బిగ్‌బాస్ షో... గంట ఎపిసోడ్ కోసం రోజంతా ఎదురుచూసేవాళ్లు ప్రేక్షకులు. వారి ఆసక్తిని అర్థం చేసుకుని బిగ్‌బాస్ ఓటీటీని ప్రవేశపెట్టారు. 24 గంటలు హౌస్‌లో ఏం జరిగిందో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసేయండంటూ బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో మొదలుపెట్టారు. విచిత్రంగా బిగ్‌బాస్ షోలో లేనన్ని గొడవలు ఈ ఓటీటీలో చోటు చేసుకున్నాయి. ప్రేమలు, ఆప్యాయతల కంటే గొడవలతోనే కంటెస్టెంట్లు ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కలిపి ఈ ఓటీటీ మొదటి సీజన్‌లో మొత్తం 18 మంది పాల్గొన్నారు. వీరిలో అనిల్, అరియానా, అఖిల్, బిందు, శివ, మిత్ర, బాబా ఫినాలేకు చేరుకున్నారు.
శనివారం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ జరగ్గా నాగార్జున బిందును విన్నర్‌గా ప్రకటించాడు. అఖిల్ సార్థక్ రన్నర్‌గా నిలిచాడు. యాంకర్ శివ సెకండ్ రన్నరప్ స్థానానికి పరిమితమయ్యాడు. ఈ స్థానాలను ముందుగానే అంచనా వేసిన అరియానా రూ.10 లక్షల సూట్‌కేస్‌తో రేస్ నుంచి తప్పుకుంది. మరి విజేతగా నిలిచిన బిందుమాధవి ఎంత గెలుచుకుందో తెలుసా? అక్షరాలా రూ.40 లక్షలు. నిజానికి బిందుకు అరకోటి దక్కాలి. కానీ మధ్యలో అరియానా రూ.10 లక్షలున్న సూట్‌కేస్ చేజిక్కించుకోవడంతో దాన్ని ప్రైజ్‌మనీలో నుంచి తగ్గించారు. మొత్తానికి బిందు ప్రజల మనసుతో పాటు భారీ ప్రైజ్‌మనీ కూడా గెల్చుకుంది.
ఊహించని గెలుపుతో ఉక్కిరిబిక్కిరి అయిన బిందు బిగ్‌బాస్ స్టేజీపై భావోద్వేగానికి లోనైంది. కొందరికి కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు కష్టపడితే సక్సెస్ వస్తుంది. కానీ చాలామందికి ఎన్నో సంవత్సరాలు కష్టపడితేనే విజయం వరిస్తుంది. అలా ఆలస్యంగా విజయాన్ని అందుకునే లేట్ బ్లూమర్స్‌కు నా గెలుపు అంకితం. నేను కూడా లేట్ బ్లూమర్‌నే. చాలా సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత నాకు ఈ ట్రోఫీ వచ్చింది అని చెప్తూ ఎమోషనలైంది.
చదవండి 👉🏾 నటితో ఎఫైర్ పెట్టుకో, ఫేమస్ చేస్తామన్నారు
తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే మొదటి మహిళా విజేతగా బిందు మాధవి..
Comments
Please login to add a commentAdd a comment