
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో ఇప్పటివరకు ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. శ్రీరాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వి, ముమైత్ ఖాన్, స్రవంతి, మహేశ్ విట్టా వరుసగా ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. తాజాగా ఎనిమిదో వారం అజయ్ ఎలిమినేట్ అయ్యాడు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ బజ్‌లో యాంకర్ రవికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో భాగంగా యాంకర్ రవి.. నువ్వు బిందుకు దగ్గరయ్యావని అఖిల్ దూరమయ్యాడా? అని సూటిగా ప్రశ్నించాడు. దీనికి అజయ్.. ఈ మధ్యే ఆ చర్చ కూడా మొదలైందని, ఎందుకు ఆమెతో క్లోజ్ ఉంటున్నావని అఖిల్ తనను అడుగుతూ ఉండేవాడని బదులిచ్చాడు.
అఖిల్ వల్లే అజయ్ ఇన్నాళ్లు హౌస్‌లో ఉండగలిగాడని ఇంతకుముందు ఎలిమినేట్ అయినవాళ్లు చెప్పారు. ఎప్పుడైతే అఖిల్‌కు కొద్దికొద్దిగా దూరమవుతూ వచ్చావో అప్పటినుంచి అజయ్ వీక్ అవుతూ వచ్చాడని రవి పేర్కొనడంతో అజయ్ అలాంటిదేం లేదని ఆన్సరిచ్చాడు. ఇక ఇంటిసభ్యుల గురించి చెప్తూ.. నటరాజ్ మాస్టర్ కొంచెం కంట్రోల్‌లో ఉంటే బాగుంటుందన్నాడు. శివ స్మార్ట్ కానీ గేమ్‌లో విలువలు, ఎమోషన్స్ కూడా పక్కన పెట్టేస్తాడని అభిప్రాయపడ్డాడు. బిందుమాధవి చాలా స్ట్రాంగ్ ప్లేయర్, కాకపోతే కొంచెం ఓవర్ థింకింగ్ ఆపేస్తే బాగుంటుందని చెప్పాడు. అరియానా ఇప్పుడే గేమ్ స్టార్ట్ చేసిందన్నాడు. అఖిల్ కప్పు తీసుకుని రావాలని ఆశపడ్డాడు.
చదవండి: బిగ్‌బాస్ షో నుంచి అజయ్ ఎలిమినేట్
మూడో సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ తెలుగువాడే!
Comments
Please login to add a commentAdd a comment