
Bindu Madhavi Remuneration: బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ విన్నర్‌గా నిలిచింది బిందు మాధవి. షో విజేతగా అవతరించడంతో ఆమెకు రూ.40 లక్షలు దక్కాయి. నిజానికి విన్నర్ ప్రైజ్‌మనీ అరకోటి. కానీ గ్రాండ్ ఫినాలే రోజు బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరీ రూ.10 లక్షలు తీసుకుని రేసు నుంచి తప్పుకుంది. దీంతో ఆ పది లక్షలు ప్రైజ్‌మనీలో నుంచి కోత పెట్టారు. అలా బిందు చేతికి 40 లక్షల రూపాయలు వచ్చాయి.
ఇకపోతే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో 12 వారాలు సాగింది. మరి 12 వారాలు హౌస్‌లో ఉన్నందుకు ఆమెకు ఎంత పారితోషికం వచ్చిందనుకుంటున్నారు? రూ. 55- 60 లక్షలు. అంటే మొత్తంగా బిందు ఇంచుమించు కోటి రూపాయలు గెల్చుకున్నట్లు తెలుస్తోంది. కానీ ట్యాక్స్ కటింగ్స్ వల్ల ఆమె చేతికి దాదాపు రూ.90 లక్షల మేరకు వచ్చే ఛాన్స్ ఉంది! మొత్తానికి బిందు ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్ అందుకుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.
కాగా బిందు తెలుగులో ఆవకాయ బిర్యానీ, బంపర్ ఆఫర్ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే! తమిళ బిగ్‌బాస్ మొదటి సీజన్‌లో పాల్గొన్న బిందు అక్కడ నాలుగో రన్నరప్‌గా నిలిచింది. ఇక తెలుగులో ఏకంగా ట్రోఫీ అందుకుని బిగ్‌బాస్ కప్పు గెలిచిన మొట్టమొదటి మహిళా విజేతగా అవతరించింది.
చదవండి 👇
స్టార్ హీరో తండ్రికి అస్వస్థత, పొత్తికడుపులో రక్తస్రావం
నా సినిమాను చంపేశారు: శేఖర్ నిర్మాత ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment