![Bigg Boss Telugu OTT Non Stop Promo: Bindu Madhavi Worst Performer in 6th Week - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/9/bigg-boss.jpg.webp?itok=BpX75N2b)
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో వీకెండ్‌కు రెడీ అవుతోంది. అయితే ఎలిమినేషన్ కన్నాముందు వరస్ట్ పర్ఫామర్‌ను ఎన్నుకోవాల్సిన సమయం వచ్చేసింది. దీంతో మెజారిటీ ఇంటిసభ్యులు బిందుమాధవి పేరును ప్రస్తావించినట్లు తెలుస్తోంది. గేమ్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించి కాయిన్స్ పోగొట్టుకుందంటూ చాలామంది ఆమెను చెత్త ప్లేయర్‌గా అభిప్రాయపడ్డారు. ఆఖరికి ఆమె ఫ్రెండ్ యాంకర్ శివ కూడా కాయిన్స్ పోగొట్టుకోవడం తప్పంటూ బిందుకు వరస్ట్ పర్ఫామర్ ట్యాగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో బిందు తన ఆటను తప్పుపట్టిన హౌస్‌మేట్స్ తీరును తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. దీంతో మరోసారి అఖిల్, బిందుమాధవి మధ్య గొడవ రాజుకుంది. ఈ వారం బిందు వరస్ట్ పర్ఫామర్‌గా ఎంపికై జైల్లో పడ్డట్లు కనిపిస్తోంది.
మరోవైపు అటు నటరాజ్ మాస్టర్, యాంకర్ శివ మధ్య కూడా పెద్ద ఫైట్ నడిచినట్లు కనిపిస్తోంది. కొట్టకపోతే అడుగు అంటూ శివకు సవాలు విసిరాడు నటరాజ్. ఇద్దరూ ఒకరిమీదకు ఒకరు దూసుకెళ్తుండటంతో వీరి కొట్లాటను ఆపే ప్రయత్నం చేసింది కెప్టెన్ అషూ. కోపంతో రగిలిపోయిన నటరాజ్ మాస్టర్ కిచెన్‌లో కూడా చిందులు తొక్కాడు. నాకు రక్తం మరిగిపోతుంది, ఎన్నిసార్లు ఊరుకుంటాను? కత్తి తెచ్చి కట్ చేసి పాడేద్దామనుకున్నాను అని ఆవేశంతో ఊగిపోయాడు. చివర్లో మనిషికి రెండు కళ్లు, శివుడికి మూడు కళ్లు, నటరాజ్‌కు ఒళ్లంతా కళ్లు అన్న తనదైన స్టైల్‌లో డైలాగ్ వదిలాడు నటరాజ్ మాస్టర్.
Comments
Please login to add a commentAdd a comment