
ఇటీవల కాలంలో నటులు కేవలం నటులుగానే మిగిలిపోయేందుకు ఇష్టపడటం లేదు. తమ అభిరుచికి తగ్గట్టుగా ఇతర రంగాల మీద కూడా దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే కొంత మంది వ్యాపార రంగంలో సత్తా చాటుతుండగా మారికొందరు ఇండస్ట్రీలోనే నిర్మాతలుగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో మరో నటుడు చేరబోతున్నాడు.
పెళ్లిచూపులు సినిమాతో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి, త్వరలో కొత్త అవతారం ఎత్తబోతున్నాడట. ఇప్పటి వరకు నటుడిగానే తెలిసిన ప్రియదర్శి.. దర్శకుడిగా మారనున్నాడు. ఈ విషయాన్ని మిఠాయ్ ఆడియో ఫంక్షన్‌లో దర్శకుడు తరుణ్ భాస్కర్ వెల్లడించాడు. అయితే గతంలో దర్శకత్వం చేసే ఆలోచన ఉన్నట్టుగా చెప్పిన ప్రియదర్శి ఈ వేదిక మీద మాత్రం ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment