మణిపూర్‌లో మళ్లీ కాల్పులు.. ఐదుగురు పౌరులు మృతి | Manipur 5 Civilians Killed And 3 BSF Personnel Hurt In Fresh Round Of Violence, Details Inside - Sakshi
Sakshi News home page

Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ కాల్పులు.. ఐదుగురు పౌరులు మృతి

Published Fri, Jan 19 2024 9:28 AM | Last Updated on Fri, Jan 19 2024 10:37 AM

Manipur 5 Civilians Killed In Fresh Round Of Violence - Sakshi

ఇంఫాల్: మణిపూర్‌లో మళ్లీ కాల్పుల మోత మోగింది. వేర్వేరు ఘటనల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందారు. బిష్ణుపూర్ జిల్లాలో నలుగురు పౌరులు చనిపోగా.. కాంగ్‌పోక్పి జిల్లాలో ఒకర్ని దుండగులు కాల్చి చంపారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

పోలీసులు మృతులను ఓనామ్ బమోంజావో సింగ్ (61), ఆయన కుమారుడు ఓనామ్ మణితోంబ సింగ్ (32), తియం సోమేంద్ర సింగ్ (55), నింగ్‌థౌజం నబద్విప్ సింగ్ (40)గా గుర్తించారు. కాంగ్‌పోక్పిలో మరణించిన పౌరుడిని తఖెల్లంబమ్ మనోరంజన్‌గా గుర్తించారు. అయితే.. గత రెండురోజులుగా అర్ధరాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లోనే మనోరంజన్ మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానిక బంకర్‌ నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

బుధవారం రాత్రి తౌబల్ జిల్లాలో కాల్పులు జరగడంతో ముగ్గురు సరిహద్దు భద్రతా దళం (BSF) సిబ్బందికి గాయాలయ్యాయి. అర్ధరాత్రి సమయంలో దుండగులు నిద్రిస్తున్న భద్రతా సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. అంతకుముందు మంగళవారం అర్ధరాత్రి కూడా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఓ భద్రతా అధికారి మృతి చెందారు. 
  
గత ఏడాది మే నెల నుంచి మణిపూర్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ ప్రారంభం అయింది. మెయితీ, కుకీ తెగల మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. నాటి దాడుల్లో 170 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటికీ పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ ఆనాటి నుంచి నేటి వరకు చెదురుమదురుగా హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 

ఇదీ చదవండి: ప్రాణ ప్రతిష్ట వేళ.. అయోధ్యలో అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్‌!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement