
Anchor Shiva Gave Clarity On Love Story With Bindu Madhavi: బిగ్‌బాస్.. ప్రేక్షకుల నుంచి ఎంతో ఆదరణ పొందింది ఈ రియాలిటీ షో. గంట ఎపిసోడ్ కోసం రోజంతా ఎదురుచూసే ప్రేక్షకుల కోసం బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌పేరుతో ఓటీటీలో ప్రవేశపెట్టారు. బిగ్‌బాస్ హౌజ్‌లో 24 గంటలు ఏం జరుగుతుందో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూసేయండంటూ షోపై మరింత ఆసక్తి పెంచారు. ఈసారి బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో వచ్చిన గొడవలు ఏ బిగ్‌బాస్ సీజన్‌లో రాలేదు. ఎంతలా అంటే ప్రేమలు, ఆప్యాయతలు కంటే కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదాలతోనే మోస్ట్ పాపులర్ అయ్యారు. ఈ ఓటీటీ మొదటి సీజన్‌లో మొత్తం 18 మంది (ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సహా)
పాల్గొన్నారు.
వీరిలో అనిల్ రాథోడ్, అరియానా గ్లోరీ, అఖిల్ సార్థక్, బిందు మాధవి, శివ, మిత్రా శర్మ, బాబా భాస్కర్ గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నారు. బిందు మాధవి విన్నర్‌గా నిలవగా అఖిల్ రన్నరప్‌గా సరిపెట్టుకున్నాడు. ఇక కాంట్రవర్సీ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న శివ టాప్ 3 కంటెస్టెంట్‌గా నిలిచాడు. అయితే హౌజ్‌లో ఉన్నప్పుడు యాంకర్ శివ, బిందు మాధవి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని అనేక రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే తర్వాత జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి చెప్పుకొచ్చాడు శివ.
చదవండి: అనిల్, సునిల్‌ను దొంగసచ్చినోళ్లు అంటూ అరియానా తిట్లు..
బిందుతో లవ్ ట్రాక్ నడపడం వల్లే ఫైనల్ వరకు వచ్చారా అని అడిగిన ప్రశ్నకు 'అసలు రాంగ్ ఇన్ఫర్మేషన్ అనుకుంటా. నిజానికి నేను బిందుతో ఉన్నది లవ్ ట్రాక్ కాదు. మా ఇద్దరిది ఫ్రెండ్‌షిప్ మాత్రమే. అసలు లవ్ ట్రాక్ అయితే కానేకాదు.' అని తెలిపాడు శివ. తర్వాత బిగ్‌బాస్‌కు వెళ్లడం ఎలా ఉందన్న ప్రశ్నకు 'కాంట్రవర్సీ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న నేను మొదట్లో భయపడ్డాను. ఎక్కడ నెగెటివిటీ వస్తుందో అని. నన్ను యాక్సెప్ట్ చేస్తారో లేదో అనుకున్నా. కానీ హౌజ్‌లోపలికి గెస్ట్‌లు, పేరెంట్స్ వచ్చి ఎంటర్‌టైనర్ ఎంటర్‌టైనర్ అంటే సంతోషంగా అనిపించింది. ఇంత మంచి పేరు వచ్చినందుకు హ్యాపీగా ఉంది.' అని పేర్కొన్నాడు.
చదవండి: తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే మొదటి మహిళా విజేతగా బిందు మాధవి..
Comments
Please login to add a commentAdd a comment