
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్‌గా బిందు మాధవి రికార్డు సృష్టించింది.టైటిల్ రేసులో ఉన్న అఖిల్ సార్థక్ నుంచి గట్టి పోటీ ఎదురైనా చివరికి బిందు మాధవి టైటిల్ విన్నర్‌గా నిలిచింది. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే తొలి లేడీ విన్నర్‌గా నిలిచి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ట్రోఫీతో పాటు రూ. 40లక్షల క్యాష్ ప్రైజ్‌ను సైతం సొంతం చేసుకుంది.
'మస్తీ' హ్యాష్ ట్యాగ్‌తో ఎంట్రీ ఇచ్చి 'ఆడపులి' అనే హ్యాష్ ట్యాగ్‌తో బయటికొచ్చింది. అనంతరం బిగ్‌బాస్ బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిందు మాధవి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. బిగ్‌బాస్ టైటిల్ గెలవడం తన మొదటి విజయంగా భావిస్తున్నానని, ఇప్పటి నుంచి ఇక విజయవంతంగా ముందుకు వెళ్తానని అనుకుంటున్నట్లు పేర్కొంది. ఇప్పుడు విన్నర్ అయ్యావ్ కానీ, ఒకసారి కూడా కెప్టెన్ ఎందుకు అవ్వలేదు అని యాంకర్ అడగ్గా అది తనకు కూడా తెలియదని చెప్పింది.
హౌస్‌లో మోస్ట్ ఇరిటేటింగ్ కంటెస్టెంట్ ఎవరు అని అడగ్గా ఏమాత్రం తడుముకోకుండా వెంటనే నటరాజ్ మాస్టర్ అని తెలిపింది. ఈ సీజన్‌లో పలానా కంటెస్టెంట్ ఉన్నపపుడు నేను ఈ సీజన్‌కి రావాల్సింది లేకుండే అని ఎవరిని చూస్తే అనిపించింది?అని అడగ్గా వారి వళ్లే తనకీ టైటిల్ దక్కిందంటూ చెప్పుకొచ్చింది. చివరగా విన్నింగ్ మూమెంట్‌లో గెలుస్తానో, లేదో అని చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నానని బిందు పేర్కొంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment