
బిగ్‌బాస్ షోలో ఫుల్ కామెడీ పంచుతున్నాడు బాబా. మరోవైపు నటరాజ్ తన జోలికొచ్చినవాళ్లను జంతువులతో పోలుస్తూ, ఇమిటేట్ చేస్తూ చుక్కలు చూపిస్తున్నాడు. అయితే బాబా దగ్గరకు వచ్చేసరికి మాత్రం వాళ్లు అలాంటివారు, వీళ్లు ఇలాంటివారు అంటూ కంటెస్టెంట్ల గురించి లేనిపోనివి అతడి బుర్రలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి బాబా వీటన్నింటినీ పట్టించుకుంటున్నాడా లేదా అన్న విషయం పక్కన పెడితే ఈ వారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అతడు నామినేషన్స్‌లో లేడు. కాబట్టి తాపీగా వీకెండ్‌ను ఎంజాయ్ చేయవచ్చు. అటు నట్టూ కూడా ఎలిమినేషన్ జోన్‌లో లేడు. ఈ వారం అఖిల్, అజయ్, అనిల్, హమీదా, అషూ రెడ్డి నామినేషన్‌లో ఉన్నారు.
వీరిలో అఖిల్, అషూ సేఫ్ అన్న విషయం మనకెలాగో తెలుసు. మిగిలిందల్లా అనిల్, అజయ్, హమీదా. ఈ ముగ్గురిలో హమీదాకు మంచి ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది. దీంతో అనిల్, అజయ్ డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఇక అజయ్‌ను అఖిల్ పక్కన పెట్టడంతో అతడి ఫ్యాన్స్ అజయ్‌ను సేవ్ చేసే పరిస్థితి లేనట్లే కనిపిస్తోంది. ఫలితంగా అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లే సూచనలున్నాయి. ఇదిలా ఉంటే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారన్న విషయాన్ని లీకువీరులు మరోసారి సోషల్ మీడియాలో ముందుగానే ప్రకటించేశారు. ఊహించినట్లుగానే అజయ్ బిగ్‌బాస్ హౌస్‌ను వీడనున్నట్లు వెల్లడించారు. మరి ఇదెంతవరకు నిజమో తెలియాలంటే సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ చూడాల్సిందే!
చదవండి 👉 ఆ బ్రేకప్‌కు కారణం రోహిత్ శర్మ: సోఫియా
టాస్క్ రద్దు చేయాలన్న బాబా, వీల్లేదని అఖిల్ డిమాండ్, ఇరకాటంలో అషూ
Comments
Please login to add a commentAdd a comment