Is Bindu Madhavi Got Offer In Director Anil Ravipudi And Balakrishna Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Bindu Madhavi In Anil Ravipudi Movie: బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన బిగ్‌బాస్‌ విన్నర్‌ బిందు మాధవి!

Published Thu, May 26 2022 5:25 PM | Last Updated on Thu, May 26 2022 6:56 PM

Is Bindu Madhavi Got Offer From Director Anil Ravipudi For Balakrishna Movie - Sakshi

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ విజేతగా బిందు మాధవి నిలిచిన విషయం తెలిసిందే. తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలో ఓ మహిళ విన్నర్‌గా నిలవడం ఇదే తొలిసారి. దీంతో తెలుగు బిగ్‌బాస్‌ విన్నర్‌గా నిలిచి బిందు మాధవి చరిత్ర సృష్టించింది. టాస్క్‌లో.. మాటల్లో ఆడపులిలా రెచ్చిపోయిన బిందుకి ఒక్కసారిగా ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ విపరీతంగా పెరిగింది. ఇది వరకు ఆమె తెలుగులో పలు చిత్రాల్లో చేసిన రానీ గుర్తింపు ఒక్కసారిగా బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌తో తెచ్చుకుంది. దీంతో ఆమెకు టాలీవుడ్‌ నుంచి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. 

చదవండి:  కరణ్‌ జోహార్‌ బర్త్‌డే పార్టీ, ఒకే రంగు దుస్తుల్లో మెరిసిన రష్మిక, విజయ్‌

ఈ నేపథ్యంలో బిందుకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఏకంగా ఆమె ఓ స్టార్‌ డైరెక్టర్‌ సినిమాలో చాన్స్‌ కొట్టేసిందంటూ తాజాగా వార్తలు గుప్పుమన్నాయి. ఇండస్ట్రీలో వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న యంగ్‌ డైరెక్టర్‌ అనిల్‌రావిపూడి తదుపరి ప్రాజెక్ట్‌లో నటించే చాన్స్ కొట్టేసిందని వినికిడి. కాగా ప్రస్తుతం అనిల్‌ రావిపూడి ఎఫ్‌ 3 మూవీ ప్రమోషన్‌తో బిజీగా ఉన్నాడు. దగ్గుబాటి హీరో విక్టరి వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ నటించి ఈ చిత్రం రేపు(మే 27న) ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని అనంతరం ఆయన బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

చదవండి: రాత్రి 11 గంటలు, కానిస్టేబుల్‌ వల్ల అభద్రతకు గురయ్యా: హీరోయిన్‌

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన అనిల్‌ రావిపూడితో బాలయ్య సినిమా అనేసరికి అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా అప్‌డేట్‌ కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో బిందు మాధవిని ఓ కీ రోల్‌ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా మెహ్రీన్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. అంతేకాదు మరో యువ నటి శ్రీలీలా బాలయ్య కూతురిగా కనిపించబోతుందట. మరి ఇందులో బిందు మాధవి రోల్‌పై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే బాలయ్య కోసం తన కామెడీ టచ్‌ను పక్కన పెట్టి యాక్షన్‌పై దృష్టి పెట్టానని అనిల్‌ రావిపూడి ఇటీవల ఓ ఇంటర్య్వూలో చెప్పిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement