Bigg Boss OTT Telugu Non Stop Promo: Clash Between Ariyana And Ashu, Details Inside - Sakshi
Sakshi News home page

Bigg Boss OTT Telugu: ఎవరినీ బ్యాడ్‌ చేసి గేమ్‌ ఆడట్లే: అషూకు అరియానా కౌంటర్‌

Published Wed, Apr 13 2022 1:55 PM | Last Updated on Wed, Apr 13 2022 2:58 PM

Bigg Boss OTT Non Stop Promo: Clash Between Ariyana And Ashu - Sakshi

ప్రయోగాత్మకంగా ప్రారంభమైన బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. కంటెస్టెంట్ల కొట్లాటలతో ఆట మరింత రంజుగా మారుతోంది. 17 మందితో ప్రారంభమైన బిగ్‌బాస్‌ షోలో ప్రస్తుతం 11 మంది మిగిలారు. తాజాగా కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌లో వీరిని జంటలుగా విభజించి అషూను సంచాలకురాలిగా వ్యవహరించాలని ఆదేశించాడు బిగ్‌బాస్‌. ఈ క్రమంలో కంటెస్టెంట్ల మధ్య గొడవలు రాజుకుంటున్నట్లు తెలుస్తోంది.

గురువారం రిలీజ్‌ చేసిన ప్రోమోలో అషూ, అరియానా మధ్య వార్‌ నడిచినట్లు కనిపిస్తోంది. అరియానా ప్లేటులో భోజనం పెట్టుకొని వచ్చి అజయ్‌కు తినిపించింది. అయితే ముందు కార్డు చూపించంటూ కెప్టెన్‌ అషూ పదేపదే అడగడంతో అన్నం మీద అలిగి వెళ్లిపోయింది అరియానా. ప్లేటులో ఫుడ్డు పెట్టుకొని వచ్చి ఎమోషన్స్‌ వాడుకుందామనుకుంటే కరెక్ట్‌ కాదని వ్యాఖ్యానించింది అషూ. దీనికి అరియానా.. వేరేవాళ్లను బ్యాడ్‌ చేసి గేమ్‌ ఆడటంలేదంటూ కౌంటరిచ్చింది. ఇక శివ బెడ్‌రూమ్‌లో తింటూ దొరికిపోవడంతో అతడిని బయటకు పంపించేసింది అషూ. బయటకు వచ్చిన శివ కోపంతో నీళ్ల బాటిల్‌ను నేలకేసి కొట్టాడు. ఇంతకూ ఈ గేమేంటి? ఈ గేమ్‌లో ఎవరి జోడీ గెలుస్తుంది? అన్నది తెలియాలంటే రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్‌ చూడాల్సిందే!

చదవండి: ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత

వాడు అమ్మాయి టచ్‌ కోరుకున్నాడు: అజయ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement