mithai
-
మణిపూర్‌లో మళ్లీ కాల్పులు.. ఐదుగురు పౌరులు మృతి
ఇంఫాల్: మణిపూర్‌లో మళ్లీ కాల్పుల మోత మోగింది. వేర్వేరు ఘటనల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందారు. బిష్ణుపూర్ జిల్లాలో నలుగురు పౌరులు చనిపోగా.. కాంగ్పోక్పి జిల్లాలో ఒకర్ని దుండగులు కాల్చి చంపారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు మృతులను ఓనామ్ బమోంజావో సింగ్ (61), ఆయన కుమారుడు ఓనామ్ మణితోంబ సింగ్ (32), తియం సోమేంద్ర సింగ్ (55), నింగ్థౌజం నబద్విప్ సింగ్ (40)గా గుర్తించారు. కాంగ్పోక్పిలో మరణించిన పౌరుడిని తఖెల్లంబమ్ మనోరంజన్‌గా గుర్తించారు. అయితే.. గత రెండురోజులుగా అర్ధరాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లోనే మనోరంజన్ మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానిక బంకర్ నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి తౌబల్ జిల్లాలో కాల్పులు జరగడంతో ముగ్గురు సరిహద్దు భద్రతా దళం (BSF) సిబ్బందికి గాయాలయ్యాయి. అర్ధరాత్రి సమయంలో దుండగులు నిద్రిస్తున్న భద్రతా సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. అంతకుముందు మంగళవారం అర్ధరాత్రి కూడా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఓ భద్రతా అధికారి మృతి చెందారు. గత ఏడాది మే నెల నుంచి మణిపూర్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ ప్రారంభం అయింది. మెయితీ, కుకీ తెగల మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. నాటి దాడుల్లో 170 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటికీ పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ ఆనాటి నుంచి నేటి వరకు చెదురుమదురుగా హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇదీ చదవండి: ప్రాణ ప్రతిష్ట వేళ.. అయోధ్యలో అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్! -
మణిపూర్‌లో మళ్లీ కాల్పులు.. పోలీసు హెడ్‌క్వార్టర్‌పై మూకదాడి
ఇంఫాల్: మణిపూర్‌లో దుండగులు రెచ్చిపోతున్నారు. గంటల వ్యవధిలోనే వేర్వేరు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మోరే జిల్లాలో పోలీసు పోస్టుపై దుండగులు కాల్పులు జరిపిన కొన్ని గంటల్లోనే తౌబాల్ జిల్లాలో పోలీసు హెడ్‌క్వార్టర్‌పై దాడి చేశారు. ఇక్కడ జరిగిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. తౌబల్ ఖంగాబోక్ ప్రాంతంలోని 3వ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ కాంప్లెక్స్‌ను దుండగులు మొదట లక్ష్యంగా చేసుకున్నారు. తెల్లవారు జామున పోలీసు కేంద్రంపై ఒక్కసారిగా మూకదాడికి దిగారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు దాడిని తిప్పికొట్టారు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. మణిపూర్‌లో మెయితీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు ప్రారంభమైన నాటి నుంచి హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో దాదాపు 175 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘర్ణణ వాతావరణం కాస్త సద్దుమణిగినప్పటికీ కాల్పుల ఘటనలు చెదురుమదురుగా జరుగుతూనే ఉన్నాయి. నిన్న మోరేలో జరిగిన దాడి నేపథ్యంలో సీఎం బీరేన్ సింగ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హజరయ్యారు. Today (17.01.2024), an irate mob targeted the 3rd Indian Reserve Battalion (3IRB) in Khangabok, Thoubal District. Security forces repelled them using the minimum necessary force. Further, the mob attempted to breach Thoubal Police Headquarters, prompting the security forces to — Manipur Police (@manipur_police) January 17, 2024 -
మణిపూర్‌లో దుండగుల మెరుపుదాడి
ఇంఫాల్: మణిపూర్‌లోని మోరే పట్టణంలో బుధవారం తెల్లవారుజామున కాల్పుల మోత మోగింది. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దుండగులు రెండుసార్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో ఓ అధికారి ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది సైనికులు గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఎమా కొండోంగ్ లైరెంబి దేవి మందిర్ సమీపంలో భద్రతా బలగాలు నిద్రిస్తున్నాయి. ఈ క్రమంలో దుండగులు దాడులు జరిపారు. చికిమ్ విలేజ్ కొండపై నుండి కాల్పులు జరిపారు. ఈ ఘటనకు కేవలం 20 మీటర్ల దూరంలో ఉన్న అసోం రైఫిల్స్ రంగంలోకి దిగి ఎదురుకాల్పులు జరిపారు. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని గాలింపు చేపట్టారు. మళ్లీ గంట తర్వాత ఉదయం 5:10 నిమిషాలకు మరోసారి కాల్పులు జరిగాయి. ఎస్బీఐ బ్యాంక్ బిల్డింగ్ దేఖునాయ్ రిసార్ట్ వద్ద మోహరించిన భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని దుండగులు మరొక ఆకస్మిక దాడి చేశారు. రెండోసారి జరిపిన దాడిలో ఓ అధికారి మరణించారు. మరికొంతమంది సైనికులు గాయపడ్డారు. ఇదీ చదవండి: రిపబ్లిక్ డే వేళ ఢిల్లీలో గోడలపై ఖలిస్థానీ రాతల కలకలం -
మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
ఇంఫాల్: మణిపూర్‌లో ముష్కరులు జరిపిన దాడిలో గాయపడిన భద్రతా బలగాలను సీఎం బీరేన్ సింగ్ పరామర్శించారు. దాడిలో మయన్మార్‌కు చెందిన కిరాయి సైనికులు పాల్గొన్నట్లు సమాచారం ఉందని చెప్పారు. దుండగులు ఆధునిక ఆయుధాలను ఉపయోగించినట్లు వెల్లడించారు. ముష్కరులను పట్టుకునేందుకు కూంబింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మణిపూర్‌లో వరుసగా రెండోరోజు ఉగ్రమూకలు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. మోరే పట్టణంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు మంగళవారం ఆకస్మికదాడి జరిపారు. ఈ ఘటనలో నలుగులు పోలీసులు ఒక బీఎస్ఎఫ్ జవాన్ గాయపడ్డారు. అంతకుముందు తౌబల్ జిల్లా లిలాంగ్ చింగ్జావో ప్రాంతంలో దుండగులు సోమవారం కాల్పులు జరపగా.. నలుగురు పౌరులు చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తౌబల్‌తోపాటు ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, కాక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. మణిపూర్‌లో గత ఏడాది మే 3వ తేదీన ట్రైబల్ సాలిడారిటీ మార్చ్ అనంతరం కొనసాగుతున్న జాతుల మధ్య వైరంతో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మొయితీలున్నారు. కొండ ప్రాంత జిల్లాల్లో నివసించే నాగాలు, కుకీలు కలిపి 40 శాతం వరకు ఉంటారు. ఇదీ చదవండి: ట్రక్కు డ్రైవర్ల ఆందోళనపై స్పందించిన కేంద్రం -
సినిమా సక్సెస్ కాలేదని.. కమెడియన్ సంచలన నిర్ణయం
అర్జున్ రెడ్డి సినిమాలో నటించి విజయ్ దేవరకొండ ‘బెస్ట్ ఫ్రెండ్’గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాహుల్ రామకృష్ణ. తన కామెడీ టైమింగ్‌తో అనతి కాలంలోనే ప్రేక్షకాదరణ పొందిన ఈ కమెడియన్ ట్విటర్ నుంచి వైదొలిగారు. దీనికి గల కారణం ఆయన ఇటీవల నటించిన సినిమా ‘మిఠాయి’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడమే. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, కమల్ కామరాజు, శ్వేతవర్మ, అర్ష ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రశాంత్‌కుమార్ దర్శకత్వంలో డా. ప్రభాత్ కుమార్ నిర్మించిన ‘మిఠాయి’ చిత్రం ఈ నెల 22(శుక్రవారం)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో రాహుల్ తన ట్విటర్ ద్వారా ఫ్యాన్స్‌కి క్షమాపణలు తెలియజేస్తూ వరుస ట్వీట్స్ చేశారు. అనంతరం ట్విటర్ నుంచి ఎగ్జిట్ అయ్యాడు. ‘మేము సినిమా బాగా రావటానికి చాలా ప్రయత్నాలు చేశాం. చివరికి మా ప్రయాత్నాలేవి ఫలించలేదు. సినిమాకు ఇలాంటి ఫలితం వస్తుందని ముందే అంచనా వేశాను. సినిమా పరాజయానికి నేనే క్షమాపణలు తెలుపుతున్నా. దర్శకుడు ఆలోచన, ఊహలను ఇప్పటికీ గౌరవిస్తున్నా’’ అని తన చివరి ట్వీట్లో రామకృష్ణ పేర్కొన్నారు. అయితే తన అకౌంట్ తాత్కాలికంగా డి యాక్టివ్ వేట్ చేశారా? లేక శాశ్వతంగా డిలీట్ చేశారా? అనేది తెలియాల్సి ఉంది. -
మిఠాయి బాగుంది
రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, కమల్ కామరాజు, శ్వేతవర్మ, అర్ష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మిఠాయి’. ప్రశాంత్‌కుమార్ దర్శకత్వంలో డా. ప్రభాత్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలకానుంది. ఈ చిత్రం థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘అందరినీ ఆహ్లాదపరిచే చక్కటి వినోదాత్మక చిత్రమిది. డార్క్ కామెడీతో విభిన్న పాత్రల మధ్య సాగే కథ, కథనాలు ఆద్యంతం ప్రేక్షకులను అలరింపజేస్తాయి. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిల అభినయం సినిమాకే హైలైట్. నవరసాలను మేళవించి దర్శకుడు ఈ చిత్రాన్ని ఎంతో బాగా తీశాడు. వివేక్ సాగర్ సంగీతం వీనుల విందుగా ఉంటుంది. ప్రేక్షకులకు ఓ మంచి చిత్రాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది’’ అన్నారు. భూషణ్ కల్యాణ్, రవివర్మ, గాయత్రి గుప్త, అదితీ మైఖేల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రవివర్మన్ నీలమేఘం. -
నవ్వించి పంపించే బాధ్యత మాది
రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కథానాయకలుగా నటించిన సినిమా ‘మిఠాయి’. ప్రశాంత్ కుమార్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ప్రభాత్ కుమార్ నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈ నెల 22న విడుదల కానున్న ఈ సినిమా పాటల విడుదల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు తరుణŠ æభాస్కర్ బిగ్ సిడీని ఆవిష్కరించి ‘హుషార్’ ఫేమ్ దర్శకుడు శ్రీహర్ష కొనుగంటికి అందించారు. అనంతరం తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నా స్నేహితులు. మేమందరం కలిసి సైన్మా (షార్ట్ ఫిల్మ్), ‘పెళ్ళిచూపులు’ చేశాం. మమ్మల్ని ప్రేక్షకులు ఆదరిస్తారని, ఇంత సక్సెస్ అవుతామని ఎప్పుడూ అనుకోలేదు. అందరూ అనుకున్నట్లు నేను ఇంకా యాక్టర్ అవ్వలేదు. డైరెక్షన్ చేస్తున్నా. కాకపోతే.. అనుకోకుండా రోల్స్ రావడంతో యాక్ట్ చేస్తున్నాను’’ అన్నారు. ‘‘నా కథపై నమ్మకంతో సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సినిమాను నిర్మించిన ప్రభాత్ కుమార్‌కి థ్యాంక్స్’’ అన్నారు ప్రశాంత్ కుమార్. ‘‘నేను ఓ డాక్టర్ని. నన్ను నిర్మాతను చేసింది ప్రశాంతే. తను ఏడాదిన్నరపాటు సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు’’ అన్నారు ప్రభాత్. ‘‘ప్రశాంత్‌కు తెలుగు రాదు. కానీ తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు చాలా భయాలు ఉండేవి. రాహుల్ రామకృష్ణ సినిమాలోకి వచ్చిన తర్వాత అంతా సెట్ అయ్యింది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి పంపే బాధ్యత మాది. ఒక్క అవకాశం ఇవ్వండి.. నవ్విస్తాం’’ అన్నారు ప్రియదర్శి. సంగీతదర్శకుడు వివేక్ సాగర్ పాల్గొన్నారు. -
దర్శకుడిగా మారనున్న కమెడియన్..!
ఇటీవల కాలంలో నటులు కేవలం నటులుగానే మిగిలిపోయేందుకు ఇష్టపడటం లేదు. తమ అభిరుచికి తగ్గట్టుగా ఇతర రంగాల మీద కూడా దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే కొంత మంది వ్యాపార రంగంలో సత్తా చాటుతుండగా మారికొందరు ఇండస్ట్రీలోనే నిర్మాతలుగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో మరో నటుడు చేరబోతున్నాడు. పెళ్లిచూపులు సినిమాతో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి, త్వరలో కొత్త అవతారం ఎత్తబోతున్నాడట. ఇప్పటి వరకు నటుడిగానే తెలిసిన ప్రియదర్శి.. దర్శకుడిగా మారనున్నాడు. ఈ విషయాన్ని మిఠాయ్ ఆడియో ఫంక్షన్లో దర్శకుడు తరుణ్ భాస్కర్ వెల్లడించాడు. అయితే గతంలో దర్శకత్వం చేసే ఆలోచన ఉన్నట్టుగా చెప్పిన ప్రియదర్శి ఈ వేదిక మీద మాత్రం ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. -
‘కడుపుబ్బా నవ్వించి పంపే బాధ్యత మాది!’
రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కథానాయకులుగా నటించిన డార్క్ కామెడీ సినిమా ‘మిఠాయి’. ప్రశాంత్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను రెడ్ యాంట్స్ పతాకంపై డాక్టర్ ప్రభాత్ కుమార్ నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈ మూవీ ఫిబ్రవరి 22న సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా ఆడియోను శుక్రవారం విడుదల చేశారు. ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాల దర్శకుడు తరుణ్ భాస్కర్ బిగ్ సీడీ, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. తొలి సీడీని ‘హుషారు’ దర్శకుడు శ్రీహర్ష కొనుగంటికి స్వీకరించారు. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ ‘అందరూ అనుకున్నట్టు నేనింకా యాక్టర్ అవ్వలేదు. డైరెక్షన్ చేస్తున్నా. కాకపోతే... అనుకోకుండా రోల్స్ రావడంతో చేస్తున్నా. యాక్టింగ్ చాలా కష్టమనేది కూడా అర్థమైంది. మిఠాయి విషయానికి వస్తే... ఈ సినిమా చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నా స్నేహితులు. మేమంతా కలిసి ఆడుతూ పాడుతూ సైన్మా, పెళ్లి చూపులు చేశాం. మమ్మల్ని ప్రేక్షకులు ఇంత ఆదరిస్తారని, ఇంత సక్సెస్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నా’ అన్నారు. దర్శకుడు క్రాంతి మాధవ్ మాట్లాడుతూ ‘ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్, నేనూ క్లాస్ మేట్స్. కాలేజీ రోజుల నుంచి ప్రశాంత్ కు సినిమాలంటే చాలా ఇష్టం. లక్కీగా నేను ముందు దర్శకుడు అయ్యా. మిఠాయితో ప్రశాంత్ దర్శకుడిగా మారుతున్నాడు. ఇది ఒక స్ట్రాంగ్ డెబ్యూ ఫిల్మ్ అవుతుందని ఆశిస్తున్నా. ప్రశాంత్ సెన్సాఫ్ హ్యూమర్ గానీ... తను ఫాలో అయ్యే యాక్టర్స్ గానీ డిఫరెంట్ లెవెల్. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రశాంత్.. అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ రోజు హీరో వివేక్ సాగర్. మంచి మ్యూజిక్ ఇచ్చాడు’ అన్నారు. దర్శకుడు శ్రీ హర్ష కొనగంటి మాట్లాడుతూ ‘నా ఫ్రెండ్ రాహుల్ రామకృష్ణ హీరోగా నటించిన చిత్రమిది. మేం హుషారు షూటింగ్ చేసేటప్పుడు ఈ సినిమా గురించి రాహుల్ రామకృష్ణ చాలా మంచి మంచి విషయాలు చెప్పేవారు. ప్రేక్షకులు అందరిలా నేను కూడా ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా? ఎప్పుడు చూస్తామా? అని ఎదురుచూస్తున్నా. డార్క్ హ్యూమర్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం’ అన్నారు. సినిమా దర్శకుడు ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ‘నా కథపై నమ్మకంతో సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. సినిమా ప్రొడ్యూస్ చేసిన నా బ్రదర్ ప్రభాత్ కుమార్ కి థాంక్స్. నా అకౌంటులో జీరో బాలన్స్ ఉన్నా... షూటింగ్ స్టార్ట్ చేసేవాణ్ణి. హండ్రెడ్ పర్సెంట్ ప్రభాత్ ఎలాగోలా డబ్బులు సర్దుబాటు చేస్తాడని నమ్మకం. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, షఫీ... అందరూ ఎంతో హెల్ప్ చేశారు’ అన్నారు. ప్రియదర్శి మాట్లాడుతూ ‘ప్రశాంత్ కుమార్ ఈ కథ ఇచ్చి చదవమన్నాడు. సరేనని చదివా. ఇదేదో కొంచెం డార్క్ డార్క్ ఉందని అనుకున్నా. స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు చాలా భయాలు ఉండేవి. రాహుల్ రామకృష్ణ సినిమాలోకి వచ్చాక.. అంతా సెట్ అయ్యింది. నటీనటులకు దర్శకుడు ప్రశాంత్ చాలా స్పేస్ ఇచ్చాడు. అతడికి ఒక్క ముక్క తెలుగు రాదు. కానీ, ఆయనకు తెలుగు సినిమా అంటే ఎంత ప్రేమ అంటే.. ఎక్కడ ఎక్కడ నుంచో డబ్బులు తీసుకొచ్చి సినిమా పూర్తి చేశాడు. సెట్స్ లో మేం తెలుగులో మాట్లాడేవాళ్ళం. తనకు సరిగా అర్థమయ్యేది కాదు. అందరం ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళం. సినిమా బాగా వచ్చింది. ఈ నెల 22న థియేటర్లకు రండి. మీరూ ఎంజాయ్ చేస్తారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి పంపే బాధ్యత మాది. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి... నవ్విస్తాం’ అన్నారు. -
ఫిబ్రవరి 22న ‘మిఠాయి’
రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కథానాయకులుగా ప్రశాంత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన డార్క్ కామెడీ చిత్రం ‘మిఠాయి’. ఈ సినిమాకు డాక్టర్ ప్రభాత్ కుమార్ నిర్మాత. ఫిబ్రవరి 22 న విడుదలకు రెడీ అవుతున్న ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత ప్రభాత్ కుమార్ మాట్లాడుతూ ‘ఇద్దరు స్నేహితుల నేపథ్యంలో నడిచే చిత్రమిది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు విశేష స్పందన లభిస్తోంది. సాయిగా రాహుల్ రామకృష్ణ బాగా నటించారు. ఫిబ్రవరి 22న ప్రపంచ వ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’ అని అన్నారు. -
కామెడీ మిఠాయి
గాయత్రి గుప్తా, శ్వేతా వర్మ, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య తారలుగా స్వీయ దర్శకత్వంలో ప్రశాంత్‌కుమార్ రూపొందిస్తున్న ‘మిఠాయి’ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో విజయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ వేడుకలో పాల్గొన్నారు. ‘‘డిఫరెంట్ కథ. తెలుగులో డార్క్ కామెడీ నేపథ్యంలో వస్తున్న చిత్రమిది’’ అన్నారు సందీప్ రెడ్డి. ‘‘డార్క్ కామెడీ మూవీ అనగానే క్యూరీయాసిటీతో వెయిట్ చేస్తున్నాం. ప్రశాంత్ నాకు మంచి ఫ్రెండ్’’ అన్నారు విజయ్ దేవరకొండ. ‘‘మంచి టీమ్ చేస్తున్న సినిమా. అందరికీ నచ్చే విధంగా ఉంటుంది’’ అన్నారు ప్రశాంత్ కుమార్. ప్రియదర్శి, భూషణ్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, ఎగ్జిక్యూ టివ్ ప్రొడ్యూసర్: కృష్ణ వొడవల్లి. -
మిఠాయి కొట్టున పకోడి పొట్లం!
హ్యూమర్ వస్తూ వస్తూ రైల్వేస్టేషన్లో కొన్న మామిడి తాండ్రను మా రాంబాబు చేతిలో పెట్టగానే... దాన్ని చూసి ‘‘హు...’’ అంటూ రాంబాబు గాడు విరక్తిగా పెదవి విరిచాడు. అది చూసి ఆశ్చర్యపోయాన్నేను. ‘‘మామిడి తాండ్రను చూడగానే తాండ్రపాపారాయుడిని చూసినట్లు జోష్‌లో ఊగిపోయేవాడి. ఆ రుచిని ఆస్వాదించుకుంటూ తినేవాడివి. ఇదేంట్రా ఇలా నిరుత్సాహంగా ఉండిపోయావు?’’ అడిగాను. ‘‘ఇదీ ఒక తాండ్రేనా? అలనాడు పొట్లం కడితే ఈతచాప అచ్చులు తాండ్రపై కనిపించాలి. అలాంటి అచ్చులు లేని తాండ్ర కనిపిస్తే చారల్లేని పులిలా, జూలు లేని సింహంలా బోసిగా అనిపిస్తోందిరా’’ అన్నాడు రాంబాబు. అలా మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా వాడు కిరాణా షాప్ దగ్గర, మిఠాయి దుకాణం దగ్గర... ఇలా రెండు చోట్ల గాల్లోనే దండం పెట్టుకున్నాడు. దార్లో గుడిని చూసినప్పుడు భక్తిపూర్వకంగా పెట్టుకునే నమస్కారంతో పాటు వేళ్ల ఉంగరాలను ముద్దు పెట్టుకోవడం చూసి... ‘‘ఆ షాపుల్లో ఏవైనా నీ ఇష్టదైవాల ఫొటోలున్నాయా?’’ అని అడిగాను. ‘‘లేదురా... మిఠాయి కొట్లో వాడు పకోడీ పొట్లం కట్టే తీరు ఒక అద్భుతం రా. అసలు పకోడీ పొట్లాన్ని ఒక ఉదాహరణగా స్వీకరించి... అత్యంత సీరియస్ సబ్జెక్టు అయిన జర్నలిజం పాఠాలు బోధిస్తారు తెల్సా. మనం న్యూస్ ఇచ్చే సమయంలో వివరాలన్నీ అచ్చం తలకిందులైన పకోడీ పొట్లాంలా ఉండాలని లెసన్ చెబుతారురా. మొదట ప్రధాన వివరాలూ, ఆ తర్వాత అప్రధాన అంశాలూ పకోడీ పొట్లం చేత శీర్షాసనమేయించినట్లుగా ఉండాలంటారు. ఇలా పాఠాల్లో చోటుచేసుకున్న ఆ పొట్లం బతుకు ధన్యం కాదా? త్రిభుజాకారంలో ఉండే ఆ పొట్లంలో మన కాళ్ల పనీ... అనగా లెగ్ వర్క్, జబ్బ సత్తువలూ కనిపించాలంటూ శాస్త్రప్రమాణమైన దాఖలాను చూపుతారు. అంటే పోలిక కోసం ఎంపిక జరిగిన తీరును బట్టి అయినా పొట్లాం మీద మనందరికీ భక్తి కలగాలి కదా’’ అన్నాడు వాడు. ఆ సెటైరు నాకే అని అర్థమైంది. ఎందుకంటే నాకు పకోడీ పెద్దగా ఇష్టముండదు. అదే విషయాన్ని చెప్పా. ‘‘అసలు పకోడీ గురించి ఎవడు మాట్లాడారురా ఇక్కడ. నేను చెప్పేదంతా పొట్లాం గురించే కదా. ఒక్కో పొట్లానికి ఒక్కో నిర్దిష్టమైన విధానముందీ, దీన్ని కట్టేందుకు తగిన పద్ధతుంది. శాస్త్రబద్ధమైన ఈ పద్ధతులేవీ ఫాలో కాకుండా... ఒకప్పటి ఉదాత్తమైన పొట్లాలు కట్టే కళను ఇప్పుడు ప్లాస్టిక్‌తో అపభ్రంశం చేస్తున్నారురా ఈ షాపుల వాళ్లు. ఇందాక నేను నమస్కరించిన కిరాణ షాపులో ఇంకా శాస్త్రోక్తంగా పొట్లాలు కడుతున్నారు’’ అన్నాడు వాడు సశాస్త్రీయమైన పొట్లాల గురించి శంకరాభరణం శంకరశాస్త్రిలా బాధపడుతూ. ‘‘పొట్లాలు కట్టడంలోనూ పద్ధతా?’’ అడిగా ఆశ్చర్యంగా. ‘‘కాదా... మరి? ఆయుర్వేద మందుల్ని చిట్టి చిట్టి పొట్లాల్లా కడతారు. వాటిని నలుచదరాకారపు వైనాన్ని ఎప్పుడైనా గమనించావా? ఆ పొట్లాం కట్టిన తీరుతోనే వైద్యుడి నైపుణ్యం అర్థమవుతుంది. అన్నట్లు... మసాలాదోశను చాపచుట్టినట్లుగా రోల్ చేస్తారు. అలా చేసి, స్తూపాకారంలో పొట్లం కడతారు. బోండాలను, బజ్జీల కాగితపు పొట్లం కట్టే ముందర అరిటాకుతోనో, బాదం ఆకులతో ఫౌండేషన్ వేస్తారు. అనేక దొంతరలుగా ఉండే తందూరీ రోటీలనూ, జొన్న రొట్టెల్ని వృత్తాకారంలోనే కాగితాల్లో చుడతారు. ఇందాక మనం చూసిన ఆ కిరాణ షాపులో పప్పు పొట్లాన్ని క్యూబ్ ఆకారంలో పొట్లాం కడతారు. దాన్ని చూస్తే ఘనాఘన సుందరుణ్ణి చూసినంత ఆనందం కలుగుతుంది. ఇక బెల్లం అచ్చుల్ని పిరమిడ్ ఆకారాన్ని మధ్యకు కోసినట్లుగా తాటాకు చాపలో చుట్టిపెడతారు. అందుకే బెల్లంపై తాటాకు అచ్చుల్ని చూడకపోయినా, మామిడి తాండ్రపై ఈతచాప కదుములు కనిపించకపోయినా నాకెంతో బెంగగా ఉంటుందిరా. అంతెందుకు కాసిన్ని పూలు బయటికి కనిపించేలా పూలమాల పొట్లాంలోనూ ఓ చమత్కారం ఉంటుంది’’ అన్నాడు మా రాంబాబు. ‘‘ఒరే బాబూ... పూలూ, కిరాణా పొట్లాల్లోనూ పొట్లకాయలాంటి నిర్మాణ చమత్కృతి చూస్తున్న నిన్నేం అనాలో నాకు తోచడం లేదురా’’ అన్నాను. ‘‘నేను చెప్పేది ఇంకా అయిపోలేదు. ఇక జర్నలిజపు పాఠాలను తన ఒంటిపై అక్షరాలతో అచ్చోసుకున్న ఆ వార్తల కాగితమే, మళ్లీ పకోడీ పొట్లాలకు మూలం కావడంలోని చిత్రం చూశావా? ఎంత మాలావు ఇంగ్లిషు పేపరైనా పాత పేపర్ల వాడి నుంచి చివరకు కిరాణాషాపుకు లేదా కాకాహోటళ్లకు మళ్లుతుంది. అయితే ఇక్కడ కూడా తెలుగు పేపరు కంటే ఇంగ్లిష్ పేపరుకే ఎక్కువ ధర పలకడం చూస్తే బాధేస్తుంది. పొట్లాం దగ్గర కూడా తెలుగు పేపర్ల పట్ల ఇంకా కొనసాగుతున్న ఈ వివక్ష చూస్తే బాధేస్తోందిరా’’ అన్నాడు వాడు. ‘‘చూస్తుంటే కంగారూ సైతం తన బిడ్డను పొట్టకు పొట్లాంలా కట్టుకుంటుందని అనేలా ఉన్నావు’’ అంటూ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాన్నేను. - యాసీన్