kamal kama raju
-
‘సోదర సోదరీమణులారా’మూవీ రివ్యూ
టైటిల్: సోదర సోదరీమణులారా నటీనటులు: కమల్ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో, కాలకేయ ప్రభాకర్, పృథ్వీ నిర్మాత: విజయ్ కుమార్ పైండ్ల దర్శకత్వం: రఘుపతి రెడ్డి గుండా నేపథ్య సంగీతం : వర్ధన్ సినిమాటోగ్రఫీ : మోహన్ చారి ఎడిటర్ : పవన్ శేఖర్ పసుపులేటి విడుదల తేది: సెప్టెంబర్ 15, 2023 కథేంటంటే.. క్యాబ్ డ్రైవర్ రాజు(కమల్ కామరాజు) తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రావణి (అపర్ణాదేవి) తన కుమార్తె కలిసి జీవిస్తూ ఉంటాడు. ఫైనాన్స్‌లో కొన్న కారు అప్పు తీర్చడం కోసం ఎక్స్ట్రా ట్రిప్పులు వేస్తుంటాడు. అలా ఒక రోజు అతని క్యాబ్‌లో సన్నీ అనే యువకుడిని వికారాబాద్‌లో ఉన్న ఒక రిసార్ట్‌కు తీసుకెళ్తాడు. తిరుగు ప్రయాణంలో ఒక అమ్మాయిని డ్రాప్ చేయమని రిసార్ట్ మేనేజర్ చెప్పడంతో ఆమెను కారులో ఎక్కించుకొని వస్తూ ఉండగా, పోలీసులు వచ్చి కారులో ఉన్న అమ్మాయిని రేప్ చేసి చంపేశావని అరెస్ట్ చేస్తారు. అసలు ఆ అమ్మాయి ఎవరు? రిసార్ట్ లో అసలు ఏం జరిగింది? పోలీసులు వస్తుంటే సన్నీ ఎందుకు పారిపోయాడు? ఆ అమ్మాయిని రేప్ చేసి చంపిదెవరు? తన భర్తను కాపాడుకునేందుకు శ్రావణి ఏం చేసింది? చివరకు ఈ కేసు నుంచి రాజు ఎలా బయటపడ్డాడు అనేది మిగతా కథ. ఎలా ఉందంటే.. ఈ సినిమా కథ కొత్తది ఏమీ కాదు. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు చేసిన తప్పుకు ఒక అభం శుభం తెలియని వ్యక్తిని బలి చేయబోతూ చివరికి తానే బలి కావాల్సి వచ్చిన ఒక పోలీసు అధికారి కథ. సాధారణంగా ఏదైనా ఒక క్రైమ్ గురించి మీడియాలో పోలీసుల వర్షన్ మాత్రమే ప్రసారమవుతుంది. అదే చూసి బయట వ్యక్తులు ఆ క్రైమ్ వెనుక ఉన్నది మీడియాలో చెప్పిన వారే అని దాదాపుగా ఫిక్స్ అయిపోతూ ఉంటారు. కానీ పోలీసులు తమ పై అధికారులు లేదా రాజకీయ నేతల ఒత్తిడితో ఎలా కేసులను తారుమారు చేస్తారు? చివరికి తమ మీదకు వస్తుందనుకున్న టైంలో ఎలా బిహేవ్ చేస్తారు? ఇలాంటి విషయాలను ఈ కథలో చర్చించాడు దర్శకుడు. తప్పు చేయని వ్యక్తులను పోలీసులు ఎలా కార్నర్ చేస్తారు? అధికారుల కోసం ఎలా అడ్డదారులతోక్కుతారు అనే విషయాలను సినిమాలో చూపించి రియాలిటీ కి దగ్గరలో ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చినట్టు అనిపించింది. అయితే సినిమా చిన్న బడ్జెట్ ది కావడంతో పూర్తిస్థాయిలో దర్శకుడు ఔట్పుట్ రాబట్టలేకపోయాడేమో అనిపించింది. ఎవరెలా చేశారంటే.. అమాయక క్యాబ్ డ్రైవర్ రాజు పాత్రలో కమల్ కామరాజు చక్కగా నటించాడు. రాజు భార్యశ్రావణిగా అపర్ణాదేవి తనదైన నటనతో ఆకట్టుకుంది. సీఐ భాస్కర్‌గా బాహుబలి ప్రభాకర్ మెప్పించాడు. హోం మినిస్టర్‌గా సీనియర్ నటుడు పృథ్వీ నెగటివ్ షేడ్‌లో ఆకట్టుకున్నాడు.మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక పరంగా ఈ చిత్రం పర్వాలేదు. మోహన్ చారి కెమెరా వర్క్ , వర్ధన్ నేపథ్య సంగీతంతో పాటు ఇతర సాంకేతిక విభాగాలు అన్ని బాగున్నాయి. నిర్మాణ విలువలు పర్వాలేదు. -
గ్రామీణ నేపథ్యంలో...
సుమన్‌బాబు, కారుణ్య చౌదరి, కమల్ కామరాజు, భానుశ్రీ, అజయ్, ఉత్తేజ్, మహేష్, సురేష్ కొండేటి, ‘మహానటి’ ఫేం బేబీ సాయి తుషిత ముఖ్య తారలుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎర్ర చీర’. సీహెచ్ సుమన్‌బాబు నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. బేబి డమరి సమర్పణలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. కాగా ఈ చిత్రంలో ‘ఒకరికి ఒకరు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ ఫేమ్ శ్రీరామ్ ప్రత్యేకపాత్ర పోషిస్తున్నారు. సుమన్‌బాబు మాట్లాడుతూ– ‘‘మదర్ సెంటిమెంట్, హారర్ ఈ సినిమాలో ప్రధాన హైలైట్. మొదటి షెడ్యూల్లో పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్‌ను తీశాం. ఈ నెల 15న ప్రారంభమయ్యే రెండో షెడ్యూల్లో వినోదం, పోరాట సన్నివేశాలు తీస్తాం. శ్రీరామ్పాత్ర ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఆయనపై తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా ఉంటాయి’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: చందు, సంగీతం: ప్రమోద్ పులిగిళ్ళ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తోట సతీష్. -
కళ్లు చెమర్చేలా...
సుమన్ బాబు, కారుణ్య, కమల్ కామరాజు, భానుశ్రీ, అజయ్, ఉత్తేజ్, మహేష్ ముఖ్య తారలుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎర్రచీర’. సి.హెచ్.సుమన్ బాబు దర్శకత్వంలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. సి.హెచ్. సుమన్‌బాబు మాట్లాడుతూ– ‘‘హారర్, మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ నెల 15న షూటింగ్ ప్రారంభించి మొదటి షెడ్యూల్ పూర్తి చేశాం. కథలో ప్రధాన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించాం. ఎంతో హృద్యంగా ఉండే ఈ సన్నివేశాలు కళ్లు చెమర్చేలా చేస్తాయి. ‘మహానటి’ ఫేం బేబి సాయి తుషిత పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నాకు సహకరించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రత్యేక కృతజ్ఞతలు’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బేబి డమరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తోట సతీష్, సంగీతం: ప్రమోద్ పులగిల్ల, కెమెరా: చందు. -
అందమైన వినోదం
‘మహానటి’ ఫేమ్ బేబి తుషిత ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రం ‘ఎర్రచీర’. చెరువుపల్లి సుమన్ బాబు, ‘శంభో శంకర’ ఫేమ్ కారుణ్య, కమల్ కామరాజు ముఖ్య తారలుగా నటించనున్నారు. శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్న ఈ సినిమా ఏప్రిల్ 15 నుంచి తొలి షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సి.హెచ్ సుమన్ మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ సెంటిమెంట్, హారర్ నేపథ్యంలోని అందమైన కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. సినిమాలో ఆద్యంతం సస్పెన్స్ కట్టి పడేస్తుంది. కథ, కథనం హైలైట్‌గా తెరకెక్కనున్న ఈ క్రేజీ చిత్రానికి సంగీత దర్శకుడు ప్రమోద్ సారథ్యంలో రికార్డింగ్ కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. అలీ, రఘుబాబు, ఉత్తేజ్, మహేష్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కెమెరా: చందు, సంగీతం : పమ్రోద్ పులిగిల్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తోట సతీష్. -
మిఠాయి బాగుంది
రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, కమల్ కామరాజు, శ్వేతవర్మ, అర్ష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మిఠాయి’. ప్రశాంత్‌కుమార్ దర్శకత్వంలో డా. ప్రభాత్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలకానుంది. ఈ చిత్రం థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘అందరినీ ఆహ్లాదపరిచే చక్కటి వినోదాత్మక చిత్రమిది. డార్క్ కామెడీతో విభిన్న పాత్రల మధ్య సాగే కథ, కథనాలు ఆద్యంతం ప్రేక్షకులను అలరింపజేస్తాయి. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిల అభినయం సినిమాకే హైలైట్. నవరసాలను మేళవించి దర్శకుడు ఈ చిత్రాన్ని ఎంతో బాగా తీశాడు. వివేక్ సాగర్ సంగీతం వీనుల విందుగా ఉంటుంది. ప్రేక్షకులకు ఓ మంచి చిత్రాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది’’ అన్నారు. భూషణ్ కల్యాణ్, రవివర్మ, గాయత్రి గుప్త, అదితీ మైఖేల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రవివర్మన్ నీలమేఘం. -
ఐదే పాత్రలు
నందు, శ్రీముఖి, కమల్ కామరాజు ముఖ్య తారలుగా వి.ఎస్. వాసు దర్శక త్వంలో తెరకెక్కిన సినిమా ‘కుటుంబ కథా చిత్రమ్’. భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా సమర్పణలో దాసరి భాస్కర్ యాదవ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ– ‘‘ఇందులో సాఫ్ట్వేర్ కుర్రాడి పాత్ర చేశా. భార్యాభర్తల మధ్య జరిగే గొడవ వల్ల సినిమా థ్రిల్లర్ స్టైల్లో నడుస్తుంది. సోలో హీరోగానూ అవకాశాలొస్తున్నాయి. నటుడిగా నేను చాలా సంతృప్తిగా ఉన్నా. కథలో నా పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే ఒప్పుకుంటున్నా. ఓ టీమ్ ఏర్పాటు చేసుకుని ఫీచర్ ఫిలిం ప్లాన్ చేసుకుంటున్నా. ఆ ప్రాసెస్‌లో ‘వై నాట్ ఎ గర్ల్’ అనే షార్ట్ ఫిలిం చేశా. వెబ్ సిరీస్‌లు చేయమని అవకాశాలొస్తున్నాయి. టేకప్ చేయాలి’’ అన్నారు. కమల్ కామరాజు మాట్లాడుతూ–‘‘కాటమరాయుడు, అర్జున్‌రెడ్డి’ చిత్రాల తర్వాత నేను చేసిన సినిమా ఇది. నిర్మాత రాజ్ కందుకూరిగారు కథ వినమంటూ దర్శకుడు వాసుని నావద్దకు పంపించారు. వాసుని చూడగానే ఇతను సినిమా తీయగలడా? అని భయమేసింది. కానీ, తను కథ చెబుతున్నప్పుడు నేను ఎంజాయ్ చేశా. స్క్రీన్‌ప్లే చూసి హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టాడా? అనిపించింది. అంత బాగా ఉంటుంది. ఐదు పాత్రలతో నడిచే సినిమా ఇది. ఇప్పటి పరిస్థితుల్లో కుటుంబంలోని అనుబంధాలను ఎలా మిస్ అవుతున్నామని చూపించాం. కథకి థ్రిల్లింగ్ అంశాలు జోడించటం వల్ల ప్రేక్షకులకు ఎక్కడా బోర్ అనిపించదు. నాది నెగటివ్ క్యారెక్టర్. ప్రస్తుతం రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చా’’ అన్నారు. -
ఈ తరానికి తగ్గట్టు...
‘‘ప్రతి ప్రేక్షకునికి రీచ్ అయ్యే టైటిల్ పెట్టడంలోనే సగం సక్సెస్ అయ్యారు. ఈ చిత్రం టీజర్ చూసినప్పుడే అండగా ఉండాలని నిర్ణయించుకున్నా’’ అన్నారు నిర్మాత మల్కాపురం శివకుమార్. నందు, శ్రీముఖి, కమల్ కామరాజు ముఖ్య తారలుగా వి.ఎస్. వాసు దర్శకత్వంలో భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా సమర్పణలో దాసరి భాస్కర్ యాదవ్ నిర్మించిన సినిమా ‘కుటుంబ కథా చిత్రమ్’. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను నందు, కమల్ కామరాజు, సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ విడుదల చేయగా, టీజర్‌ని మల్కాపురం శివకుమార్ రిలీజ్ చేశారు. ‘‘చక్కని కుటుంబ కథా చిత్రమిది. అనుకున్న బడ్జెట్లోనే సినిమా పూర్తి చేసాం’’ అన్నారు భాస్కర్‌యాదవ్. ‘‘1980లో కుటుంబం అంటే అందరూ కలసి ఉండేవారు. 2017లో కుటుంబం అంటే ముగ్గురు లేక నలుగురే ఉంటున్నారు. ఈ చిత్రంలో 2017 జనరేషన్‌కు తగ్గట్టు కాన్సెప్ట్ ఉంటుంది’’ అన్నారు. నందు, కమల్ కామరాజు, కెమెరామెన్ మల్హర్ భట్ జోషి పాల్గొన్నారు. -
సెలబస్: కమల్... ఓ కళాంశం!
కమల్ జెఎన్‌టియులో ఆర్కిటెక్చర్ చేశారు. కళాపిపాస ఉన్నా, కమర్షియల్ చిత్రకారుడు కావాలని అనుకోకపోవడంతో పెయింటింగ్స్ వేయడం తగ్గింది. సినీరంగంలో ప్రవేశించాక... ఛత్రపతి, అనుకోకుండా ఒకరోజు వంటి సినిమాలకు అసిస్టెంట్ ఆర్ట్ డెరైక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత గోదావరి, ఆవకాయ్ బిర్యానీ, కలవరమాయె మదిలో వంటి చిత్రాల్లో నటించారు. షూటింగ్స్ లేని ఖాళీ సమయాల్లో చిత్రకళ చేతికొచ్చింది. రెండు పడవల ప్రయాణం మొదలైంది. ఇప్పటిదాకా 3 పెయింటింగ్ సిరీస్ చేశారు. 3 ఎగ్జిబిషన్లు నిర్వహించారు. ‘‘ఇది నాకు ఆదాయమార్గం కాదు. ఆనందమార్గం మాత్రమే’’ అనే కమల్‌ది సామాజికాంశాల మీద వెనువెంటనే స్పందించే మనసున్న కుంచె. ‘మిన్ను’ పేరుతో గర్ల్ చైల్డ్ మీద తొలి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. గోడలమీద వాల్‌పోస్టర్లు అనే అంశాన్ని థీమ్‌గా తీసుకుని చేసిన ‘వాల్ ఆర్ట్ సిరీస్’ అందరినీ ఆకట్టుకుంది. నిర్భయ సంఘటన సమయంలో కూడా స్పందించి అప్పటికప్పుడు చిత్రాలు గీశారు. ప్రస్తుతం నాలుగో సిరీస్ చేసే ప్రయత్నంలో ఉన్నారు!