Bigg Boss Telugu Non Stop Today Promo: Akhil Sarthak New Captain To BB House - Sakshi
Sakshi News home page

Bigg Boss Non Stop: టాస్క్‌ రద్దు చేయాలన్న బాబా, వీల్లేదని అఖిల్‌ డిమాండ్‌, ఇరకాటంలో అషూ

Published Sat, Apr 23 2022 12:20 PM | Last Updated on Sat, Apr 23 2022 1:23 PM

Bigg Boss OTT Telugu Non Stop Today Promo: Akhil Sarthak New Captain - Sakshi

బిగ్‌బాస్‌ షోలో కెప్టెన్సీ పోటీలో గెలిచారంటే వారం రోజులపాటు ఎలాంటి చీకూచింత లేకుండా హాయిగా గడపొచ్చు. ఎందుకంటే కెప్టెన్‌ అయితే ఇంటి అధికారాలతో పాటు ఒకవారం నామినేషన్‌లో లేకుండా ఉండొచ్చు. ఇలాంటి కెప్టెన్సీని చేజిక్కించుకోవడానికి హౌస్‌మేట్స్‌ ఎంతగానో కష్టపడతారు. ప్రస్తుతం బిగ్‌బాస్‌ హౌస్‌లో జల జల జలపాతం అనే కెప్టెన్సీ టాస్క్‌ నడుస్తోంది. ఇందులో మిత్ర, అనిల్‌, అఖిల్‌, బాబా భాస్కర్‌, శివ పాల్గొన్నారు. ఇతర పోటీదారులు వారికి నచ్చిన కంటెండర్‌ బీకర్‌లో రంగు నీళ్లను పోయాల్సి ఉంటుంది. మిత్రకు ఎవరూ సపోర్ట్‌ చేయకపోవడంతో అఖిల్‌ తన బీకరులో ఉన్న రంగు నీళ్లను మిత్ర బీకర్‌లో పోశాడు.

ఇదిలా ఉంటే రంధ్రాలున్న గ్లాస్‌లో నుంచి కలర్‌ వాటర్‌ బయట పడకుండా ఉండేందుకు రెండు గ్లాసులు సెట్‌ చేసుకుని కొందరు నీళ్లు పోశారు. దీన్ని అరియానా తప్పుపట్టడంతో సంచాలకురాలు అషూ ఇరకాటంలో పడింది. ఫస్ట్‌ రౌండ్‌ను క్యాన్సల్‌ చేయాలని బాబా, అలా ఎలా చేస్తారని అఖిల్‌ మండిపడ్డారు. ఈ కెప్టెన్సీ టాస్క్ ఎలా నడిచిందో తెలియాలంటే రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్‌ చూడాల్సిందే! ఇదిలా ఉంటే ఈ వారం అఖిల్‌ సార్థక్‌ కెప్టెన్‌గా నిలిచినట్లు తెలుస్తోంది.

చదవండి 👉 మీరు మనుషులేనా? మిత్రను అంతలా హింసిస్తారా?

నడిచే నేల, పీల్చే గాలి మీద వారి సంతకం ఉంటుంది, వారి త్యాగాలను మరవద్దు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement