Bigg Boss Fame Bindu Madhavi Epic Reply to Netizen Who Troll On Her Dressing - Sakshi
Sakshi News home page

BB Winer Bindu Madhavi: డ్రెస్సింగ్‌పై ట్రోల్‌.. తనదైన స్టైల్లో నెటిజన్‌ నోరుమూయించిన బిందు

Published Wed, Aug 3 2022 9:02 AM | Last Updated on Wed, Aug 3 2022 10:27 AM

Bigg Boss Fame Bindu Madhavi Epic Reply to Netizen Who Troll On Her Dressing - Sakshi

సోషల్‌ మీడియాలో తనపై నెగిటివ్‌ కామెంట్‌ చేసిన ఓ నెటిజన్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది బిగ్‌బాస్‌ శివంగి బిందు మాధవి. అవకాయా బిర్యానీ, బంపర్‌ ఆఫర్‌ వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు పొందింది బిందు. తెలుగు అమ్మాయి అయిన బిందు ఇక్కడ అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకుంది. అక్కడ వరుస ఆఫర్లు అందుకుంటూ సౌత్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో తెలుగు బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ ఓటీటీ  కంటెస్టెంట్‌గా దర్శనం ఇచ్చింది. హౌజ్‌లో తనదైన ఆట, యాటిటూడ్‌, మాటలతో గట్టి పోటి ఇస్తూ చివరికి బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ టైటిల్‌ గెలిచింది.

చదవండి: నందమూరి ఫ్యామిలీకి కలిసిరాని ఆగస్టు, విషాదాలన్నీ ఈ నెలలోనే..

అంతేకాదు సంప్రాదాయమైన దుస్తులనే ధరించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న బిందుమాధవి తన తాజా పోస్ట్‌లో కాస్తా ట్రెండి డ్రెస్‌లో కనిపించింది. ఈ ఫొటోను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేయగా ఓ నెటిజన్‌ తన డ్రెస్సింగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. బిగ్‌బాస్‌లో హౌజ్‌లో అందరు శరీరం కరిపించేలా డ్రెస్స్‌లు వేసుకుంటే.. తను మాత్రం కేవలం సంప్రదాయమైన అలంకరణకే ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో బిందు మాధవి అంటే రెస్పాక్ట్‌ పెరిగింది. కానీ ఇప్పుడు అది పోయింది. అందరి దగ్గర మార్కులు కొట్టాలనే ఉద్దేశంతోనే తను హౌజ్‌లో అలా ఉంది’ అంటూ విమర్శించారు.

చదవండి: ‘కార్తీకేయ 2’ ప్రమోషన్స్‌కి అనుపమ డుమ్మా.. నిఖిల్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

దీంతో సదరు నెటిజన్‌ కామెంట్స్‌ బిందు స్పందించి తనదైన స్టైల్లో గట్టి కౌంటర్‌ ఇచ్చింది.  ‘హో.. మనం ధరించే దుస్తులను బట్టే వ్యక్తికి గౌరవం ఇస్తారంటే.. అలాంటి గౌరవం నాకు వద్దు’ అంటూ నెటిజన్‌ నోరు మూయించింది ఈ ఆడపులి. ప్రస్తుతం బిందు మాధవి సమాధానం నెట్టింట చర్చనీయాంశమైంది. బిందు ఇచ్చిన రిప్లైకు ఓ నెటిజన్‌ ఫిదా అయ్యాడు. ఈ కామెంట్సకు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ తీసి ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ బిందుకు మద్దుతు తెలిపాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement