అజయ్ కాతువాయూర్.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని వ్యక్తి. కానీ ఇప్పటికే రెండు సినిమాలు చేశాడు. తనే దర్శకుడిగా మరి ఓ కొత్త సినిమా కూడా చేస్తున్నాడు అజయ్. అయితే విధి తన జీవితంతో ఆడుకుందంటూ బిగ్‌బాస్ స్టేజీపై ఓ బాధాకర విషయాన్ని పంచుకున్నాడు.
'ఫస్ట్ టైం ఆడిషన్‌కు వెళ్లగానే హీరోగా సెలక్ట్ అయ్యాను, షూటింగ్ పూర్తయ్యే సమయంలో రోడ్డు ప్రమాదం జరిగి కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. 8 నెలల తర్వాత కోలుకుని ఇప్పుడు నడవగలుగుతున్నా'నని చెప్పుకొచ్చాడు. ఏదైనా మొండిగా వెళ్లిపోయే అలవాటుందన్న అతడు సంకి అన్న బిరుదుతో హౌస్‌లో అడుగుపెట్టాడు. మరి ఈ జూనియర్ సీనియర్స్‌తో ఎలా పోటీపడతాడు, బిగ్‌బాస్ ఓటీటీలో ఎన్ని వారాలు ఉంటాడన్నది చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment