర్ విక్కీ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నారు. రాజా ఫిలిమ్స్ పతాకంపై ఈ సినిమా రూపొందనుంది. డైరెక్టర్ విక్కీ మాస్టర్, కథారచయిత యస్.ఎం. బాషా మాట్లాడుతూ– ‘‘రాజకీయ నేపథ్యంలో సాగే కథ ఇది. ఓ యువ ముఖ్యమంత్రికి శత్రువులు అడుగడుగునా అడ్డు తగులుతుంటారు. అయినప్పటికీ వారిపై కక్ష తీర్చుకోకుండా వారిలో మార్పు తీసుకురావడానికి సీఎం ఎలాంటి ప్రయత్నం చేశాడన్నది కథాంశం. విజయదశమి రోజున ఈ చిత్రం షూటింగ్‌ను ఒంగోలులో ప్రారంభిస్తాం. ఇద్దరు ప్రముఖ సీనియర్ నటులతో పాటు పాత, కొత్త నటీనటులతో తెరకెక్కిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: భగవతి బాల, ఫైట్స్, దర్శకత్వం: విక్కీ మాస్టర్. -
చుట్టూ చెంగావి చీర కట్టాలి చిలకమ్మా
గాయకులుగా ఉంటూ సంగీత దర్శకత్వం చేసిన వారిలో చిత్తూరు నాగయ్య, ఘంటసాల, భానుమతి రామకృష్ణ తర్వాత ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం వస్తారు. నెల్లూరులో పాట కచ్చేరీలు ఇచ్చే నాటి నుంచే సొంతగా పాట రాసి ట్యూన్ కట్టే ప్రయత్నం చేసిన బాలు సినిమా గాయకుడిగా బిజీ అయ్యాక సంగీత దర్శకుడిగా పాటలు చేయాలని ప్రత్యేకంగా ప్రయత్నించలేదు. కాని ప్రయోగాలు చేయడంలో సిద్ధహస్తుడైన దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు ‘కన్య–కుమారి’ (1977) సినిమాకు తొలి అవకాశం ఇచ్చారు. వేటూరి రాసిన ‘ఇది తొలి పాట’ బాలు స్వరపరిచిన తొలి పాట. ఈ పాటను ఆ తర్వాత ఆయన తన ప్రతి కచ్చేరీలో పాడేవారు. అయితే గాయకుడిగా చాలా బిజీగా ఉంటున్న బాలూను సినిమా సంగీతం కోసం అడగడం నిర్మాత దర్శకులకు కొంత సంశయం అనే చెప్పాలి. ఎందుకంటే దానికి వారు అడిగినంత సమయం బాలు ఇవ్వలేకపోవచ్చు అనే సందేహం ఉండేదేమో. అయినప్పటికీ తెలుగులో బాలు 31 సినిమాలకు సంగీతం వహించారు. తమిళంలో 5, కన్నడంలో 9 సినిమాలు ఆయన స్వర పర్యవేక్షణలో వచ్చాయి. బాపుతో కలిసి దర్శకుడు బాపు ‘తూర్పు వెళ్లే రైలు’ సినిమాకు బాలు చేత పాటలు చేయించుకున్నారు. ఇవి మంచి అభిరుచి ఉన్న పాటలుగా నిలిచాయి. జాలాది రాసిన ‘సందె పొద్దు అందాలున్న చిన్నది’, ఆరుద్ర రాసిన ‘చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలుకమ్మ’ పాటలు నేటికీ నిలిచి ఉన్నాయి. చుట్టూ చెంగావి చీర పాటకు మెహదీ హసన్ ‘రఫ్తా రఫ్తా’ ప్రేరణ. ఆ తర్వాత బాపూతో బాలు ‘సీతమ్మ పెళ్లి’, ‘జాకీ’ సినిమాలు చేశారు. ‘సీతమ్మ పెళ్లి’ తమిళంలో సూపర్‌హిట్ చిత్రానికి రీమేక్. అయినప్పటికీ ఆ పాటల ఛాయలు లేకుండా ఒరిజినల్ పాటలు చేశారు బాలు. అందులోని ‘చెల్లివైనా తల్లివైనా చామంతి పువ్వంటి నువ్వే’ పాట ప్రేక్షకులకు గుర్తుంటుంది. ఇక ‘జాకీ’లో పాటలన్నీ హిట్టే. శోభన్‌బాబు, సుహాసిని నటించిన ఈ సినిమాలో బాలు, జానకి పోటీలు పడి పాడారు. ‘శశివదన మొరను వినలేవా’, ‘అలా మండి పడకే జాబిలీ’, ‘నిదుర లెమ్ము నిమ్మకాయ’ అలరించాయి. ‘మన ఊరి పాండవులు’ సినిమాను బాపు హిందీలో ‘హమ్ పాంచ్’ పేరుతో రీమేక్ చేస్తే బాలు దానికి రీ రికార్డింగ్ చేశారు. జంధ్యాలతో జంధ్యాలతో బాలూ చేసిన ‘పడమటి సంధ్యారాగం’ క్లాసిక్‌గా నిలిచింది. ఈ సినిమాకు పేరు బాలూయే పెట్టారు. అందులో ‘లైఫ్ ఈజ్ షాబీ’ పాటను రాసి పాడారు కూడా. ఇందుకోసం అమెరికాలో పాటను రికార్డు చేసి, అలా రికార్డు చేసిన తెలుగు సినిమా రికార్డును సొంతం చేసుకున్నారు. పడమటి సంధ్యారాగంలోని ‘ఈ తూరుపు ఆ పశ్చిమం’ పాట బాలు చేసిన చాలామంచి పాటల్లో ఒకటి. అలాగే ‘పిబరే రామరసం’ పాట ఎంతో స్పందనాయుతంగా ఉంటుంది. జంధ్యాలతో ‘వివాహ భోజనంబు’, ‘నీకూ నాకూ పెళ్లంట’ సినిమాలు చేశారు బాలు. అవార్డు తెచ్చిన సినిమా బాలూకు అవార్డులు, రివార్డులు తెచ్చి పెట్టిన సినిమాగా ‘మయూరి’ని చెప్పవచ్చు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాలు సంగీత ప్రతిభకు ఒక తార్కాణంగా నిలిచింది. ఇందులో ‘ఈ పాదం ఇలలోని నాట్య వేదం’, ‘ఇది నా ప్రియనర్తన వేళ, ‘మౌనం గానం మధురం మంత్రాక్షరం’ పాటలు హిట్‌గా నిలిచాయి. ఈ సినిమా బాలూకు ఉత్తమ సంగీత దర్శకుని అవార్డు తెచ్చి పెట్టింది. సింగీతం దర్శకత్వంలోనే ‘ఊరంతా సంక్రాంతి’ సినిమాకు పాటలు చేశారు బాలు. ప్రతి సంక్రాంతికి వినిపించే ‘సంబరాల సంకురాత్రి’ పాట ఈ సినిమాలోదే. శోభన్‌బాబు ‘కొంగుముడి’, బాలకృష్ణ ‘రాము’, నాగార్జున ‘జైత్రయాత్ర’ సినిమాలకు బాలూ సంగీతం అందించారు. జైత్రయాత్రలోని ‘ఎన్నాళ్లమ్మా ఎన్నేళ్లమ్మా’ పాట హిట్‌గా నిలిచింది. దర్శకుడు వంశీతో ‘లాయర్ సుహాసిని’ చేశారు బాలు. ఇందులోని పాటలన్నీ మెలొడీతో ఉంటాయి. ‘తొలిసారి పూసే మురిపాల తీవ’, ‘ఏమైంది ఇల్లాలుగారు’, ‘మహరాజా మర్యాద’ చాలా బాగుంటాయి. ఇక చిన్న సినిమా ‘కళ్లు’కు పెద్ద సంగీతం అందించారు బాలు. ఇందులో ‘తెల్లారింది లెగండోయ్’ పాటను ఆ పాట రాసిన సిరివెన్నెల చేత పాడించారు. బాలు పాటల్లోనే కాదు నేపథ్య సంగీతంలో కూడా ఒక మార్క్ ఉండేలా చూసుకున్నారు. ఆయన పాటల్లో ‘కలకాలం ఇదే పాడనీ’ (ఏజంట్ గోపీ), ‘చెలి సఖీ మనోహరి’ (బంగారు చిలక), ‘ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం’ (మగధీరుడు), ‘తెల్లమబ్బు తేరు మీద ఇలకు దిగిన వెండి చందమామ’ (చిన్నోడు పెద్దోడు) గుర్తుకు వస్తాయి. ‘నా షరతులతో పాటలు చేయడానికి అంగీకరించిన వారికే పాటలు చేస్తాను’ అని చెప్పిన బాలు 1990ల తర్వాత సంగీత దర్శకత్వానికి దూరంగానే ఉండిపోయారు. బాలు – జానకి నిరంతరమూ వసంతములే బాలు నెల్లూరు బిడ్డ అయితే ఎస్. జానకి నెల్లూరు కోడలు. ఇద్దరూ పోటీ పడి పాడిన పాటలు తెలుగువారికి కండశర్కరలుగా మారాయి. ముఖ్యంగా ఇళయరాజా తెలుగులో చేసిన పాటలు చాలా వాటికి వీరిద్దరే గొంతునిచ్చారు. ఆ పాటలన్నీ సూపర్ డూపర్ హిట్స్‌గా నిలిచాయి. ‘మాటే మంత్రము’ (సీతాకోక చిలుక), ‘ఏమని నే చెలి పాడుదును’ (మంత్రిగారి వియ్యంకుడు), ‘నిరంతరము వసంతములే’ (ప్రేమించు–పెళ్లాడు), ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ (రాక్షసుడు), ‘మాటరాని మౌనమిది’ (మహర్షి), ‘మౌనమేలనోయి’ (సాగర సంగమం), ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా’ (స్వాతిముత్యం), ‘ఎదలో తొలి వలపే’ (ఎర్ర గులాబీలు), ‘సన్నజాజి పడక మంచె కాడ పడక’ (క్షత్రియపుత్రుడు), ‘మధుర మురళి హృదయ రవళి’ (ఒక రాధ–ఇద్దరు కృష్ణులు)... ఇవన్నీ కమనీయ పాటలు. ఇక ఇతర సంగీత దర్శకుల కోసం కూడా వీరు ఎన్నో మనోహరమైన పాటలు పాడారు. ‘వీణ వేణువైన సరిగమ’ (ఇంటింటి రామాయణం), ‘సిరిమల్లె పువ్వల్లే నవ్వు’ (జ్యోతి), ‘నీ చేతులలో తలదాల్చి’ (కార్తీక దీపం), ‘అలివేణి ఆణిముత్యమా’ (ముద్దముందారం), ‘కాస్తందుకో దరఖాస్తందుకో’ (రెండు రెళ్లు ఆరు)... ఈ పాటలు వింటుంటే కాలం తెలుస్తుందా? జానకి దగ్గర బాలూకు కొంచెం చనువు ఉండేది. ‘ఆమె ఒక చేతిలో కర్చిఫ్ పట్టుకుని పాడేవారు. అది ఆమె అలవాటు. తీరా రికార్డింగ్ సమయానికి ఆ కర్చిఫ్ దాచేసేవాణ్ణి. ఆమె నన్ను కోప్పడేవారు’ అని సరదాగా చెప్పుకున్నారు బాలు. పాట నుంచి విరమించుకుని విశ్రాంత జీవితం గడుపుతున్న జానకి ఈ వార్త విని ఎలా స్పందిస్తారో. అసలు తట్టుకోగలరో లేదో. -
నా కథ నేనే చెబుతా
హాలీవుడ్ పాప్ సింగర్ మడోన్నా జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు చేస్తారు అనే చర్చ కొన్ని రోజులుగా నడుస్తోంది. అయితే తన బయోపిక్‌ను మడోన్నాయే డైరెక్ట్ చేసుకోనున్నారట. ‘నా కథను నాకంటే ఎవరు బాగా చెప్పగలరు? ఈ సినిమా ఫోకస్ మొత్తం మ్యూజిక్ మీదే ఉంటుంది. సంగీతమే నన్ను నడిపించింది. నా జీవితంలో ఎన్నో సంఘటనలను ఈ సినిమాలో ప్రస్తావిస్తాను’ అని అన్నారు మడోన్నా. గతంలో ‘ఫిల్త్ అండ్ విస్డమ్, డబ్ల్యూ ఈ’ చిత్రాలకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారామె. -
త్వరలో నిఖిల్ దర్శకత్వంలో సినిమా..
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో విభిన్న కథలతో ఆకట్టుకుంటున్న నిఖిల్ తాజాగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే నిఖిల్ హీరో కాకముందే హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా(సహ దర్శకుడు) పనిచేశారు. ఇటీవల ఓ టీవీ షోలో నిఖిల్ మాట్లడుతూ త్వరలోనే చిన్నారులతో ఓ సినిమా తీస్తానని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు తెలిపాడు. ప్రస్తుత లాక్డౌన్ సమయంలో అన్ని నియమాలు పాటిస్తు సినిమాను రూపొందిస్తానని పేర్కొన్నారు. అయితే నటుడిగా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్న నిఖిల్ దర్శకత్వ విభాగాలలో కూడా సత్తా చాటాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఇటీవల ’అర్జున్ సురవరం’ విజయంతో నిఖిల్ మంచి స్పీడు మీదున్నారు. వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ–2’ చిత్రాన్ని, సూర్యప్రతాప్ దర్శకత్వంలో ‘18 పేజెస్’ చిత్రాలను ఇప్పటికే చేస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: 18 పేజీస్: ఆసక్తికరంగా నిఖిల్ కొత్త చిత్రం) -
డైరెక్షన్ మారింది
‘‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, వసంతం, కబడ్డీ కబడ్డీ, పెదబాబు’ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో కథానాయికగా నటించి, తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కల్యాణి డైరెక్షన్ మార్చారు. దర్శక–నిర్మాతగా మారారు. ఇటీవల అతిథి పాత్రల్లో కనిపిస్తూ వస్తున్న ఆమె కే2కే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని రూపొందించనున్నారు. చేతన్ శీను, సిద్ధి, సుహాసినీ మణిరత్నం, రోహిత్ మురళి, శ్వేత ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. హోలి పర్వదినం సందర్భంగా ఈ సినిమా ప్రీ లుక్, టీజర్ గ్లింప్స్‌ను దర్శకుడు పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందనున్న చిత్రమిది. విలక్షణ ప్రేమకథతో సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఉంటుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. త్వరలోనే చిత్రీకరణ మొదలవుతుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. -
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం
-
ప్రేమ..వినోదం...
‘ఇది నా లవ్ స్టోరీ’ ఫేమ్ రమేష్– గోపి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. రమణ్ హీరోగా వర్షా విశ్వనాథ్, పావని, దీపికా హీరోయిన్లుగా నటించనున్నారు. కొరివి పిచ్చిరెడ్డి, సరస్వతి సమర్పణలో సిరి మూవీస్ పతాకంపై కె.శిరీషా రెడ్డి నిర్మించనున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా దర్శకులు రమేష్– గోపి మాట్లాడుతూ– ‘‘లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ జోనర్లో మంచి సందేశాత్మకంగా రూపొందనున్న చిత్రమిది. ఒక హీరో, ముగ్గురు హీరోయిన్లతో స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగుతుంది. విలన్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉండి ఆడియన్స్‌కి ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. నవంబర్ చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహిత్ నారాయణ్, కెమెరా: క్రిస్టోఫర్ జోసెఫ్. -
నాకంత ఓర్పు లేదు
ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తు పల్లాలు ఉన్నట్లే పొగడ్తలు, విమర్శలు ఉంటాయి. నటిగా మీ కెరీర్లో ఎదురయ్యే విమర్శలను మీరు ఎలా తీసుకుంటారు? అనే ప్రశ్నను తమన్నా ముందు ఉంచితే– ‘‘నేనేం దేవుణ్ణి కాదు. మామూలు మనిషిని. అందరిలాగే నేనూ తప్పులు చేస్తాను. నా తప్పుల గురించి వచ్చిన నిజమైన విమర్శలను మాత్రమే పట్టించుకుంటాను. నన్ను నేను విశ్లేషించుకుని నాలోని లోపాలను సరిదిద్దుకుంటాను. అంతేకానీ తప్పుడు విమర్శలను పట్టించుకుని అనవసరంగా బాధపడను’’ అని పేర్కొన్నారు. భవిష్యత్‌లో దర్శకత్వం ఆలోచన ఏమైనా ఉందా? అన్నప్పుడు... ‘‘దర్శకత్వం అంటే చిన్న విషయం కాదు. సినిమా గురించిన ప్రతి విషయంపై అవగాహన ఉండాలి. పాత అంశాలను కొత్త దృష్టి కోణంలో చూడగలగాలి. అన్నింటికన్నా ముందు చాలా ఓర్పు ఉండాలి. అంత ఓర్పు నాలో లేదు. ప్రసుతం దర్శకత్వం ఆలోచన లేదు. కానీ శ్రీదేవి బయోపిక్‌ను ఎవరైనా తీస్తే అందులో నటించాలని ఉంది’’ అని పేర్కొన్నారు తమన్నా. -
ఆమిర్ కూతురు డైరెక్షన్లో...
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోషూట్ ఫొటోలతో తరచూ వార్తల్లో ఉంటుంటారు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్. ఈ స్టార్ కిడ్ త్వరలో నటిగా కెమెరా ముందుకు రాబోతుందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఐరా డైరెక్షన్ దిశగా అడుగులు వేస్తున్నట్లున్నారు. ఇంత చిన్న వయసులో డైరెక్షన్ వంటి పెద్ద బాధ్యతను ఐరాకు అప్పజెప్పింది ఎవరా? అనే ఆలోచన చేయవద్దు. ఎందుకుంటే ఐరా డైరెక్ట్ చేయబోయేది ఫీచర్ ఫిల్మ్‌ని కాదు. ఓ నాటకానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతున్నారు. గ్రీక్ ట్రాజిడీ డ్రామా ‘మేడియా’ను డైరెక్ట్ చేయబోతున్నారు ఐరా. ‘‘ఒరిజినల్ 431 బీసీ కాలానికి చెందినది. నా ప్రజెంటెషన్‌లో కొన్ని మార్పులు ఉంటాయని చెప్పగలను. ఏమో భవిష్యత్‌లో సినిమాను కూడా డైరెక్ట్ చేస్తానేమో ఇప్పుడే చెప్పలేను’’ అని ఐరా ఖాన్ చెప్పుకొచ్చారు. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఈ డ్రామా ప్రీమియర్‌ను డిసెంబర్లో ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నారట. -
కథ చెప్తానంటోన్న డాషింగ్ బ్యూటీ
ఒక కథను నిజాయితీగా చెప్పాలనుంది అని అంటోంది నటి పార్వతీమీనన్. ఈ మాలీవుడ్ నటి కోలీవుడ్‌లోనూ సుపరిచితురాలే. మలయాళంలో పలు చిత్రాల్లో నటించి కథానాయకిగా మంచి ఫామ్‌లో ఉన్న పార్వతీమీనన్. తమిళ చిత్ర పరిశ్రమలోకి ‘పూ’ చిత్రంతో పరిచయం అయ్యి తొలి చిత్రంతోనే నటిగా మంచి పేరుతెచ్చుకుంది. ఆ తరువాత ధనుష్‌కు జంటగా మరియాన్ చిత్రంలో నటించింది. అయితే చాలా సెలక్టెడ్ చిత్రాలనే చేసే పార్వతీమీనన్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి. తాను అనుకుంది నిర్మొహమాటంగా చెప్పే మనస్థత్వం కలిగిన ఈ బ్యూటీ అలాంటి చర్యలతోనే ఆ మధ్య మాలీవుడ్‌లో వివాదాల్లో చిక్కుకుంది. అయినా నేనింతే అన్నట్టుగా తనకు వచ్చిన అవకాశాలనూ, తనకు నచ్చిన పాత్రలనే నటిస్తానని చెబుతోంది బోల్డ్ అండ్ డేరింగ్ బ్యూటీ. సరే ఇంకేంటీ కొత్త విషయాలు అన్న ప్రశ్నకు మెగాఫోన్ పట్టనున్నానని చెప్పింది. ఏంటీ సడన్ నిర్ణయం అని అంటే ఇది అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం కాదని, దర్శకత్వం చేయాలన్నది చాలా కాలంగా తనలో నిగూఢమైన కోరిక అని పేర్కొంది. దర్శకత్వం చేయాలన్నది తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాలన్న ఆసక్తి మాత్రం కాదని, నిజాయితీతో కూడిన కథను వెండితెరపై చూపించాలన్న కోరికనేనని చెప్పింది. ప్రస్తుతం అందుకు సన్నాహాలు చేస్తున్న నటి పార్వతీమీనన్ వచ్చే ఏడాది మెగాఫోన్ పట్టే అవకాశం ఉందని సమాచారం. అయితే ఆ చిత్రం మాతృభాషలోనే ఉంటుందా? లేక తమిళంతో కలిపి రెండు భాషల్లో చేస్తుందా? అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
రూట్ మారింది
నటిగా తానేంటో నిరూపించుకున్నారు అందాల సుందరి ఐశ్వర్యారాయ్. ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశారు. ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ప్రొడక్షన్, డైరెక్షన్ విభాగాల్లో సత్తా చాటాలని ప్రయత్నాలు మొదలుపెట్టారట ఐశ్వర్య. ‘‘ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉన్నాను. చాలా రకాల పాత్రలు చేశాను. ఇప్పుడు ప్రొడక్షన్ వైపు ఆలోచన మొదలైంది. ఈ విషయంపై సీరియస్‌గా వర్క్ చేస్తున్నాం. అలాగే డైరెక్టర్ కావాలని ఉంది. భవిష్యత్తులో తప్పకుండా డైరెక్టర్ అవుతాను. నా సన్నిహితులు, స్నేహితులు ‘నువ్వు ప్రొడ్యూసర్ లేదా డైరెక్టర్ అవొచ్చు కదా’ అని అప్పుడప్పుడు సరదాగా ఆట పట్టిస్తుంటారు. ఇప్పుడు వారి మాటలను నిజం చేయాలనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు ఐశ్వర్యారాయ్. -
దర్శకుడిగా మారనున్న కమెడియన్..!
ఇటీవల కాలంలో నటులు కేవలం నటులుగానే మిగిలిపోయేందుకు ఇష్టపడటం లేదు. తమ అభిరుచికి తగ్గట్టుగా ఇతర రంగాల మీద కూడా దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే కొంత మంది వ్యాపార రంగంలో సత్తా చాటుతుండగా మారికొందరు ఇండస్ట్రీలోనే నిర్మాతలుగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో మరో నటుడు చేరబోతున్నాడు. పెళ్లిచూపులు సినిమాతో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి, త్వరలో కొత్త అవతారం ఎత్తబోతున్నాడట. ఇప్పటి వరకు నటుడిగానే తెలిసిన ప్రియదర్శి.. దర్శకుడిగా మారనున్నాడు. ఈ విషయాన్ని మిఠాయ్ ఆడియో ఫంక్షన్లో దర్శకుడు తరుణ్ భాస్కర్ వెల్లడించాడు. అయితే గతంలో దర్శకత్వం చేసే ఆలోచన ఉన్నట్టుగా చెప్పిన ప్రియదర్శి ఈ వేదిక మీద మాత్రం ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. -
డైరెక్టర్ కంగనా
‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’.. కంగనా రనౌత్ నెక్ట్స్ రిలీజ్ ఇదే. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం జనవరి 25న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత ‘పంగా’ అనే సినిమాలో కబడ్డీ ప్లేయర్‌గా నటించనున్నారు కంగనా రనౌత్. అశ్వనీ అయ్యర్ దర్శకురాలు. మరి.. ఆ తర్వాత కంగనా సినిమా ఏంటి? అంటే ఓ లవ్‌స్టోరీ అని బాలీవుడ్ తాజా టాక్. ఈ సినిమాకు ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ కథను రెడీ చేస్తున్నట్లు సమాచారం. పూర్తి విభిన్నమైన లవ్‌స్టోరీతో ఈ చిత్రం రూపొందనుందట. ఇక హైలైట్ పాయింట్ ఎంటంటే... ఈ సినిమాకు కంగనానే దర్శకత్వం వహిస్తారట. ఇటీవల ‘మణికర్ణిక’ సినిమా ప్యాచ్ వర్క్ కోసం కంగనా మెగాఫోన్ పట్టిన విషయం తెలిసిందే. -
ప్రేమను పంచండి
కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. ఓ రోజు మధ్యాన్నం భోజనం చేశాక నా బృందంతో పాటు విశాఖపట్నం బయలుదేరాను. కొద్దిరోజుల క్రితమే కొనుక్కున్న కొత్త కారులో ప్రయాణం చాలా ఆహ్లాదంగా, ఉత్సాహభరితంగా ఉంది. రాత్రి జరగబోయే మీటింగ్ పైనే నా ఆలోచనలు దొర్లుతున్నాయి. నిజమైన క్రిస్మస్ గురించి అందరికీ అర్థమయ్యేలా వివరించాలన్నదే నా ఆలోచన. సరిగ్గా ఆ సమయంలో ఒకచోట రోడ్డు మీద జనం గుమిగూడారు. కారును వేగం తగ్గించి, అద్దంలో నుండి బయటకు చూసేసరికి ఇద్దరు వ్యక్తులు రక్తపు మడుగులో పడి ఉన్నారు. వారిద్దరూ తండ్రీకొడుకులని తర్వాత తెలిసింది. స్పృహలో లేరు. వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. గబగబా బయటకు వచ్చి చుట్టూ చూశాను. ‘‘నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు’’ అన్న క్రీస్తు మాటలు మదిలో మెదిలాయి. ఇంతమంది చుట్టూ ఉన్నారుగా, మనకెందుకు అనుకోలేదు. ఎంతమంది ఉన్నా సహాయం చేయడానికి ఒక్క అడుగు ముందుకేద్దాం అంటూ సహాయం అందించాం. అందరూ చేతులు కట్టుకుని నిలబడి చూస్తున్న ఆ క్షణంలో పడి ఉన్న ఆ ఇద్దరినీ మా కారులో ఎక్కించాము. కొత్తకారంతా రక్తపు మరకలే! అయినా ప్రాణం కన్నా విలువైనది ఏముంది? మీరలా తీసుకెళ్లద్దు. అనవసరంగా సమస్యల్లో చిక్కుకుంటారు అనే హెచ్చరికలు నన్ను ఏమాత్రం వెనక్కు లాగలేదు. దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కు తీసుకెళ్లి డాక్టరు చేతికి వారిని అప్పగించాను. కాపాడమని దేవుణ్ణి ప్రార్థించాను. కొద్దిగా ఆలస్యమైతే ఏమయ్యేదో అని ఆ వైద్యబృందం మాట్లాడుకుంటుంటే మనస్సులోనే దేవుణ్ణి స్తుతించాను. ఇంకేం ఫర్వాలేదు అని తెలిసిన తర్వాత నా ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాను. అది క్రిస్మస్ రోజు. మా చర్చిలో వేలాదిమంది క్రీస్తును ఆరాధించేందుకు సిద్ధమయ్యారు. ‘క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించడమే నిజమైన క్రిస్మస్’ అంటూ నా సందేశం కొనసాగింది. భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా పరిణతి చెందాలంటే ప్రేమమార్గమే సరైనదంటూ నేను చేసిన ప్రసంగం అనేకులను ఆలోచింపజేసింది. క్రిస్మస్ అనంతరం ఇద్దరు భార్యాభర్తలు పుష్పగుచ్ఛంతో ముందుకు వచ్చి నాకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పి కన్నీళ్లు కారుస్తున్నారు. అనురాగంతో వారిని హత్తుకుని కారణం అడిగాను. ‘ఆనాడు మీరు చూపిన ప్రేమను మర్చిపోలేకపోతున్నాము. మేమెవరమో తెలియకపోయినా మీరు చేసిన సహాయం రెండు బతుకులను నిలబెట్టింది. ప్రాణాలు దక్కించుకున్న మా కుమారుడు నేడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు’ అని చెబుతుంటే ఎంత సంతోషించానో! అవును! దేవుని పేరిట మనస్ఫూర్తిగా చేసే ఏ చిన్న కార్యమైనా అపరిమితమైన ఆనందాన్ని మోసుకొస్తుంది. సాటివ్యక్తి బాధలను గుర్తించక ఏరులై పారుతున్న కన్నీళ్లను అవహేళన చేస్తూ, దైవప్రేమను గుర్తించక దారితప్పిపోతున్న సమాజానికి ఓ అమూల్యమైన దిశానిర్దేశం చేసే పండుగే క్రిస్మస్. భూమికి మధ్య ప్రాంతమైన బెత్లెహాములో దేవుడు శరీరధారిగా రావడం ద్వారా మనిషికి ఎన్నో మేళ్లు చేకూర్చబడ్డాయి. చితికిపోయిన జీవితాలను పునఃప్రతిష్ఠ చేసి వారిని నిలబెట్టాలనే సదాశయంతో దేవుడు భూమ్మీదకు వచ్చాడు. కర్కశలోకంలో కారుణ్యం విరబూసింది. సొమ్మసిల్లిన బతుకులకు ఆశ్రయం లభించింది. ‘ఓ దేవా! నేను అసత్యంలో ఉన్నాను. నన్ను సత్యంలోనికి నడిపించు! చీకటిలో ఉన్నాను. వెలుగులోనికి నడిపించు! మరణంలో ఉన్నాను. జీవంలోనికి నడిపించు!’ అని మనిషి చేస్తున్న ప్రార్థనకు జవాబివ్వడానికి పరమాత్ముడు పశుశాలలో పవళించాడు. దీనులైన సామాన్య గొర్రెల కాపరులకు సృష్టికర్తను చూడగలిగే భాగ్యం లభించింది. మనిషిలో మానవత్వాన్ని మేల్కొల్పడానికి దేవుడే మనిషిగా వచ్చాడు. పశువుల శాల వంటి జీవితాలలో జన్మిస్తూ, పాపాన్ని పారద్రోలుతూ, మనిషిని పావనం చేస్తున్నాడు. మానవత్వం రెండు కళ్లూ మూసుకుపోయి పైశాచికంగా బతుకీడుస్తున్న మనిషికి ‘నిజమైన మనిషి’గా ఎలా బతకాలో చేసి చూపించడానికి క్రీస్తు నరావతారుడయ్యాడు. జడత్వంలో నిండిన ఇంద్రియాలను చైతన్య పరచి సమ సమాజ నిర్మాణానికి బాటలు వేశాడు. క్రిస్మస్ అనగా ప్రేమను వ్యక్తీకరించే పండుగ. క్షణికమైన అనురాగాలు, ఆవిరి వంటి ఆప్యాయతలు. అవసరాల అభిమానాలు. నిలిచిపోయే అనుబంధాలు నేటి ప్రపంచానికి స్వచ్ఛమైన, నిత్యమైన ప్రేమను కనబరచడానికి క్రీస్తు వచ్చాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడమేగాక ఆ ప్రేమను క్రియల్లో నెరవేర్చాడు. ‘ఉత్తమ వ్యక్తిత్వం అంటే అందచందాలు కాదు! భౌతికమైన భోగభాగ్యాలు కాదు! దేవుని ప్రేమతో నింపబడి సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడేవాడే ఉత్తమ వ్యక్తిత్వం కలవాడు. ప్రేమతోనే ప్రపంచంలో ఓ గొప్ప మార్పును తీసుకురాగలము’ అని మదర్ థెరిస్సా చెప్పిన మాటలు కచ్చితంగా అభినందనీయం. ఆచరణీయం. ‘‘మనుష్యులు మీకెలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి’’ ‘‘మీకు మేలు చేయువారికే మేలు చేసిన యెడల మీకేమి మెప్పు కలుగును?’’‘‘మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి’’అని క్రీస్తు బో ధించాడు. ఆ బోధనలను అనుసరించడమే నిజమైన క్రిస్మస్! మానవత్వాన్ని పెంపొందించుకుంటూ, ప్రతి ఒక్కరినీ సన్మానిస్తూ, ప్రేమిస్తూ దేవుడు మెచ్చే క్రిస్మస్ను జరుపుకుందాం! జాన్‌వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ -
డైరెక్షన్ మారింది
వరుస విజయాలతో హీరోగా తెలుగు, తమిళ రాష్ట్రాల్లో దూసుకెళ్తున్నారు విశాల్. తాజాగా ఆయన డైరెక్షన్.. డైరెక్షన్ వైపునకు మళ్లిందట. 2019లో కెమెరా ముందు నుంచి వెనక్కి వెళ్లే ప్లాన్‌లో ఉన్నారట. నిజానికి ఇండస్ట్రీలోకి విశాల్ అడుగుపెట్టింది సహాయ దర్శకుడిగానే. హీరో అర్జున్ దగ్గర సహాయ దర్శకుడిగా కొన్ని నెలలు చేశారు. ఇప్పుడు దర్శకుడిగా మారనున్నారు. నిస్సహాయంగా ఉన్న వీధి కుక్కల మీద ఆయన ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తారట. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన జనవరి 2019లో రానుంది. మరి ఈ సినిమాలో ఆయన కనిపిస్తారా? లేదా? వేచి చూడాలి. -
డైరెక్షన్ చేయాలనుంది
‘ఎగిరే పావురమా, ఉగాది, పెళ్లి చేసుకుందాం, ఖైదీగారు, పవిత్రప్రేమ, శివ పుత్రుడు’ వంటి చిత్రాలతో నటిగా మంచి పాపులారిటీ సంపాదించారు లైలా. 2006లో వ్యాపారవేత్త మెహ్దిన్ని వివాహం చేసుకొని సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టారామె. అయితే, పన్నిండేళ్ల విరామం తర్వాత మళ్లీ సినిమాల్లోకి కమ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారట లైలా. సినిమాల్లో కమ్‌బ్యాక్ గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘దక్షిణ రాష్ట్రాల నుంచి మళ్లీ చాలా ఆఫర్స్ వస్తున్నాయి. కానీ, మంచి రోల్‌తో కమ్‌బ్యాక్ చేయాలని ఎదురుచూస్తున్నాను. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అయితే ఇంకా సరదాగా ఉంటుంది. భవిష్యత్తులో డైరెక్షన్ కూడా చేయాలనే ఉద్దేశం ఉంది’’ అని పేర్కొన్నారు. మరి ఎలాంటి క్యారెక్టర్‌తో లైలా తిరిగొస్తారో వేచి చూడాలి. -
కొత్త అవతారం
సరిగమలు పలకాల్సిన యువన్ శంకర్ రాజా స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్ చెప్పడానికి రెడీ అవుతున్నారు. శృతి మీద వర్క్ చేయాల్సిన ఆయన స్క్రీన్‌ప్లే రెడీ చేస్తూ, బిజీగా ఉన్నారు. విషయమేంటంటే... ఇళయరాజా తనయుడు, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఓ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ‘‘స్క్రిప్ట్ రాయడం కొత్త అనుభవం. ఫ్యాన్స్ నా నుంచి ఊహించని సినిమా ఇవ్వబోతున్నాను’’ అన్నారు యువన్. జర్మన్ సంగీత దర్శకుడు టామ్ టైక్వార్ రూపొందించిన ‘పెర్ఫ్యూమ్’ చిత్రమే యువన్ దర్శకుడిగా మారడానికి ఇన్స్పిరేషన్ అట. -
డైలాగ్స్ టు డైరెక్షన్
రచయితల నుంచి దర్శకులుగా మారిన లిస్ట్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, అనిల్ రావిపూడి.. ఇలా చాలామందే ఉన్నారు. ఇప్పుడీ లిస్ట్‌లోకి రైటర్ డైమండ్ రత్నబాబు కూడా చేరిపోయారు. ‘సీమశాస్త్రి, పిల్లా నువ్వు లేని జీవితం, ఈడోరకం ఆడోరకం’ వంటి చిత్రాలకు డైలాగ్స్ అందించిన డైమండ్ రత్నబాబు దర్శకుడిగా మెగాఫోన్ పట్టనున్నారు. ఆది సాయికుమార్ హీరోగా రత్నబాబు ఓ చిత్రాన్ని రూపొందించనున్నారు. దీపాల ఆర్ట్స్ బ్యానర్ నిర్మించనున్న ఈ చిత్రం పూర్తిస్థాయి వినోదాత్మకంగా ఉండబోతోందని సమాచారం. -
డైరెక్షన్ చేస్తానంటున్న ప్రియదర్శి
పెళ్లి చూపులు సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ నటుడు ప్రియదర్శి. తెలంగాణ యాసలో నవ్వులు పూయించే ఈ కామెడీ స్టార్ ప్రస్తుతం టాలీవుడ్లో బిజీ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నాడు. తాజాగా ఈ యువ నటుడు తన మనసులోని మాట బయటపెట్టాడు. సినిమాల్లోకి రాకముందు పలు షార్ట్ ఫిలింస్‌లో నటించిన ప్రియదర్శి, కొన్నింటికి దర్శకత్వం వహించి నిర్మించాడు కూడా. తాను నటుడిగా వెండితెరకు పరిచయం అయిన ఎప్పటికైన దర్శకుడిగా సత్తా చాటుతానంటున్నాడు. అయితే ప్రస్తుతం నటుడిగా బిజీగా ఉండటంతో దర్శకుడిగా మరేందుకు కొంత సమయం పడుతుందని తెలిపాడు. -
‘ఆ మూవీ తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు’
సాక్షి, హైదరాబాద్ : మహానటి సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నాగ్ అశ్విన్. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌కు ఆయన పరిచమయ్యారు. నాని హీరోగా నటించిన ఎవడే సుబ్రమణ్యం సినిమా ఓ మోస్తరుగా ఆడినా దర్శకుడిగా అశ్విన్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. రెండో సినిమాగా బయోపిక్‌ను ఎంచుకోవడం.. అందులోనూ మహానటి సావిత్రి జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించాలనుకోవడం.. అనుకున్న దానికంటే అద్భుతంగా సినిమాను తీర్చిదిద్దిన తీరు ఆయనపై అంచనాలను అమాంతం పెంచేశాయి. సావిత్రి బయోపిక్ తీయాలనుకోవడం ఒక సాహసమైతే.. ఒకే సినిమాతో దిగ్గజాలను తెరపైన ఆవిష్కరించానుకోవడం మరో సాహసం. జెమినీ గణేషన్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, కేవీ రెడ్డి, చక్రపాణి, ఎల్వీప్రసాద్ ఇలా అలనాటి మేటి సినీ వర్గాన్ని తెరపైన చూపించాలంటే వారి అభినయాన్ని, ఆహార్యాన్ని స్ఫురణకు తెచ్చే నేటి నటులను తెరపైకి తేవాలి. ఇది అంత సామాన్యమైన విషయం కాదు. అలాంటిది మేటి తారలకు తగ్గట్టుగా వారి పాత్రలలో నేటి తారలను చూపించి ఔరా అనిపించారు అశ్విన్. సినిమాతో మ్యాజిక్ చేసి అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘ఎవడే సుబ్రమణ్యం తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదని, ఏదైనా చేస్తే అది భవిష్యత్తును ముందుకు నడిపేదిగా ఉండాలి. చిన్నప్పటి నుంచి నటిగా సావిత్రి అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె గురించిన విషయాలు తెలుసుకోవడానికి రెండేళ్లు కష్టపడ్డాను. ఏది ఎప్పుడు జరగాలని ఉంటే అప్పుడే జరుగుతుంది. రెండో సినిమాగా బయోపిక్ తీయడం అలా జరిగిపోయింది. రానున్న రోజుల్లో ప్రయోగాలు చేస్తానో లేదో తెలియదు. కొన్ని విజయాలు, అపజయాల తర్వాత జీవితం ఎలా మారుతుందో. ఇప్పుడు తీసినంత నిజాయితీగా తర్వాతి రోజుల్లో తీస్తానో లేదో. మహానటి విజయం ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉంది. సావిత్రి గురించి తెలుసుకోవడానికి చాలా పుస్తకాలు చదివాను, సావిత్రితో కలిసి నటించిన వారు ఆమె గురించి ఇచ్చిన ఇంటర్వ్యూలలోని విషయాలను కూడా తెలుసుకున్నాను. ముఖ్యంగా ఆమె కూతురితో సినిమాకు అవసరమైన అన్ని విషయాలపై చర్చించాను. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు తమ బాధ్యతను నిజాయితీతో పూర్తి చేశారు. కీర్తి సురేష్ నటన సినిమా విజయానికి ఓ ముఖ్య భూమిక పోషించింది. శేఖర్ కమ్ముల వద్ద పని చేసినపుడు పాత్రల విషయంలో ఎక్కువ ఆసక్తి చూపేవాడిని. మొదట సావిత్రి పాత్రకోసం చాలా మందిని అనుకున్నప్పటికి చివరగా కీర్తి సురేష్‌ను ఎంచుకున్నాం. ధనుష్ హీరోగా నటించిన తమిళ సినిమా తొడరిలో కీర్తి సురేష్ నటన నచ్చడంతో ఆమె ఈ పాత్రకు న్యాయం చేస్తుందని నమ్మాను. మహానటి సినిమాలో నటించిన దుల్కర్ సల్మాన్, సమంతా అక్కినేని, విజయ్ దేవరకొండ, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, బానుప్రియ, ఇతరులతో కలిసి పనిచేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. వారి షెడ్యూల్స్‌ను మేనేజ్ చేయడమే ఇబ్బందిగా మారేదని, కేవలం సావిత్రి బయోపిక్ అన్న ఒక్క కారణంతో సినిమా పాత్ర నిడివి తక్కువైనా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమా కోసం కష్టపడిన వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను నమ్మి సినిమా చేసిన నిర్మాతలు ప్రియాదత్, స్వప్నదత్‌ల వల్లే మహానటి విజయం సాధ్యపడింది. మహానటి సినిమాతో తన బాధ్యత మరింత పెరింగిందంటూ’ పలు విషయాలు షేర్ చేసుకున్నారు. -
నా వీక్నెస్ అదే!
అమితాబ్ బచ్చన్.. వందలకుపైగా సినిమాల్లో యాక్టర్‌గా మెప్పించారు. కొన్ని సినిమాలు నిర్మించారు కూడా. అంతేనా.. పాటలు పాడారు. చాలా సాంగ్స్ కంపోజ్ చేశారు. యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా, సింగర్‌గా, కంపోజర్‌గా అన్ని డిపార్ట్మెంట్స్లో ప్రవేశం ఉన్న అమితాబ్‌ను డైరెక్షన్ కూడా చేస్తారా? అనే ప్రశ్న ముందుంచితే.. ‘డైరెక్షన్ చేయలేకపోవడమే నా వీక్నెస్’ అన్నారు. డైరెక్షన్ గురించి అమితాబ్ మాట్లాడుతూ– ‘‘డైరెక్షన్ గురించి నాకు ఎక్కువగా తెలియదు. నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న ఏంటంటే.. కెమెరాను ఒక యాంగిల్లో పెట్టి షాట్ డిజైన్ చేస్తున్నప్పుడు దర్శకుడి మైండ్‌లో ఏం రన్ అవుతుంది. ఆ సమయంలో వాళ్లు ఎలా ఆలోచిస్తారు? అనేదే డౌట్. నేనెప్పటికీ సినిమాను డైరెక్ట్ చేయలేనేమో’’ అని పేర్కొన్నారు. -
దర్శకుడిగా మారనున్న యంగ్ హీరో
అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో, నీదీ నాదీ ఒకే కథ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు శ్రీ విష్ణు. సహాయనటుడిగా కెరీర్ ప్రారంభించి హీరోగా విజయాలు సాధిస్తున్న ఈ యువ కథానాయకుడు త్వరలో దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. నటుడిగా మారక ముందు పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన శ్రీ విష్ణు తన అనుభవాన్ని వృథా కానివ్వనని చెపుతున్నాడు. ప్రస్తుతం నటన మీదే దృష్టి పెడుతున్నానన్న శ్రీవిష్ణు, మంచి కథ కుదిరితే తప్పుకుండా దర్శకుడిగా మారతానని చెపుతున్నాడు. వెంకీ ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన నీదీ నాదీ ఒకే కథ సినిమా ఇటీవల విడుదలై విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ ను అందుకున్న శ్రీ విష్ణు... ప్రస్తుతం వీరభోగ వసంత రాయలుతో పాటు ‘తిప్పరా మీసం’ అనే కామెడీ ఎంటర్టైనర్లోనూ నటిస్తున్నాడు. -
ఇక మెగాఫోన్ పట్టడమే!
నెక్ట్స్గోల్ డైరెక్షనే అంటున్నారు ప్రముఖ నృత్యదర్శకుడు శోభి. కోలీవుడ్ టూ టాలీవుడ్ వయా మాలీవుడ్, శాండిల్‌వుడ్, బాలీవుడ్ అంటూ పలు భాషల్లో స్టార్ హీరోలతో స్టెప్స్ వేయిస్తూ ప్రముఖ నృత్య దర్శకుడిగా రాణిస్తున్న శోభి గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. సీనియర్ నృత్యదర్శకుడు పౌల్రాజ్ వారసుడైన ఈయన ప్రముఖ నృత్య దర్శకులు సిన్నిప్రకాశ్, రాజుసుందరంల వద్ద సహాయకుడిగా పని చేసి నృత్యదర్శకుడిగా ప్రమోట్ అయ్యారు. ప్రస్తుతం తమిళం,తెలుగు భాషల్లో స్టార్ హీరో చిత్రాలకు కొరియోగ్రఫీ అందిస్తూ నంబర్‌వన్ నృత్యదర్శకుడిగా రాణిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనతో సాక్షి చిట్ చాట్. చిత్ర రంగప్రవేశం గురించి? నాన్న ప్రముఖ నృత్యదర్శకుడు. నాకు ఆయనే గురువు కూడా. నృత్యదర్శకుడిగా నా చిత్రరంగప్రవేశం తెలుగు చిత్రంతోనే జరిగింది. కే.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన అల్లరిబుల్లోడు నా తొలి చిత్రం. తమిళంలో 2004లో కమలహాసన్ నటించి న వసూల్‌రాజా ఎంబీబీఎస్ చిత్రంతో పరిచయం అయ్యాను. ఆ తరువాత నృత్యదర్శకుడిగా వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. ఎలాంటి పాటకు నృత్యరీతులు సమకూర్చడం కష్టం అనిపిస్తుంది. సిట్యువేషన్ సాంగ్స్‌కు నృత్యరీతులు సమకూర్చడం కష్టమనే చెప్పాలి. హీరోహీరోయిన్లతోనే చిత్రీకరించే యువళగీతాలకు డాన్స్ కంపోజ్ చేయడం అంత సులభం కాదు. డాన్స్ విషయంలో తమిళంకు, తెలుగుకు వ్యత్యాసం ఏమైనా ఉంటుందా? పెద్దగా ఏమీ ఉండదు. అయితే తమిళంలో కథానుగుణంగా పాటల చిత్రీకరణ ఉండాలని భావిస్తారు. తెలుగులో కాస్త స్టార్ వ్యాల్యూస్‌ను బట్టి డాన్స్ కోరుకుంటారు. ఇంకో విషయం ఏమిటంటే ఎలాంటి పాటకైనా నృత్యరీతుల్ని డిసైడ్ చేసేది సంగీతమే. ఏ హీరోకు నృత్యరీతులను సమకూర్చడం ఛాలెంజ్‌గా భావిస్తారు? తమిళంలో విజయ్‌కు నృత్యరీతులను సమకూర్చడం ఛాలెంజింగ్ అనిపిస్తుంది. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు? ప్రస్తుతం తెలుగులో పవన్ కల్యాణ్ తాజా చిత్రం పీకే 25, రామ్‌చరణ్‌తేజ రంగస్థలం, మహేశ్‌బాబు కొత్త చిత్రం, నాగచైతన్య చిత్రం అలాగే తమిళంలో నీదాన్, శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న వేలైక్కారన్, పొన్రామ్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న మరో చిత్రం, ఏంజిలినా ఇలా చాలా చిత్రాలు చేస్తున్నాను. తమిళం, తెలుగు చిత్రాలేనా ఇతర భాషా చిత్రాలు చేశారా? మలయాళం, కన్నడం, హిందీ చిత్రాలు కూడా చేశాను. తమిళం, తెలుగు చిత్రాలతో బిజీగా ఉండడంతో ఇతర భాషల్లో ఎక్కువ చేయలేకపోతున్నాను. మీది ప్రేమ వివాహమా? అందరూ అదే అనుకుంటారు. నిజానికి మాది పెద్దల అనుమతితో జరిగిన పెళ్లే. నా భార్య లలిత నృత్యదర్శకురాలే. మా పాప పేరు శమంతకమణి అశ్విక. ఈ పేరును నటుడు కమలహాసన్ పెట్టారు. ప్రముఖ నృత్యదర్శకుడిగా రాణిస్తున్నారు. తదుపరి గోల్? జ: దర్శకుడిగా మెగాఫోన్ పట్డడమే. అందుకు కథ సిద్ధం చేశాను. ఎప్పుడన్నది త్వరలోనే వెల్లడిస్తాను. మరి హీరో కోరిక లేదా? మీకో విషయం చెప్పాలి. నేను మొదట బాల నటుడిగానే పరిచయం అయ్యాను. తెలుగులో జూలకటక అనే చిత్రంలో నటించాను. ఆ తరువాత డాన్స్ పై దృష్టిసారించాను. ఏమో మంచి కథ అనిపిస్తే హీరోగా నటించవచ్చు. -
నటుడిగానే కొనసాగుతా : స్టార్ డైరెక్టర్
దక్షిణాదిలో సంచలన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఎస్ జె సూర్య. వాలి, ఖుషి, న్యూ (తెలుగులో నాని) లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన ఎస్ జె సూర్య, తన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో హీరోగానూ నటించి మెప్పించారు. అయితే న్యూ తరువాత దర్శకుడిగా తన స్థాయికి తగ్గ విజయాలు సాధించటంలో విఫలమవుతున్న ఈ స్టార్ డైరెక్టర్ ఇతర దర్శకుల సినిమాల్లోనూ నటిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న మహేష్ బాబు స్పైడర్ తో పాటు విజయ్ మెర్సల్ సినిమాల్లోనూ సూర్య విలన్ గా నటిస్తున్నాడు. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఘన విజయాలు అందించిన ఈ దర్శకుడు ఇక దర్శకత్వం వహించేది లేదని చెప్పేశారు. ఇప్పటికే డైరెక్టర్ గా చాలా సాధించానని, ఇక పై నటుడిగానే కొనసాగుతానని తెలిపారు. తాను సినీ రంగానికి నటుడు కావాలన్న కోరికతోనే వచ్చానని, అనుకోకుండా దర్శకుడిగా మారానని తెలిపారు. -
సమంత 'దృష్టి' పడింది..!
సాక్షి, హైదరాబాద్: ప్రముఖనటుడు, సింగర్ చిన్మయి భర్త, రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా అరంగేట్రం చోయబోతున్న సంగతి తెలిసిందే. దర్శకుడిగా సినిమా ప్రారంభించబోతున్న రాహుల్ హీరోగానూ కొనసాగుతున్నాడు. రాహుల్ లీడ్ రోల్ లో రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరోయిన్ సమంత ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసింది. మరోవైపు సమంత అద్భుత నటనకు, చిన్మయి డబ్బింగ్ పూవుకు తావిలా వుంటుందనేది జగమెరిగిన సత్యం. అందుకే రాహుల్‌కు కొత్త ప్రాజెక్టుకు ఆమె ఇంత సపోర్ట్ చేస్తున్నారనీ, తన గొంతుతో ఎనలేని కీర్తిని, గుర్తింపును తెచ్చిపెట్టిన చిన్మయి శ్రీప్రాదకు కృతజ్ఞతగానే సమంత దీనికి ఒప్పుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్ వేదికగా దర్శకుడిగా తొలి సినిమా తీయబోతున్నానని రాహుల్ రవీంద్రన్ ప్రకటించారు. తన చిన్ననాటి కల నెరవేరబోతోందని.. ఈ సినిమాకు హీరో సుశాంత్ అని కూడా క్లారిటీ ఇచ్చారు. సిరుని సీనా కార్పొరేషన్ ప్రొడ్యూస్ చేయబోతోందని, అక్టోబర్ చివర్లోకానీ, నవంబరులో కాని షూటింగ్ మొదలుపెట్టనున్నట్టు రాహుల్ వెల్లడించారు. అలాగే ఈ కొత్త ప్రాజెక్ట్‌లో వెన్నెల కిషోర్, విద్యారామన్ ను కూడా అలరించనున్నారు. Wishing my good friend @23_rahulr the very best on his new film #Dhrushti directed by @RamAbbaraju . Super cool poster pic.twitter.com/Af1D8ENjvt — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) 7 September 2017 Super happy to tell you all that @Samanthaprabhu2 will release the title and first look posters of my next film tomorrow on twitter:) — Rahul Ravindran (@23_rahulr) September 6, 2017 -
డైరెక్టర్‌గా మరో నటుడు
ప్రముఖనటుడు, సింగర్ చిన్మయి భర్త, రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా అరంగేట్రం చోయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ ట్విట్టర ద్వారా ప్రకటించారు. శనివారం ట్విట్టర్ వేదికగా ఈ సంతోషాన్ని పంచుకున్నారు. దర్శకుడిగా తొలి సినిమా తీయబోతున్నానని రాహుల్ రవీంద్రన్ పేర్కొన్నారు. తన చిన్ననాటి కల నెరవేరబోతోందని.. ఆ వైపుగా తన తొలి అడుగులు పడుతున్నాయంటూ ట్వీట్ చేశారు. అలాగే ఈ సినిమాకు హీరో సుశాంత్ అని కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ సరికొత్త ప్రాజెక్ట్‌ను సిరుని సీనా కార్పొరేషన్ ప్రొడ్యూస్ చేయబోతోందన్నారు. అంతేకాదండోయ్ హీరోయిన్ కోసం వెదుకుతున్నట్టు కూడా రివీల్ చేశారు. అక్టోబర్ చివర్లోకానీ, నవంబరులో కాని షూటింగ్ మొదలుపెట్టనున్నట్టు వెల్లడించారు. అటు సుశాంత్ కూడా తన తదుపరి చిత్రంపై ట్వీట్ చేస్తూ తాను రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నటించనున్నట్టు తెలిపారు. ఈ సినిమా స్క్రిప్ట్ లవ్లీగా ఉందనీ, తనకు అభిమానుల మద్దతును కావాలని పేర్కొన్నారు. మరోవైపు రాహుల్ ప్రకటనతో ట్విట్టర్ లో సందడి నెలకొంది. రాహుల్ భార్య, ప్రముఖ గాయని చిన్నయి శ్రీపాద, దర్శకుడు అడవి శేషు, నటుడు వెన్నెల కిషోర్ తదితరులు ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్వీట్ చేశారు. దీంతోపాటు నటులు వెన్నెల కిశోర్, విద్యారామన్ కూడా ఓ ఆసక్తికరమైన వీడియోను కూడా పోస్ట్‌చేశారు. దీనిపై రాహుల్ పాజిటివ్‌గా స్పందించారు. దీంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌లో వీరిద్దరి బెర్త్‌లు కూడా కనఫాం అయినట్టే. Taking baby steps towards fulfilling a childhood dream:) My next project will be my directorial debut:) @iamSushanthA plays the male lead... — Rahul Ravindran (@23_rahulr) September 2, 2017 All the best @23_rahulr n @iamSushanthA .. - yours lovingly@VidyuRaman -
ఆ పనిచేసే ఆలోచన లేదు: హీరోయిన్
నటీమణుల్లో నిత్యామీనన్‌కు ఓ ప్రత్యేకత ఉందనే చెప్పాలి. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఇమిడిపోతుంది. అయితే ఆ పాత్ర తనకు నచ్చితేనే ఒప్పుకుంటానని నిర్మొహమాటంగా చెప్పే నిత్య ఆ మధ్య మణిరత్నం అవకాశాన్ని కూడా నిరాకరించిందనే ప్రచారం జరిగింది. అయితే అమ్మడికి ఇటీవల అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అందుకు కారణం తనే అనే ప్రచారం కూడా చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. నిత్యామీనన్‌కు దర్శకత్వంపై మోజు పుట్టిందని, అందుకే నటిగా అవకాశాలను తిరస్కరిస్తోందనే ప్రచారం హల్చల్ చేస్తోంది. ఇది ఆ నోటా ఈ నోటా అమ్మడి చెవిన పడింది. అంతే.. అయ్యయ్యో దర్శకత్వం చేస్తానని తానెప్పుడు ఎవరితో చెప్పాను. ఇలా కూడా వదంతులు పట్టిస్తున్నారా? అంటూ రియాక్ట్ అయ్యింది. నిజం చెప్పాలంటే నటిగా తనకింకా చాలెంజింగ్ పాత్రలు చాలా చేయాలని ఉన్నట్లు చెప్పింది. తనను దర్శకురాలిగా చూడటానికి చాలామంది ఎదురు చూస్తున్నారన్న విషయం ఆనందాన్ని కలిగిస్తోందని పేర్కొంది. అయితే ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని, భవిష్యత్తులో దర్శకత్వం గురించి ఆలోచిస్తాను అని వివరించింది. ప్రస్తుతం విజయ్ 61వ చిత్రంలో ముగ్గురు కథానాయికల్లో ఒకరిగా నటిస్తున్నట్టు చెప్పింది. ఇందులో తండ్రి పాత్రలో నటిస్తున్న విజయ్‌కు జోడీగా నిత్యామీనన్ నటిస్తున్నట్లు సమాచారం. కాగా విజయ్ చాలా శాంత స్వభావి అని, ఆయనతో తొలిసారిగా నటిస్తున్నానని, అదేవిధంగా అట్లీ దర్శకత్వంలో నటించడం సంతోషంగా ఉందని నిత్యా తెలిపింది. -
అయ్యో అలా ఎప్పుడు చెప్పాను?
నటీమణుల్లో నిత్యామీనన్ది సపరేట్ బాణీ అనే చెప్పాలి. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఇమిడిపోతుంది. ఆ పాత్ర తనక నచ్చితేనే ఒప్పుకుంటానని నిర్మొహమాటంగా చెప్పే నిత్య ఆ మధ్య మణిరత్నం అవకాశాన్ని కూడా నిరాకరించిందనే ప్రచారం జరిగింది. అయితే అమ్మడికి ఇటీవల అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అందుకు కారణం కూడా తనేననే ప్రచారం చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. నిత్యామీనన్‌కు దర్శకత్వంపై మోజు పుట్టిందనీ,అందుకే నటిగా అవకాశాలను తిరస్కరిస్తోందన్న ప్రచారం హల్చల్ చేస్తోంది. ఇది ఆ నోటా ఈ నోటా నిత్యామీనన్ చెవిన పడింది. అంతే అయ్యో దర్శకత్వం చేస్తానని నేనెప్పుడు ఎవరితో చెప్పాను?. ఇలా కూడా వదంతులు పుట్టిస్తున్నారా? అంటూ రియాక్ట్ అయ్యింది. దీని గురించి నిత్యామీనన్ మాట్లాడుతూ నిజం చెప్పాలంటే నటిగానే తనకింకా సంతృప్తి కలగలేదని, ఛాలెంజింగ్ పాత్రలు చాలా చేయాలని ఆశ పడుతున్నట్లు తెలిపింది. తనను దర్శకురాలిగా చూడటానికి చాలా మంది ఎదురు చూస్తున్నారన్నది ఆనందాన్ని కలిగిస్తోందని పేర్కొంది. అయితే ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని, భవిష్యత్‌లో దర్శకత్వం గురించి ఆలోచిస్తానని తెలిపింది. ప్రస్తుతం విజయ్ 61వ చిత్రంలో ముగ్గురు కథానాయికల్లో ఒకరిగా నటిస్తున్నాననీ నిత్యా చెప్పింది. కాగా విజయ్ చాలా శాంత స్వభావి అనీ, ఆయనతో తొలి సారిగా నటిస్తున్నాననీ చెప్పింది. అదే విధంగా అట్లీ దర్శకత్వంలో నటించడం సంతోషంగా ఉందని నిత్యామీనన్ పేర్కొంది. ఇందులో తండ్రి పాత్రలో నటిస్తున్న విజయ్‌కు జోడిగా నిత్యామీనన్ నటిస్తుందని సమాచారం. -
మెగాఫోన్ పడుతున్న హీరోయిన్!
రెండు సార్లు జాతీయ అవార్డులు.. కెరీర్లో లెక్కలేనన్ని హిట్లు.. వాటితో పాటు అగ్రహీరోతో రచ్చకెక్కిన విభేదాలు.. ఇవన్నీ కలబోస్తే కంగనా రనౌత్ అవుతుంది. గ్యాంగ్‌స్టర్, క్వీన్, తను వెడ్స్ మను లాంటి సినిమాలతో తానేంటో నిరూపించుకున్న కంగనా.. ఇప్పుడు మెగాఫోన్ పట్టుకుని యాక్షన్... కట్ అని చెబుతానంటోంది. క్రిష్ దర్శకత్వంలో తాను చేస్తున్న 'మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ' సినిమా తర్వాత ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తానని, అది కామెడీ అవుతుందని కంగనా ఖరారు చేసింది. మణికర్ణిక పోస్టర్ విడుదల అనంతరం ఆమె వారణాసిలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పింది. రాణీ లక్ష్మీబాయి పాత్రలో కూడా నటించే అవకాశం వచ్చిన తర్వాత.. తన జీవితం పరిపూర్ణం అయినట్లు అనిపిస్తోందని, అందుకే ఇప్పుడు తనకు ఎంతో ప్యాషన్ అయిన దర్శకత్వం వైపు వెళ్తున్నానని 30 ఏళ్ల కంగన తెలిపింది. తాను 15 ఏళ్ల వయసులో ఇల్లు వదిలి వచ్చేశానని, ఏదైనా సాధించినట్లు ఎప్పటికి ఫీలవుతానో అప్పటికి ఏమీ తెలియదని, ఇన్నాళ్లకు తన జీవితం పరిపూర్ణం అయినట్లు అనిపిస్తోందని చెప్పింది. విజయాలు, పరాజయాలు అన్నీ చూసి తాను అన్నీ సాధించేశానని అనుకోడానికి ముందే దర్శకత్వం వైపు కూడా వెళ్తున్నట్లు వివరించింది. ఇక నటనతో సమయం ఎక్కువగా వేస్ట్ చేసుకోనని, అయితే దర్శకత్వం వహిస్తూనే తన సినిమాల్లో కూడా నటిస్తానని చెప్పింది. అందుకే క్రిష్‌తో 'నా చిట్టచివరి డైరెక్టర్ మీరే' అని చెప్పేశానంది. తనకు నటిగా కంటే దర్శకురాలిగా పేరు తెచ్చుకోవడమే ఇష్టమంది. -
స్టార్ట్.. యాక్షన్.. కట్..!
నిత్యామీనన్ మనసు ఇప్పుడు మార్పు కోరుకుంటోందట. ఫర్ ఎ ఛేంజ్ కెమెరా ముందు కాకుండా కెమెరా వెనక ఉండాలని మనసు ఉవ్విళ్లూరుతోందట. దీన్నిబట్టి నిత్యా మనసులో ఏముందో కొంచెం గ్రహించే ఉంటారు. యస్.. ఈ మలయాళ కుట్టి మనసు ఇప్పుడు డైరెక్షన్ మీద ఉందట. వాస్తవానికి ‘భవిష్యత్తులో ఎప్పుడైనా దర్శకురాలిగా మారతా’ అని గతంలో నిత్యామీనన్ పలు సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ఆ టైమ్ వచ్చేసిందనిపిస్తోంది. ఎందుకంటే, ఓ సినిమా తెరకెక్కించడానికి నిత్యా సన్నాహాలు చేస్తున్నారట. కథానాయికగా ఆమె సంపాదించుకున్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాగా నటించడం మాత్రమే కాదు.. చక్కగా పాడతారు కూడా. తెలుగులో తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటారు. టోటల్‌గా ఈ కటౌట్‌కి చాలా టాలెంట్ ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి నిత్యామీనన్ ఇప్పటివరకూ దాదాపు 50 సినిమాలు చేశారు. ప్రస్తుతం విజయ్ సరసన ఆమె తమిళంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు దర్శకురాలిగా మారడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటివరకూ డైరెక్టర్ ‘స్టార్ట్... యాక్షన్’ అనగానే కెమేరా ముందు నటించిన నిత్యామీనన్ ఇప్పుడు తానే ‘స్టార్ట్.. యాక్షన్.. కట్’ చెప్పడానికి రెడీ అవుతున్నారన్నమాట. -
నిత్య సినిమాలకు నో చెప్తోందా..?
గ్లామర్ షోకు నో చెప్పినా.. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అందుకున్న అతి కొద్ది మందిలో నిత్యామీనన్ ఒకరు. కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలెంజింగ్ రోల్స్ ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ మలయాళీ బ్యూటి. సినిమా రేంజ్‌తో సంబంధం లేకుండా తన పాత్రకు ఉన్న ఇంపార్టెన్స్‌ను బట్టే నిత్య సినిమాలు ఎంచుకునేది. తన నటనతో ఎన్నో సినిమాలకు ఘనవిజయాలు అందించిన నిత్యామీనన్, కొంత కాలంగా వెండితెర మీద కనిపించటం మానేసింది. సందీప్ కిషన్ సరసన హీరోయిన్గా నటించిన 'ఒక అమ్మాయి తప్ప' సినిమా తరువాత నిత్యా మీనన్ ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. అంతేకాదు కొంత మంది దర్శకులు నిత్యతో సినిమా చేసేందుకు సంప్రదించే ప్రయత్నం చేసినా.. ఆమె నో చెప్పేసిందిట. భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న కారణంగానే నిత్యామీనన్‌కు సినిమాలు రావటం లేదన్న ప్రచారం జరుగుతున్నా.. అసలు కారణం వేరే ఉందంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. తన స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్న నిత్యామీనన్, ఆ సినిమా పనులకు ఎక్కువ టైం ఇచ్చేందుకే వేరే ఆఫర్స్‌ను అంగీకరించటం లేదంటున్నారు. ప్రస్తుతానికి నిత్యామీనన్ దర్శకత్వం వహించబోయే సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్నఇలాంటి సమయంలో దర్శకత్వం వైపు అడుగులేయటం అంత కరెక్ట్ కాదంటున్నారు విశ్లేషకులు. మరి నిత్య నిజంగానే దర్శకత్వం కోసమే సినిమాలు కాదంటుందా.? అసలు విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. -
ప్రేమరాత చిత్రానికి దర్శకత్వం
సాక్షి, తిరుమల:‘ నా కూతురు ఐశర్వ హీరోయిన్గా న టించే›ప్రేమరాత చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నా. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నా’ అని ప్రముఖ హీరో అర్జున్ అన్నారు. శనివారం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రేమరాత చిత్రంలో హీరోగా చందన్ అనే కొత్త నటుడిని పరిచయం చేస్తున్నానని వెల్లడించారు. ఆగస్టు 15 తేదీ తన పుట్టిన రోజు సందర్భంగా ఏటా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీ అని, ఈసారి షూటింగ్ కారణంగా రాలేకపోయానన్నారు. శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించానన్నారు. అనంతరం జాపాలి ఆంజనేయ స్వామివారిని, ధర్మగిరి ప్రాంతంలోని అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని అర్జున్ దర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. అక్కడే భక్తులతో కలసి అన్నప్రసాదాలు స్వీకరించారు. భక్తులతో కలసి ఆనందంగా గడిపారు. -
ధనుష్ ’పవర్ పాండి’ ఫస్ట్ లుక్
చెన్నై : హీరో ధనుష్ మరో కొత్త అవతారం ఎత్తాడు. నటుడు, గాయకుడు, గీత రచయితగా, నిర్మాతగా మంచి మార్కులు కొట్టేసిన ఈ హీరో తాజాగా మెగాఫోన్ పట్టాడు. ప్రముఖ నటుడు రాజ్ కిరణ్ ప్రధాన పాత్రలో 'పవర్ పాండి' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ విషయాన్ని ధనుష్ అధికారికంగా ధ్రువీకరించాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. దర్శకుడిగా ఈ సినిమా ధనుష్‌కి తొలి చిత్రం కాగా దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజ్ కిరణ్‌తో పాటు ఈ చిత్రంలో ప్రసన్న, చాయసింగ్ నటిస్తున్నారు. కాగా కబాలి చిత్రానికి సంగీతం అందించిన షాన్ రోల్డాన్ ... ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ అందించనున్నారు.అలాగే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను త్వరలో ప్రకటించనున్నారు. అయితే ఈ చిత్రంలో ధనుష్ నటిస్తాడా? లేదా?అన్నది మాత్రం సస్పెన్స్. ప్రస్తుతం ధనుష్ గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ’ఎన్నై నోక్కి పాయుమ్ తూట్టా’ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే ధనుష్ త్వరలో తన సొంత బ్యానర్‌పై రజనీకాంత్‌తో ఓ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకత్వం వహించనున్నాడు. #powerpaandi #wunderbarfilms #rajkiran #prasanna #DD1 a Sean roldan musical pic.twitter.com/8WSRAOW1e8 — Dhanush (@dhanushkraja) 7 September 2016 -
మెగాఫోన్ పట్టనున్న ధనుష్?
చాలా మంది ఒక వృత్తిలో రాణించడానికే పడరాని అవస్థలు పడుతుంటారు. అలాంటిది నటన, గీతరచయిత, గాయకుడు, నిర్మాత ఇలా పలు శాఖల్లో రాణించి శభాష్ అనిపించుకోవడం సాధారణ విషయం కాదు. అలాంటి అరుదైన బహుముఖ ప్రజ్ఞాశాలిల పట్టికలో నటుడు ధనుష్‌ను చేర్చవచ్చు. అసలు నటుడిగానే పనికిరాడు అని ఎగతాళికి గురైన నటుడు ధనుష్. తుళువదో ఇళమై చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన ధనుష్‌ను ఆ చిత్రం విడుదల తరువాత ఇలాంటి వాళ్లంతా హీరోగా నిలబడతారా? అని పరిహాసం ఆడినవారు లేకపోలేదు. అయితే తొలి చిత్రంతోనే సంచలన విజ యం సాధించి ఆ తరువాత నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు తిరుగులేని కథానాయకుడిగా ఎదిగారు. రాంజానా, షమితాబ్ చిత్రాలతో బాలీవుడ్‌లోనూ సక్సెస్ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఆడుగళం చిత్రంతో నటుడిగా జాతీయ అవార్డును, కాక్కాముట్టై చిత్రంతో నిర్మాతగా జాతీయ అవార్డును అందుకున్న ధనుష్ వై దిస్ కొలవెరి డీ పాటతో గాయకుడిగా, గీత రచయితగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. ఇలా నటుడిగా గాయకుడిగా, గీతరచయితగా, నిర్మాతగా విజయపథంలో పయనిస్తున్న ధనుష్ తాజాగా మరో అవతారం ఎత్తనున్నారన్న ప్రచారం కోలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అదే దర్శకుడి అవతారం. ధనుష్‌లో దర్శకత్వం వహించాలన్న కోరిక చాలా కాలంగా ఉంది. అది దాన్ని ఇప్పుడు నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ధనుష్ దర్శకత్వం వహించనున్న చిత్రంలో నటుడు రాజ్‌కిరణ్ ప్రధాన పాత్ర పోషించనున్నారని, ఇతర నట వర్గం, సాంకేతిక బృందం ఎంపిక జరుగుతోందని ప్ర చారం జరుగుతోంది. అయితే ఇందులో ధనుష్ నటిస్తారా? లేదా?అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈయన గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ఎన్నై నోక్కి పాయుమ్ తూట్టా చిత్రంలో నటిస్తున్నారు. -
శ్రుతి డైరెక్షన్ చేయడం సరికొత్త అనుభవం
శ్రుతిహాసన్‌ను డైరెక్ట్ చేయడం సరికొత్త అనుభంగా పేర్కొన్నారు ఆమె తండ్రి, ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత కమలహాసన్. ఈ విశ్వనటుడు తాజగా శభాష్‌నాయుడు చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో శ్రుతిహాసన్ తొలిసారిగా ఆయనతో కలిసి నటిస్తున్నారన్న విషయం తెలిసిందే.మలయాళ దర్శకుడు రాజీవ్‌కమార్ ఈ చిత్రానికి దర్శకుడు. అయితే ఆయన అనూహ్యంగా షూటింగ్ ఆరంభంలోనే అనారోగ్యానికి గురికావడంతో దర్శకత్వం బాధ్యతలను కమలహాసన్ తన భుజాలపై మోయాల్సిన పరిస్థితి. శభాష్‌నాయుడు చిత్రం షూటింగ్ అమెరికాలో శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తన కూతురు శ్రుతిని డెరైక్షన్ చేయడం సరికొత్త అనుభవం అని కమల్ పేర్కొన్నారు.ఇంతకు ముందు పలువురు నటీనటులను డెరైక్షన్ చేసినా శ్రుతి లాంటి స్టార్ హీరోయిన్ను తొలిసారిగా డెరైక్షన్ చేస్తున్నానని అన్నారు. తాను దశావతారం చిత్రంలో అమెరికా వ్యక్తి పాత్రకు మాట్లాడిన అమెరికా యాస ఉచ్చరింపునకు కారణం శ్రుతినేనన్నారు. తను అప్పట్లో అమెరికా నుంచి తిరిగొచ్చారన్నారు. శ్రుతినే తనకు అమెరికా యాసలో మాట్లాడడం నేర్పించినట్లు తెలిపారు. ఇక తాను హాస్యానికి ఎప్పుడూ దూరం కాలేదన్నారు. దశాతారం చిత్రంలోనూ వినోదాన్ని జోడించానని అన్నారు. ఇక శభాష్‌నాయుడు ఆ చిత్రంలోని బలరామ్ నాయుడు పాత్రకు కొనసాగింపుగా భావించవచ్చునన్నారు. ఇది పూర్తి వినోదాత్మక కథా చిత్రం అని తెలిపారు. అమెరికా షెడ్యూల్ పూర్తి చేసి మిగిలిన భాగాన్ని చెన్నైలో చిత్రీకరించి చిత్రాన్ని డిసెంబర్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు కమల్ వెల్లడించారు. -
360 డిగ్రీల్లో తిరిగే కొత్త కారు
కారు కొనాలనుకున్నవారు... ముందుగా దానికున్న విశిష్ట లక్షణాలను గమనిస్తారు. ముఖ్యంగా అందులోని ఆధునిక పరిజ్ఞానానికీ ప్రాధాన్యతనిస్తారు. అందుకే వాహన ప్రేమికులంతా ఇష్టపడే విధంగా లండన్ కు చెందిన ఓ వ్యక్తి కొత్తరకం కారును సృష్టించాడు. ప్రధానంగా 360 డిగ్రీల్లో చక్రాలు ఏ దిశకైనా తిరిగేలా ఏర్పాటు చేసి, తక్కువ స్థలంలో కూడా కారు అన్నివైపులకూ తిరిగేలా రూపొందించాడు. లండన్ కు చెందిన విలియం లిడ్డియార్డ్.. నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. ఫోర్క్ లిఫ్ట్ వాహనాల్లో వినియోగించే వోమిని డైరెక్షనల్ చక్రాలను పెట్టి, తయారు చేసిన ఆ కారు.. 360 డిగ్రీల్లో ఎటుపక్కకైనా సులభంగా తిరిగేట్టు ఏర్పాటు చేశాడు. అడ్డంగా పార్క్ చేయాల్సి వచ్చినపుడు సైతం ఇబ్బంది పడకుండా పక్కకు జరిపేందుకు వీలుగా కారు వీల్స్ ను రూపొందించాడు. సాధారణ కార్లకు వినియోగించే చక్రాల్లా కాకుండా... తాను వినియోగించిన చక్రాలు ఏ దిశకైనా తిరుగుతాయని, బోల్ట్ ఆన్ ఆప్లికేషన్ ను వినియోగించి ప్రపంచంలోనే మొట్టమొదటి సారి ఈ నూతన ఆవిష్కరణకు నాంది పలికినట్లు లిడ్డియార్డ్ చెప్తున్నాడు. పాత టయోటా కారుకు తాను రూపొందించి కొత్తరకం వీల్స్ ను పెట్టి, ట్రయల్ రన్ వేసిన అతడు.. ఆ వీడియోను యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసి, అందుకు సంబంధించిన వివరణ ఇచ్చాడు. సాధారణ కారుకు వేగంలోనూ, పనిచేసే తీరులోనూ ఏమాత్రం తీసిపోదని, అంతకంటే ఎక్కువ నియంత్రణా సామర్థ్యం కూడా కలిగి ఉంటుందని చెప్తున్నాడు. విలియమ్స్ కొత్త ప్రయోగం.. ఇప్పుడు యూట్యూబ్ లో లక్షలకొద్దీ వ్యూయర్లను ఆకట్టుకుంటోంది. అతడు పోస్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే నాలుగు లక్షలమంది వరకూ తిలకించడం ఎంతో ఆనందంగా ఉందని, తన నూతన ఆవిష్కరణ 'లిడ్డర్డ్ వీల్స్' కు సోషల్ మీడియా సహాయపడుతుందని ఆశిస్తున్నాడు. తన కొత్త సృష్టిని ఏదైనా కంపెనీ ప్రోత్సహిస్గే వారితో కలసి అభివృద్ధి పరిచి, కొత్తరకం కారును మార్కెట్లోకి తేవాలని ఎదురు చూస్తున్నాడు. మార్కెట్లో ప్రవేశ పెడితే తన వీల్స్ కు ఎంతో డిమాండ్ వస్తుందని ధీమాగా చెప్తున్నాడు. -
తప్పని పరిస్థితుల్లో దర్శకుడిగా..!
కమల్‌హాసన్‌లో మంచి నటుడు మాత్రమే కాదు.. మంచి దర్శకుడు కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఆయన దర్శకత్వం వహించిన చిత్రం చెప్పాలంటే ‘విశ్వరూపం’కి మించిన మంచి ఉదాహరణ లేదు. ఇలా నటనతో పాటు దర్శకత్వం మీద కూడా అవగాహన ఉండటం మంచి విషయమే. ఒక్కోసారి దర్శకుడికి కుదరకపోయినా, దర్శకత్వం వహించే పరిస్థితుల్లో ఆ దర్శకుడు లేకపోయినా.. అప్పుడు వెంటనే రంగంలోకి దిగొచ్చు. కమల్ నటిస్తున్న తాజా చిత్రం ‘శభాష్ నాయుడు’ విషయంలో అదే జరిగింది. ఈ చిత్రంలో కమల్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. చిత్రీకరణ కోసం ఇటీవల ఈ చిత్రబృందం లాస్ ఏంజిల్స్ వెళ్లింది. మొదటి రోజు షూటింగ్ బాగానే జరిగింది. నాలుగో రోజు చిత్రదర్శకుడు టి. రాజీవ్‌కుమార్ అస్వస్థతకు గురి కావడంతో కమల్ నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంతకీ రాజీవ్ పరిస్థితి ఎలా ఉందనే విషయానికి వస్తే.. లైమ్ అనే వ్యాధితో ఆయన బాధపడుతున్నారని డాక్టర్లు నిర్ధారించారట. ఐరోపా-ఉత్తర అమెరికాలో వచ్చే అరుదైన ఇన్ఫెక్షన్ ఇది అని సమాచారం. లాస్ ఏంజిల్స్‌లోని ది బెస్ట్ అనదగ్గ ఆస్పత్రిలో చేర్చి, రాజీవ్‌కు మెరుగైన చికిత్స చేయిస్తున్నారు. మరోవైపు షూటింగ్‌కు ఆటంకం కలగనివ్వకుండా కమల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. -
శభాష్ నాయుడును నేనే హ్యాండిల్ చేస్తున్నా
శభాష్ నాయుడు చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తున్నట్లు ఆ చిత్ర కథానాయకుడు, నిర్మాత కమలహాసన్ స్పష్టం చేశారు. తమిళం, తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కుతున్న చిత్రం శభాష్‌నాయుడు. ఇందులో విశ్వనాయకుడు కమలహాసన్, ఆయన కూతురు శ్రుతీహాసన్ తొలిసారిగా కలిసి నటిస్తున్నారు. రీల్ లైఫ్‌లోనూ వారు తoడ్రీకూతుళ్లుగా నటించడం విశేషం. రమ్యకృష్ణ, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీత జ్ఞాని ఇళయరాజా సంగీత బాణీలు కడుతున్నారు. కమలహాసన్ చిత్ర నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషన ల్ లైకా ఫిలింస్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి మలయాళ ప్రముఖ దర్శకుడు రాజీవ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే అమెరికాలో ప్రారంభం అయ్యింది. పలు ఆటంకాలను అధిగమించి చిత్ర యూనిట్ అమెరికా చేరుకున్నట్లు కమల్ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. కాగా నటుడిగా నిర్మాతగా బాధ్యతల్ని మోస్తున్న విశ్వనటుడికిప్పుడు అనివార్య కారణాల వల్ల అదనంగా దర్శకత్వం బాధ్యత భుజాన పడింది. ఈ విషయాన్ని కమలహాసన్ స్వయంగా అంగీకరించారు. ఆయన తెలుపుతూ శభాష్‌నాయుడు చిత్రానికి దర్శకత్వ బాధ్యతల్ని తాను నిర్వహిస్తున్నానన్నారు.క ారణం అమెరికాలోని లాస్ఏంజెల్స్లో చిత్ర షూటింగ్ ప్రారంభమైన నాలుగో రోజునే దర్శకుడు రాజీవ్‌కుమార్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. ఆయన లైమ్ అనే వ్యాధికి గురయ్యారని చెప్పారు. ఇది ఐరోపా, ఉత్తర అమెరికా ప్రాంతాలలో సోకే అరుదైన వ్యాధి అని తెలిపారు. దీంతో దర్శకుడు లాస్ఏంజెల్స్లోని ఆస్పత్రిలో ఉన్నత వైద్యం పొందుతున్నారని చెప్పారు. ఆయనను చిత్ర యూనిట్‌కు చెందిన సభ్యుడొకరు 24 నాలుగు గంటలు కనిపెట్టుకుని సేవలు అందించేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దర్శకుడు రాజీవ్‌కుమార్ కోలుకుని తిరిగొచ్చే వరకూ శభాష్‌నాయుడు చిత్ర దర్శకత్వ బాధ్యతల్ని తానే నిర్వహిస్తానని అన్నారు. చిత్రాన్ని జూలై నెల చివరికీ లేదా ఆగస్టు నెల తొలి వారానికల్లా పూర్తి చేయడానికి ప్రణాళికను చేసినట్లు కమల్ పేర్కొన్నారు. ఈ విశ్వనటుడికి దర్శకత్వం కొత్తేమీ కాదు కదా. ఇంతకు ముందు విరుమాండి, హేరామ్, విశ్వరూపం మొదలగు పలు విజయవంతమైన చిత్రాలను కమల్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. -
మెగాఫోన్ పట్టనున్న అరవింద్‌స్వామి
తెరపై రెండు రకాలుగా పేరు తెచ్చుకున్నారు. ఇక తెర వెనుక తన ప్రతిభను చాటుకోవాలనుకుంటున్నారు.ఆయనే నటుడు అరవింద్‌స్వామి. మణిరత్నం దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన భారీ చిత్రం దళపతి ద్వారా పరిచయమైన నటుడీయన. అందులో యువ కథానాయకడిగా కలెక్టర్ పాత్రలో అరవింద్‌స్వామి ఆ తరువాత కారణాలేమైనా సినిమాకు దూరం అయ్యారు.అదీ చిన్న గ్యాప్‌నే. తనను హీరోగా పరిచయం చేసిన అదే మణిరత్నం ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కడల్ చిత్రం అరవింద్‌స్వామి ఇటీవల తనీఒరవన్ చిత్రంలో జయంరవికి విలన్‌గా మారి మరో కోణంలో తనను ది బెస్ట్‌గా ఆవిష్కరించుకున్నారు. అలాంటి మల్టీ టాలెంటెడ్ నటుడిని అరవింద్‌స్వామి తలుపు తట్టడం మొదలెట్టాయి. అయితే పాత్రల ఎంపికలో ఆచీతూచీ అడుగేస్తున్న ఈ క్రేజీ నటుడు తను తొలిసారిగా విలన్‌గా ఢీకొన్న జయంరవితోనే మరో సారి భోగన్ చిత్రంలో విలనీయం ప్రదర్శించనున్నారు. ఇంతకు ముందు జయంరవితో రోమియో జూలియట్ చిత్రాన్ని తెరకెక్కించిన లక్ష్మణన్‌నే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హీరో,విలన్,క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించిన అరవింద్‌స్వామి తాజాగా దర్శకుడిగా తన సత్తా చాటడానికి సిద్ధం అవుతున్నారన్నది లేటెస్ట్ న్యూస్. త్వరలోనే తమిళం తేదా? హిందీలో గానీ ఒక చిత్రానికి మోగాఫోన్ పట్టాడానికి సిద్ధం అవుతునట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యో అవకాశం ఉంది. -
దర్శకేంద్రుడి క్లాస్ రూమ్
ఇన్నాళ్లు దర్శకుడిగా ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇప్పుడు మరో అవతారంలో దర్శనమివ్వనున్నాడు. ఇప్పటి వరకు మెగాఫోన్ పట్టుకొని సినిమా షాట్ల గురించి మాత్రమే చెప్పిన రాఘవేంద్రుడు త్వరలో దర్శకత్వ పాఠాలు చెప్పడానికి రెడీ అవుతున్నాడు. దర్శకుడిగా సంచలన విజయాలు నమోదు చేసిన ఈ దిగ్థర్శకుడు తనలాంటి మేటి దర్శకులను తయారు చేసే పనిలో ఉన్నాడు. ఇందుకు సంభందించిన ఓ ప్రమోషన్ వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన రాఘవేంద్ర రావు మరిన్ని వివరాల కోసం వేచిచూడాలంటూ ఊరిస్తున్నాడు. రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్స్‌ను తయారు చేసిన దర్శకేంద్రుడు ఇప్పుడు ఏకంగా స్కూలు పెట్టి మరి దర్శకులను తయారు చేయటం ఇండస్ట్రీకి శుభ పరిణామంఅంటున్నారు విశ్లేషకులు. Classes starting soon! Stay tuned!https://t.co/KFBiTS3wkJ — Raghavendra Rao K (@Ragavendraraoba) February 24, 2016 -
ఆ ఐదుగురితో డెరైక్షన్ చేస్తానంటున్న సోనమ్!
పులి కడుపున పులే పుడుతుంది. అనిల్ కపూర్ గారాలపట్టి సోనమ్ కపూర్ అదే నిరూపించారు. చాలా తక్కువ సమయంలోనే మంచి నటిగా పేరు తెచ్చుకున్నారామె. అయితే ఆమె దానితోనే సంతృప్తిపడదలచుకోలేదు. మెగాఫోన్ పట్టే ఆలోచనలో కూడా ఆమె ఉన్నారు. ఇంతకీ సోనమ్ ఎప్పుడు డెరైక్టర్ అవుతారు? కథలు రెడీ చేసుకున్నారా? డెరైక్టర్ అయ్యాక ఏయే కథానాయికలతో సినిమాలు తీయాలనుకుంటున్నారు?.. ఆ విషయాలు తెలుసుకుందాం... * కథానాయికగా అడుగుపెట్టే ముందు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దగ్గర సోనమ్ కపూర్ దర్శకత్వ శాఖలో చేశారు. మూడేళ్ల పాటు ఆయన దగ్గర డెరైక్షన్ నుంచి పలు విషయాలు తెలుసుకున్నారు. అంతకు ముందు సింగపూర్‌లో యునెటైడ్ వరల్డ్ కాలేజ్ ఆఫ్ సౌత్-ఈస్ట్ ఏషియాలో థియేటర్లో అండ్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. అక్కడ డెరైక్షన్, రైటింగ్ నేర్చుకున్నారు. * సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ‘బ్లాక్’ చిత్రానికి సోనమ్ దర్శకత్వ శాఖలో చేశారు. ఆ సినిమా చేస్తున్నప్పుడే భన్సాలీ తన తదుపరి చిత్రం ‘సావరియా’లో హీరోయిన్గా నటించమని సోనమ్‌ని అడిగారు. అప్పుడు ఈ బ్యూటీ దాదాపు 80 కిలోల బరువు ఉండేవారు. ‘సావరియా’లో నటించడం కోసం 35 కిలోలు తగ్గారు. మొదటి చిత్రంతోనే తన అందచందాలు, అభినయంతో అందర్నీ ఆకట్టుకుని, క్రేజీ హీరోయిన్ అయిపోయారు సోనమ్. అక్కణ్ణుంచి వెనక్కి తిరిగి చూసే అవసరం లేకుండా బిజీ బిజీగా సినిమాలు చేస్తున్నారు. * కథానాయికగా బిజీ అయినప్పటికీ డెరైక్షన్ చేయాలనే తన లక్ష్యాన్ని సోనమ్ మర్చిపోలేదు. వీలు కుదిరినప్పుడల్లా రకరకాల కాన్సెప్టులు అనుకుంటున్నారు. కొన్ని కథలు కూడా రాసుకున్నారు. రొమాంటిక్ మూవీస్ అంటే సోనమ్‌కు చాలా ఇష్టం. ఆ తరహా చిత్రాలు, కామెడీ మూవీస్‌ని తెరకెక్కించాలనుకుంటున్నారామె. మరో ఐదు, పదేళ్లల్లో మెగాఫోన్ పట్టుకోవాలనుకుంటున్నారు. * ఓ దర్శకురాలిగా ఏయే కథానాయికలతో సినిమాలు చేయాలో కూడా సోనమ్ ఓ జాబితా రాసుకున్నారు. ఆ జాబితాలో దీపికా పదుకొనె, అనుష్కా శర్మ, పరిణీతి చోప్రా, ఆలియా భట్, స్వర భాస్కర్ ఉన్నారు. ఈ ఐదుగురూ చాలా టాలెంటెడ్ అనీ, ఎలాంటి పాత్రలో అయినా నటింపజేయవచ్చని సోనమ్ అంటున్నారు. ‘‘వీళ్ల పేర్లు చెప్పినంత మాత్రాన మిగతా కథానాయికలు వేస్ట్ అని నా ఉద్దేశం కాదు. అందరూ ప్రతిభావంతులే. అందుకని మిగతావాళ్లతో కూడా సినిమాలు చేస్తా’’ అంటున్నారు సోనమ్. మొత్తం మీద సోనమ్ చెబుతున్న మాటలు చూస్తుంటే డెరైక్షన్ని ఆమె సీరియస్‌గానే తీసుకున్నారని అనిపిస్తోంది. హిందీలో మీరా నాయర్, దీపా మెహతా, ఫరా ఖాన్, నందితా దాస్ వంటి లేడీ డెరైక్టర్స్ ఉన్నారు. భవిష్యత్తులో వీళ్ల జాబితాలో సోనమ్ చేరతారు. అయితే, వాళ్లందరూ వేరు. సోనమ్ వేరు. కమర్షియల్ చిత్రాల కథానాయికగా పేరు తెచ్చుకున్న కేటగిరీలో ఉన్న తార సోనమ్. సో.. సోనమ్ నుంచి ఎలాంటి చిత్రాలు వస్తాయి? నటిగా పేరు తెచ్చుకున్న సోనమ్ దర్శకురాలిగా కూడా భేష్ అనిపించుకుంటారా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. -
'దర్శకత్వం చేసే ఉద్దేశం లేదు'
ముంబయి : బాలీవుడ్ ఇండస్ట్రీలో సరదాగా ఉంటూ రెండు దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న నటుడు అక్షయ్ కుమార్. నటుడిగా, నిర్మాతగా ఉండటానికే తాను ఇష్టపడతానని చెప్పాడు. ఫేమస్ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా డైరెక్షన్ చేసిన తన లేటెస్ట్ మూవీ 'సింగ్ ఈజ్ బ్లింగ్' ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్ర యూనిట్ ఓ చాట్ సెషన్ నిర్వహించారు. ఓ అభిమాని సంధించిన ప్రశ్నకు అక్షయ్ ఆశ్చర్యానికి లోనయ్యాడట. దర్శకత్వం ఎప్పుడు చేస్తారని ఈ చాట్ సెషన్లో వచ్చిన ఓ ప్రశ్నకు బదులుగా.. నాకు దర్శకత్వ చేసే ఉద్దేశం లేదన్నాడు. తాను ప్రస్తుతం నటుడిగా, నిర్మాతగా సంతృప్తిగా ఉన్నానంటూ నవ్వేశాడు అక్షయ్. ఈ ఏడాది ఇది విడుదలవుతున్న తన నాలుగో మూవీ 'సింగ్ ఈజ్ బ్లింగ్' అన్నాడు. ఈ మూవీ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ అని అక్షయ్ చెప్పాడు. తన ప్రతి మూవీలోనూ ఏదో వైవిధ్యం అక్షయ్ ప్రదర్శిస్తానని ఈ ఏడాది విడుదలైన ఆయన మూవీలను చూస్తే అర్థమవుతుంది. తాను దర్శకత్వం వహించాలని అభిమానులు కోరుకుంటున్నందుకు వారికి ధన్యావాదాలు తెలిపాడు. ప్రభుదేవాతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మరో అభిమాని అడిగిన ప్రశ్నకు.. మా కాంభినేషన్ ఎప్పుడూ సూపర్బ్. అతనికి ఏం కావాలో అదే తెరపై చూపిస్తాడంటూ ప్రభుదేవా గురించి చెప్పుకొచ్చాడు. 2012లో మా కాంబినేషన్లో 'రౌడీ రాథోడ్' మూవీ వచ్చిందని అక్షయ్ గుర్తుచేశాడు. -
హిస్టారికల్ స్టోరీలో నటిస్తున్న మహేష్ ?
-
మురుగదాస్ డైరెక్షన్లో యంగ్‌టైగర్ ?
-
త్వరలో డెరైక్షన్ చేస్తా!
‘‘ ‘పాండవుల్లో ఒకడు’ మాతృక ‘కప్పల్’ను వాస్తవానికి తమిళంలో వేరే నిర్మాత తీశారు. దిగ్దర్శకుడు శంకర్ కు ఈ సినిమా బాగా నచ్చి, తమిళంలో ఆయనే విడుదల చేశారు’’ అని నటుడు వైభవ్ తెలిపారు. ఆయన హీరోగా కార్తీక్ జి. క్రిష్ దర్శక త్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘కప్పల్’ను దర్శకుడు మారుతి తెలుగులో ‘పాండవుల్లో ఒకడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ నెల 24న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా వైభవ్ మాట్లాడుతూ- ‘‘పెళ్లయితే స్నేహం చెడి పోతుందన్న ఉద్దేశంతో ఓ అయిదుగురు యువకులు అమ్మాయిలకు దూరంగా ఉంటారు. కానీ అను కోని పరిస్థితుల్లో వాసు అనే యువకుడు ప్రేమలో పడతాడు. వాసు ప్రేమను చెడగొట్ట డానికి వాళ్లు ఎలాంటి ప్లాన్లు వేస్తారు? మరి.. వాసూకి పెళ్లవుతుందా? అనే కథాంశంతో హాస్యభరితంగా ఈ చిత్రం సాగుతుంది. ఇందులో వాసుగా నటించాను. సోనమ్ బజ్వా నాయిక. నటరాజన్ శంకరన్ పాటలు హైలైట్’’ అని చెప్పారు. కాగా, గతంలో ‘అమ్మా నాన్న తమిళ అమ్మాయి’, ‘శివమణి’కి దర్శకత్వ శాఖలో పని చేసిన అనుభవమున్న వైభవ్ త్వర లోనే డెరైక్ష న్ చేయాలనే ఆలోచన ఉందన్నారు. -
చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో...వెంకీ లవ్‌స్టోరీ
కొన్ని నెలలుగా వెంకటేశ్ గడ్డంతో కనిపిస్తున్నారు. ఈ గెటప్ కొత్త సినిమా కోసమేనన్నారు. ఓ పవర్ఫుల్ రోల్లో వెంకీ కనిపిస్తారని కూడా ఊహాగానాలు వచ్చాయి. ఇది ఇలా ఉండగా, ఇప్పుడొక తాజా వార్త బయటకొచ్చింది. తాజా వార్త ఏమిటంటే,. వెంకీ ఓ ప్రేమకథా చిత్రంలో నటించనున్నారట. ‘ఐతే..’ చిత్ర ఫేమ్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందట. ఆ ప్రేమకథ ఎలా ఉంటుందన్నది ప్రస్తుతం ఫిలింనగర్లో హాట్ టాపిక్. వెరైటీ కథాంశాలతో, స్టయిలైజ్డ్గా సినిమా తీస్తారనే పేరు చంద్రశేఖర్‌కి ఉంది. ప్రయోగాలు చేయడానికి వెనకాడని వెంకీతో ఆయన ఓ వినూత్న ప్రయత్నం చేయనున్నారని టాక్. ‘ఈగ’, ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’తో పాటు, 14 రీల్స్ సంస్థ భాగస్వామ్యంలో ‘లెజెండ్’ నిర్మించిన సాయి కొర్రపాటి ఈ కొత్త చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. -
త్రివిక్రమ్ డైరెక్షన్లో నాగచైతన్య.?
-
స్క్రీన్ ప్లే..దర్శకత్వం చంద్రబాబే
-
మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమాపై రోజుకో ట్విస్ట్..
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ...ఎవరి దర్శకత్వం అనేది ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాఫిక్‌గా మారింది. చిరంజీవి 150వ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారని అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. అయితే చిరంజీవి సినిమాకు దర్శకుడు మారినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. ఇక మెగాస్టార్ రీఎంట్రీ సినిమా కథలో ట్విస్టులెలా ఉంటాయో తెలీదు కానీ ఆ ప్రాజెక్ట్ గురించి రోజుకో ట్విస్ట్ రివీలవుతుంది. పూరి జగన్నాథ్ చెప్పిన కథలో మార్పులు చేయాడానికి రచయిత చిన్నికృష్ణను చిరంజీవి రంగంలోకి దింపినట్లు సమాచారం. అయితే చిన్నికృష్ణది ముక్కుసూటి మనస్తత్వం , పూరీకి మోహమాటం ఎక్కువ కావటంతో వీళ్ళద్దరి మధ్య సఖ్యత కుదరదనేది ఇండస్ట్రీ వాదన. ఏది ఎలా ఉన్నా చిరు 150 సినిమా మాత్రం రోజుకో ట్విస్ట్ ఇస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ చిత్రానికి వేరే దర్శకుణ్ణి తీసుకున్నారనే చర్చకు పూరి జగన్నాథ్ ఒక్క ట్వీట్‌తో పుల్‌స్టాప్ పెట్టేశారు . 'చిరంజీవిగారికి ఈ చిత్రానికి సంబంధించిన కథ తాలూకు ఫస్ట్ హాఫ్ చెప్పాను. ఆయనకు బాగా నచ్చేసింది. ఇప్పుడు సెకండ్ హాఫ్ కోసం వర్క్ చేయాలి. ఇది పది రెట్లు బాగుండేలా తయారు చేస్తా' అని పూరి కొద్దిరోజుల క్రితం ట్విట్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు కొద్దిరోజుల క్రితం చిరంజీవి దర్శకుడు వినాయక్‌తో నాలుగు గంటల సుదీర్ఘ చర్చల తరువాత చిరంజీవి ఓ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. అందుకే ఇప్పుడు చిన్నికృష్ణ పేరు వినిపిస్తోంది. అయితే చిన్నికృష్ణ 'ఆటోజానీ' కథకు తుది మెరుగులు దిద్దుతాడా లేదంటే మరో కొత్త కథను తయారు చేస్తాడా అన్న విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఫిలిం నగర్ లో వినిపిస్తున్న మాటల్ని బట్టి వినాయక్ ఆధ్యర్వంలో చిన్నికృష్ణ చిరంజీవి కోసం ఓ పవర్ఫుల్ కథ సిద్ధం చేసాడని తెలుస్తోంది. మరి దాన్ని వినాయక్ డైరెక్ట్ చేస్తాడా లేక పూరీ తెరకెక్కిస్తాడా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు చిరంజీవి అభిమాన సంఘాలు కూడా ఈనెల మొదటి వారంలో హైదరాబాద్‌లో (అప్పటి పీఆర్పీ కార్యాలయం) సమావేశం అయ్యారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా (ఆగస్టు 22) ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మరి 150వ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే.. -
కార్తిక్సుబ్బరాజు దర్శకత్వంలో కమలినీ
-
కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో సుదీప్ సినిమా
-
‘అల్లరి’ రవిబాబు దర్శకత్వంలో?
‘విక్టరీ’ వెంకటేశ్ ఏ సినిమాలో చేస్తున్నారు? ఇప్పుడు అభిమానుల్లో ఇదే చర్చ. త్వరలో ఈ ప్రశ్నకు సమాధానం దొరకనుంది. ఇప్పటికే కొంత మంది దర్శకులు వెంకీ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారట. ఈ జాబితాలో ముందున్న పేరు రవిబాబు. వెంకీ కోసం ఇప్పటికే ఓ స్క్రిప్ట్ తయారు చేశారని, త్వరలోనే ఈ సినిమా మొదలవునుందని సమాచారం. -
లారెన్స్ డైరెక్షన్లో రజనీ..?
-
నిత్యావసరాల పంపిణీలో పారదర్శకత
జాయింట్ కలెక్టర్లకు మంత్రి ఈటల రాజేందర్ దిశానిర్దేశం ధాన్యం సేకరణ, ఆహార భద్రతా కార్డుల జారీపై సమీక్ష హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా సరఫరా చేసే నిత్యావసర సరుకుల పంపిణీ పక్కదారి పట్టకుండా అత్యంత పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. వచ్చే నెల నుంచి ఆహార భద్రతా కార్డుల జారీ ప్రక్రియ మొదలు కానున్నందున అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో జాయింట్ కలెక్టర్లతో పౌర సరఫరాలశాఖ పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ధాన్యం సేకరణ, కార్డుల జారీ, అక్రమాల నివారణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. లబ్ధిదారులకు సరైన రీతిలో సరుకులు చేరేలా ఈ-పాస్, రవాణా సక్రమంగా జరిగేలా జీపీఎస్ వ్యవస్థను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అవసరమైతే సన్నబియ్యం కోటాను పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ పథకాన్ని అంగన్వాడీలకు కూడా విస్తరిస్తామని చెప్పారు. అక్రమాలకు పాల్పడితే జైలుకే: ఈటల జాయింట్ కలెక్టర్లతో సమావేశం అనంతరం ఈటల విలేకరులతో మాట్లాడుతూ ‘నిత్యావసరాల పంపిణీ పారదర్శకంగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. జీపీఎస్, ఈ-పాస్ వ్యవస్థను తెచ్చి అక్రమాలను అరికట్టే చర్యలు చేపడుతున్నాం. లబ్ధిదారులకు అందాల్సిన బియ్యం, చక్కెర సహా ఇతర సరుకుల్లో చిన్నపాటి తేడా వచ్చినా ఉపేక్షించేది లేదు. డీలర్లు ఎలాంటి అక్రమాలకు పాల్పడినా పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసి నేరుగా జైలుకే పంపుతాం’ అని హెచ్చరించారు. రేషన్ డీలర్లకు కమీషన్ పెంచే విషయమై త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఫ్యాప్సీ భవన్లో తెలంగాణ రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశానికి హాజరైన ఈటల మిల్లర్ల సమస్యలపై సానుకూలంగా స్పందించారు. బ్యాంకు రుణాల చెల్లింపులో మిల్లర్లకు వెసులుబాటు కోసం త్వరలోనే బ్యాంకర్లతో సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వంలో ఏ రంగాన్నీ కన్నీళ్లు పెట్టనివ్వమని చెప్పిన ఈటల...మిల్లర్లు రీసైక్లింగ్ దందాలకు పాల్పడరాదని సూచించారు. ఈ సమావేశంలో మిల్లర్ల సంఘం దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడు దేవెందర్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు గన్ప నాగేంద్ర, ప్రధాన కార్యదర్శి వడ్డి మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. -
త్రివిక్రమ్ డైరెక్షన్లో యంగ్‌టైగర్..?
-
ఆటోగ్రాఫ్ నటి మల్లిక గుర్తు ఉందా?
ఆటోగ్రాఫ్ నటి మల్లిక గుర్తు ఉందా? ఇటీవల సెక్స్ వేధింపులు అంటూ ప్రకటనలు చేసి కలకలం సృష్టించిన ఈ భామ ఇప్పటి వరకు తెర ముందు పలు అనుభవనాలను చవి చూశారు. ఆ అనుభవాలతో ఇకపై కెమెరా వెనుక కెప్టెన్సీ బాధ్యతలను నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నట్టు కోలీవుడ్ సమాచారం. మల్లిక తమిళంలో ఆటోగ్రాఫ్, తిరుప్పాచ్చి తదితర చిత్రాల్లో ప్రధాన పాత్ర పోషించారు. అదే విధంగా మలయాళంలో పలు చిత్రాలను చేసిన ఈమె తాజాగా, దర్శకత్వంపై మొగ్గు చూపుతున్నారు. ఆమె దర్శకత్వం వహించనున్న చిత్రంలో భావన నటిస్తున్నట్టు తెలిసింది. మల్లిక, భావన గతంలో మలయాళ చిత్రంలో కలిసి నటించారు. ఆ పరిచయంతోనే మల్లిక దర్శకత్వంలో నటించేందుకు భావన సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ చిత్ర కథ కథనాలను ప్రముఖ మలయాళ రచయిత తయారు చేస్తున్నట్టు తెలిసింది. ఇది హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంగా తెరకెక్కనున్నట్టు సమాచారం. ఇంతకు ముందు చిత్తిరం పేసుదడి, దీపావళి, తదితర చిత్రాల్లో నటించిన భావన ఆ తర్వాత ఆశించిన అవకాశాలు లేకపోవడంతో టాలీవుడ్, మాలీవుడ్లపై దృష్టి పెట్టారు. ఆమె కోలీవుడ్‌లో నటించిన చివరి చిత్రం అసల్. మల్లిక చిత్రంతో మరో సారి కోలీవుడ్‌లో పాగా వేయాలని భావన భావిస్టున్నట్టు సమాచారం. -
షకీలా టార్గెట్ ఎవరు?
స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను,అన్యాయాలను ప్రశ్నించిన ఓ మహిళ కథే ‘రొమాంటిక్ టార్గెట్’. షకీలా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. నరేశ్, శ్వేతాషైనీ, శ్రీదే వి హీరో హీరోయిన్లుగా సత్యం సినిమా క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని మెంటా సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. సమర్పకులు సయ్యద్ అఫ్జల్ మాట్లాడుతూ-‘‘షకీలా గారు చెప్పిన దాని కన్నా ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు. ఈ కథ తెలిసిన కొంతమంది రాజకీయనాయకుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. అయినా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి వెనుకాడం’’ అని అన్నారు. షకీలా మాట్లాడుతూ -‘‘ఆడవారిపై జరుగుతున్న అన్యాయాలను వేలెత్తి చూపిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. త్వరలోనే విడుదల చేస్తాం’’అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అభిషేక్, పాటలు: సయ్యద్ అఫ్జల్, బొబ్బా, సహ నిర్మాత: జల్లేపల్లి నరేశ్. -
అవకాశం వస్తే చిరంజీవితో సినిమా తీస్తా
వర్ధమాన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల భద్రాచలం : అవకాశం వస్తే చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహిస్తానని వర్ధమాన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అన్నారు. భద్రాద్రి కళాభారతి ఆధ్వర్యంలో జరుగుతున్న నాటకోత్సవాలకు అతిథిగా విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. చిరంజీవి సినిమాకు అవకాశం వస్తే అంతకంటే కావాల్సి ఏముందన్నారు. అందుకు తగ్గ కథ తనవద్ద ఉందన్నారు. దాసరి నారాయణరావు సినిమాలంటే ఎంతో ఇష్టమన్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కొత్తబంగారు లోకం, ముకంద సినిమాలతో మంచి గుర్తింపు రావటం ఆనందంగా ఉందన్నారు. దర్శకుడిగా రాణించటంలో తనకు ఎలాంటి బ్యాంక్ గ్రౌండ్ లేదని, భగవంతుడు కల్పించిన ఆలోచనతోనే ఈ రంగాన్ని ఎంచుకున్నానని తెలిపారు. కుటుంబ నేపథ్యం ఉన్న సినిమాలకే ప్రాధాన్యత ఉంటుందన్నారు. తన కొత్త ప్రాజెక్టుగా మహేష్‌బాబుతో ‘బ్రహ్మోత్సవం’ తీస్తున్నట్లు చెప్పారు. సినిమాకు సంబంధించిన ప్రాజెక్టు పూర్తయ్యిందని, త్వరలోనే కార్యరూపం దాల్చతామని అన్నారు. ఇంకా హీరోయిన్ ఎంపిక జరుగాల్సి ఉందన్నారు. -
శంకర్ దర్శకత్వంలో...?
ఆరంభం, వీరమ్.. ఇలా వరుస విజయాలతో దూసుకెళుతున్నారు అజిత్. ఆయన నటించిన తాజా చిత్రం ‘ఎన్నయ్ అరిందాల్’ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తదుపరి శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అజిత్ అంగీకరించారట. శంకర్‌తో ‘భారతీయుడు’ వంటి సూపర్ హిట్ నిర్మించిన ఏయం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తారని చెన్నయ్ టాక్. -
శంకర్ దర్శకత్వంలో చిరంజీవి చిత్రం?
మెగాస్టార్ చిరంజీవి, స్టార్ దర్శకుడు శంకర్ కలయికలో త్వరలో భారీ చిత్రం రూపుదిద్దుకునే అవకాశాలు ఉన్నాయూ? ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్‌లలో జరుగుతున్న ఆసక్తికర చర్చ ఇది. మొన్నటి వరకు రాజకీయాలతో బిజీగా ఉన్న చిరంజీవి మళ్లీ సినిమాల్లో నటిస్తానని ప్రకటించారు. 149 చిత్రాలను పూర్తి చేసుకున్న చిరంజీవి 150వ చిత్రంకథ కోసం ఎదురు చూస్తున్నారు. గత ఏడాది ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం ఆరంభం అవుతుందన్న ప్రచారం సాగింది. అయితే, మంచి కథ దొరకని దృష్ట్యా, ఆ చిత్రం ప్రారంభం కాలేదు. అదే సమయంలో దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించాలన్న ఆసక్తిని చిరంజీవి ఇటీవల వ్యక్తం చేశారు. విక్రమ్ హీరోగా ఐ చిత్రాన్ని పూర్తి చేసిన శంకర్, ఈ చిత్ర తెలుగు ఆడియో వేడుక ఇటీవల జరగ్గా, ఆ వేడుకలో దర్శకుడు రాజమౌళి మగధీర చిత్రం చూసి ఆయన అభిమాని అయినట్టు పేర్కొన్నారు. ఆయన తాజా చిత్రం బాహుబళి చిత్రాన్ని చూడాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. తాను తెలుగులో ఓ చిత్రం చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నట్టు తెలిపారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే చిరంజీవితో చిత్రం చేయడానికి శంకర్ రాయబారం చేస్తున్నట్టు తాజా సమాచారం. -
అందుకే నటించను
తన భార్య ఐశ్వర్య దర్శకత్వంలో నటించకపోవడానికి కారణాన్ని నటుడు ధనుష్ తెలిపారు. రజనీకాంత్ పెద్దకూతురు ఐశ్వర్య తొలిసారిగా మెగాఫోన్ పట్టి తన భర్త ధనుష్ హీరోగా ‘3’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్ర నిర్మాణ దశలో మంచి బూమ్ తెచ్చుకున్నా విడుదలైన తరువాత ఆశించిన విజయం సాధించలేదు. అంతేకాదు ఇకపై తన భార్య దర్శకత్వంలో నటించనని ధనుష్ ప్రకటించా రు. ఆయన వ్యాఖ్యలపై మీడియా ఈకలు పీకడం మొదలెట్టింది. 3 చిత్రం విజయం సాధించనందువల్లే ధనుష్ అలాంటి నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జోరందుకుంది. మరోపక్క ఐశ్వర్య తన రెండవ చిత్రాన్ని వర్ధమాన నటుడు గౌతమ్ కార్తీక్ హీరోగా మొదలెట్టేశారు. ఇలాంటి పరిస్థితిలో ధనుష్ తన భార్య దర్శకత్వంలో నటించకపోవడానికి కారణం వెల్లడిస్తూ ఐశ్వర్య దర్శకత్వం వహించిన చిత్రం హిట్ అయ్యిందా? ప్లాప్ అయ్యిందా? అన్నది సమస్య కాదన్నారు. ‘3’ చిత్రానికి తామిద్దరం పని చేసినపుడు అధిక సమయం షూటింగ్ స్పాట్లోనే ఉండేవారమన్నారు. దీంతో పిల్లలకోసం సమ యం కేటాయించలేని పరిస్థితి నెలకొందని చెప్పా రు. అందుకే ఎవరో ఒకరైనా పిల్లలతో ఉండాలని ఇద్దరం కలసి పనిచేయరాదని నిర్ణయించుకున్నామని వివరించారు. ఇకపోతే రజనీకాంత్‌తో కలిసి నటిం చాలని ఆసక్తిగా ఉందని అలాంటి అవకాశం వస్తే చాలా సంతోషిస్తానన్నారు. ప్రస్తుతం హిందీలో షమితాబ్ చిత్రంలో అమితాబ్‌బచ్చన్‌తో కలిసి నటిస్తున్నానని తెలిపారు. ఆయన చాలా ఫ్రెండ్లీగా నడుచుకుంటారన్నారు. ఆయన గొప్ప నటుడైనా తన పాత్ర విషయంలో జోక్యం చేసుకోలేదని చెప్పారు. అలాంటి గొప్ప నటుడిని ఇంతకుముందెప్పుడూ చూడలేదని ధనుష్ పేర్కొన్నారు. -
చిరు 150వ సినిమా దర్శకుడెవరు ?
-
శ్రీవాస్ దర్శకత్వంలో 99వ సినిమా...?
చకచకా నూరో సినిమా వైపు అడుగులేస్తున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన 98వ చిత్రం నిర్మాణ దశలో ఉంది. సత్యదేవాను దర్శకునిగా పరిచయం చేస్తూ బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రానికి ‘లయన్’ అనే టైటిల్ విస్తృత ప్రచారంలో ఉంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇదే వేడిలో తన 99వ చిత్రానికి కూడా రంగం సిద్ధం చేసేశారు బాలయ్య. ఇటీవల ‘లౌక్యం’ చిత్రంతో విజయాన్ని అందుకున్న శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. నిజానికి తన తొలి చిత్రం ‘లక్ష్యం’ తర్వాతే శ్రీవాస్, బాలకృష్ణతో సినిమా చేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఇటీవలే ‘లౌక్యం’ సినిమా చూసి మెచ్చుకొన్న బాలకృష్ణ, శ్రీవాస్‌తో సినిమా చేయాలని భావించారు. ప్రముఖ రచయితలు కోన వెంకట్, గోపీమోహన్‌లు ఈ కొత్త ప్రాజెక్ట్‌కు స్క్రిప్టు సమకూర్చే పనిలో ఉన్నారు. వీళ్లిద్దరూ బాలకృష్ణ చిత్రానికి పనిచేయడం ఇదే ప్రథమం. బాలకృష్ణతో ‘ఆదిత్య 369, వంశానికొక్కడు, భలేవా డివి బాసు, మిత్రుడు’ చిత్రాలు నిర్మించిన సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని వినికిడి. సంక్రాంతి తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉందని ఫిలిమ్‌నగర్ సమాచారం. పూర్తి వివరాలు అధికారికంగా త్వరలోనే తెలుస్తాయి. -
మెగా బ్రదర్స్ మెగాఫోన్ పడుతున్నారా?
-
చిరంజీవే దర్శకత్వం వహిస్తారా?
కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి మెగాఫోన్ పట్టుకుంటారా? అవునట ఆయన దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తబోతున్నారని తెలుస్తోంది. రెండు దశాబ్దాల పాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమను మకుటం లేని మహారాజులా ఏలిన ఆయన తాజాగా దర్శకత్వంపై మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. రీల్ మీద పాలిటిక్స్‌ను ఈజీగా హ్యాండిల్ చేసిన చిరంజీవి రియల్ లైఫ్ రాజకీయాల్లో మాత్రం తడబడిన విషయం తెలిసిందే. పాలిటిక్స్ ద్వారా పోయిన పాపులారిటీని మళ్లీ సినిమాల ద్వారా తెచ్చుకునేందుకు మెగాస్టార్ ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయాల నుంచి కాస్త విశ్రాంతి దొరకటంతో చిరంజీవి సినిమాలపై.. అందునా తన 150వ సినిమాపై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రీ ఎంట్రీ గ్రాండ్‌గా ఉండేలా తన స్వీయదర్శకత్వంలో ఆ సినిమాను తీర్చిదిద్దాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. కాగా చిరంజీవి 150 సినిమాకి డైరెక్టర్‌గా చాలామంది పేర్లు తెర మీదకు వచ్చాయి. ఛాన్స్ ఇస్తే చిరు సినిమాకు దర్శకత్వం వహిస్తానని దర్శకుడు వీవీ వినాయక్ బాహాటంగానే చెప్పాడు. కానీ చిరంజీవి మాత్రం స్వయంగా తానే రంగంలోకి దిగుతున్నారట. నలభై ఏళ్ల తన నటనా అనుభవంతో ఆయన మెగాఫోన్ పట్టుకునేందుకు డిసైడ్ అయ్యారట. తాను నటించి దర్శకత్వం వహిస్తే భారీ క్రేజ్ వస్తుందని కూడా చిరు భావిస్తున్నారట. కాగా చిరంజీవి దర్శకత్వంపై ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. -
చిరంజీవితో 150వ సినిమాకు కథ కోసం ప్రయత్నిస్తున్నా
విశాఖ : మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహించాలన్న కోరిక ఉందని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ మరోసారి తన మనసులో మాటను బయటపెట్టాడు. అందుకు సరైన కథ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చిన వినాయక్ అక్కడ విలేకర్లతో మాట్లాడాడు. మహేష్ బాబు హీరోగా వచ్చే ఏడాది ఓ సినిమా నిర్మిస్తున్నట్లు తెలిపాడు. అలాగే మరో ఇద్దరు అగ్ర హీరోలతో సినిమాలు తీసే యోచన ఉందన్నాడు. జూనియర్ ఎన్టీఆర్‌తో అదుర్స్ 2 కూడా తీయనున్నట్లు చెప్పాడు. భూ విక్రయానికి సంబంధించిన పని మీద వినాయక్ రావటంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. అతడిని చూసేందుకు, కలిసి ఫోటోలు తీయించుకునేందుకు పలువురు పోటీ పడ్డారు. -
అన్నయ్య దర్శకత్వంలో తమ్ముడు?
ప్రముఖ యువ నటుడు ధనుష్‌కు తన అన్నయ్య సెల్వరాఘవన్ అంటే చాలా ఇష్టం. గౌరవం కూడా. ధనుష్ ప్రస్తుతం కథానాయకుడిగాను, నిర్మాతగాను విజయాల బాటలో దూసుకుపోతున్నారు. ఇటీవల ఆయన తన ఉండర్ బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించి హీరోగా నటించిన వేలై ఇల్లా పట్టాదారి మంచి విజయాన్ని సాధించింది. అదే విధంగా సెల్వరాఘవన్‌కు ఈ మధ్య సరైన విజయాలు లేవు. ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం ఇరండామ్ ఉలగం చాలా నిరాశపరచింది. దీంతో ఆయన దర్శకత్వం వహించాల్సిన ఒకటి, రెండు చిత్రాలు డ్రాప్ అయ్యాయి. ఏదేమైనా ధనుష్ ఇప్పుడు తన అన్నయ్య దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా వార్త. ఇంతకుముందు కాదల్ కొండేన్, 7జి రెయిన్ బో కాలనీ, పుదుపేట్టై వంటి చిత్రాలకు సెల్వరాఘవన్‌తో పనిచేసిన సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, ఛాయా గ్రాహకుడు అరవింద్ కృష్ణలు ఈ చిత్రానికి చేతులు కలపనున్నారని సమాచారం. ఈ బృందమే ధనుష్ ఉండర్‌బార్ ఫిలింస్ ద్వారా మళ్లీ త్వరలో రానున్నామంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. -
రొమాంటిక్ సినిమాకు డెరైక్షన్..!
‘క్వీన్’ సినిమాతో బాలీవుడ్ క్వీన్ అనిపించుకున్నారు కంగనారనౌత్. నటిగా ఆమెను మరో మెట్టుపైన కూర్చోబెట్టిందా సినిమా. ‘‘ ‘క్వీన్’ తెచ్చిన గౌరవాన్ని పోగొట్టుకోలేను. అందుకే... ఇక నుంచి అభినయానికి ఆస్కారమున్న ప్రయోగాత్మక పాత్రలకే పెద్దపీట వేయాలనుకుంటున్నా’’ అని కంగనా ఆ మధ్య మీడియాతో చెప్పారు. దానితో పాటు మరో కొత్త నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు కంగనా. అదేంటంటే... త్వరలోనే ఆమె మెగా ఫోన్ పట్టబోతున్నారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు. ‘‘త్వరలోనే నా దర్శకత్వంలో సినిమా ఉంటుంది. కథ కూడా సిద్ధమైంది. రొమాంటిక్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాను. మరో విషయం ఏంటంటే... నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఈ సినిమాలో చూపించబోతున్నాను. అందుకని నా లైఫ్‌నే సినిమాగా తీస్తున్నానని అనుకోవద్దు. ఇది కల్పిత కథే. అయితే... నా జీవిత సంఘటనలు ఈ కథకు వన్నె తెస్తాయి. అందుకే ఇందులో చేర్చాను. వాటి వివరాలు ముందు చెప్పను. సినిమా విడుదలయ్యాకే తెలియజేస్తా’’ అని కంగనా చెప్పారు. -
పూరీ డైరెక్షన్లో తారక్ సినిమా
-
దర్శకురాలిగా సెల్వరాఘవన్ భార్య
కాదల్ కొండాన్ చిత్రంతో కోలీవుడ్‌లో ఒక కొత్త ట్రెండ్‌కు నాంది పలికిన దర్శకుడు సెల్వరాఘవన్. ఆ తరువాత కడా 7/జి రెయిన్ బో కాలనీ, వంటి వైవిధ్య ప్రేమ కథా చిత్రాలతో అనూహ్య విజయాలను సాధించిన సెల్వరాఘవన్ ఇటీవల కాస్త వెనుక పడ్డారనే చెప్పాలి. ఆయ న ఇటీవల తెరకెక్కించిన ఇరండామ్ ఉలగం. ఎన్నో అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. దీంతో చాలా నిరాశ చెందాలనే చెప్పాలి. అయితే ఇప్పుడాయన దర్శకత్వం బాధ్యతలను భార్య గీతాంజలి చేపట్టారన్నది తాజా వార్త. నటి సోనియా అగర్వాల్ నుంచి విడాకులు పొందిన తరువాత సెల్వరాఘవన్ తన వద్ద సహాయ దర్శకురాలిగా పని చేసిన గీంతాం జలిని పెళ్లి చేసుకున్నారు. తాను మెగాఫోన్ పట్టనున్న విషయం గురించి సెల్వరాఘవన్ భార్య గీతాంజలి వివరిస్తూ తన భర్త దర్శకత్వం వహించిన మయక్కం ఎన్న, ఇరండాం ఉలగం చిత్రాలకు సహాయ దర్శకురాలిగా పని చేశానన్నారు. సెల్వరాఘవన్ ప్రోత్సహించడంతో ఇప్పుడు మాలై నెరత్తు మయక్కం పేరుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి తన భర్త సెల్వరాఘవన్ కథ, కథనం మాటలు సమకూర్చినట్లు వెల్లడించారు. ఇది ఈ తరం యువత ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. నూతన తారాగణం నటించనున్న ఈ చిత్రానికి కెమెరామెన్ రంజి సహాయకుడు శ్రీధర్. చాయాగ్రహణ అందిస్తున్నారని తెలిపారు. షూటింగ్‌ను మూడు వారాల క్రితం చెన్నైలో ప్రారంభించి నిరాటంకంగా నిర్వహిస్తున్నట్లు నవ మహిళా దర్శకురాలు గీతాంజలి వెల్లడించారు. -
మళ్లీ డెరైక్షన్ చేస్తున్నా...
‘‘బ్రెయిన్‌కి కనెక్టయిన సినిమా హిట్ టాక్కే పరిమితం అవుతుంది. హార్ట్‌కి కనెక్టయిన సినిమాకి లాంగ్ రన్ ఉంటుంది. ‘దృశ్యం’ రెండో కోవకు చెందిన సినిమా’’ అని రచయిత ‘డార్లింగ్’స్వామి అన్నారు. తాను సంభాషణలు సమకూర్చిన ‘దృశ్యం’ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం పట్ల స్వామి ఆనందం వెలిబుచ్చారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో ముచ్చటించారు. ‘‘మాది తాడేపల్లిగూడెం. అక్కడే డిగ్రీ చదివాను. వైజాగ్‌లో ఎం.ఎ.లిటరేచర్ చేశాను. సినిమా అంటే పేషన్, రచనపై ఆసక్తి... నన్ను హైదరాబాద్ వైపు నడిపించాయి. కోన వెంకట్‌గారి వద్ద సహాయకునిగా చేరాను. ‘ఒక ఊరిలో’ నేను మాటలు రాసిన తొలి సినిమా. హ్యాపీ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్, రెబల్ రచయితగా నాకు మంచి గుర్తింపు తెచ్చిన సినిమాలు’’ అని చెప్పారు స్వామి. ‘రొమాన్స్’ చిత్రంతో దర్శకునిగా కూడా మారిన తాను, త్వరలో మరో చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు. -
అఖిల్‌కి మంచి ప్రేమకథ చెప్పాను :దేవా కట్టా
‘‘అఖిల్‌కి ఓ మంచి ప్రేమకథ చెప్పాను. తనకు నచ్చింది. వేరే దర్శకుల దగ్గర కూడా అఖిల్ రెండు కథలు విన్నారు. ఏ సినిమా ముందు ఉంటుందో చెప్పలేను’’ అని దేవా కట్టా చెప్పారు. నాగచైతన్య, సమంత జంటగా ఆయన దర్శకత్వం వహించిన ‘ఆటోనగర్ సూర్య’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. తొలి రోజు టాక్ తర్వాత ఈ చిత్రంలోని పన్నెండు నిమిషాల సన్నివేశాలను కత్తిరించి, నిడివి తగ్గించారు. నిడివి తగ్గిన తర్వాత మంచి ఆదరణ లభిస్తోందని దేవా కట్టా చెప్పారు. ఈ చిత్రంలోని సంభాషణలకు మంచి స్పందన లభిస్తోందని చెప్పారు. ప్రజలను ప్రభావితం చేసే కథలతో సినిమాలు తీయాలనుకుంటానని, సహజత్వానికి దూరంగా సినిమాలు చేయనని దేవా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తన దర్శకత్వంలో మరో సినిమా చేయాలనే ఆకాంక్షను సమంత వెలిబుచ్చిన నేపథ్యంలో, ఆమెతో ‘ఏ మాయ చేశావె’వంటి ప్రేమకథా చిత్రం చేయాలనుకుంటున్నా అని తెలిపారు -
అవును...2017లో మెగాఫోన్ పడతా
చాలామంది నటీనటులు నటనే కాదు, ఇతర శాఖలపై మక్కువ చూపటం సాధారణ విషయమే. 24 కళల్లో తమకు నచ్చిన శాఖను ఎంచుకుంటున్నారు. అందులో దర్శకత్వం శాఖ అంటే అందరికీ మోజే... అవకాశం దొరికితే తమ సత్తా చాటేందుకు మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధం అవుతున్నారు. తాజాగా హీరో అల్లరి నరేష్ దర్శకత్వంపై మోజు పడ్డాడు. త్వరలో మెగా ఫోన్ పడతానని చెబుతున్నాడు. తనకు నటన కన్నా దర్శకత్వం అంటేనే ఇష్టమని తెలిపాడు. నటన, దర్శకత్వం ఒకేసారి చేయడమనేది కొంచెం కష్టమైన పని అని.... 2017లో దర్శకత్వం చేపట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్లు అల్లరి నరేష్ తన మనసులోని మాట చెప్పాడు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మోరులో 'బందిపోటు' చిత్రం షూటింగ్ లో పాల్గొన్న అల్లరోడితో చిట్ చాట్..... అన్నయ్య రాజేష్, నేను నిర్మాతలుగా మా బ్యానర్లో బందిపోటు తొలి సినిమాగా నిర్మిస్తున్నాం. ఈవీవీ బ్యానర్‌పై వచ్చే సినిమాలను చూసిన జనం మంచి సినిమా వచ్చింది అనుకులేలా ఉండాలన్నదే మా ధ్యేయం. ఇకపై ఏడాదికి ఒక సినిమా సొంత బ్యానర్లో, మిగిలినవి ఇప్పటి వరకు నన్ను ప్రోత్సహించిన బ్యానర్లలో నటిస్తా. * బందిపోటు సినిమా కథాంశం ఏంటి ఒక్కమాటలో చెప్పాలంటే హీరో పేరు విశ్వా ఘరానా దొంగ. ప్రజలను దోచుకునే దొంగలను తెలివితేటలను పెట్టుబడిగా పెట్టి దోచుకుంటుంటాడు. * ఇప్పటికీ ఎన్ని సినిమాల్లో నటించారు బందిపోటు నా 48వ సినిమా, ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మాతగా సాయికిశోర్ దర్శకత్వంలో ఓ సినిమా త్వరలో ప్రారంభించనున్నారు. వచ్చేఏడాది జనవరిలో నా 50వ సినిమాలో నటించడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రముఖ నటి రాధ కుమార్తె కార్తీక, మోనాల్‌గజ్జర్ హీరోయిన్లగా సిరి సినిమా బ్యానర్‌పై నూతన దర్శకుడు చిన్నికృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం షూటింగ్లో ఉంది. * లడ్డూబాబు సినిమాపై మీ అభిప్రాయం తెలుగు పరిశ్రమలో ప్రయోగాత్మకంగా నిర్మించిన చిత్రం ఇది. అయితే కొంత నిరాశను మిగిల్చిన మాట వాస్తవం. ఈ సినిమా షూటింగ్ సమయంలో రోజూ నా శరీరంపై 38 కిలోల బరువున్న మేకప్ వేసేవారు. మేకప్ ఉన్నంతకాలం చాలా కష్టంగా ఉండేది. దీనికోసం నెల రోజులపాటు లండన్‌లో ఉండి మేకప్ గురించి తెలుసుకున్నా. తెలుగులో మొదట త్రీడీ సినిమాలో నటించానన్న తృప్తి మిగిలింది. *దర్శకత్వం చేసే ఆలోచన ఉందా నాకు నటన కన్నా దర్శకత్వం అంటేనే ఇష్టం. నటన, దర్శకత్వం ఒకేసారి చేయడమనేది కొంచెం కష్టం. 2017లో దర్శకత్వం చేపట్టాలనే ఉద్దేశంతో ఉన్నాను. * ప్రేమ వివాహమా.. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా ప్రేమ వివాహమైతే ఇప్పటికే జరిగిపోయి ఉండేది. పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకుంటాను. బహుశా వచ్చే ఏడాది నా పెళ్లి ఉండొచ్చు. -
మెగాఫోన్ పట్టనున్న బాలీవుడ్ హీరో
త్వరలోనే తాను మెగాఫోన్ పట్టుకుని ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తానని చెబుతున్నాడు.. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్. జెనీలియాను పెళ్లి చేసుకుని త్వరలో ఓ బిడ్డకు తండ్రి కూడా కాబోతున్న రితేష్.. సినిమా తీయడం అద్భుతమైన కళ అని, అటు దర్శకత్వం, ఇటు నిర్మాణం రెండూ కూడా తనకు అత్యంత ఇష్టమైన విషయాలని చెప్పాడు. నిర్మాతగా అయితే సినిమా మన సొంతం అనే భావన వస్తుందని, దర్శకుడంటే సృజనాత్మకంగా ఉండాలని.. భవిష్యత్తులో తాను తప్పక దర్శకత్వం వహిస్తానని తెలిపాడు. నిర్మాతగా రితేష్ తీసిన 'ఎల్లో' అనే మరాఠీ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రితేష్ దేశ్‌ముఖ్ కుమారుడైన రితేష్.. తాను రాజకీయాల్లోకి వెళ్తానో లేదో మాత్రం చెప్పలేనన్నాడు. అయితే, ఒక పౌరుడిగా మాత్రం దేశం గురించి తప్పకుండా తెలుసుకోవాలని తెలిపాడు. -
దర్శకత్వమే లక్ష్యం
దర్శకత్వమే లక్ష్యం అంటుంది నటుడు, దర్శకుడు పార్తిపన్ వారసురాలు కీర్తన. ఈమె మణిరత్నం దర్శకత్వం వహించిన కన్నత్తిల్ ముత్తమిట్టాల్ చిత్రం ద్వారా బాల నటిగా పరిచయమయ్యూరు. ఆ తరువాత ఈమె హీరోయిన్గా తెరంగేట్రం ఖాయం అని చాలా మంది భావించారు. అయితే కీర్తన నటనపై ఆసక్తి కనబరచడంలేదు. ప్రస్తుతం కీర్తన తండ్రి పార్తిపన్ కదై తిరైకథై వచనం ఇయక్కం అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి కీర్తన సహ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించకుండా నిర్మాణ బాధ్యతలను చేపట్టింది. అయితే తన లక్ష్యం మాత్రం మెగా ఫోన్ పట్టడమేనంటోంది. అరణ్య కాండం చూసినప్పటి నుంచి ఆ చిత్ర దర్శకుడు త్యాగరాజ కుమార్ రాజా వద్ద శిష్యరికం చేయాలనే కోరిక కలిగిందట. ఈ విషయాన్ని తన తండ్రి పార్తిపన్కు విన్నవించుకోగా ఆయన వెంటనే త్యాగరాజా కుమార్‌రాజాతో మాట్లాడి ఆయన వద్ద సహాయ దర్శకురాలిగా చేర్చారట. అయితే హీరోయిన్గా రంగ ప్రవేశం చేసే ఆలోచన లేదా అంటే క్రియేటివ్ దర్శకురాలిగా పేరు తెచ్చుకుంటానంటోంది కీర్తన. ప్రస్తుతం స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్లు సరైన సమయం రాగానే బాధ్యతలను చేపడతానని కీర్తన అంటోంది. -
ఇక నటనకు గుడ్‌బై!
హాలీవుడ్ హాట్ లేడీ ఏంజెలినా జోలీ అభిమానులకు ఓ చేదు వార్త. ఇక, ఆమె నటనకు గుడ్‌బై చెప్పేయాలనుకుంటున్నారు. నిజానికి రెండేళ్ల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నారామె. ఆరుగురు బిడ్డలకు తల్లయిన జోలీ, నలుగురు పిల్లల్నిదత్తత కూడా తీసుకున్నారు. ఈ పిల్లల ఆలనా పాలనా చూసుకోవాలనుకుంటున్నానని, అందుకే ఇక నటించకూడదనుకుంటున్నానని రెండేళ్ల క్రితం ఆమె పేర్కొన్నారు. ఆ మేరకు ఓ రెండేళ్లు సినిమాలకు దూరంగానే ఉన్నారు. ఆ తర్వాత మనసు మార్చుకుని ‘మేల్ఫిషెంట్’ అనే సినిమాలో నటించారు. వచ్చే నెల ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా చేస్తూ, పిల్లలను చూసుకోవడం పెద్ద కష్టమనిపించలేదట. అయినప్పటికీ నటనకు గుడ్‌బై చెప్పాలనుకోవడం ఎందుకంటే, ఇకనుంచి దర్శకురాలిగా మాత్రమే కొనసాగాలనుకుంటున్నారట. ప్రస్తుతం ఆమె ‘అన్బ్రోకెన్’ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్లో ఈ చిత్రం విడుదల కానుంది. అన్నట్లు దర్శకురాలిగా జోలీకి ఇది మొదటి సినిమా కాదు. 2007లో ‘ఎ ప్లేస్ ఇన్ టైమ్’ అనే లఘు చిత్రం ద్వారా దర్శకురాలిగా మారి, ఆ తర్వాత నాలుగేళ్లకు ‘ఇన్ ది ల్యాండ్ ఆఫ్ బ్లడ్ అండ్ హనీ’ అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ‘అన్బ్రోకెన్’ చేశారు. ఈ సినిమా తర్వాత వరుసగా దర్శకత్వం వహించాలనుకుంటున్నారట. నటన అనేది ఓ వరం అని, ఆ వరాన్ని సద్వినియోగం చేసుకున్నానని, దర్శకురాలిగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా జోలీ తెలిపారు. -
నాన్నను ఎప్పుడూ అలా చూడకూడదనుకున్నా..
ఇవాళ దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న చిత్రం - తమిళ ‘కోచ్చడయాన్‘ (తెలుగులో ‘విక్రమ సింహ’). రజనీకాంత్ నటించిన ఈ అత్యాధునిక సినిమాకు ఆయన చిన్న కుమార్తె సౌందర్య డెరైక్టర్. తండ్రి నటిస్తుంటే, కుమార్తె దర్శకత్వం వహించడం భారతీయ సినీ చరిత్రలో ఇదే తొలిసారి. మోషన్ క్యాప్చర్ ఫొటో రియలిస్టిక్ టెక్నాలజీతో తయారైన మన తొలి సినిమా కూడా ఇదే. సూపర్ స్టార్ తండ్రి... సూపర్ కూతురు... సూపర్ టెక్నాలజీ సినిమా... ఇంకేం.. 29 ఏళ్ల సౌందర్యా రజనీకాంత్‌ను కదిలిస్తే, కబుర్లకు కొదవా. నేను చెన్నైలో పుట్టి పెరిగా. మా అమ్మ నడుపుతున్న ‘ది ఆశ్రమ్’ స్కూలులో చదువుకున్నాను. అసలు చిన్నప్పటి నుంచి నాకు వాక్యాలు చదవడం కన్నా, బొమ్మలు చూడడం బాగా ఇష్టం. నేనెప్పుడూ పదాల్లో ఆలోచించను, నా ఆలోచనలెప్పుడూ బొమ్మల్లోనే! పెర్త్‌కు వెళ్ళి, గ్రాఫిక్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసి, వచ్చా. ఆఫర్లొచ్చినా, నటన వైపు మొగ్గలేదు. సినీ ప్రముఖుడి సంతానానికి ఎవరికైనా, సినిమా పట్ల ఆకర్షణ కలగడం సహజమే. కానీ, దాని వల్ల కొన్ని సానుకూలతలున్నాయి. ప్రతికూలతలూ ఉన్నాయి. పిల్లలైన మేము ఏం కావాలని అనుకుంటున్నదీ నాన్న గారు మాతో ఓపెన్‌గా మాట్లాడారు. మేము కెమేరా ముందుకు రావడాన్ని ఆయన పెద్దగా ఇష్టపడలేదు. నాకు కూడా యానిమేషన్ అంటే ఆసక్తి. యానిమేషన్, విజువల్ గ్రాఫిక్స్ నా ఊహలకు రెక్కలు తొడిగాయి. అలా ‘శివాజీ’, ‘రోబో’లకు పని చేశా. యువతరం కథ ‘గోవా’ నచ్చి, నిర్మాతనయ్యా. ‘కోచ్చడయాన్’తో దర్శకత్వం వైపు వచ్చా. పరిస్థితులెటు తీసుకెళితే అటెళుతున్నా. అమ్మంటే ఇష్టం నేను అమ్మ కూచిని. మా అమ్మ లాగా దేనినైనా సానుకూల దృక్పథంతో చూసే, దృఢమైన వ్యక్తిత్వమున్న మహిళ చాలా అరుదు. నాకు అన్నీ మా అమ్మే. మా ఇంటి మొత్తాన్నీ ఆమే నడుపుతుంది. బయట ఇంత పేరున్న మా నాన్న గారు కూడా నూటికి 200 పాళ్ళు అన్నిటికీ ఆమె మీద ఆధారపడుతుంటారు. ఆమె ఏకకాలంలో అనేక పాత్రలు పోషిస్తుంటారు. ఆమెకున్న సహనం అంతా ఇంతా కాదు. సూపర్‌స్టార్ కుమార్తెగా... ప్రముఖుల పిల్లలమైనప్పుడు అందరి దృష్టీ మన మీద ఉంటుంది. తల్లితండ్రుల గొప్పతనంతో, వారు సాధించిన విజయాలతో అనుక్షణం పోలుస్తూ ఉంటారు కాబట్టి, ఒత్తిడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ మా గురించి రాస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ తప్పవు. అయినా, అక్కచెల్లెళ్ళమైన మా ఇద్దరి బాల్యం అద్భుతంగా గడిచింది. అప్పట్లో మా నాన్న గారు రోజూ మూడు షిఫ్టులతో తీరిక లేకుండా పనిచేస్తుండేవారు. ఆయన దగ్గర లేని లోటు లేకుండా అమ్మ చూసేది. అమ్మమ్మ వాళ్ళు మధ్యతరగతి పిల్లల్లా పెంచారు. ‘కోచ్చడయాన్’ మొదలైందిలా... ముందు అసలు నేను ‘సుల్తాన్’ అనే 3డి యానిమేషన్ చిత్రం తీయాలనుకున్నా. అనేక కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇక, ఆ సినిమా తీసే ఆలోచన లేదు. ‘సుల్తాన్’ ఆగాక,‘రాణా’ సినిమా నాన్న గారితో ప్రారంభించాం. తీరా నాన్న గారికి ఒంట్లో బాగాలేక ఆ సినిమా కూడా ఆగిపోయింది. నాన్న గారితో గతంలో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన కె.ఎస్. రవికుమార్ ఆ చిత్రానికి దర్శకత్వం వహించాల్సింది. నాన్న గారి ఆరోగ్యం బాగవడంతో, ‘రాణా’ కన్నా ముందు దానికి ముందు భాగం ఒకటి తీయాలనుకున్నాం. రాణాకు తండ్రే ఈ కోచ్చడయాన్. ‘కో’ అంటే రాజు గారనీ, ‘చడయాన్’ అంటే అంటే పొడవాటి జుట్టున్న వ్యక్తి అనీ అర్థం. శివుణ్ణి పూజించే ఓ రాజ వంశీకుల కాల్పనిక కథ ఇది. పెర్ఫార్మెన్స్ క్యాప్చరింగ్ అంటే... మన దేశంలో సాధారణంగా విజువల్ ఎఫెక్ట్లు, గ్రాఫిక్స్ లాంటివి యాక్షన్ సన్నివేశాలు, పాటల లాంటి ఏదైనా ఓ ప్రత్యేక సందర్భంలానే వాడతారు. టెక్నాలజీని మేళవించుకొని నడిచే ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’, ‘అవతార్’ లాంటి సినిమాలు ఇక్కడ తీయం. నిజానికి, మన దేశంలో అవి రూపొందించగల ప్రతిభావంతులైన టెక్నీషియన్లు చాలా మంది ఉన్నారు. అందుకే భారతదేశంలోనే తొలిసారిగా పెర్ఫార్మెన్స్ క్యాప్చర్ పద్ధతిలో ‘కోచ్చడయాన్’ తీశా. నటీనటులు సెన్సర్లు తగిలించిన తోలుదుస్తులతో వచ్చి కెమేరా ముందు అభినయిస్తారు. వారి కదలికల్నీ, అభినయాన్నీ క్యాప్చర్ చేసి, 3డి వెర్షన్లో ప్రవేశపెట్టి, పాత్రల రూపురేఖల్ని యానిమేషన్లో తీర్చిదిద్దుతాం. మనకు ఇప్పటి దాకా తెలియని ఇలాంటి సరికొత్త పద్ధతిలో సినిమా తీయడమంటే, ఆర్థికంగా అభద్రత తలెత్తుతుంది. అయినా సరే, ఈ కొత్త దోవ తొక్కాం. కష్టపడి ‘కోచ్చడయాన్’ తీశాం. బాక్సాఫీస్ వద్ద విజయమంటారా... కష్టపడి పనిచేసి, ఫలితం దేవుడికి వదిలేయాలి. అయితే, రజనీకాంత్ అభిమానులకు నచ్చేవన్నీ సినిమాలో ఉన్నాయని చెప్పగలను. నాన్నకు దర్శకురాలిగా... అన్ని భాషల సినిమాలూ చూస్తుంటాను. తొలి సినిమాకే అంత గొప్ప నటునికి దర్శకత్వం వహించడం నా అదృష్టం. కొన్నిసార్లు నేను ‘యాక్షన్’ అని చెప్పి, షాట్ అయిపోయినా సరే ‘కట్’ చెప్పడం మర్చిపోయి, నాన్న గారి అభినయాన్ని చూస్తూ ఉండిపోయేదాన్ని. ఇక, కొన్ని సందర్భాల్లో ఆయన హీరోగా, నేను దర్శకురాలిగా కాకుండా తండ్రీ కూతుళ్ళలా ప్రవర్తించేవాళ్ళం. ఒకసారి మా అమ్మ ఏ సన్నివేశాలు తీస్తున్నారని అడిగింది. అప్పుడు మేము ‘అప్పా’ (తమిళంలో నాన్న అని అర్థం)కీ, దీపికా పదుకొనేకీ మధ్య ప్రేమ సన్నివేశాలు తీస్తున్నాం. ఆ మాటే చెప్పా. ఆ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి కానీ, వాటిని చిత్రీకరించడం దర్శకురాలిగా నాకూ, నటుడిగా నాన్నకూ కొద్దిగా ఇబ్బంది అనిపించింది. చిత్రీకరణ సమయంలో ఆయన ఆరోగ్యం గురించి ఎంతో జాగ్రత్తగా ఉండేదాన్ని. అప్పుడు నాలోని కుమార్తె తొంగి చూసేది. కెమేరా ముందు ఆయన నటన చూస్తున్నప్పుడు నాలోని అభిమాని బయటకొచ్చేది. ఏ రోజుకా రోజు ఆనాటి షెడ్యూల్ పూర్తయ్యేలా చూడాల్సి వచ్చినప్పుడు నాలోని దర్శకురాలు బహిర్గతమయ్యేది. ఆయనకు శ్రమ అనిపించకుండా, అదే సమయంలో నా లాంటి అభిమానులంతా ఆయనను ఎలా చూడాలనుకుంటున్నారో అలా కనిపించేలా చూపాను. చుట్టూతా ఏమీ లేకపోయినా, అవి ఉన్నట్లు ఊహించుకొంటూ, నటించాలి కాబట్టి, ప్రతి సన్నివేశాన్నీ లోతుగా వివరించేదాన్ని. ఆయన అంత పెద్ద సూపర్‌స్టార్ అయినా కొత్త దర్శకురాలినైన నా మాట శ్రద్ధగా వినేవారు. చెప్పినట్లు చేసేవారు. ఆయన అంతెత్తుకు ఎలా ఎదిగారన్నది అప్పుడు అర్థమైంది. ఈ సినిమా తరువాతా నాన్నగారు నటిస్తూనే ఉంటారు. మేము ముందనుకున్న కె.ఎస్. రవికుమార్ స్క్రిప్టు ‘రాణా’ సిద్ధంగానే ఉంది. ఏదో ఒక రోజున ఆ కలా నిజం కావచ్చు. అక్కను మెప్పించడమా... అమ్మో... అక్కయ్య ఐశ్వర్య నాకు పూర్తిగా భిన్నమైన వ్యక్తి. నేను బహిర్ముఖురాలినైతే, ఆమె అంతర్ముఖురాలు. ఆమె వీణ నేర్చుకోవడానికి వెళితే, నేను గోల్ఫ్‌కు వెళ్ళేదాన్ని. కట్టూబొట్టుల్లో ఆమె భారతీయతననుసరిస్తుంది. నాది అందుకు భిన్నమైన పంథా. మాది ప్రత్యేకమైన అనుబంధం. పొద్దస్తమానం మాట్లాడుకోము కానీ, ముఖ్య విషయాలు చర్చించుకుంటాం. ఆమె కూడా దర్శకురాలే. నిర్మొహమాటంగా విమర్శించుకుంటూ ఉంటాం. అక్కను మెప్పించడం అంత సులభం కాదు. ఆమె ‘ఫరవా లే’దందంటే, బ్రహ్మాండంగా ఉన్నట్లు లెక్క. ‘కోచ్చడయాన్’ చూసి, ‘మంచి సినిమా’ అంది. ఎంతో ఒత్తిడికి లోనయ్యా... ఆ మధ్య మా నాన్న గారికి ఒంట్లో బాగా లేనప్పుడు ఎంతో ఒత్తిడికి లోనయ్యా. అంతకు ముందు మా అమ్మకు ఆరోగ్యం బాగా లేదు. అది మానసికంగా కుంగదీసింది. అక్కచెల్లెళ్ళమిద్దరం అన్నీ వదిలేసి, అనుక్షణం నాన్న గారి వెంటే ఉన్నాం. ఆ రోజులు తలుచుకుంటే కూడా ఇప్పటికీ నాకు భయమేస్తుంది. నాన్న గారిని ఎప్పుడూ అలా చూడకూడదనుకున్నా. అలాంటి పరిస్థితి రాకూడదని వేయి దేవుళ్ళకు మొక్కుకున్నా. ఇక, నేను చేపట్టిన ప్రాజెక్టులేవీ ముందుకు సాగక, స్తంభించిపోయినప్పుడు నిరాశకు లోనయ్యా. అయితే, మా అమ్మ నాకు ధైర్యం చెప్పింది. వ్యాపారవేత్త అయిన నా భర్త అశ్విన్, నా అత్తమామలు నా పనిని అర్థం చేసుకొని నైతికంగా మద్దతునిచ్చారు. తరతరాలకూ తెరపై రజనీ... ఈ భారీ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినందుకు పెద్ద బరువు దింపుకున్నట్లుంది. కొద్ది రోజుల్లో ‘కోచ్చడయాన్’ రిలీజవుతుండడంతో ప్రేక్షకులెలా ఆదరిస్తారా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా. ఈ సినిమాకు పనిచేస్తున్నప్పుడు టెక్నాలజీ సాయంతో రజనీకాంత్‌కు సంబంధించిన వర్చ్యువల్ ఇమేజరీలు లెక్కలేనన్ని సృష్టించాం. రాబోయే రోజుల్లో ఎవరైనా భౌతికంగా ఆయన బాడీ లాంగ్వేజ్‌ను అనుసరిస్తే చాలు, ఆ ఇమేజరీల సాయంతో, సరైన ఎఫెక్ట్‌ల ద్వారా ఎన్నేళ్ళ తరువాతైనా సరే రజనీకాంత్‌ను వెండితెరపై పునఃసృష్టించవచ్చు. తరతరాలు అభిమానులకది కన్నుల పండుగ. ఆయనలోని గొప్పదనం అదే... నాన్న గారిలో గొప్పదనం ఏమిటంటే, డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తితో ఎలా మాట్లాడతారో, అవేమీ లేని డ్రైవర్‌తోనూ అదే పద్ధతిలో మాట్లాడడం. అందుకే, తెర బయటా ఆయనే నా హీరో. ఆయన లాగే నేనూ పట్టిన పట్టు విడవను. వల్ల కాదు లెమ్మని దేనినీ అంత తొందరగా వదిలేయను. మొదట్లో ఆయన బస్ కండక్టర్. తమిళం ఒక్క ముక్క రాదు. అలాంటి వ్యక్తి పట్టుదలతో ఇవాళ ఏ స్థాయికి చేరారో చూడండి. ఆయన రక్తం పంచుకు పుట్టినందుకు గర్విస్తున్నా. -
బావతో సినిమా చేస్తానంటున్న సౌందర్య
తండ్రి హీరోగా కొచ్చాడయాన్ సినిమా తీసిన రజనీకాంత్ కుమార్తె సౌందర్య.. ఇప్పుడు తన బావ ధనుష్‌తో ఓ సినిమా తీయాలనుకుంటోంది. బాలీవుడ్లో ధనుష్ హీరోగా వచ్చిన 'రాంఝణా' చిత్రం చూసిన సౌందర్య.. అందులో అతడి యాక్షన్ చూసి థ్రిల్లయిపోయింది. సమీప భవిష్యత్తులోనే ధనుష్ సినిమాకు దర్శకత్వం వహించాలని అనుకుంటోంది. ''కుందన్ పాత్రలో బావగారు ఎంత బాగా ఒదిగిపోయారో.. నాకు ఆ సినిమా భలే నచ్చేసింది. ఇక ఆ పాటలు ఊకడా చాలా బాగున్నాయి'' అని ఆమె తెలిపింది. ధనుష్ సినిమాకు దర్శకత్వం వహించాలని తనకు ఉన్నా.. సీనియర్ నటుడు కాబట్టి ఆయన డేట్లు ఇస్తే తప్పకుండా చేస్తానని అంటోంది. '3' సినిమాకు దర్శకత్వం వహించిన రజనీ కుమార్తె ఐశ్వర్యను ధనుష్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తమ కుటుంబంలో ఒక్క తన భర్త తప్ప.. అందరూ సినిమా పరిశ్రమకు చెందినవాళ్లేనని సౌందర్య చెప్పింది. -
మళ్లీ మెగాఫోన్ పట్టనున్న పవర్ స్టార్..?
-
ఆ రెండే నా బలం
న్యూఢిల్లీ: ప్రస్తుతం నటనతో బిజీగా ఉన్నా, రచన, దర్శకత్వ విభాగాల్లోనే తనకు పట్టు ఎక్కువని ఫర్హాన్ అఖ్తర్ చెబుతున్నాడు. హీరోగా కనిపించడానికి ముందు మనోడు చాలా సినిమాలకు దర్శకుడు, రచయిత, నిర్మాతగా వ్యవహరించాడు. ‘దిల్ చాహతా హై, లక్ష్య, డాన్ సినిమాలకు పనిచేసేటప్పుడు నటులతో ఎంతో సన్నిహితంగా ఉండేవాణ్ని. దర్శకుడిగా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను కాబట్టి నటనను కూడా ప్రయత్నించాలని అనుకున్నాను. మొదటి సినిమా రాకాన్ హిట్ అయింది కాబట్టి మరిన్ని అవకాశాలు వచ్చాయి. నా గురించి వేరే వాళ్లు ఏమనుకుంటారనేది నాకు అనవసరం. పనిని మరింత సమర్థంగా చేయాలన్నది నా పద్ధతి. ఇన్నేళ్లుగా నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అని వివరించాడు. ఫర్హాన్ తాజా చిత్రం షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ ప్రచారం కోసం ముంబైలో బుధవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ పైవిషయాలు చెప్పాడు. ఇటీవల విడుదలైన భాగ్ మిల్ఖా భాగ్ హిట్ కావడంతో ఫర్హాన్‌కు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరి శ్రమకూ గుర్తింపు దక్కిందన్నాడు. ‘ప్రేక్షకులు నా నుంచి ఏదైనా ఆశిస్తే నా దృష్టంతా దానిపైనే ఉంటుంది. నాకు అది స్ఫూర్తిని కూడా ఇస్తుంది. మల్టీస్టారర్ లేదా సోలో అన్నది కాదు.. కథ బాగుంటే ఎలాంటి వాటిలోనైనా నటిస్తాను’ అని చెప్పాడు. కార్తిక్ కాలింగ్ కార్తిక్, భాగ్ మిల్ఖా భాగ్ మినహా ఫర్హాన్ నటించినవన్నీ మల్టీస్టారర్ సినిమాలే. జోయా అఖ్తర్ తదుపరి సినిమాలోనూ ఈ 40 ఏళ్ల నటుడు రణ్వీర్ సింగ్, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రాతోపాటు కనిపిస్తున్నాడు. సాకేత్ చౌదరి దర్శకత్వం వహించిన షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ ఈ నెల 28న విడుదలవుతోంది. ఈ శృంగార వినోదాద్మతక కథలో ఫర్హాన్, విద్యాబాలన్ జోడీగా కనిపిస్తారు. -
'గిరిబాబు కొడుకని పిలిచి అవకాశాలు ఇవ్వలేదు'
నిడదవోలు : సినిమాల్లో కామెడీ పండించడం ఓ వరమని హాస్యనటుడు రఘుబాబు అన్నారు. సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు నిడదవోలు వచ్చిన ఆయన విలేకర్లతో ముచ్చటించారు. రఘుబాబు మాట్లాడుతూ '1991లో గురువు సత్యారెడ్డి దర్శకత్వంలో దొంగలున్నారు...జాగ్రత్త సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాను. మా తండ్రి గిరిబాబును ఆదర్శంగా తీసుకుని నటనపై ఆసక్తి పెంచుకున్నాను. మంచి నటుడిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలనే తపనతో కష్టపడి నటుడిగా గుర్తింపు పొందాను. గిరిబాబు కొడుకు కదా అని ఎవరూ పిలిచి అవకాశాలు ఇవ్వలేదు. ఎలాంటి సిఫార్సులు లేకుండా పరిశ్రమలో గుర్తింపు పొందడంలో నాన్న ఎంతో గర్వపడుతున్నారు. ఇప్పటివరకూ 253 చిత్రాల్లో నటించాను. తెలుగులో 250, తమిళంలో రెండు, కన్నడంలో ఒక సినిమాలో నటించా. మురారి, ఆది, కబడ్డీ, కబడ్డీ, చెన్నకేశవరెడ్డి, బెట్టింగ బంగార్రాజు, ఖడ్గం, దిల్, వేదం చిత్రాలు గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం సునీల్ హీరోగా భీమవరం బుల్లోడు, మోహన్ బాబు తనయులతో పాండువులు పాండవులు తుమ్మెద, చార్మీ హీరోయిన్ గా ప్రతిఘటన-2, రేసుగుర్రం సినిమాల్లో నటిస్తున్నా. త్వరలో ఎన్టీఆర్ రభస, మహేష్ బాబు ఆగడు, వీవీ వినాయక్ సినిమాల్లో నటించనున్నాను. హాస్యాన్ని పండించడం నాకు దేవుడిచ్చిన వరం. ఇది అందరికీ సాధ్యపడదు. సినీ పరిశ్రమలో పోటీని తట్టుకుని ప్రతిభ చూపేవారికి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. కొత్తదనంతో కామెడీను పండిస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. పలువురు వీఐపీలు, ఉద్యోగులు, వైద్యులు సాప్ట్వేర్ ఇంజినీర్లు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు కామెడీ చిత్రాలు చూస్తున్నారు. దేశంలో ఏ పరిశ్రమలో లేనంత మంది హాస్యనటులు తెలుగు చిత్రసీమలో ఉన్నారు. అన్నీ కలిసి వస్తే త్వరలో దర్శకత్వం చేస్తా. సామాజిక సందేశంతో కూడిన కమర్షియల్ చిత్రానికి దర్శకత్వం వహించాలన్నదే నా ఆశ.' అని మనసులోని మాటను చెప్పారు. -
ఈ ఏడాది డెరైక్షన్ చేస్తాను
‘‘ఎప్పటి నుంచో దర్శకత్వం చేయాలనుకుంటున్నా. ఆ ఆలోచన ఈ ఏడాది కచ్చితంగా కార్యరూపం దాలుస్తుంది. ఓ పెద్ద హీరోతో పెద్ద స్థాయిలోనే ఉంటుంది’’ అని రచయిత చిన్ని కృష్ణ తెలిపారు. నరసింహనాయుడు, నరసింహ, ఇంద్ర, గంగోత్రి, బద్రినాథ్, జీనియస్లాంటి చిత్రాలకు రచన చేసిన చిన్ని కృష్ణకు నేడు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తన భవిష్యత్తు ప్రణాళికలను, లక్ష్యాలను వివరించారు. ‘‘చిరంజీవి గారి 150వ చిత్రం కోసం అద్భుతమైన కథ సిద్ధం చేస్తున్నాను. అలాగే ఆమిర్‌ఖాన్ కోసం నాలుగేళ్లుగా ఓ మంచి స్క్రిప్టు సిద్ధం చేస్తున్నాను. ఇందుకోసం ముంబై కూడా వెళ్లి వస్తున్నా. ప్రస్తుతం నా దగ్గర పది స్క్రిప్టులు సిద్ధంగా ఉన్నాయి. అందులో అయిదు స్క్రిప్టులు నేనే డెరైక్ట్ చేసుకుంటాను. మిగిలినవి బయటి దర్శకులకు ఇస్తాను. సూర్య, పవన్‌కల్యాణ్, మహేశ్, ఎన్టీఆర్, బన్నీలాంటి యంగ్ హీరోల సినిమాలు డెరైక్ట్ చేయాలని ఉంది’’ అని చెప్పారు చిన్ని కృష్ణ. పన్నెండేళ్ల కెరీర్లో చాలా తక్కువ చిత్రాలకే రచన చేయడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తే -‘‘నేను కొంతమందికే అర్థం అవుతాను. అందుకే అందరూ నాతో కనెక్ట్ కాలేరు. అలా కనెక్ట్ అయిన వాళ్లతోనే నేను పని చేయగలుగుతాను. అందుకే తక్కువ సినిమాలు చేశా’’ అని జవాబిచ్చారాయన. చార్లీ చాప్లిన్, రాజ్‌కపూర్, భాగ్యరాజా, సుజాత తన అభిమాన రచయితలని చిన్ని కృష్ణ పేర్కొన్నారు. ‘‘రచయితగా, దర్శకునిగా నాపై మణిరత్నం, శంకర్ ప్రభావం ఎక్కువగా ఉంది. రేపు నేను డెరైక్ట్ చేయబోయే సినిమా వాళ్లిద్దరికీ చూపించి వాళ్లతో చాలా బావుందనిపించుకునే స్థాయిలో వర్క్ చేస్తాను’’ అని చిన్ని కృష్ణ తెలిపారు. -
కథ... స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం - ఢిల్లీ
-
కథ... స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం - ఢిల్లీ