
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో ఆఖరి కెప్టెన్‌గా బాబా భాస్కర్ ఎన్నికయ్యాడు. ఆది నుంచి కెప్టెన్సీకోసం కష్టపడ్డ చాలామందికి ఇప్పటికీ కెప్టెన్ అయ్యే అవకాశం రాలేదు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన బాబా భాస్కర్ మాత్రం హౌస్‌లో అడుగుపెట్టిన వారం రోజులకే కెప్టెన్‌గా అవతరించడం విశేషమనే చెప్పాలి. ఇదిలా ఉంటే షో ప్రారంభమై ఇప్పటికే రెండు నెలలు కావస్తున్న తరుణంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ల కోసం ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడు.
ప్రస్తుతం హౌస్‌లో ఉన్న టాప్ 10 హౌస్‌మేట్స్ కోసం వారి కుటుంబ సభ్యులను ఇంట్లోకి పంపించాడు. ఈమేరకు ఓ ప్రోమో వదిలాడు. అందులో భాగంగా అషూ తల్లి బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చింది. అయితే ఆమె చీపురు పట్టుకుని హౌస్‌లోకి రావడంతో అషూ వణికిపోయింది. చీపురుపట్టుకుని వచ్చావేంటి, పరువు పోతుంది మమ్మీ అంటూ వెళ్లి తన తల్లిని హత్తుకోవడంతో ఆమె చేతిలోని చీపురు కింద పడేసింది. ఆ తర్వాత నీ ఫేవరెట్ ఎవరంటే అషూ కాకుండా అందరూ అని బదులివ్వడంతో అక్కడున్నవాళ్లంతా సరదాగా నవ్వారు. అనంతరం యాంకర్ శివ సోదరి యమున హౌస్‌లోకి వచ్చింది. అలాగే నటరాజ్ మాస్టర్ భార్యాకూతురు గేట్ లోపల నుంచి లోపలకు రావడంతో అతడు ఎమోషనల్‌అయ్యాడు. తన గారాలపట్టిని ఎత్తుకుని ముద్దాడాడు. కూతురిని ఆడిస్తూ సంబరపడిపోయాడు.
చదవండి: 'పోకిరి' ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్స్ ఎవరో తెలుసా?
'నటుడిగా పనికిరావు, పోయి ఇంకేదైనా పని చూసుకో అని హేళన చేశారు'
Comments
Please login to add a commentAdd a comment