బాబా భాస్కర్ ఎంట్రీతో బిగ్‌బాస్ హౌస్‌లో సీన్ మారిపోయింది. అతడు వచ్చీరావడంతోనే బిందుమాధవిని నామినేషన్స్‌లో నుంచి సేవ్ చేయడంతో అందరూ ఖంగు తిన్నారు. తన గురించి ఒక్క మాట మాట్లాడలేదేంటని అఖిల్ హర్టయ్యాడు. ఇక బిందును సేవ్ చేసి తనకు జనాల్లో ఎంత పాపులారిటీ ఉందో చెప్పకనే చెప్పేశాడు బాబా. ఇదిలా ఉంటే ప్రస్తుతం హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ నడుస్తోంది. ఇందులో అషూ, శివ, మిత్ర, అఖిల్, అనిల్, బాబా భాస్కర్‌లను మనుషుల టీమ్‌గా, అరియానా, బిందుమాధవి, అజయ్, హమీదా, నటరాజ్ మాస్టర్‌లను ఏలియన్స్ టీమ్‌గా విభజించారు.
ఈ క్రమంలో ఏలియన్స్ తమదగ్గరున్న వస్తువులను కాపాడుకునే ప్రయత్నం చేయగా హ్యూమన్స్ వాటిని తీసుకుని పగలగొట్టి హ్యూమన్స్ టీమ్‌లో నుంచి ఒక్కొక్కరిని గేమ్‌లో నుంచి తొలగించేందుకు ట్రై చేస్తారు. గేమ్ ఆడే క్రమంలో ఏలియన్స్ స్విమ్మింగ్ పూల్‌లో దూకగా అందుకు వీల్లేదని స్పష్టం చేశాడు బిగ్‌బాస్. అందుకు శిక్షగా అషూ తన దగ్గరున్న మైక్ ధరించడానికి వీల్లేదని ప్రకటించాడు.
అయితే ఇదే విషయాన్ని అరియానా చెప్పడానికి ప్రయత్నించగా అషూ అస్సలు వినిపించుకోలేదు. సంచాలక్ చెప్తేనే వింటానంటూ మొండికేయడంతో బాబా భాస్కర్ జరిగింది చెప్పి ఆమె దగ్గర నుంచి మైక్ తీసుకున్నాడు. ఇక గేమ్‌లో హమీదా, మిత్ర కొట్టుకున్నంత పని చేశారు. మిత్ర కొడుతుందని, తాను కూడా కొడతానంటూ ఆమె వెనకాల పరిగెత్తింది హమీదా. తనను కింద పడేయడంతో సిగ్గు లేదు అంటూ అమ్మాయిల మీద అరిచేసింది మిత్ర. ఇక ఈ టాస్క్‌లో హ్యూమన్స్ టీమ్ గెలిచి అందులోని సభ్యులు కెప్టెన్సీ కంటెండర్స్ అయినట్లు తెలుస్తోంది.
చదవండి: నన్ను గర్భవతిని చేసి మోసం చేసింది ఆ డైరెక్టర్ కాదు!
నిద్రలేని రాత్రులు, రక్తస్రావం, సాగిన చర్మం, గడ్డకట్టిన ప్యాడ్‌లు.. కాజల్
Comments
Please login to add a commentAdd a comment