బిగ్‌బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అజయ్ కతుర్వర్. అంతకు ముందు పలు సినిమాల్లో నటించిన అంతగా గుర్తింపు రాలేదు కానీ..బిగ్‌బాస్ ఓటీటీ సీజన్‌లో పాల్గొని తనదైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. తాజాగా ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘అజయ్‌గాడు’. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది జనవరిలోనే నేరుగా ఓటీటీలోకి రిలీజై.. మంచి విజయం సాధించింది. తాజాగా థియేటర్స్‌లో రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
ఈ సినిమ కథ విషయానికొస్తే.. అజయ్(అజయ్ కుమార్ కతుర్వార్) ఎలాగైనా ఓ సినిమా తీసి హిట్ కొట్టాలనుకుంటాడు. ఈ ప్రయత్నంలో అతనికి ధనవంతుడి కుమార్తెతో పరిచయం అవుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. అయితే అమ్మాయి తండ్రికి ఇది నచ్చదు. దీంతో అజయ్‌కి ఓ సమస్యలో ఇరికిస్తాడు. డాక్టర్ శ్వేత..అజయ్‌ను ఈ సమస్య నుంచి బయటపడేస్తుంది. అసలు శ్వేత ఎవరు? అజయ్, శ్వేతల మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? ధనవంతుడి కుమార్తెతో ప్రేమలో పడిన తర్వాత అజయ్ జీవితంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి. సినిమా తీయాలనుకున్న అజయ్ కోరిక నెరవేరిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఓ సామాన్యుడు తనకు ఎదురైన అసాధారణ పరిస్థితులను ఎలా అధిగమించారు? అందుకు దోహదపడిన అంశాలు ఏంటి అనేది ఈ సినిమా కథాంశం. సినిమా ప్రారంభం అవ్వగానే అజయ్ జీవితంలో జరిగిన అనేక ఉద్విగ్నభరితమైన జీవిత ఘట్టాలు మనకు పరిచయమవుతాయి. ఎలాంటి హడావుడి లేకుండా హీరో పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది.
అనుకోకుండా హీరో జీవితంలోకి వచ్చిన యువతి వల్ల హీరో ఎలాంటి అనుభూతిని పొందారు? అతని జీవితంలో వచ్చిన మార్పులేంటి అనేది యూత్ కి కనెక్ట్ అయ్యేలా మలిచారు. ఓ చిత్రాన్ని తీయాలనే కోరికతో ఉన్న ఓ సామాన్యుడు అడుగడుగా ఎదుర్కొన్న ఇబ్బందులను ఎలాంటి హడావుడి లేకుండా సిల్వర్ స్క్రీన్ పై చూపించిన విధానం ప్రేక్షకులను మెప్పిస్తుంది. అలాగే ఇలాంటి పాత్ర నుంచి ఓ బాధ్యతతో తన కల అయిన సినిమాని తీయాలనుకునే హీరో పాత్రను యూత్ కు మెచ్చే విధంగా మలిచిన తీరు ఆకట్టుకుంటుంది.
అజయ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కాబట్టి... ఈసినిమా కథ, కథనాలన్నీ అజయ్ టేస్ట్ కు తగ్గట్టుగానే యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. మూడు బాధ్యతలు పోషించడం అంటే మాటలు కాదు. అలాంటిది నిర్మాతగా కూడా సినిమాని ఎంతో క్వాలిటీగా నిర్మించారు. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదనే చెప్పొచ్చు. వైద్యురాలి పాత్రలో శ్వేత మెహతా ఆకట్టుకుంది. అజయ్ లవర్‌గా భానుశ్రీ తెరపై అందాలను ప్రదర్శించడమే కాకుండా తనదైన నటనతో ఆకట్టుకుంది. అజయ్ స్నేహితుని పాత్రలో నటించిన అభయ్ బేతిగంటి మెప్పించారు. సాకేంతికంగా సినిమా పర్వాలేదు.
Comments
Please login to add a commentAdd a comment