Bhanu Sri
-
త్రియుగి నారాయణ్ ఆలయంలో బిగ్‌బాస్ బ్యూటీ (ఫోటోలు)
-
థియేటర్స్‌లోకి వచ్చిన ‘అజయ్‌గాడు’.. ఎలా ఉందంటే?
బిగ్‌బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అజయ్ కతుర్వర్. అంతకు ముందు పలు సినిమాల్లో నటించిన అంతగా గుర్తింపు రాలేదు కానీ..బిగ్‌బాస్ ఓటీటీ సీజన్లో పాల్గొని తనదైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. తాజాగా ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘అజయ్‌గాడు’. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది జనవరిలోనే నేరుగా ఓటీటీలోకి రిలీజై.. మంచి విజయం సాధించింది. తాజాగా థియేటర్స్‌లో రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.ఈ సినిమ కథ విషయానికొస్తే.. అజయ్(అజయ్ కుమార్ కతుర్వార్) ఎలాగైనా ఓ సినిమా తీసి హిట్ కొట్టాలనుకుంటాడు. ఈ ప్రయత్నంలో అతనికి ధనవంతుడి కుమార్తెతో పరిచయం అవుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. అయితే అమ్మాయి తండ్రికి ఇది నచ్చదు. దీంతో అజయ్‌కి ఓ సమస్యలో ఇరికిస్తాడు. డాక్టర్ శ్వేత..అజయ్‌ను ఈ సమస్య నుంచి బయటపడేస్తుంది. అసలు శ్వేత ఎవరు? అజయ్, శ్వేతల మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? ధనవంతుడి కుమార్తెతో ప్రేమలో పడిన తర్వాత అజయ్ జీవితంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి. సినిమా తీయాలనుకున్న అజయ్ కోరిక నెరవేరిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఓ సామాన్యుడు తనకు ఎదురైన అసాధారణ పరిస్థితులను ఎలా అధిగమించారు? అందుకు దోహదపడిన అంశాలు ఏంటి అనేది ఈ సినిమా కథాంశం. సినిమా ప్రారంభం అవ్వగానే అజయ్ జీవితంలో జరిగిన అనేక ఉద్విగ్నభరితమైన జీవిత ఘట్టాలు మనకు పరిచయమవుతాయి. ఎలాంటి హడావుడి లేకుండా హీరో పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. అనుకోకుండా హీరో జీవితంలోకి వచ్చిన యువతి వల్ల హీరో ఎలాంటి అనుభూతిని పొందారు? అతని జీవితంలో వచ్చిన మార్పులేంటి అనేది యూత్ కి కనెక్ట్ అయ్యేలా మలిచారు. ఓ చిత్రాన్ని తీయాలనే కోరికతో ఉన్న ఓ సామాన్యుడు అడుగడుగా ఎదుర్కొన్న ఇబ్బందులను ఎలాంటి హడావుడి లేకుండా సిల్వర్ స్క్రీన్ పై చూపించిన విధానం ప్రేక్షకులను మెప్పిస్తుంది. అలాగే ఇలాంటి పాత్ర నుంచి ఓ బాధ్యతతో తన కల అయిన సినిమాని తీయాలనుకునే హీరో పాత్రను యూత్ కు మెచ్చే విధంగా మలిచిన తీరు ఆకట్టుకుంటుంది.అజయ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కాబట్టి... ఈసినిమా కథ, కథనాలన్నీ అజయ్ టేస్ట్ కు తగ్గట్టుగానే యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. మూడు బాధ్యతలు పోషించడం అంటే మాటలు కాదు. అలాంటిది నిర్మాతగా కూడా సినిమాని ఎంతో క్వాలిటీగా నిర్మించారు. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదనే చెప్పొచ్చు. వైద్యురాలి పాత్రలో శ్వేత మెహతా ఆకట్టుకుంది. అజయ్ లవర్‌గా భానుశ్రీ తెరపై అందాలను ప్రదర్శించడమే కాకుండా తనదైన నటనతో ఆకట్టుకుంది. అజయ్ స్నేహితుని పాత్రలో నటించిన అభయ్ బేతిగంటి మెప్పించారు. సాకేంతికంగా సినిమా పర్వాలేదు. -
Bhanu Shree: బిగ్‌బాస్ బ్యూటీ స్టన్నింగ్ షో..మతిపోయేలా అందాల జోరు! (ఫోటోలు)
-
Kalasa Movie Review: ‘కలశ’మూవీ రివ్యూ
టైటిల్: కలశ నటీనటులు: భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్, రోషిణి కామిశెట్టి, జీవా, సమీర్, రవివర్మ తదితరులు నిర్మాత: రాజేశ్వరి చంద్రజ వాడపల్లి దర్శకత్వం:కొండా రాంబాబు సంగీతం: విజయ్ కురాకుల సినిమాటోగ్రఫీ:వెంకట్ గంగధారి ఎడిటర్: జునైద్ సిద్దిఖీ విడుదల తేది: డిసెంబర్ 15, 2023 కథేంటంటే.. తన్వి(భానుశ్రీ) ఓ హారర్ సినిమాను తెరకెక్కించాలనుకుంటుంది. ఇందుకోసం ఓ మంచి కథను సిద్ధం చేసుకొని నిర్మాతను కలుస్తుంది. అతను కథ మొత్తం విని క్లైమాక్స్ మార్చమని సలహా ఇస్తాడు. దీంతో తన్వి హైదరాబాద్‌లో ఉన్న తన స్నేహితురాలు కలశ(సోనాక్షి వర్మ) దగ్గరకు వెళ్తుంది. ఇంటికి వెళ్లేసరికి కలశ అక్కడ ఉండదు. తన్వి కాల్ చేస్తే.. పని మీద బయటకు వెళ్లాలని.. కాస్త లేట్‌గా వస్తానని చెబుతోంది. తన్వి ఒక్కతే ఇంట్లోకి వెళ్తుంది. ఆ ఇల్లు అచ్చం తన్వి రాసుకున్న కథలోని ఇల్లు మాదిరే ఉంటుంది. తన కథలో ఉన్న కొన్ని సీన్లే తన కళ్లముందు రిపీట్ అవుతాయి. ఓ వ్యక్తి ఆమె కదలిలను దొంగచాటున గమనిస్తుంటాడు. అలాగో ఇంట్లో మరోకరు తన్వికి కనిపించకుండా తిరుగుతుంటారు. కలశ చెల్లి అన్షు(రోషిణి కామిశెట్టి) తనను ఆట పట్టిస్తుందని తన్వి భావిస్తుంది. కట్ చేస్తే.. మరుసటి రోజు తన్వికి ఓ నిజం తెలుస్తుంది. కలశ, అంజు ఇద్దరూ రెండు నెలల క్రితమే చనిపోయారని, ఈ ఇంట్లో ఇప్పుడు ఎవరు ఉండట్లేదని ఆ ఇంటి పని మనిషి చెబుతాడు. మరి తన్వికి ఫోన్ కాల్ చేసిందెవరు? అంజు, కలశ ఎలా చనిపోయారు? కలశ నేపథ్యం ఏంటి? రచయిత రాహుల్(అనురాగ్)తో ఈ హత్యలకు ఉన్న సంబంధం ఏంటి? సాఫ్ట్వేర్ ఉద్యోణి మానస హత్యకు ఈ కేసులో ఉన్న సంబంధం ఏంటి? సస్పెండ్ అయిన సీఐ కార్తికేయ(రవివర్మ) ఎందుకు రహస్యంగా ఈ కేసును ఎందుకు విచారించాడు? కార్తికేయకు తన్వి ఎలాంటి సహాయం చేసింది? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘కలశ’మూవీ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. సైకలాజికల్ థ్రిల్లర్, హారర్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ.. తెరపై దాన్ని ఆసక్తికరంగా చూపించడంలో కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. అసలు కథను దాచిపెడుతూ.. ఫస్టాఫ్ అంతా సోసోగా నడిపించాడు. ప్రథమార్థంలో ఎక్కువగా కామెడీకే ప్రాధాన్యత ఇచ్చారు. రచ్చ రవి, భానుశ్రీల మధ్య వచ్చే కామెడీ సీన్ నవ్వులు పూయిస్తుంది. కానిస్టేబుల్ నారాయణ, అతని కూతురు మానసల మధ్య వచ్చే సన్నివేశాలు ఎమోషనల్‌కు గురి చేస్తాయి. ఇంట్లో దెయ్యం చేసే పనులు కొన్ని చోట్ల సిల్లీగా అనిపిస్తే.. మరికొన్ని చోట్ల భయానికి గురి చేస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథ పరుగులు తీసుస్తుంది. కలశ నేపథ్యం, అక్కాచెల్లెళ్ల చావులకు గల కారణాలు ఊహించని విధంగా ఉంటాయి. కార్తికేయ ఇన్వెస్టిగేషన్లో తెలిసే ట్విస్టులు థ్రిల్లింగ్ ఉంటాయి. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్‌లో కథను మరింత బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. హారర్ జానర్స్‌ని ఇష్టపడేవారికి కలశ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. బిగ్‌బాస్ ఫేమ్ భానుశ్రీకి చాలా కాలం తర్వాత మంచి పాత్ర లభించింది. యంగ్ డైరెక్టర్ తన్విగా ఆమె చక్కగా నటించింది. తెరపై కావాల్సిన చోట అందాలను ఆరబోస్తూనే.. తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక టైటిల్ రోల్ ప్లే చేసిన సోనాక్షి వర్మ.. తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. సెకండాఫ్‌తో తన పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. అన్షుగా రోషిణి కామిశెట్టి, పోలీసు అధికారి కార్తికేయగా రవివర్మ, నెగెటివ్ షేడ్స్ ఉన్న సీఐగా సమీర్, సినిమా రచయిత రాహుల్‌గా అనురాగ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక పరంగా ఈ సినిమా పర్వాలేదు. విజయ్ కురాకుల నేపథ్యం సంగీతం కొన్ని చోట్ల భయపెట్టిస్తుంది. వెంకట్ గంగధారి సినిమాటోగ్రఫీ బాగుంది. . ఆర్టిస్ట్‌గా, గాయనిగా, నర్తకిగా వివిధ రంగాలలో పేరు, ప్రఖ్యాతుల సంపాదించుకున్న రాజేశ్వరి చంద్రజ ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాయే అయినా ప్యాషనేట్ ప్రొడ్యూసర్‌గా ఈ సినిమా నిర్మించారు. ఖర్చు విషయంలో ఎక్కడ తగ్గకుంటా సినిమా చాలా రిచ్‌గా నిర్మించారు. -
బిగ్ బాస్ బ్యూటీ భానుశ్రీ 'కలశ' చిత్రం విడుదల ఎప్పుడంటే
బిగ్ బాస్ ఫెమ్ భానుశ్రీ , సోనాక్షి వర్మ, అనురాగ్కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'కలశ'. చంద్రజ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లో కొండా రాంబాబు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. దీంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. తాజాగా నేడు (డిసెంబర్9) కలశ ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్ మలినేని గోపిచంద్ విడుదల చేశారు. ఆపై ఆయన చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ సందర్భంగా దర్శకులు మలినేని గోపిచంద్ మాట్లాడుతూ.. 'కలశ మూవీ ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా థ్రిల్లరా? లేక హర్రరా ? అనేది తెలీకుండా తెలివిగా కట్ చేశారు. కలశ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టి డైరెక్ట్ చేసిన దర్శకుడు రాంబాబుతో పాటు నిర్మాత, నటీనటులు, టెక్నీషియన్స్‌కు అల్ ది బెస్ట్ చెప్పారు. డిసెంబర్ 15 న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అందరూ తప్పకుండా చూడండి.' అని ఆయన అన్నారు. కలశ ట్రైలర్‌ను డైరెక్టర్ మలినేని గోపిచంద్ లాంచ్ చేసినందుకు హీరోయిన్ భానుశ్రీ కృతజ్ఞతలు తెలిపింది. కలశ చిత్రాన్ని చూసి ఆదరించాలని ప్రేక్షకులను ఆమె కోరింది. నిర్మాత శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి మాట్లాడుతూ.. డైరెక్టర్ గోపిచంద్ మలినేని గారు కలశ ట్రైలర్‌ను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. డిసెంబర్ 15 న థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని ఎవరూ మిస్ అవ్వకుండా చూస్తారని ఆసిస్తున్నట్లు తెలిపారు. -
హారరా? థ్రిల్లరా?
భాను శ్రీ, సోనాక్షీ వర్మ, అనురాగ్ కీలక పాత్రల్లో రూపొందిన చిత్రం ‘కలశ’. కొండా రాంబాబు దర్శకత్వంలో శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ–‘‘కలశ’ ట్రైలర్ బాగుంది. ఈ సినిమా థ్రిల్లరా? లేక హారరా? అనే సందేహం కలిగేలా ట్రైలర్‌ను కట్ చేశారు. యూనిట్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘కలశ’ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది. థియేటర్స్‌లో చూడండి’’ అని యూనిట్ పేర్కొంది. -
హీరోయిన్గా బిగ్‌బాస్ ఫేమ్.. టీజర్ రిలీజ్!
బిగ్‌బాస్ ఫేమ్ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కలశ’. కొండ రాంబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డాక్టర్ రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మించారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ చంద్ర టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు కొండా రాంబాబు మాట్లాడుతూ...' చిత్రబృంద సభ్యులు పగలు, రేయి బాగా కష్టపడ్డారు. అనురాగ్, భానుశ్రీ, సోనాక్షి వర్మ, రోషిణిలు అద్భుతంగా నటించారు. మా అందరినీ వెనుక ఉండి నడిపించిన స్వామి, మేడమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ‘కలశ’ అనే టైటిల్ ఈ సినిమాలోని క్యారెక్టర్. అందుకే కలశం నుంచి ‘కలశ’ను తీసుకోవడం జరిగింది. బ్రెయిన్‌కి, హార్ట్‌కి లింక్ చేస్తూ రాసుకున్న సినిమా ఇది. అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది.' అని అన్నారు. దర్శకుడు సాగర్ చంద్ర మాట్లాడుతూ... 'టీజర్ చాలా బాగుంది. మంచి ఎమోషన్, యాక్షన్ ఉంది. కాబట్టి ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. అందరికీ అల్ ది బెస్ట్' అని అన్నారు. నిర్మాత చంద్రజ మాట్లాడుతూ...' రాంబాబు చాలా హార్డ్ వర్కర్. ఈ కథకు కావాల్సిన కమర్షియల్ హంగులతో తెరకెక్కించాం. ఎక్కడా అశ్లీలత లేకుండా చూశాం. సెన్సార్ వారు కూడా కట్స్ లేకుండా సర్టిఫికెట్ ఇవ్వడం మా తొలి విజయంగా భావిస్తున్నా. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్ముతున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో రోషిణి కామిశెట్టి, జీవా, సమీర్, రవివర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి విజయ్ కురాకుల సంగీతమందించారు. -
Bhanu Sree: బిగ్ బాస్ బ్యూటీ భాను శ్రీ హాట్ పోజులు (ఫోటోలు)
-
బిగ్ బాస్ బ్యూటీ భాను శ్రీ గ్లామర్ ఫొటోలు
-
ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌కు చిరంజీవితో చెయ్యాలనే ఆశ ఉంటుంది కానీ.. : నోయల్
టాలీవుడ్లో ఉన్న ప్రతి ఆర్టిస్ట్‌కి చిరంజీవితో కలిసి సినిమా చేయాలని ఉంటుంది. కానీ దర్శకనిర్మాతలు మంచి అవకాశాలు ఇచ్చి.. మనం ప్రూవ్చేసుకుంటే అలాంటి చాన్స్‌లు వస్తాయి. నన్ను నమ్మి ‘ఈఎంఐ.. ఈ అమ్మాయి’అనే సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలు దొంతు రమేష్, డి. రమేష్ గౌడ్ లకు ధన్యవాదాలు’అని నటుడు నోయల్ అన్నారు. నోయల్, బిగ్ బాస్ ఫెమ్ బానుశ్రీ హీరో హీరోయిన్లు నటించిన తాజా చిత్రం ఈఎంఐ.. ఈ అమ్మాయి. చమ్మక్ చంద్ర, సత్తి పండు, ధనరాజ్, భద్రం, చలాకి చంటి ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా చిత్ర హీరో నోయల్ మాట్లాడుతూ.. ఒక తండ్రి కృషి, కొడుకు ప్రయత్నం అని చాలా సార్లు విన్నాను. అయితే ఈ సినిమా ద్వారా ఈ తండ్రి కొడుకులను కళ్లారా చూశాను. చాలా మంది సినిమాల్లోకి వెళతాను అంటే ఎంకరేజ్ చెయ్యరు. అలాంటి తన కొడుకు కలను నిజం చేస్తూ చాలా కష్టపడి నిర్మించిన చిత్రమే ‘ఈఎంఐ..ఈ అమ్మాయి’. ఈ నెల 10 న వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించి బిగ్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. ‘వివిధ దశల్లో అమ్మాయిలు ఎదుర్కొనే రక రకాల సమస్యలను కథాంశంగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించాం. సినిమా చెయ్యడానికి చాలా ఇబ్బంది పడ్డాము. నటీ, నటులు టెక్నిషియన్స్ అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది’అని సమర్పకులు దొంతు బుచ్చయ్య అన్నారు. ‘అందరి సహకారంతో సినిమా బాగా వచ్చింది. మా చిత్రం ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం మాకుంది’అని దర్శకుడు దొంతు రమేష్ అన్నారు.‘దర్శకుడు ఈ కథ నాకు చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. వెంటనే చేయడానికి ఒప్పుకున్నాను, మా చిత్రాన్ని ఆదరించాలి అని కోరుకుంటున్నాను’అని హీరోయిన్ భాను అన్నారు. -
బీబీ జోడి జడ్జస్‌పై బిగ్‌బాస్ కౌశల్ షాకింగ్ కామెంట్స్, పోస్ట్ వైరల్
బిగ్‌బాస్ కంటెస్టంట్‌తో స్టార్ మా బీబీ జోడి అనే డాన్స్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌లో పాల్గొన్న పలువుడు కంటెస్టెంట్స్ జోడిగా పెర్పామెన్స్ ఇస్తున్నారు. ఇందులో సహా కంటెస్టెంట్స్ జోడిగా మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారు బిగ్‌బాస్ హౌజ్‌లో మాదిగా స్కోర్స్ విషయంలో స్ట్రాటజీ అప్లై చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓ జోడి తమ స్ట్రాటజీ వాడి ఎలిమేనేట్ అయ్యింది. ఇక దీనిని తప్పు బడుతూ షో జడ్జస్ అయిన తరుణ్ మాస్టర్, నటి రాధపై అసహనం వ్యక్తం చేశాడు బిగ్‌బాస్ విన్నర్, నటుడు కౌశల్ మండా. చదవండి: టాలీవుడ్లో మరో విషాదం.. ‘శంకరాభరణం’ మూవీ ఎడిటర్ మృతి ఇంతకి ఏం జరిగిందంటే.. ఈ బీబీ జోడి షోలో పలువురు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ జోడి కట్టి తమ డాన్స్ పర్ఫామెన్స్తో అదరగొడుతున్నారు. అందులో చెప్పుకొదగ్గ జోడిల్లో రవికృష్ణ, భాను జోడి ఒకటి. చెప్పాలంటే బిబి జోడి టైటిల్ కొట్టే సత్తా వారిలో ఉంది. అయితే గతవారం జరిగిన ఎపిసోడ్లో రవి, భాను స్ట్రాటజీ వాడి షో నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. తమ కో-కంటెస్టెంట్స్ అయిన వాసంతి-అర్జున్ కల్యాణ్ జోడి తమ డాన్స్‌తో జడ్జస్‌ను మెప్పించారు. వారి చేత వావ్ అంటూ ప్రశంసలు అందుకున్నారు. ఇక సహ కంటెస్టెంట్స్ కూడా వారి డాన్స్‌ని మెచ్చకుంటూ స్కోర్స్ ఇచ్చారు. అయితే రవి-భాను మాత్రం ఒక్క మార్కే ఇచ్చి షాకిచ్చారు. ఇది నిజమా? ప్రాంక్‌గా అని జడ్జస్ అడుగగా.. ఇది తమ స్ట్రాటజీ అని సమాధానం ఇచ్చారు. నిజానికి వారి ప్రెర్ఫామెన్స్‌కి 10 మార్కులు ఇవ్వాలి, కానీ తాము సేవ్ అవ్వాలంటే వారికి ఒక్క మార్కు ఇచ్చామన్నారు. దీంతో జడ్జస్ కూడా తమ స్ట్రాటజీని వాడి వారికి అతి తక్కువ మార్కులు ఇచ్చారు. ఫలితంగా భాను-రవి ఎలిమేనేషన్ ఫేస్ చేసి షో నుంచి వెళ్లిపోయారు. ఇక దీనిపై కౌశల్ మండా స్పందిస్తూ జడ్జస్‌పై తీరు తప్పుబడ్డాడు. ఈ మేరకు ఫేస్బుక్లో వివాదస్పద పోస్ట్ షేర్ చేశౠడు. ‘నా ఉద్దేశం ప్రకారం బీబీ జోడి విజేతలు రవి,భాను శ్రీ. ఎందుకంటే.. వాళ్లు డ్యాన్స్ చేసిన విధానం, ప్రతి రౌండ్లో పింక్ సీటు గెలుచుకున్న తీరు అద్భుతం. చదవండి: ఆ మూవీ నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నాడా? కారణం ఇదేనా! బిగ్‌బాస్ పోటీదారులుగా వారి వ్యూహాల ప్రకారం ఆడటానికి వారికి అన్ని హక్కు ఉంది. కానీ న్యాయనిర్ణేతలకు లేదు. జడ్జస్ కేవలం కంటస్టెంట్స్ డాన్స్ మాత్రమే జడ్జ్ చేయాలి, వారి వ్యూహలను కాదు. బిగ్‌బాస్‌లో ఏ జోడి గెలిచిన అది రవి-భాను తర్వాతే అనేది నా అభిప్రాయం. నాకు అనిపించింది చెప్పాను. నిజాన్ని మనసులోనే దాచుకోలేను. క్షమించండి జడ్జస్’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు కౌశల్‌కు మద్దతు తెలుపుతుంటే మరికొందర అతడిని తప్పుబడుతున్నారు. రవి భాను కేవలం ఒక్క మార్క్ ఇవ్వడం కరెక్ట్ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇదే షోలో కౌశల్ కూడా కంటెస్టెంట్‌గా ఉండటం గమనార్హం. అభినయ శ్రీతో జోడి కట్టి తన డాన్స్‌తో మెప్పిస్తున్నాడు కౌశల్. -
బిగ్‌బాస్ బ్యూటీ నందిని బర్త్‌డే సెలబ్రేషన్స్, టాలీవుడ్ తారల సందడి
బిగ్‌బాస్ ఫేం, హీరోయిన్ నందిని రాయ్ బర్త్‌డే సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. నిన్న(సెప్టెంబర్ 18) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ సెలబ్రెటీలు, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్ మధ్య ఆమె బర్త్‌డే వేడుక జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ బర్త్‌డే సెలబ్రెషన్స్‌లో నటుడు సాయి కుమార్, వరుణ్ సందేశ్, రాజ్ తరుణ్, తనిష్, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ సోహెల్, రాహుల్ సిప్లిగంజ్, లహరి శారి, యాంకర్, నటి భాను శ్రీ, వైవా హర్ష, పూజిత, చాందినీ చౌదరి, దర్శకులు సతీష్, కృష్ణ, రఘులు హాజరయ్యారు. ఇక వారందరి సమక్షంలో కేక్ కట్ చేసి తన కోసం వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేసింది ఆమె. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి కాగా నందిని రాయ్.. అతి చిన్న వయసులోనే మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. ఈ క్రమంలో పలు అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె తక్కువ సమయంలోనే మోడల్‌గా మంచి గుర్తింపు పొందింది. 2011లో వచ్చిన 040 అనే చిత్రంలో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాతా మాయ, ఖుషి ఖుషిగా, మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్, శివరంజని వంటి హిట్ చిత్రాల్లో నటించింది.ఈ క్రమంలో బిగ్‌బాస్ 2 సీజన్లో పాల్గొని ఆడియన్స్‌కు మరింత దగ్గరైంది. బిగ్‌బాస్ అనంతరం వరుస ఆఫర్లు కొట్టేసి బిజీగా మారింది నందిని. ఇటీవల ఆమె సాయికుమార్, సీనియర్ నటి రాధిక శరత్ కుమార్‌లు ప్రధాన పాత్రలో వచ్చిన గాలివాన వెబ్ సిరీస్‌లో నటించి తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. -
ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ!
బిగ్‌బాస్ ఫేం, సినీ, టీవీ నటి భానుశ్రీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. పలు షోలకు యాంకర్‌గా చేసిన భాను టీవీ సీరియల్స్ కూడా నటించింది. అలాగే సినిమాల్లో సహానటి పాత్రలు చేస్తూ నటిగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టిన భాను ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. బిగ్‌బాస్ తెచ్చిపెట్టిన ఫేంతో ఆమె పలు సినిమాల్లో హీరోయిన్గా కూడా చాన్స్ కొట్టేసింది. ఇటీవల మౌనం, నల్లమల వంటి చిత్రాల్లో హీరోయిన్గా చేసి ఫ్యాన్స్‌ను అలరించింది. ప్రస్తుతం నటిగా, హీరోయిన్గా కెరీర్లో బిజీ అయిపోయిన భాను అటూ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. చదవండి: అందుకే సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది: కత్రినా కైఫ్ తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకునే భాను పెళ్లి వార్త ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. త్వరలోనే ప్రియుడితో ఏడడుగులు వేయబోతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో తాను ఓ వ్యక్తి వల్లే ఇలా ఉన్నానని, హైదరాబాద్‌లో తనకంటూ ఒకరు ఉన్నారనే ధైర్యం ఇచ్చాడని చెప్పింది. ఇక తాను అతడినే పెళ్లి చేసుకుంటానని ఓ ఇంటర్య్వూలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అతడితోనే ఆమె పెళ్లి పీటలు ఎక్కబోందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే భానుశ్రీ స్పందించే వరకు వేచి చూడాల్సిందే. చదవండి: ‘తమ్ముడు’కి చిరంజీవి స్పెషల్ బర్త్‌డే విషెస్ -
‘నల్లమల’మూవీ రివ్యూ
టైటిల్ : నల్లమల నటీనటులు : అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, ముక్కు అవినాష్ తదితరులు నిర్మాణ సంస్థ : నమో క్రియేషన్స్ నిర్మాత: ఆర్.ఎమ్ దర్శకత్వం :రవి చరణ్ సంగీతం : పీ.ఆర్ సినిమాటోగ్రఫీ : వేణు మురళి ఎడిటర్: శివ సర్వాణి విడుదల తేది : మార్చి 18,2022 పలు సినిమాల్లో విలన్ నటించి,మెప్పించిన అమిత్ తివారి ‘నల్లమల’తో హీరోగా మారాడు. బిగ్‌బాస్ 2 ఫేమ్ భానుశ్రీ ఇందులో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం నుంచి విడుదలైన ‘ఎమున్నావే.. పిల్లా’సాంగ్ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఆ ఒక్క పాట.. ‘నల్లమల’కు హైప్ క్రియేట్ చేసింది. ఓ మోస్తారు అంచనాల మధ్య ఈ శుక్రవారం(మార్చి 18) ప్రేక్షకుల మధ్యకు వచ్చిన ‘నల్లమల’చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘నల్లమల’కథేంటంటే.. గిరిజన యువకుడు నల్లమల(అమిత్ తివారి)కి ప్రకృతి, సాధుజంతువులపై అమితమైన ప్రేమ. నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉండే ఓ గూడెంలో నివసిస్తూ అక్కడి ప్రజలకు సహాయం చేస్తుంటాడు. మొరటోడులా కనిపించే నల్లమలకు ఆవులంటే చాలా ఇష్టం. అలాగే తన గూడెంలో నివసించే వనమాలి(భానుశ్రీ)అంటే కూడా ఆయనకు ప్రాణం. ప్రకృతి, సాధుజంతువులే లోకంగా భావించే నల్లమలకు అడవిలో జరిగే అక్రమ వ్యాపారం గురించి తెలుస్తోంది. దీంతో ఆయన అక్రమ వ్యాపారం చేస్తున్నవారికి ఎదురు తిరుగుతాడు.మరి నల్లమల అటవీ ప్రాంతంలో జరిగే అక్రమ వ్యాపారం ఏమిటి? అది ఎందుకు చేస్తున్నారు? గిరిజనుడైన నల్లమల దాన్ని ఎందుకు ఎదిరించాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..? ఆవు అమ్మ లాంటిది దాన్ని కాపాడు కోకపోతే మనుగడలేదు అనే కాన్సెప్ట్ తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు రవి చరణ్. శాస్త్రవేత్త (నాజర్)ను గిరిజనలు వెంటాడటంతో ఎమోషనల్ నోట్‌తో నల్లమల సినిమా కథ మొదలవుతుంది. ఆ తర్వాత స్కూల్ పిల్లలకు ఎలాంటి అంశాలతో పాఠ్యాంశాన్ని పుస్తకంలో చేర్చాలనే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో కథ ఆసక్తిని కలిగిస్తుంది. ఇక మాజీ నక్సలైట్ (చత్రపతి శేఖర్) చెప్పే ఫ్లాష్ బ్యాక్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఆవు చుట్టూ తిరిగే భావోద్వేగమైన పాయింట్‌ను దర్శకుడు తీర్చిదిద్దిన విధానం బాగుంది. సాధారణంగా ప్రతి దర్శకుడు తన డెబ్యూ మూవీకి సేఫ్‌గా ప్రేమ కథను ఎంచుకుంటారు.కానీ రవి చరణ్ మాత్రం తొలి ప్రయత్నంలోనే ఓ మంచి సందేశాత్మక కథను ఎంచుకున్నారు. ఈ విషయంలో ఆయనను అభినందించాల్సిందే. డెబ్యూ డెరెక్టర్‌గా కాకుండా ఒక అనుభవజ్ఞుడైన దర్శకుడిలా సినిమాను తెరకెక్కించాడు. కానీ ఫస్టాప్‌లో కథ కాస్త నెమ్మదిగా సాగడం.. సెకండాఫ్ వరకు అసలు కథపై క్లారిటీ రాకపోవడం సినిమాకు కాస్త మైనస్. ప్రీ క్లైమాక్స్ లో అసలు విషయం రివీల్ అవుతుంది. దాన్ని మరింత బాగా డిజైన్ చేసుకుంటే బాగుండేది. ఎవరెలా చేశారంటే.. విలన్‌గా పలు సినిమాల్లో నటించి, టాలీవుడ్లో తనకంటే ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాధించుకున్నాడు అమిత్ తివారి. హీరోగా మారి తొలి ప్రయత్నంగా ‘నల్లమల’లాంటి కథను ఎంచుకోవడం అమిత్‌కు ప్లస్ అయింది. ఈ చిత్రంలోని ఆయన పాత్రకు అన్ని రకాల ఎమోషన్స్ పండించే అవకాశం దొరికింది. దీంతో నల్లమల పాత్రలో అమిత్ ఒదిగిపోయాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో అమిత్ అదరగొట్టాడు. భాను శ్రీ గ్లామర్ పరంగా, డ్యాన్సుల పరంగా ఆకట్టుకొంది. కొన్ని సీన్లలో భాను శ్రీ నటన, స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. శాస్త్రవేత్తగా నాజర్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, తనికెళ్ల భరణి తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకెతిక విషయానికొస్తే.. పీ.ఆర్ సంగీతం అదిరిపోయింది. ‘ఎమున్నావే.. పిల్లా’సాంగ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. అలాగే తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫి బాగుంది. అటవీ అందాలను సినిమాటోగ్రాఫర్ వేణు మురళీ తన కెమెరాలో చక్కగా బంధించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
మల్లెపువ్వు మురళితో బిగ్‌బాస్ భానుశ్రీ ‘మౌనం’
‘మల్లెపువ్వు’ ఫేమ్ మురళి, ‘బిగ్ బాస్‘ ఫేమ్ భానుశ్రీ జంటగా లాస్ ఏంజెల్స్ టాకీస్ పతాకంపై కిషన్ సాగర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మౌనం’. ఈ చిత్రానికి ‘వాయిస్ ఆఫ్ సైలెన్స్’ అనేది ట్యాగ్ లైన్. అల్లూరి సూర్యప్రసాద్–సంధ్యా రవి నిర్మించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ ఆవిష్కరించి, ‘‘మణిరత్నం ‘మౌనరాగం’ తరహాలో నా మిత్రుడు మురళి నటించిన ‘మౌనం’ మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘మౌనం కూడా కొన్ని సందర్భాల్లో ఎంత శక్తివంతంగా ఉంటుందో చాలా సెన్సిబిల్‌గా చూపించే పారా సైకలాజికల్ థ్రిల్లర్ మా ‘మౌనం‘. అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎమ్.ఎమ్. శ్రీలేఖ. -
ఆకట్టుకుంటున్న ‘మౌనం’ థియేట్రికల్ ట్రైలర్!
‘మల్లెపువ్వు’ఫేమ్ మురళి, ‘బిగ్ బాస్’ ఫేమ్ భానుశ్రీ జంటగా నటించిన తాజా చిత్రం ‘మౌనం’.‘వాయిస్ ఆఫ్ సైలెన్స్’ ట్యాగ్ లైన్. లాస్ ఏంజెల్స్ టాకీస్ పతాకంపై కిషన్ సాగర్ దర్శకత్వంలో అల్లూరి సూర్యప్రసాద్-సంధ్య రవి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిషన్ సాగర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎమ్.ఎమ్.శ్రీలేఖ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ ప్రథమార్థంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు రమేశ్ వర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేశ్ వర్మ మాట్లాడుతూ.. ‘మణిరత్నం’ మౌనరాగం తరహాలో... తన మిత్రుడు మురళి నటించిన ‘మౌనం’ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. నిర్మాతలు అల్లూరి సూర్యప్రసాద్-సంధ్య రవి మాట్లాడుతూ... ‘మౌనం కూడా కొన్ని సందర్భాల్లో ఎంత శక్తివంతంగా ఉంటుందో చాలా సెన్సిబిల్ గా చూపించే పారా సైకలాజికల్ థ్రిల్లర్ ‘మౌనం’. అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’అన్నారు. ఐశ్వర్య అడ్డాల, 'శివ' ఫేమ్ చిన్నా, జీవా, ధనరాజ్, శేషు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ: అనిల్, స్క్రీన్ ప్లే-ఎడిటింగ్: శివ శర్వాణి. -
హల్చల్ : అలా ఉండాలంటున్న జాన్వీ..జూమ్‌లో నేనింతే అంటున్న శ్రియా
♦ అది చెప్పడానికి సిగ్గేస్తుందంటున్న భాను ♦ యోగాసనాలు వేస్తోన్న కీర్తి సురేష్ ♦ భర్తను బీచ్‌కు పోదామంటున్న శ్రియా ♦ షెహ్నాజ్ మేకప్ మెరుపులు ♦ కారులోంచి కొటేషన్ చెబుతున్న సర్గున్ ♦ నా జామ్ కాల్స్‌లో నెనెలా ఉంటానో తెలుసా అంటున్న శ్రియా ♦ కొంటెగా చూస్తున్న సారా అలీఖాన్ ♦ బ్లాంక్ అండ్ సారీలో ఫోజులిస్తున్న శ్రీముఖి ♦ భర్త కౌగిలిలో పూజా రామచంద్రన్ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by M.bala bhargavi (@bhanuu_1006) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shehnaaz Gill (@shehnaazgill) View this post on Instagram A post shared by Bhumi 🌻 (@bhumipednekar) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Anchor Neha (@chowdaryneha) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Sargun Mehta (@sargunmehta) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Pooja Ramachandran (@pooja_ramachandran) View this post on Instagram A post shared by Bhanu shree (@iam_bhanusri) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
సోషల్ హల్ చల్: తెల్ల చీరలో భాను.. రెడ్ సారీలో శ్యామల
♦ షూటింగ్ వీడియోని షేర్ చేసిన పాయల్ రాజ్‌పుత్ ♦ తెల్ల చీరలో అందాలు ఆరబోస్తున్న బిగ్‌బాస్ ఫేం భానుశ్రీ ♦ లక్ష్మీరాయ్ సొగసు చూడ తరమా ♦ రెడ్ సారీలో అదరగొట్టిన బిగ్‌బాస్ ఫేమ్ యాంకర్ శ్యామల ♦ నేనేంటో.. ఏం చేయాలో నాకే బాగా తెలుసు అంటున్న బిగ్‌బాస్ బ్యూటీ మోనాల్ ♦ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో పిచ్చెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ View this post on Instagram A post shared by Bhanu shree (@iam_bhanusri) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by syamala Anchor (@syamalaofficial) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by bipashabasusinghgrover (@bipashabasu) View this post on Instagram A post shared by Bhanu shree (@iam_bhanusri) -
భాను శ్రీ చేతుల మీదుగా బజాజ్ ఎలక్ట్రానిక్స్ లక్కీ డ్రా
-
బుల్లితెర యాంకర్ భానుశ్రీ అదిరే స్టిల్స్
-
విదేశాలకు సముద్రుడు
రమాకాంత్ హీరోగా, భానుశ్రీ, అవంతిక హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘సముద్రుడు’. కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై నగేష్ నారదాసి దర్శకత్వంలో బాదావత్ కిషన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ ముగిసింది. దాదాపు 25 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్లో చీరల ఓడరేపు నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరించారు. దీంతో మూడు పాటలు మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. మిగిలిన పాటలను విదేశీ లొకేషన్స్‌లో చిత్రీకరించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. ‘‘మా సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు చీరాల యం.ఎల్.ఏ ఆమంచి కృష -
రొమాంటిక్ టాకీస్
విజయ్ పెద్దిరెడ్డి హీరోగా ‘బిగ్‌బాస్’ ఫేమ్ భానుశ్రీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘టూరింగ్ టాకీస్’. రంగనాధ్ ముత్యాల దర్శకత్వంలో ప్రేమ్ నాధ్ ముత్యాల నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘‘ఇదొక వెరైటీ రొమాంటిక్ ఎంటర్టైనర్. మా సినిమాను వేసవిలో విడుదల చేసేలా ప్లా¯Œ చేస్తున్నాం’’ అన్నారు దర్శకుడు రంగనాధ్. ఈ సినిమాకు ఉమ మహేష్బెరి స్వరకర్త. -
కోరుకున్నది ఇస్తాడు..
నా దృష్టిలో వినాయకుడిని కోర్కెలు అడిగి ఇబ్బంది పెట్టకూడదు. నాకు ఏం ఇవ్వాలనేది ఆయనకు తెలుసు. అందుకే పండుగ రోజు మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసి పూజలు చేశాను.. కానీ కోర్కెలు కోరలేదు. మనం ఆయన్ని ప్రత్యేకించి ఇది కావాలి, అది కావాలి అని అడిగి ఆయన ఇచ్చే బోలెడుఅదృష్టాలను కోల్పోయినవారం కూడా అవ్వొచ్చు. నిమజ్జనం రోజు నాకు రికార్డింగ్ ఉంది, కానీ నేను ఎప్పటికప్పుడు నిమజ్జనం లైవ్ అప్డేట్స్ని మాత్రం ఫాలో అవుతా. – రమ్య బెహరా, సింగర్ నిమజ్జనం అంటే...తీన్మార్ డ్యాన్స్‌లే చిన్నప్పటి నుంచి వినాయకచవితి అంటే అమితమైన ఇష్టం. నవరాత్రులు గణనాథుడిని భక్తిశ్రద్ధలతో పూజించేవాళ్లం. నిమజ్జనోత్సవంలో తీన్మార్ డ్యాన్స్‌లు వేసేదాన్ని. ప్రతీపనికి మొదటి దేవుడు వినాయకుడు. అలాంటి వినాయకుడిని చిన్నప్పటి నుండి పూజిస్తూ ఆరాధిస్తున్నాం . – భానుశ్రీ, హీరోయిన్ ఆయన కృపతో అంతా మంచే... మా ఇంట్లో వినాయకచవితిని బాగా చేస్తాం. ఉదయం, సాయంత్రం కుటుంబసభ్యులతో పూజలు చేసి ప్రసాదాన్ని పంచేదాన్ని. వినాయకుడిని పూజిస్తే సుఖసంతోషాలతో పాటు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఎక్కడున్నా గణనాథుడిని మనసులో తలచుకుంటూ పూజిస్తూ నా జీవనాన్ని సాగిస్తాను. – పూజిత పొన్నాడ, హీరోయిన్ నిమజ్జనం మిస్సవుతున్నా.. సిటీకి చాలా దూరంలో ఉన్నాను. ఫెస్టివల్‌కు ముందే వెళ్లడంతో అక్కడే ఉండాల్సి వచ్చింది. ప్రతి ఏటా సిటీలో ఉన్నప్పుడు కొద్దిసేపైనా నిమజ్జనంలో పాల్గొని ఎంజాయ్ చేసేవాడ్ని. కానీ ఈసారి సిటీలో లేకపోవడం వల్ల నిమజ్జనాన్ని మాత్రం చాలా మిస్సవుతున్నాను. నిమజ్జనం వేడుకల్లో అందరూ పాల్గొని, విజయంతం చేయాలని కోరుతున్నా. – బెల్లంకొండ శ్రీనివాస్, సినీహీరో -
సరికొత్త కథతో...
‘బిగ్ బాస్’ ఫేమ్, నటి భానుశ్రీ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘ఈ అమ్మాయి’. గాయకుడు నోయల్ హీరోగా నటిస్తున్నారు. దొంతు రమేష్ దర్శకత్వంలో అవధూత వెంకయ్యస్వామి ప్రొడక్షన్స్‌పై దొంతు బుచ్చయ్య నిర్మిస్తున్న ఈ సినిమా నాలుగో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బుచ్చయ్య మాట్లాడుతూ– ‘‘లేడీ ఓరియంటెడ్ చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సరికొత్త కథాంశంతో రమేష్ తెరకెక్కిస్తున్నాడు. నోయల్, విలన్ పాత్రధారి ‘దిల్’ రమేశ్‌లపై హకీంపేట పోలీస్ స్టేషన్లో రసవత్తరమైన సన్నివేశాలను చిత్రీకరించాం. ఈ నెలాఖరుకు టాకీ పార్ట్ పూర్తవుతుంది. ఆగస్టులో విదేశాల్లో పాటలు చిత్రీకరించనున్నాం. సెప్టెంబర్‌లో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. చమ్మక్ చంద్ర, సత్తి పండు, ధన్‌రాజ్, భద్రం, చలాకీ చంటి, హరితేజ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.రవి శంకర్. -
గ్రామీణ నేపథ్యంలో...
సుమన్‌బాబు, కారుణ్య చౌదరి, కమల్ కామరాజు, భానుశ్రీ, అజయ్, ఉత్తేజ్, మహేష్, సురేష్ కొండేటి, ‘మహానటి’ ఫేం బేబీ సాయి తుషిత ముఖ్య తారలుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎర్ర చీర’. సీహెచ్ సుమన్‌బాబు నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. బేబి డమరి సమర్పణలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. కాగా ఈ చిత్రంలో ‘ఒకరికి ఒకరు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ ఫేమ్ శ్రీరామ్ ప్రత్యేకపాత్ర పోషిస్తున్నారు. సుమన్‌బాబు మాట్లాడుతూ– ‘‘మదర్ సెంటిమెంట్, హారర్ ఈ సినిమాలో ప్రధాన హైలైట్. మొదటి షెడ్యూల్లో పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్‌ను తీశాం. ఈ నెల 15న ప్రారంభమయ్యే రెండో షెడ్యూల్లో వినోదం, పోరాట సన్నివేశాలు తీస్తాం. శ్రీరామ్పాత్ర ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఆయనపై తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా ఉంటాయి’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: చందు, సంగీతం: ప్రమోద్ పులిగిళ్ళ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తోట సతీష్.