అమ్మాయిల సమస్యలపై.. | Bigg Boss 2 Bhanu Sri New Movie Launch | Sakshi
Sakshi News home page

అమ్మాయిల సమస్యలపై..

Published Sun, Nov 11 2018 2:45 AM | Last Updated on Sun, Nov 11 2018 2:45 AM

Bigg Boss 2 Bhanu Sri New Movie Launch - Sakshi

భానుశ్రీ

‘బిగ్‌ బాస్‌’ ఫేమ్‌ భానుశ్రీ ప్రధాన పాత్రలో ‘ఈ అమ్మాయి’ చిత్రం ఆరంభమైంది. శ్రీ అవధూత వెంకయ్యస్వామి ప్రొడక్షన్స్‌ పతాకంపై దొంతు రమేశ్‌ దర్శకత్వంలో దొంతు బుచ్చయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి పారిశ్రామికవేత్త చెరుకూరి సుధాకర్‌ రాజు కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నవ్యాంధ్ర ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు యస్‌.వి.ఎన్‌. రావు క్లాప్‌నిచ్చారు.

‘‘రెగ్యులర్‌ షూటింగ్‌ను ఈ నెలాఖరులో ప్రారంభిస్తాం. సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమాని పూర్తి చేయాలనుకుంటున్నాం. జనవరి 23న ఆడియోను, ఫిబ్రవరి 14న చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేశాం’’ అని దొంతు రమేశ్‌ అన్నారు. ‘‘వివిధ దశల్లో అమ్మాయిలు ఎదుర్కొనే రకరకాల సమస్యల్ని కథాంశంగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని దొంతు బుచ్చయ్య చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: అంజి సలాది, పాటలు: పెంచల్‌ దాస్‌ , కెమెరా: గువ్వాడ చంద్రమోహన్, సహనిర్మాత: గోగుల అనిల్‌ కుమార్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement