
ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోతే ఎవరికైనా ఆవేశం రాకమానదు. అందులోనూ బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో మొదటి నుంచీ ఒంటరిగా పోరాడుతూ వస్తున్నాడు నటరాజ్ మాస్టర్. అవసరమైనప్పుడు తన ఫ్రెండ్స్‌కు సాయం కూడా చేశాడు. కానీ నిన్నటి టాస్క్‌లో మాత్రం తనకు బదులుగా అఖిల్ వేరొకరికి సాయం చేసి అతడిని గెలిపించడాన్ని తట్టుకోలేకపోయాడు. గెలుపు తథ్యం అనుకున్న సమయంలో ఓటమిపాలు కావడంతో భరించలేకపోయాడు. బాధపడ్డాడు, ఏడ్చేశాడు, ఆగ్రహించాడు.
తాజాగా బిగ్‌బాస్ ఇచ్చిన బీబీ ఆవుల కొట్టం టాస్క్‌లో అఖిల్, నటరాజ్ మధ్య ఫైట్ జరిగింది. గేమ్‌లో నటరాజ్ తన చేయిని నెట్టేస్తుండటంతో అఖిల్ తన పాలన్నీ ఒలకబోసాడు. నీకు అత్యాశ ఎక్కువని ఫైర్ అయ్యాడు. దీనికి నటరాజ్ స్పందిస్తూ.. నన్ను ఎక్కడైతే కొట్టకూడదో అక్కడ కొట్టేశావు, దేవుడున్నాడు, నా కష్టానికి ఫలితం దక్కింది అని మాట్లాడాడు. నటరాజ్ మాటలను బట్టి అతడు ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశాన్ని గెల్చినట్లు తెలుస్తోంది. మరి అఖిల్, నటరాజ్ మధ్య మాటల యుద్ధం ఎంతవరకు వెళ్లింది? వీళ్లు తిరిగి కలిసిపోయారా? లేదా? అన్నది తెలియాలంటే నేడు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment