Bigg Boss Non Stop Telugu: 2nd Week Nominations Promo Out Details Inside - Sakshi
Sakshi News home page

Bigg Boss Non-Stop : బిగ్‌బాస్‌ నామినేషన్స్‌ రచ్చ: డబుల్‌ మీనింగ్‌ డైలాగులంటూ ఫైర్‌

Published Mon, Mar 7 2022 4:42 PM | Last Updated on Mon, Mar 7 2022 7:56 PM

Bigg Boss Non Stop Telugu:2nd Week Nominations Promo Out - Sakshi

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ రసవత్తరంగా సాగుతోంది. తొలి వారం ఎవరూ ఊహించని విధంగా ముమైత్‌ ఖాన్‌ ఎలిమినేట్‌ అయ్యింది. చివరి రౌండ్‌లో సరయు, ముమైత్‌కి జరిగిన పోరులో అనూహ్యంగా ముమైత్‌ ఖాన్‌కు తక్కువ ఓట్లు రావడంతో హౌస్‌ నుంచి బయటికి వెళ్లింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఆర్జే చైతూని నిందిస్తూ తన తర్వాత బయటికి వచ్చేది తనే అంటూ శాపనార్థాలు పెట్టింది. ఇక సం‍డే ఎపిసోడ్‌ అలా సాగింది.

తాజాగా బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌లో రెండవ వారానికి సంబంధించి నామినేషన్స్‌ షురూ అయ్యాయి. తాము ఎవరినైతే నామినేట్‌ చేయాలనుకుంటున్నారో వారి ఫోటోను డ్యాగర్‌తో గుచ్చి తగిన కారణాలు చెప్పాల్సిందిగా బిగ్‌బాస్‌ ఆదేశించాడు. ఇక ఎప్పటిలాగే నామినేషన్స్‌లో ఒకరిపై ఒకరు అరుచుకోవడం, గొడవ పడటం జరిగాయి. ఇంట్లో ఉండటానికి ఒక అర్హత ఉండాలని అది గేమ్‌లో ఎక్కడా కనిపించడం లేదంటూ అఖిల్‌ యాంకర్‌ శివను నామినేట్‌ చేశాడు.

సరయు సైతం తనతో డబల్‌ మీనింగ్‌తో మాట్లాడుతున్నాడంటూ శివనే నామినేట్‌ చేసింది. ఈ గొడవలో నటరాజ్‌ మాస్టర్‌ ఎంటర్‌ అయ్యి.. అవును నువ్వు డబల్‌ మీనింగ్‌లోనే మాట్లాడావ్‌ అంటూ సరయూకి సపోర్ట్‌గా నిలిచాడు. దీంతో ఒకవేళ మీరు చెప్పిన డైలాగ్‌ నేను అని ఉంటే తక్షణమే బిగ్‌బాస్‌ నుంచి బయటికి వెళ్లిపోతా అంటూ యాంకర్‌ శివ ఛాలెంజ్‌ చేస్తాడు. అషూ, మిత్రా శర్మ మధ్య జరిగిన గొడవ ఇంకా సద్దుమణిగినట్లు లేదు. ఇద్దరూ మాటల యుద్దంతో హీటెక్కించారు. మరోవైపు అరియానా నీ ఎక్స్‌పెక్టేషన్‌ కోసం హౌస్‌కి రాలేదంటూ శ్రీ రాపాకకి చురకలంటిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement