Bigg Boss Non Stop Telugu Today Promo: Fight Between Bindhu Madhavi & Akhil Sarthak - Sakshi
Sakshi News home page

Bigg Boss Non Stop: బిందు అన్న మాటలకి కన్నీళ్లు పెట్టుకున్న అఖిల్‌

Published Sat, Mar 26 2022 11:48 AM | Last Updated on Sat, Mar 26 2022 12:43 PM

Bigg Boss Non Stop: Big Fight Between Akhil Sarthak And Bindu Madhavi - Sakshi

Bigg Boss Non Stop Latest Promo Is Out: బుల్లితెరపై బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ రసవత్తరంగా సాగుతోంది. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో 24గంటల పాటు ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌లో వినోదంతో పాటు గొడవలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. అప్పటి వరకు ఫ్రెండ్స్‌గా ఉన్న వారు కూడా టాస్క్‌లు వచ్చేవరకు ఎనిమీలుగా మారుతున్నారు. ఇక బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌లో ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే.  శివను ఆ  రౌండ్‌లో ఎలిమినేట్‌ చేసే ప్రక్రియలో అఖిల్‌, బిందు మాధవికి మధ్య పెద్ద గొడవ జరిగింది.

నువ్వు ఇప్పటివరకు ఎన్ని సార్లు కెప్టెన్సీ కంటెండర్‌ అయ్యావని అఖిల్‌ ప్రశ్నించగా.. నీలా నాకు ఫ్రెండ్స్‌ సపోర్ట్‌ చేయలేదు అంటూ బిందు కౌంటర్‌ వేసింది. 'ఫ్రెండ్స్‌ సపోర్ట్‌ లేకుండా నువ్వు ఒక్క గేమ్‌ కూడా ఆడలేవు.  ఫ్రెండ్స్‌ సపోర్ట్‌తో బతుకుతుంది నువ్వు.. నేను కాదు. ఫ్రెండ్స్‌ సపోర్ట్‌ లేకుండా అఖిల్‌ ఈ ఇంట్లో బతకలేడు'.. అంటూ మండిపడింది. 'ఈ మాటలు పడటానికి వచ్చానా నేను.. ఇష్టం వచ్చిన మాటలు అంటున్నావ్‌' అంటూ అఖిల్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఈ ఫైట్‌లో అజయ్‌ తన ఫ్రెండ్స్‌ అఖిల్‌కి సపోర్ట్‌గా నిలుస్తాడు. మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడాలని బిందుతో గొడవకు దిగుతాడు. దీనికి సంబంధించిన లేటెస్ట్‌ ప్రోమో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement