
రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, కమల్ కామరాజు, శ్వేతవర్మ, అర్ష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మిఠాయి’. ప్రశాంత్‌కుమార్ దర్శకత్వంలో డా. ప్రభాత్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలకానుంది. ఈ చిత్రం థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘అందరినీ ఆహ్లాదపరిచే చక్కటి వినోదాత్మక చిత్రమిది. డార్క్ కామెడీతో విభిన్న పాత్రల మధ్య సాగే కథ, కథనాలు ఆద్యంతం ప్రేక్షకులను అలరింపజేస్తాయి.
రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిల అభినయం సినిమాకే హైలైట్. నవరసాలను మేళవించి దర్శకుడు ఈ చిత్రాన్ని ఎంతో బాగా తీశాడు. వివేక్ సాగర్ సంగీతం వీనుల విందుగా ఉంటుంది. ప్రేక్షకులకు ఓ మంచి చిత్రాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది’’ అన్నారు. భూషణ్ కల్యాణ్, రవివర్మ, గాయత్రి గుప్త, అదితీ మైఖేల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రవివర్మన్ నీలమేఘం.
Comments
Please login to add a commentAdd a comment