Ajay Kathurvar
-
థియేటర్స్‌లోకి వచ్చిన ‘అజయ్‌గాడు’.. ఎలా ఉందంటే?
బిగ్‌బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అజయ్ కతుర్వర్. అంతకు ముందు పలు సినిమాల్లో నటించిన అంతగా గుర్తింపు రాలేదు కానీ..బిగ్‌బాస్ ఓటీటీ సీజన్లో పాల్గొని తనదైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. తాజాగా ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘అజయ్‌గాడు’. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది జనవరిలోనే నేరుగా ఓటీటీలోకి రిలీజై.. మంచి విజయం సాధించింది. తాజాగా థియేటర్స్‌లో రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.ఈ సినిమ కథ విషయానికొస్తే.. అజయ్(అజయ్ కుమార్ కతుర్వార్) ఎలాగైనా ఓ సినిమా తీసి హిట్ కొట్టాలనుకుంటాడు. ఈ ప్రయత్నంలో అతనికి ధనవంతుడి కుమార్తెతో పరిచయం అవుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. అయితే అమ్మాయి తండ్రికి ఇది నచ్చదు. దీంతో అజయ్‌కి ఓ సమస్యలో ఇరికిస్తాడు. డాక్టర్ శ్వేత..అజయ్‌ను ఈ సమస్య నుంచి బయటపడేస్తుంది. అసలు శ్వేత ఎవరు? అజయ్, శ్వేతల మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? ధనవంతుడి కుమార్తెతో ప్రేమలో పడిన తర్వాత అజయ్ జీవితంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి. సినిమా తీయాలనుకున్న అజయ్ కోరిక నెరవేరిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఓ సామాన్యుడు తనకు ఎదురైన అసాధారణ పరిస్థితులను ఎలా అధిగమించారు? అందుకు దోహదపడిన అంశాలు ఏంటి అనేది ఈ సినిమా కథాంశం. సినిమా ప్రారంభం అవ్వగానే అజయ్ జీవితంలో జరిగిన అనేక ఉద్విగ్నభరితమైన జీవిత ఘట్టాలు మనకు పరిచయమవుతాయి. ఎలాంటి హడావుడి లేకుండా హీరో పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. అనుకోకుండా హీరో జీవితంలోకి వచ్చిన యువతి వల్ల హీరో ఎలాంటి అనుభూతిని పొందారు? అతని జీవితంలో వచ్చిన మార్పులేంటి అనేది యూత్ కి కనెక్ట్ అయ్యేలా మలిచారు. ఓ చిత్రాన్ని తీయాలనే కోరికతో ఉన్న ఓ సామాన్యుడు అడుగడుగా ఎదుర్కొన్న ఇబ్బందులను ఎలాంటి హడావుడి లేకుండా సిల్వర్ స్క్రీన్ పై చూపించిన విధానం ప్రేక్షకులను మెప్పిస్తుంది. అలాగే ఇలాంటి పాత్ర నుంచి ఓ బాధ్యతతో తన కల అయిన సినిమాని తీయాలనుకునే హీరో పాత్రను యూత్ కు మెచ్చే విధంగా మలిచిన తీరు ఆకట్టుకుంటుంది.అజయ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కాబట్టి... ఈసినిమా కథ, కథనాలన్నీ అజయ్ టేస్ట్ కు తగ్గట్టుగానే యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. మూడు బాధ్యతలు పోషించడం అంటే మాటలు కాదు. అలాంటిది నిర్మాతగా కూడా సినిమాని ఎంతో క్వాలిటీగా నిర్మించారు. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదనే చెప్పొచ్చు. వైద్యురాలి పాత్రలో శ్వేత మెహతా ఆకట్టుకుంది. అజయ్ లవర్‌గా భానుశ్రీ తెరపై అందాలను ప్రదర్శించడమే కాకుండా తనదైన నటనతో ఆకట్టుకుంది. అజయ్ స్నేహితుని పాత్రలో నటించిన అభయ్ బేతిగంటి మెప్పించారు. సాకేంతికంగా సినిమా పర్వాలేదు. -
Ajay Gadu OTT Release: ఓటీటీలో ఆకట్టుకుంటున్న తెలుగు సినిమా.. ఫ్రీగా చూసేయొచ్చు!
ఇప్పుడు సినిమా అనగానే అందరికీ గుర్తొచ్చేవి సంక్రాంతికి రిలీజైనవే. ఆ నాలుగింటికి ప్రేక్షకుల నుంచి ఆదరణ వస్తోంది. వీటి సంగతి పక్కనబెడితే ఓటీటీలో ఓ తెలుగు సినిమాకు కూడా మంచి వ్యూస్ వస్తున్నాయి. కరెక్ట్‌గా చెప్పాలంటే గత కొన్నిరోజుల నుంచి ట్రెండింగ్‌లో ఉంది. ఇంతకీ ఆ మూవీ ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: కన్నడలో సూపర్ హిట్.. ఓటీటీలో తెలుగు వెర్షన్.. రిలీజ్ అప్పుడేనా?) బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ సీజన్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న అజయ్ కతుర్వర్.. పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేస్తూనే హీరోగానూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అలా హీరోగా నటిస్తూ స్వీయ దర్శక నిర్మాణంలో తీసిన చిత్రం 'అజయ్ గాడు'. తొలుత దీన్ని థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు. కానీ ఎందుకనో కుదర్లేదు. అలా సంక్రాంతి కానుకగా ఈ జనవరి 12న నేరుగా జీ5లో రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన దగ్గర నుంచి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ట్రెండ్ అవుతోందని చెప్పొచ్చు. అలానే దీన్ని ఫ్రీగానే చూసేయొచ్చు. ఇక కథ విషయానికొస్తే.. మధ్యతరగతి కుర్రాడు అజయ్. రోజురోజుకీ మారిపోతున్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, డబ్బు, పేరు, ప్రేమ లాంటి వాటి గురించి తెలుసుకోవడానికి ఇబ్బంది పడుతుంటాడు. అలా ఓ సమయంలో శ్వేతని చూసి ప్రేమలో పడతాడు. ఆమె డ్రగ్స్‌కి బానిస అయిన మెడికో. అలాంటి ఆమెను సక్రమ మార్గంలో ఉంచటానికి చేసే ప్రయత్నాలు చేస్తూ.. బాహ్య ప్రపంచంతో అజయ్ ఎలాంటి యుద్ధం సాగించాడనేదే కథ. (ఇదీ చదవండి: Prasanth Varma: 'హనుమాన్' మూవీతో హిట్ కొట్టాడు.. ఇంతలోనే దర్శకుడికి షాక్!) -
నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్న ఆ తెలుగు సినిమా.. డేట్ ఫిక్స్
సంక్రాంతికి దాదాపు నాలుగు పెద్ద సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో ఏ సినిమాకు ఎప్పుడు వెళ్లాలా అని అందరూ ప్లాన్స్ వేసుకుంటున్నారు. మరోవైపు పండగ సీజన్‌ని క్యాష్ పలు చిన్న సినిమాలు కూడా రెడీ అవుతున్నాయి. కాకపోతే థియేటర్లు దొరికే ఛాన్స్ లేదు కాబట్టి ఓటీటీల వైపు చూస్తున్నాయి. అలా ఇప్పుడు ఓ తెలుగు సినిమా నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్కి రెడీ అయిపోయింది. ఇంతకీ ఏంటా మూవీ? (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా) పలు సినిమాల్లో సహాయ పాత్రలు పోషించిన అజయ్ కతుర్వర్.. బిగ్‌బాస్ ఓటీటీ షోతో కాస్తోకూస్తో పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ షోలో పాల్గొన్న తర్వాత హీరోగా అవకాశాలు దక్కించుకున్నాడు. అలా చేసిన సినిమానే 'అజయ్ గాడు'. దాదాపు ఏడాదిన్నర క్రితమే అంతా రెడీ అయినప్పటికీ.. కారణం ఏంటో తెలీదు గానీ రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇన్నాళ్లకు ఈ సినిమాకు మోక్షం కలిగింది. నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అజయ్, భానుశ్రీ, శ్వేత మెహతా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు టీమ్ ఏ దర్శకత్వం వహించాడు. చందన కొప్పిశెట్టితో కలిసి హీరో అజయ్ కతుర్వార్ స్వయంగా ఈ సినిమాని నిర్మించాడు. ఇప్పుడు సంక్రాంతి కానుకగా జనవరి 12 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో పండగపూట థియేటర్లకు వెళ్లే ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్లో కూర్చుని ఈ సినిమా ఫ్రీగా చూడొచ్చు. (ఇదీ చదవండి: విమాన ప్రమాదం.. కూతుళ్లతో సహా ప్రముఖ నటుడి దుర్మరణం) View this post on Instagram A post shared by ZEE5 Telugu (@zee5telugu) -
‘మిస్టేక్’ మూవీ రివ్యూ
టైటిల్: మిస్టేక్ నటీనటులు: అభినవ్ సర్దార్, అజయ్ కతుర్వర్, సుజిత్, తేజ ఐనంపూడి, కరిష్మా కుమార్, తానియా కల్రా, ప్రియా పాల్ తదితరులు నిర్మాణ సంస్థ: ఏఎస్పీ మీడియా హౌస్ నిర్మాత: అభినవ్ సర్దార్ స్టోరి, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భరత్ కొమ్మాలపాటి సంగీతం: మణి జెన్నా సినిమాటోగ్రాఫర్: హరి జాస్తి ఎడిటర్:విజయ్ ముక్తావరపు విడుదల తేది: ఆగస్ట్ 4, 2023 ‘మిస్టేక్’ కథేంటంటే.. హెయిర్ స్టైలీష్ ఆగస్త్య(అజయ్ కతుర్వర్) , పూజారి మహదేవ్ శర్మ అలియాస్ దేవ్(సుజిత్ కుమార్), కార్తీక్(తేజ ఐనంపూడి) ముగ్గురు స్నేహితులు. ఒకే గదిలో కలిసి ఉంటారు. ఈ ముగ్గురికి లవర్స్ ఉంటారు. హెయిర్ స్టైలీష్ ఆగస్త్య.. ఏసీపీ కూతురు మిత్ర(ప్రియా)ను ప్రేమిస్తాడు. పూజారి దేవ్, పార్వతి అలియాస్ పారు(నయన్ సారికా) అనే యువతితో ప్రేమలో ఉంటే, ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిణి స్వీటీ(తనియా కార్లా)ని కార్తీక్ లవ్ చేస్తాడు. ఈ ముగ్గురికి నగరంలో వేరు వేరు కారణాల వల్ల ప్రాణహానీ ఉందని భావిస్తారు. దీంతో ఒక వారం పాటు సిటీకి దూరంగా వెళ్లాలనుకుంటారు. తమ లవర్స్‌తో కలిసి ఫారెస్ట్ ట్రిప్ వేస్తారు. ఇందుకుగాను కార్తీక్ ఆన్లైన్లో షాపింగ్ చేసి అందరికి డ్రెస్సులు తీసుకుంటాడు. అంతా కలిసి జీపులో ఫారెస్ట్‌కి వెళ్తుంటే మార్గ మధ్యలో ఓ రౌడీ(అభినవ్ సర్దార్) వీరిపై అటాక్ చేస్తాడు. అతని నుంచి తప్పించుకున్న ఈ మూడు జంటలు అడవిలోకి వెళ్లిపోతారు. అడవిలో వీరికి ఎదురైన సమస్యలేంటి? అసలు ఆ రౌడీ వీరికి ఎందుకు అటాక్ చేశాడు? అతన్ని ఎవరు పంపించారు? ఈ మూడు జంటలు చేసిన మిస్టేక్ ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే మిస్టేక్ మూవీ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఓ చిన్న పొరపాటు వల్ల మూడు జంటలు పడిన బాధలేంటి? చివరకు వారు చేసిన మిస్టేక్ ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చింది అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు భరత్ కొమ్మాలపాటి ఓ చిన్న పాయింట్‌ని కథగా మలిచి, రెండు గంటల పాటు ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడిపించడం హైలైట్ పాయింట్. సినిమా కామెడీగా సాగుతూనే మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు ఉత్కంఠకు గురి చేస్తాయి. అయితే సస్పెన్స్ అంశాలు, ట్విస్టులలో కొత్తదనం ఉండదు. గతంలో చాలా సినిమాల్లో చూసిన ట్వీస్టులు ఇందులో చూపించారు. సస్పెన్స్ అంశాలను మరింత బలంగా రాసుకోవాల్సింది. సినిమా మొత్తం మూడు జంటలు, ఓ విలన్ పాత్రల చుట్టే తిరుగుతుంది. ఎక్కువ భాగం అడవిలోనే సాగుతుంది. ఫస్టాఫ్‌లో మూడు జంటల ప్రేమ కథ, వారికి వచ్చిన సమస్యలు, దాని నుంచి తప్పించుకునేందుకు వారు వేసిన ప్లాన్.. ఈ క్రమంలో వారు చేసే పనులు అన్ని సరదాగా సాగుతూ వినోదాన్ని పంచుతాయి. అదే సమయంలో కొన్ని సన్నివేశాలు ఉత్కంఠభరితంగాను సాగుతాయి. మూడు జంటలకు అడవిలో మరుగుజ్జు జాతి ప్రజలతో కలిసి చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. అక్కడక్కడ వచ్చే కొన్ని బోల్డ్ సన్నివేశాలు, డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో మాత్రం థ్రిల్లింగ్‌గా సాగినప్పటికీ కాస్త బోర్ కొడుతుంది. ఇంటర్వెల్ ముందే ట్విస్ట్‌ని రివీల్ చేయడం.. తర్వాత ఏం జరుగుతుందనేది ఈజీగా అర్థమైపోతుంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. కథను మరింత బలంగా రాసుకొని, సెకండాఫ్‌ని ఆసక్తికరంగా నడిపించి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. అభినవ్ సర్దార్ నెగిటివ్ రోల్ లో మెప్పించాడు. భయంకరమైన లుక్స్‌లో కనిపిస్తూ యాక్షన్స్ సీన్స్ అదరగొట్టేశాడు. ఇక మూడు ప్రేమ జంటలు అగస్త్య(అజయ్)- మిత్ర(ప్రియా),దేవ్(సుజిత్ కుమార్)-పార్వతి(నయన్ సారికా), కార్తిక్(తేజ ఐనంపూడి)-స్వీటి(తనియా కార్లా) తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పూజారి దేవ్ పాత్ర నవ్వులు పూయిస్తుంది. ఇక ముగ్గురు హీరోయిన్లు నటన పరంగానే కాదు గ్లామర్‌తోను మెప్పించారు. రాజా రవీంద్ర, సమీర్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. సంగీతం పర్వాలేదు. మంగ్లీ పాడిన పాట మినహా మిగతావేవి అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రాఫర్ హరి జాస్తి పనితీరు బాగుంది. ఎడిటర్ విజయ్ ముక్తావరపు తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
ప్రేమదేశం సినిమా రివ్యూ, ఎలా ఉందంటే?
టైటిల్: ప్రేమదేశం నటీనటులు: మధుబాల, త్రిగున్, మేఘా ఆకాష్, మాయ, అజయ్ కతుర్వార్, కమల్ నార్ల తేజ, శివ రామచంద్ర, తనికెళ్ల బరణి, వైష్ణవి చైతన్య మరియు ఇతరులు దర్శకుడు: శ్రీకాంత్ సిద్ధమ్ సంగీతం: మణిశర్మ ప్రొడక్షన్ హౌస్: సిరి క్రియేటివ్ వర్క్స్ నిర్మాత: శిరీష సిద్ధమ్ విడుదల తేదీ: ఫిబ్రవరి 3, 2023 సంక్రాంతికి మాస్ మసాలా సినిమాలు థియేటర్లో ఎంత గోల చేశాయో చూశాం. ఆ సందడి తర్వాత మనముందుకు వచ్చిన స్వచ్ఛమైన ప్రేమ కథా చిత్రం "ప్రేమదేశం". త్రిగున్, మేఘా ఆకాష్, మాయ, అజయ్ కతుర్వార్, కమల్ నార్ల తేజ, శివ రామచంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో అలనాటి అందాలతార మధుబాల ప్రత్యేక పాత్రలో మెరిసింది. శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని సిరి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై శిరీష సిద్ధమ్ నిర్మించారు. రఘు కళ్యాణ్ రెడ్డి, రాములు అసోసియేట్ ప్రొడ్యూసర్స్‌గా,కమల్, కిరణ్, రూపా, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు. తాజాగా రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో చూద్దాం.. కథ ఒకే కాలేజీలో చదువుకుంటున్న అర్జున్ (త్రిగున్), ఆద్య (మేఘా ఆకాష్)లకు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నా ఎప్పుడూ వారి ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసుకోరు. చివరికి వారిద్దరూ లవర్స్ డే అయిన ఫిబ్రవరి 14న ఒక ప్లేస్ దగ్గర కలుసుకొని లవ్ ప్రపోజ్ చేసుకుందామని నిర్ణయించుకుంటారు. ఆ ప్లేస్ పేరే " ప్రేమ దేశం". ప్రేమికుల దినోత్సవం రోజు లవ్ ప్రపోజ్ చేసుకోవడానికి వస్తున్న వీరికి అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంది. మరోవైపు రిషి (అజయ్ కతుర్వాల్) అనే అబ్బాయి మూడు సంవత్సరాల నుంచి మాయ అనే అమ్మాయి వెంట తిరుగుతుంటాడు, ఎట్టకేలకు ఆమె రిషి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరిద్దరికీ పెళ్లి ఫిక్స్ చేస్తారు. ఇంకోవైపు పెళ్లి కోసం తంటాలు పడుతుంటాడు శివ. శివకు అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయికి శివ నచ్చడు. ఆ అమ్మాయికి శివ నచ్చితే అతడికి ఆ అమ్మాయి నచ్చదు. ఈ క్రమంలో అనూహ్యంగా మాయతో శివ పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఎంతో ఇష్టంగా ప్రేమించిన రిషి (అజయ్)తో తాళి కట్టించుకోవాల్సిన మాయ శివను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సిద్దపడింది? అర్జున్, ఆద్యల యాక్సిడెంట్‌కు శివ, రిషి , మాయల మధ్య ఉన్న లింకేంటి? ఈ రెండు కథలు ఒకే దగ్గర కలవడానికి కారణమేంటి ? చివరకు అర్జున్, ఆద్యలు ఒకటయ్యారా లేదా? అనేదే మిగతా కథ. నటీనటుల పనితీరు త్రిగున్, మేఘా ఆకాష్ పరిణతితో నటించారు. త్రిగున్‌కు తల్లిగా నటించిన మధుబాల తన పాత్రలో అదరగొట్టింది. కాలేజీ ఎపిసోడ్స్‌లో కూడా మధుబాల అల్లరితో పాటు అద్భుతంగా నటించింది. అజయ్,శివ, మాయల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్ బాగుంటాయి. మాయ తండ్రిగా తనికెళ్ల భరణి, రిషిగా అజయ్ తమ నటనతో మెప్పించారు. బేబీ సినిమాలో చేసిన వైష్ణవి చైతన్య మాయ చెల్లి క్యారెక్టర్‌తో కనువిందు చేసింది. సాంకేతిక నిపుణుల పనితీరు ఫస్ట్ హాఫ్‌లో యూత్‌ను కాలేజీ డేస్‌లోకి తీసుకెళ్ళిన దర్శకుడు సెకండ్ హాఫ్‌లో లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్, వన్ సైడ్ లవ్‌లోని డిఫరెంట్ యాంగిల్స్ చూపించాడు. కానీ కొన్ని చోట్ల సీన్స్ నీరసంగా సాగదీసినట్లుగా అనిపిస్తాయి. సినిమాటోగ్రాఫర్ సజాద్ కక్కు ఇచ్చిన విజువల్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. మణిశర్మ గారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కిరణ్ తుంపెర ఇంకాస్త ఎడిటింగ్ చేయాల్సింది. ఈశ్వర్ పెంటి కొరియోగ్రఫీ, రియల్ సతీష్, డ్రాగన్ ప్రకాష్ ల ఫైట్స్ పర్వాలేదనిపించాయి. హీరో అర్జున్, వాళ్ల అమ్మ మధుభాల మధ్య రాసుకున్న సన్నివేశాలు చూస్తున్నప్పుడు "అమ్మా నాన్న తమిళ అమ్మాయి" సినిమా గుర్తుచేసేలా ఉంటుంది. అక్కడక్కడా ఇది మనకు తెలిసిన కథే అనిపించేలా ఉంటుంది. క్లైమాక్స్ చాలా సింపుల్‌గా ఉంటుంది. చదవండి: ఓ మగాడు కాటేసిన మహిళ.. గానమే ప్రాణంగా శంకర శాస్త్రి -
ఆకట్టుకుంటున్న బిగ్‌బాస్ ఫేం 'అజయ్ గాడు' టీజర్
బిగ్‌బాస్ ఫేం అజయ్ తాజాగా నటిస్తున్న చిత్రం అజయ్ గాడు. ఈ సినిమాలో భాను శ్రీ, శ్వేతా మెహతా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అజయ్ కరుత్వార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి చందనా కొప్పిశెట్టి సహకారంతో అజయ్ కుమార్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్వయంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇంటెన్స్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అజయ్ నాగ, హర్ష హరి జాస్తి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా కొడకొండ్ల, మనీజేన, సుమంత్ బాబు, ప్రతీక్ సంగీతం అందించారు. -
బిగ్‌బాస్ కంటెస్టెంట్ హీరోగా అజయ్‌గాడు, ఫస్ట్ లుక్ వచ్చేసింది
ఇటీవలే 'విశ్వక్' సినిమాలో అలరించిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ అజయ్ కతుర్వార్ ప్రస్తుతం ఓ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను యంగ్ హీరో సత్యదేవ్ ఆవిష్కరించారు. “అజయ్ గాడు” అనే టైటిల్ అందర్నీ ఆకట్టుకుంటుండగా అజయ్ తన ఫస్ట్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. భాను శ్రీ, శ్వేతా మెహతా కథానాయికలుగా నటిస్తున్నారు. త్వరలోనే ఫైర్ టీజర్‌ను కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు అజయ్ దర్శకత్వం వహిస్తుండగా చందనా కొప్పిశెట్టి సహకారంతో అజయ్ కుమార్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్నాడు. అజయ్ నాగ్, హర్ష హరి జాస్తి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ కొడకొండ్ల, మనీజేన, సుమంత్ బాబు, ప్రతీక్ సంగీతం అందించగా, నేపథ్య సంగీతాన్ని సిద్ధార్థ్ శివుని సమకూర్చారు. View this post on Instagram A post shared by Ajay Kumar Kathurvar (@ajay_kathurvar) View this post on Instagram A post shared by Ajay Kumar Kathurvar (@ajay_kathurvar) చదవండి: చెర్రీ-ఉపాసనల మేకప్ ఆర్టిస్ట్‌తో నటుడి పెళ్లి -
బిందుకు దగ్గరయ్యావని అఖిల్ దూరం పెట్టాడా? అజయ్ ఏమన్నాడంటే?
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో ఇప్పటివరకు ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. శ్రీరాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వి, ముమైత్ ఖాన్, స్రవంతి, మహేశ్ విట్టా వరుసగా ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. తాజాగా ఎనిమిదో వారం అజయ్ ఎలిమినేట్ అయ్యాడు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ బజ్‌లో యాంకర్ రవికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో భాగంగా యాంకర్ రవి.. నువ్వు బిందుకు దగ్గరయ్యావని అఖిల్ దూరమయ్యాడా? అని సూటిగా ప్రశ్నించాడు. దీనికి అజయ్.. ఈ మధ్యే ఆ చర్చ కూడా మొదలైందని, ఎందుకు ఆమెతో క్లోజ్ ఉంటున్నావని అఖిల్ తనను అడుగుతూ ఉండేవాడని బదులిచ్చాడు. అఖిల్ వల్లే అజయ్ ఇన్నాళ్లు హౌస్‌లో ఉండగలిగాడని ఇంతకుముందు ఎలిమినేట్ అయినవాళ్లు చెప్పారు. ఎప్పుడైతే అఖిల్‌కు కొద్దికొద్దిగా దూరమవుతూ వచ్చావో అప్పటినుంచి అజయ్ వీక్ అవుతూ వచ్చాడని రవి పేర్కొనడంతో అజయ్ అలాంటిదేం లేదని ఆన్సరిచ్చాడు. ఇక ఇంటిసభ్యుల గురించి చెప్తూ.. నటరాజ్ మాస్టర్ కొంచెం కంట్రోల్లో ఉంటే బాగుంటుందన్నాడు. శివ స్మార్ట్ కానీ గేమ్‌లో విలువలు, ఎమోషన్స్ కూడా పక్కన పెట్టేస్తాడని అభిప్రాయపడ్డాడు. బిందుమాధవి చాలా స్ట్రాంగ్ ప్లేయర్, కాకపోతే కొంచెం ఓవర్ థింకింగ్ ఆపేస్తే బాగుంటుందని చెప్పాడు. అరియానా ఇప్పుడే గేమ్ స్టార్ట్ చేసిందన్నాడు. అఖిల్ కప్పు తీసుకుని రావాలని ఆశపడ్డాడు. చదవండి: బిగ్‌బాస్ షో నుంచి అజయ్ ఎలిమినేట్ మూడో సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ తెలుగువాడే! -
ఫ్రెండ్‌ను పక్కన పెట్టిన అఖిల్, అతడే ఎలిమినేట్!
బిగ్‌బాస్ షోలో ఫుల్ కామెడీ పంచుతున్నాడు బాబా. మరోవైపు నటరాజ్ తన జోలికొచ్చినవాళ్లను జంతువులతో పోలుస్తూ, ఇమిటేట్ చేస్తూ చుక్కలు చూపిస్తున్నాడు. అయితే బాబా దగ్గరకు వచ్చేసరికి మాత్రం వాళ్లు అలాంటివారు, వీళ్లు ఇలాంటివారు అంటూ కంటెస్టెంట్ల గురించి లేనిపోనివి అతడి బుర్రలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి బాబా వీటన్నింటినీ పట్టించుకుంటున్నాడా లేదా అన్న విషయం పక్కన పెడితే ఈ వారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అతడు నామినేషన్స్‌లో లేడు. కాబట్టి తాపీగా వీకెండ్‌ను ఎంజాయ్ చేయవచ్చు. అటు నట్టూ కూడా ఎలిమినేషన్ జోన్లో లేడు. ఈ వారం అఖిల్, అజయ్, అనిల్, హమీదా, అషూ రెడ్డి నామినేషన్లో ఉన్నారు. వీరిలో అఖిల్, అషూ సేఫ్ అన్న విషయం మనకెలాగో తెలుసు. మిగిలిందల్లా అనిల్, అజయ్, హమీదా. ఈ ముగ్గురిలో హమీదాకు మంచి ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది. దీంతో అనిల్, అజయ్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఇక అజయ్‌ను అఖిల్ పక్కన పెట్టడంతో అతడి ఫ్యాన్స్ అజయ్‌ను సేవ్ చేసే పరిస్థితి లేనట్లే కనిపిస్తోంది. ఫలితంగా అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లే సూచనలున్నాయి. ఇదిలా ఉంటే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారన్న విషయాన్ని లీకువీరులు మరోసారి సోషల్ మీడియాలో ముందుగానే ప్రకటించేశారు. ఊహించినట్లుగానే అజయ్ బిగ్‌బాస్ హౌస్‌ను వీడనున్నట్లు వెల్లడించారు. మరి ఇదెంతవరకు నిజమో తెలియాలంటే సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ చూడాల్సిందే! చదవండి 👉 ఆ బ్రేకప్‌కు కారణం రోహిత్ శర్మ: సోఫియా టాస్క్ రద్దు చేయాలన్న బాబా, వీల్లేదని అఖిల్ డిమాండ్, ఇరకాటంలో అషూ -
ఛీ, అషూ నువ్వు అమ్మాయివేనా? అజయ్ నోటికొచ్చినట్లు వాగుతావా?
బిగ్‌బాస్ షోలో హద్దులు మీరి ప్రవర్తించినా, బూతులు మాట్లాడినా దాన్ని ఎడిటింగ్‌లో తీసే ఆస్కారం ఉండేది. కానీ బిగ్‌బాస్ తెలుగు ఓటీటీలో మాత్రం అలాంటి చాన్స్ లేదు. 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్ ఉండటంతో కంటెస్టెంట్లు ఏం మాట్లాడినా, ఏం చేస్తున్నా ప్రతీది ప్రేక్షకుడు ఓ కంట గమనిస్తూనే ఉంటాడు. అయితే నాన్‌స్టాప్ షోలో ఆది నుంచి వల్గర్ జోకులు, బూతుపురాణం నడుస్తూనే ఉంది. ఈసారి ఆ హాస్యం మరింత హద్దు మీరింది. నిన్నటి కెప్టెన్సీ కంటెండర్స్ టాస్కులో అఖిల్, బిందును ఒక టీమ్‌గా ఏర్పాటు చేశాడు బిగ్‌బాస్. వీళ్లు మిగతా జోడీలకంటే బాగానే ఆడుతున్నారు. అయితే ఈ గేమ్‌కు సంచాలకురాలిగా ఉన్న అషూ మాత్రం ఎప్పటిలాగే తన నోటి దురుసు ప్రదర్శించింది. అఖిల్.. మిత్ర దగ్గరకు వెళ్లి తనకు, బిందుకు రెండు యాపిల్స్, రెండు అరటిపండ్లు, రెండు ఆరెంజ్ కావాలని డీల్ మాట్లాడుకుంటున్నాడు. ఇది విన్న అషూ టాస్క్ ఆడబోతున్నారా? ఫస్ట్ నైట్‌కు పోతున్నారా? అంటూ సెటైర్ వేసింది. దీనికి అఖిల్ ఏమీ అనకుండా ఓ నవ్వు విసిరాడు. ఇక మరో చోట అఖిల్, అషూ, అజయ్, నటరాజ్ బెడ్ మీదకు చేరి ముచ్చట్లు పెట్టారు. ఆ సమయంలో అఖిల్.. అజయ్ చెవిలో శివ, బిందు హీరోహీరోయిన్స్ అంటూ ఊదాడు. దీనికి అజయ్ దుప్పట్లో దడదడే అంటూ కామెంట్ చేయగా మధ్యలో అషూ అందుకుని ముసుగులో గుద్దులాట అని మాట్లాడింది. దీంతో ఓ అడుగు ముందుకేసిన అజయ్ గోడకేసి గుద్దు అంటూ ఓ టైటిల్ ఇచ్చాడు. ఈ సంభాషణ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారగా ఇంత నీచంగా మాట్లాడతారా? అని ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. అషూ ఒక అమ్మాయి అయి ఉండి మరో ఆడదాని గురించి ఇంత దారుణంగా మాట్లాడుతుందా? అని తిట్టిపోస్తున్నారు. ఇక నటరాజ్ మాస్టర్, అజయ్.. నామినేషన్స్ గురించి మాట్లాడుకున్నారు. హమీదా తల మీద చేయి వేసి మాట్లాడుతుంది. ఆమె తనకు అమ్మలాగా అనిపిస్తుందని, తనకోసమే నామినేట్ అయ్యానని అనిల్ బిందుతో చెప్పాడట అంటూ నటరాజ్ మాస్టర్ చెప్పుకొచ్చాడు. దీనికి అజయ్.. వాడు అమ్మాయి టచ్ కోరుకున్నాడు అని అడ్డగోలుగా ఆన్సరిచ్చాడు. దీంతో అజయ్‌ను సైతం నెట్టింట ఆడేసుకుంటున్నారు. బిందుమాధవి, హమీదాలకు కనీస మర్యాద ఇవ్వండని డిమాండ్ చేస్తున్నారు. “Whenever you think about disrespecting a woman, think about how you were born into this world.” #BinduMadhavi RESPECT GIRLS IN BB NON STOP#BiggBossNonStop pic.twitter.com/nYm0SZRgeO — Raju Reddy (@RajuRed55149023) April 12, 2022 Statements passed by AS which exposed male chauvinist attitude out of him 1. Pampering kaavala? 2. Nenu kalaloki vastunna anindi 3. Punishment ga massage cheyamani adgatam All on a single strng woman #Bindu Y soo insecure Mr. AS? Verry disgusting to c this#BiggBossNonStop — 𝑀𝒶𝒽𝑒𝓈𝒽 ✨😇 (@ursTrulyMahi88) April 9, 2022 #BinduMadhavi #BiggBossNonStop I want body massage I want Mango pandu I want eat Mango pandu I want Mango Pandu rasalu Dupatlo dadthad Musugulo gudulata Godamida vese dadthad. Aada sentiment drama .#akhilsarthak and gang talks about a woman. RESPECT GIRLS IN BB NON STOP — N Harsha (@harshanamburi) April 12, 2022 Again and again. Akhil to Mithraw on deal: Me and Bindu need 2 apple, 2 banana, 2 orange Ashu to akhil: Task adapothunara, first night ku pothunara 😡😡😡 its going worse day by day. Passing sexualized jokes over Bindu.#BiggBossNonStop — Vijay (@Vijay2itz) April 12, 2022 🤐 no words .. very disturbing behavior.. @DisneyPlusHSTel @DisneyPlusHS @iamnagarjuna @StarMaa please address this or eliminate them . #BiggBossNonStop #BinduMadhavi https://t.co/XBZh1F5WzO — Sirisha (@jayareddyv) April 13, 2022 చదవండి: మిత్ర శర్మ నాకు రూ.5 లక్షలు ఇస్తానని చెప్పింది: స్రవంతి చిరంజీవిని గట్టిగా కొట్టాను, ముఖం ఎరుపెక్కిపోయింది: రాధిక -
'పిచ్చిపిచ్చి మాట్లాడుతుండు', ఎమోషన్స్‌తో ఆటలొద్దన్న అఖిల్
బిగ్‌బాస్‌ను ఆదరించే బుల్లితెర అభిమానులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈసారి టీవీలో కాకుండా ప్రయోగాత్మకంగా కేవలం ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో మాత్రమే ప్రసారం చేస్తున్నారు. దీంతో బిగ్‌బాస్ షోను చూసేవాళ్ల సంఖ్య తగ్గిందనే చెప్పాలి. అయితే గొడవలు, కొట్లాటలు, వినోదంతో అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది బిగ్‌బాస్. ప్రస్తుతం హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ నడుస్తోంది. అందులో భాగంగా వారియర్స్ స్మగ్లర్లుగా, చాలెంజర్స్ పోలీసులుగా మారిపోయారు. స్మగ్లర్లు చేసే పనులను అడ్డుకునే క్రమంలో రెండు టీముల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ క్రమంలో వారియర్స్ టీమ్‌లోని అఖిల్, చాలెంజర్స్ టీమ్‌లోని అజయ్ మధ్య కూడా మనస్పర్థలు చోటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. గేమ్‌లో నాతో ఆడు, నా ఎమోషన్స్‌తో కాదంటూ పరోక్షంగా అజయ్ గురించే మాట్లాడాడు అఖిల్. అటు పక్క అజయేమో.. ఏదైనా జరుగుతున్నప్పుడు ఫ్రెండ్షిప్ను మధ్యలో రానివ్వద్దని వందసార్లు చెప్పాను, అయినా పిచ్చిపిచ్చి మాట్లాడుతుండు అంటూ అఖిల్ మీద అసహనానికి లోనయ్యాడు. ఇష్టమున్నట్లు మాట్లాడితే ఎవరూ పడరు కదా? అని స్రవంతితో చెప్పుకొచ్చాడు. మరో పక్క టాస్క్‌లో యాంకర్ శివ సరయుపై ప్రతీకారం తీర్చుకున్నట్లు కనిపిస్తోంది. ఆమె వెళ్తుంటే వెనకాల తనే బొమ్మ పడేసి ఆపై బొమ్మ దొరికిందంటూ సీజ్ చేశాడు. కెమెరాలు చూస్తున్నాయంటూ సరయు శివ బట్టల దగ్గరకు వెళ్లగా అతడు అగ్గిమీద గుగ్గిలమయ్యాడు, నువ్వు నామీద ఎన్నో నిందలు వేశావు. అలాంటి నీకు నా బట్టలు ముట్టే హక్కు లేదు అని ఫైర్ అయ్యాడు. టాస్క్ గరంగరంగా సాగుతున్న సమయంలో ఇంతటితో మొదటి లెవల్ పూర్తైందన్నాడు బిగ్‌బాస్. రెండో లెవల్లో వారియర్స్ పోలీసులుగా, చాలెంజర్స్ స్మగ్లర్లుగా మారతారని చెప్పాడు బిగ్‌బాస్. మరి ఈసారి ఆట ఎలా ఉండబోతుంది? ఏ టీమ్ గెలుస్తుంది? అనేది తెలియాలంటే గురువారం (మార్చి 10) రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! -
హీరోగా సినిమా, అంతలో రోడ్డు ప్రమాదం: అజయ్
అజయ్ కాతువాయూర్.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని వ్యక్తి. కానీ ఇప్పటికే రెండు సినిమాలు చేశాడు. తనే దర్శకుడిగా మరి ఓ కొత్త సినిమా కూడా చేస్తున్నాడు అజయ్. అయితే విధి తన జీవితంతో ఆడుకుందంటూ బిగ్‌బాస్ స్టేజీపై ఓ బాధాకర విషయాన్ని పంచుకున్నాడు. 'ఫస్ట్ టైం ఆడిషన్‌కు వెళ్లగానే హీరోగా సెలక్ట్ అయ్యాను, షూటింగ్ పూర్తయ్యే సమయంలో రోడ్డు ప్రమాదం జరిగి కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. 8 నెలల తర్వాత కోలుకుని ఇప్పుడు నడవగలుగుతున్నా'నని చెప్పుకొచ్చాడు. ఏదైనా మొండిగా వెళ్లిపోయే అలవాటుందన్న అతడు సంకి అన్న బిరుదుతో హౌస్‌లో అడుగుపెట్టాడు. మరి ఈ జూనియర్ సీనియర్స్‌తో ఎలా పోటీపడతాడు, బిగ్‌బాస్ ఓటీటీలో ఎన్ని వారాలు ఉంటాడన్నది చూడాలి!