కళ్లు చెమర్చేలా... | Erra Cheera first schedule completed | Sakshi
Sakshi News home page

కళ్లు చెమర్చేలా...

Published Fri, Apr 26 2019 1:24 AM | Last Updated on Fri, Apr 26 2019 1:24 AM

Erra Cheera first schedule completed - Sakshi

సుమన్‌ బాబు, కారుణ్య, కమల్‌ కామరాజు, భానుశ్రీ, అజయ్, ఉత్తేజ్, మహేష్‌ ముఖ్య తారలుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎర్రచీర’. సి.హెచ్‌.సుమన్‌ బాబు దర్శకత్వంలో శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమా తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. సి.హెచ్‌. సుమన్‌బాబు మాట్లాడుతూ– ‘‘హారర్, మదర్‌ సెంటిమెంట్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిది.  ఈ నెల 15న షూటింగ్‌ ప్రారంభించి మొదటి షెడ్యూల్‌ పూర్తి చేశాం. కథలో ప్రధాన సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించాం. ఎంతో హృద్యంగా ఉండే ఈ సన్నివేశాలు కళ్లు చెమర్చేలా చేస్తాయి. ‘మహానటి’ ఫేం బేబి సాయి తుషిత పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నాకు సహకరించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రత్యేక కృతజ్ఞతలు’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బేబి డమరి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: తోట సతీష్, సంగీతం: ప్రమోద్‌ పులగిల్ల, కెమెరా: చందు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement