
పెళ్లి చూపులు సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ నటుడు ప్రియదర్శి. తెలంగాణ యాసలో నవ్వులు పూయించే ఈ కామెడీ స్టార్ ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నాడు. తాజాగా ఈ యువ నటుడు తన మనసులోని మాట బయటపెట్టాడు. సినిమాల్లోకి రాకముందు పలు షార్ట్ ఫిలింస్‌లో నటించిన ప్రియదర్శి, కొన్నింటికి దర్శకత్వం వహించి నిర్మించాడు కూడా. తాను నటుడిగా వెండితెరకు పరిచయం అయిన ఎప్పటికైన దర్శకుడిగా సత్తా చాటుతానంటున్నాడు. అయితే ప్రస్తుతం నటుడిగా బిజీగా ఉండటంతో దర్శకుడిగా మరేందుకు కొంత సమయం పడుతుందని తెలిపాడు.